Pain of loss... books and stories free download online pdf in Telugu

విరహ వేదనా...

ఉదయాలు పొగమంచుతో నిండి ఉన్నాయి.

ఉదయాల ఆనందంగా ఉన్నాయి..

రాత్రంతా నీ గురించే ఆలోచిస్తున్నాను.

నువ్వు కనిపించడం లేదు కాబట్టి,

ఈ రోజు నీకు అందమైన ఉదయం కావాలని కోరుకుంటున్నాను. నేను కళ్ళు తెరిచి ఇక్కడ నిన్ను చూసినప్పుడు,

ఈ ప్రకాశవంతమైన ఉదయం నేను నీ గురించి ఆలోచిస్తున్నాను.

నా చేతులు నిన్ను దగ్గరకు లాగకుండా ఉండలేకపోతున్నాయి. నేను ఆశ్చర్యంతో ఇలా రాస్తున్నాను..

నాకు తెలుసు, నేను చూసింది. నాకు కనిపించింది, నన్ను విరహ వేదన కి గురి చేసింది ఆ అందాల దేవదూత ఎవ్వరో కాదు అది నువ్వే...

నీ అందం నన్ను మండిస్తుంది. నీ నడుము ఒంపు లోని సెగలు నన్ను కల్పిస్తున్నాయి.. నిండు గా పుష్పించిన బంతిపూల తోట లోని కుసుమాలు వోలె గుబలించే నీ దేహ పరిమళాలు నాలోని మన్మధ తుమ్మెదలు నీ తడిమి లేపుతున్నాయి... ఆకుపచ్చటి పట్టు చీరలో అమావాస్యకు 3 దినాలు ముందు ఉండే చందమామ లాంటి వెండి నడుము .. చీకటి కమ్మేసినటువంటి ఆ నల్లటి కురులు అందమైన జాబిల్లి లాంటి ఆ మేలిమి నడుము ను ముద్దాడుతూ,పిల్ల గాలి కి ఊగుతూ పదే పదే చెక్కిలి గింతలు పెడ్డున్నయి... అప్పుడే మాగిన దోర ఎర్రటి ఆపిల్ పండు : మీద పడ్డ చినుకు లు, గూటికి వెల్తోన్న సూర్యుడి లేత కాంతి పడ్డప్పుడు వచ్చే తల్లుక్కు మన్నట్టు ఉండే రామ చిలుక కుట్టినటువంటి చూడగానే ముధ్దోచే ఆ పెదాలు, సూరీడు జాబిల్లి చూడనటువంటి ఆ నడుము కింద బొడ్డు, గాలికి ఎగురుతూ కప్పేస్తున్న కొంగు చాటున కామునికే కైపెక్కేల ఉంది... నల్లటి మబ్బుల వాటి పైన అమర్చే ఇంద్రదనస్సు కృష్ణుడి తల మీద అమర్చిన నెమలి పించం లాగా ఎంత అందంగా ఉందే.. నీ తల నీలాలు కింద ఆ అందమయిన మోము ను చూస్తూ ఉంటే శ్రీ రాముడు కౌగిట్లో వాలి పోయిన సీతమ్మ లాగా చాలా సుందరంగా ఉన్నావు.... ప్రవహిస్తున్న నది నీ అమ్మాయి అనుకొని, ఆ నీటిని అమ్మాయి చీర అనుకుంటే, మేఘాన్ని ప్రియుడు అనుకుంటే.. మేఘుడు ఆ నీటిని తాగేసినప్పుడు ఆ నది బోసిపోయినప్పుడు ప్రేయసి ఒంటి మీద కొంగు తీసేసి కన్నార్పకుండా చూస్తూన్న ప్రియుడు కళ్ళ లో గుండెల్లో నుంచి వచ్చే వేడి ద్వారా కళ్ళలో కామ మోహ నీటి బిందువు జారీ అక్కడే వర్షించినట్టు,, పిల్ల గాలిగి ఎగురుతూ న్న నీ ఓని నీ చూస్తూ నిద్రలో అలా వుండిపోయాను... అలా ఆకాశాన్ని చూస్తూ
పడుకొని ఉన్న నిన్ను ఒక పక్క నుంచి చూస్తూ ఉండిపోయిన నాకు నీ దేహపళ్లాలను చూస్తూ ఉంటే గొంతు బిగుసుకుపోయి, నీలోని ఒంపు సొంపులు బానిస్కుడైన బానుడు నిన్ను వెర్రెక్కి చూస్తూ చూపులకు వేడెక్కిన ధరణి మీద పార్వతి దేవి స్నానం ఆడినటువంటి కైలాస పర్వతాల నుంచి నీరు తెచ్చి మేఘుడు నువ్వు ఉంటున్న చోటు జారవిడుస్త్, అప్పుడు భూమి మీద నుచి వచ్చే వేడి ఆవిరి లోని వాసనలు చెమటలు వోలే... నా లోంచి వేడి ఆవిర్లు చెమట రుపులో కారతోంది... అప్పుడు ఒక్కసారి గా తేరుకొని నేను కన్న ది ఇదంతా కలయ ఆనుకొని ఒక చిన్న నవ్వుకొని ఇదంతా నిజం అవ్వుతాదే అవ్వడే అనుకుంటూ ఇలా మంచు కొండలు మధ్యలో ఒంటరి గ నీ జ్ఞాపకాలతో నీ ఊసులతో నీ గురించి ఈ చెట్టకు ఈ కొమ్మలకు ఈ కొండలకు ఈ లోయాలకు ఈ కాలువలకు ఈ గాలికి చెప్తూ నాతో, పాటు వాటిని కూడా సిగ్గు పడేలా చేస్తూ పహారా కాస్తూ ఉన్నటువంటి నీ సైనికుని...... ఎక్కడ వున్నా నీ జ్ఞాపకాలతో ఈ జన్మ గడిపిస్తాను... నాతో పాటు నిన్ను కూడా ఈ దేశ రక్షణలో భాగస్వామి నీ చేస్తూ నాతో పాటు నిన్ను తీసుకెళ్తూ ఉంటాను... ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను నా దేవత ల పూజిస్తూ నే ఉంటాను.. నీ పాద సేవకుని గ ఒక్కరోజు అవకాశం దొరికినా వచ్చే జన్మ కోసం ప్రశాంతంగా ఎదురు చూస్తూ ఉంటాను.... నీ మాధవ్.✍️

( ముఖ్య సూచన :- సలహా ఇవ్వలి అనిపిస్తే emadhavakrishna@gmail.com కి 💌📬 చేసి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవవలసింది గా విన్నపించుకుంటునన్ను .. పాఠకులకి నా పద అమరిక అర్థం అవుతుందా లేదా .. ఎలా రాస్తే బాగుంటది.. మీకు నా రచనలో బాగా నచ్చిన ఆశం ఏంటి,అనేవి దయచేసి నాకు తెలియజేయండి.. ఎందుకంటే మీ మాటలు నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది... పాతిక సంవత్సరాలు కూడా నిండని ఎక్కడో కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న నాయ జవాన్ అయినటువంటి ఒక్క యువ రచయిత ను.. నాకు తెలుగు అన్న తెలుగులో రచనలు అన్న తెలుగు నవలలు ప్రకృతి అందాలు అంటే చాలా చాలా ఇష్టం... మీ మాధవ్)