చాందిని ముందే నిద్రలేచి
“ఒసేయ్ శృతి ఈరోజన్నా త్వరగా లెగవే..”.
ఇంకాసేపు చందు.
“నువ్వు ఇలా వినవు” అంటూ, బాత్రూం రూమ్ లో నుంచి ఒక బకెట్ నీళ్ళు తెచ్చి శృతి మీద గుమ్మరించింది..
“ఓరి దేవుడా…” అంటూ లేచింది శృతి.
ఏంటి చాందిని ఇలా చేసావ్.
నిన్ను ఇలాగే వదిలేస్తే ఈరోజు కూడా పదింటి దాకా ఇక్కడే ఉంటాం, అసలే ఈరోజు హెచ్.ఆర్ ని కలవాలి..
అవును చాందినీ..మర్చిపోయా మెయిల్ వచ్చింది కదా..
మరి ఇంకా కూర్చున్నావే పదా..
****
హలో మేఘన..
హాయ్ గర్ల్స్, ఐయామ్ సారీ మీ పేర్లు గుర్తు లేవు.
పర్వాలేదు మేఘన,.. నా పేరు చాందిని, మాకు ప్రాజెక్టు అలొకేషన్ మెయిల్ వచ్చింది.
ఓ దట్స్ గుడ్, లెట్ మి సీ, అంటూ లాప్టాప్ లో ఏదో చెక్ చేసింది, ఓకే ,ఇక్కడ థర్డ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ లో మీ ప్రాజెక్ట్ ఓ.డి.సి ఉంటుంది, అక్కడ మీ ప్రాజెక్ట్ లో ఇద్దరు సీనియర్స్ ఉంటారు వాళ్ళని కలవండి, మీకు వాళ్ళు అంత ఎక్స్ ప్లెయిన్ చేస్తారు..
వాళ్ళ పేర్లేంటి, అడిగింది శృతి.
లావణ్య అండ్ దియా , వాళ్ళకు నేను కాల్ చేసి చెప్తా, వాళ్ళు మీకు 15 to 30 డేస్ ఉండి హెల్ప్ చేస్తారు..అంది హెచ్ ఆర్.
ఒకే మేఘన…
ఓ.డి.సి లోపలికి వెళ్ళటానికి వీళ్ళకు పర్మిషన్ లేదు, అందుకే బయటే కూర్చొన్నారు, ఎవరో ఇద్దరు అమ్మాయిలు వీళ్ళని దాటి ముందుకు వెళ్తూ, వెనక్కి తిరిగి చూశారు.
“హే ఆర్ యూ చాందిని అండ్ శృతి “ అంటూ పలకరించింది లావణ్యా.
ఎస్ అంటూ లేచి నిలబడ్డారు ఇద్దరు..
లావణ్య మీరు తెలుగే కదా, అడిగింది శృతి..
అవును,..రండి మనం క్యాబిన్ కి కూర్చొని మాట్లాడుకుందాం..
మాకు యాక్సెస్ లేదు లావణ్య..
హే మేం ఉన్నాం కదా పదండి…
నలుగురు క్యాబిన్లోకి వెళ్లి కూర్చున్నారు.
లావణ్య తో కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు.. తన పక్కనున్న ఆమె ఏమి మాట్లాడట్లేదు, ఆమె బయటకు వెళ్ళాక “ లావణ్య తను కూడా మన తెలుగామే నా” అంటూ అడిగింది శృతి...
కాదు తను చండీఘర్, మంచిది చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.
అవునా..
చెప్పడం మర్చిపోయా మాకు ప్రాజెక్ట్ రిలీజ్ లెటర్ వచ్చేసింది. 10 రోజుల తర్వాత నేను దియా వేరు వేరు ప్రాజెక్టులకు జాయిన్ అవ్వాలి.
ఇద్దరికీ గుండె ఝల్లుమంది.
అదేంటి లావణ్య మీరు ఇంకా ఒక 15 నుంచి 30 రోజులు ఉండి మాకు అన్ని కే.టి. ఇస్తారు, అని చెప్పింది మేఘన.
అయ్యో… హెచ్ ఆర్ లు అలానే చెప్తారు కానీ ఇలా ఇబ్బంది పెడతారు.
మరి ఇప్పుడు ఎలా లావణ్య.
ఎలాగో పది రోజులు ఉంది కదా బేసిక్స్ నేర్పిస్తాం.
అది సరిపోతుందా లావణ్య అంటూ అడిగింది చాందిని.
హా సరిపోతుంది, ఎందుకంటే ఇందులో వర్క్ ను రెండు భాగాలు చేశారు.
అర్థం కాలే లావణ్య.
మీరు చెయ్యాల్సిన పని సింపుల్ గానే ఉంటుంది, కష్టంగా ఉండేది హ్యాండిల్ చెయ్యడానికి వేరే వాళ్ళు వస్తారు.., వాళ్ళతో కలిసి పని చేస్తూ మీరు నేర్చుకోవాలి, మేం కూడా సపోర్ట్ చేస్తాం, మీకెప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయొచ్చు..
దిగాలుగా తలూపారు.
ఒక్క విషయం,” మీరు ఆర్కిటెక్ట్ తో జాగ్రత్తగా ఉండండి” అంది లావణ్య.
ఇంతలో దియా లోనికి వచ్చి, ” హే దట్ సోహమ్ ఈజ్ కమింగ్” అంది.
తను అన్న ఒక పది సెకండ్లకు అతను లోనికి వచ్చాడు,
“మీరేనా కొత్తగా వచ్చింది “ అంటుంది పలకరించాడు.
ఆర్కిటెక్ట్ కదా రెస్పెక్ట్ ఇద్దామని, “ ఎస్ సార్” అన్నారు ఇద్దరు, “లావణ్య ఆపబోయింది కానీ ఆలోపే వాళ్ళిద్దరూ అనేశారు”.
డోంట్ యు నో కార్పొరేట్ కల్చర్ “సార్/ మేడమ్” ఇలా పిలవకూడదని మీ హెచ్ ఆర్ నేర్పించలేదా, అన్నాడు సోహమ్.
ఇద్దరికీ భయం వేసింది..
అతను కొంచెం విచిత్రంగా నవ్వి, “ఐ యాం సోహమ్” అంటూ చేయి చాపాడు, అతని చెయ్యి అందుకొని షేక్ అండ్ ఇచ్చింది శృతి.
ఆ షేక్ హ్యాండ్ శృతికి కొంచెం అసౌకర్యంగా అనిపిస్తోంది, చూస్తే శృతి చేతిని బొటన వేలుతో నిమురుతున్నాడు, శృతి అతని వంక చిరాకుగా చూసింది.
“డోంట్ వర్రీ ఇట్స్ లైక్ పాజిటివ్ ఎంకరేజ్మెంట్ గివెన్ టు యు” అన్నాడు సోహమ్.
శృతి ఇబ్బందిగా తన చేయి వెనక్కి లాక్కుంది.
చాందిని వైపు చేయి చాపాడు.
“సారీ సోహమ్, ఐ హ్యావ్ రిస్ట్ పెయిన్” అంటూ తన చేతులు సున్నితంగా జోడించి నమస్కారం పెట్టింది.
లావణ్య గట్టిగా నవ్వేసింది.
సోహమ్ కి అది నచ్చలేదు. కానీ ఏం చేయగలడు తను ఎలాగూ ప్రాజెక్ట్ నుండి రిలీజ్ అయిపోతోంది, చాందిని వైపు సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి వెళ్లిపోయాడు..
థ్యాంక్యూ చాందిని నీ వల్ల చాలా రోజుల తర్వాత అతని మీద గట్టిగా నవ్వేసా..
“నాకెందుకో భయంగా ఉంది లావణ్య” అంది చాందిని.
ఆ వాడి బొందా వాడేం చేస్తాడు, నువ్వు హార్డ్ వర్క్ చెయ్యి, మీతో వర్క్ చేసే వాళ్ళతో మంచిగా ఉండండి, ఏమన్నా ఐతే నాతో చెప్పండి నేనే మీ కొత్త రిపోర్టింగ్ మేనేజర్…
పని కాకుండా ఇంకా వేరే విధంగా అతను ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను హెచ్ఆర్ కు చెప్తాను, వాడి సంగతి చూద్దాం.
సరే లావణ్య..అంది చాందిని.
శృతి, చాందిని వర్క్ కి సంబంధించిన లాప్టాప్ కలెక్ట్ చేసుకుని లాగిన్ చేసుకున్నారు.
లావణ్య వాళ్లకు కావలసిన యాక్సెస్ గురించి రిక్వెస్ట్ చేసి, ఇద్దరికీ కేటి(నాలెడ్జ్ ట్రాన్స్ఫర్) మొదలు పెట్టింది.
దియా కూడా మధ్య మధ్యలో చాలా విషయాలు వీళ్లకు అర్థమయ్యేలా చెప్పేది.
సరిగ్గా నాలుగింటికి స్కూల్ అయిపోయింది, స్కూల్ బస్ రిపేర్ అయిందని కబురొచ్చింది, ఇంటికి ఆలస్యం అయ్యేలా ఉంది, కథ వినాలనే కుతూహలం ఆకాష్ ను ముందుకు తోసింది, త్వరగా వెళ్ళడానికి “సెల్ఫ్ డ్రివెన్ వెహికల్” ఒకటి బుక్ చేసుకున్నాడు
అందులో ఎక్కి మామూలుగా ఇంటికి వెళ్లే సమయం కంటే గంట ముందే చేరుకున్నాడు, మధ్యాహ్నం సరిగ్గా తినకపోవడం వల్ల ఆకలిగా ఉంది, అమ్మ ఏమో ఇంకా ఇంటికి రాలేదు, ఫ్రిజ్ లో కొన్ని స్నాక్స్ ఉంటే తీసుకొని రూమ్ లోపలికి వెళ్లాడు..
స్నాక్స్ తింటూ, హెడ్ ఫోన్స్ పెట్టుకుని రాత్రి ఆపిన ఆడియో ని మళ్లీ మొదలుపెట్టాడు.
కవిత చాలా బాగా చెప్పావ్, ఇంతకీ అమ్మాయి పేరు ఏంటి.
చాందిని..
“ అందుకేనా చందమామ మీద కవిత రాశావు “ అంది గౌతమి.
అలా ఏం లేదు తనని తలుచుకోగానే అలా వచ్చేసింది.
ఇంతకీ తనని ఎక్కడ ఎలా కలుసుకున్నావు..
తననా, ఇంటికి వచ్చే ముందు బస్టాప్ లో కలిసా, అంటూ జరిగిందంతా చెప్పా..
తనని అస్సలు వదులుకోవద్దు విక్రమ్.
నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నాకున్న భయం ఏంటంటే “ ఇప్పుడు నా మైండ్ సెట్ ఏం బాలేదు” ఇలాంటి పరిస్థితి లో తను నన్ను ప్రేమిస్తుందా..
ఒక అమ్మాయిగా చెబుతున్నా అమ్మాయిలు అవేం చూడరు, అయినా నీ మానసిక స్థితి బాలేదని ఎవరు చెప్పారు, చూడు ఎంత మంచిగా మాట్లాడుతున్నావో.., నువ్వు వింటానంటే ఒకటి చెప్తా..
చెప్పు గౌతమి..
జీవితం లోనీ విషయాలను లేదా సంఘటనలను మనం ఒక దగ్గర నోట్ చేసి వాటిని తిరిగి చూస్తే, మన జీవితంలో మారాల్సిన విషయాలు ఏంటో మనకు తెలుస్తాయి, నువ్వు నీ గురించి రాయడం లేదా రికార్డ్ చేయడం మొదలు పెట్టు, ఎందుకంటే సెల్ఫ్ క్యూరింగ్ కంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఏదీ లేదు, అదే కాకుండా అలా రాసుకున్న విషయాలు బెస్ట్ మెమోరీస్ అవుతాయి..
నువ్వు చెప్పావు కాబట్టి కచ్చితంగా ట్రై చేస్తా…, నీ పరిచయం నుంచే మొదలుపెడతా..
చిన్న స్మైల్ ఇచ్చింది గౌతమి..
చీకటి పడేలా ఉంది ఇంటికి వెళ్దామా, అడిగాడు విక్రమ్.
విక్రమ్ నాకు చిన్న హెల్ప్ చేస్తావా...
చెప్పు…గౌతమి.
ఇంటికి వెళ్ళాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, కానీ కొన్ని రోజులు టైం అడుగు. ఆ లోపు నేను నా ప్రేమ విషయం ఎలాగైనా చెప్పడానికి ప్రయత్నిస్తా, ఇప్పుడు నువ్వు వద్దంటే మా నాన్న ఇంకో సంబంధం చూస్తాడు..
ఇది కొంచెం రిస్కీగా అనిపిస్తోంది గౌతమి, ఈ ప్లాన్ గనక ఫెయిల్ అయితే మన ఇద్దరికీ పెళ్ళి చేసేస్తారు..
ఒకవేళ ఆ పరిస్థితే వస్తే నేను నిజం చెప్పేస్తా, “ఏదో ఒకటి చేసి దీన్ని తప్పించు విక్రమ్, ప్లీజ్” అంది గౌతమి.
సరే..
ఎందుకో తెలియదు నేను చిన్నప్పటి నుంచి ఏ అమ్మాయితో స్నేహం చేయలేదు, గౌతమితో స్నేహం చాలా బాగుంది.
ఇద్దరం ఇంటికి వెళ్ళాము..
అక్కడ చూస్తే హాల్లో అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు.
“నీ అభిప్రాయం ఏంటి” అని ముందు గౌతమి ని అడిగారు..
విక్రమ్ ఏం చెప్తే అది నాకు ఓకే.. అంది గౌతమి
ఇరికించేసింది నన్ను, పాపం తనేం చేస్తుంది తను కాదంటే వాళ్ల నాన్న వేరే సంబంధం చూస్తాడు, ఇక చేసేది లేక నేనే మాట్లాడడం మొదలుపెట్టా..
చూడండి, తనతో నేను జస్ట్ ఒకరోజు మాట్లాడాను అంతే, తను చాలా మంచిది, కానీ మేమిద్దరం కలిసి ఉంటామా లేదా అన్న విషయం ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది, సో మాకు అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం కావాలి,..
“వ్యక్తిత్వాలు వేరైనపుడు ఇద్దరు మంచి మనుషులు కూడా కలిసి ఉండలేరు” అని నా నమ్మకం… “, మాకు కొంచెం టైమ్ కావాలి.
ఈ మాటల తర్వాత నిశ్శబ్దం.
గౌతమి తన గదిలోకి వెళ్ళిపోయింది, ఒకసారి మీరే ఆలోచించండి..అంటూ నేను ఇంటికి బయలుదేరాను.
“ ఏంటి బావ ఇది, వాళ్ళ మంచి కోసం పెళ్లి చేద్దాం అంటే ఇలా అంటున్నారు” అన్నాడు మల్లి, “అయినా మన కాలంలో ఇవన్నీ లేవు కద మామ..”, అంటూ రామన్న తాత వంక చూసాడు.
కాలం మారిపోయింది కదా మల్లి దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి, అన్నాడు సూర్య..
“ పిల్లలు వాళ్ళకేం తెలుసు , సరే నేను మాటిస్తున్నాను ఇప్పటికి సరిగ్గా 6 నెలల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేయిస్తా, విక్రమ్ ని ఒప్పించే బాధ్యత నాది” అన్నాడు తాత, ఈ మాటలు బయటున్న నాకు స్పష్టంగా వినిపించాయి..
అలా అన్నావు బావుంది ఇప్పుడు నువ్వు నాకు నచ్చావ్ మామ, అన్నాడు మల్లి మావయ్య.
తాత మరియు నాన్న ఇంటికి బయలుదేరారు.
దారిలో, ఏంటి నాన్న అలా మాటిచ్చేసావు, విక్రమ్ మనసులో ఏముందో తెలుసుకుంటే బాగుండేది.
ఒరేయ్ సూర్య నేనేం చేసినా విక్రమ్ మంచి కోసమే చేస్తాను అని నీకు తెలుసు కదా, ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు రా చాలా మంచిది తను నా దగ్గర పెరిగింది. అయినా చేసుకొనే ఉద్దేశం ఉంది కాబట్టే విక్రమ్ సమయం అడిగాడు.
సరే నాన్న మీ ఇష్టం.