Those three - 48 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 48 ( 35 -36 మధ్య కథ)

ఆదిత్య వ్యూహమే విహారిది కూడా. లేబర్ కాలనీలు జల్లెడ పట్టాడు. నాలుగు రోజుల నిరంతర శ్రమతో చివరకు అన్వర్ అడ్రస్ తెలుసుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా మఫ్టీలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ సమతా సదన్ చుట్టూ " పొజిషన్" లో ఉంచి సుఖదేవ్ ను కలిశాడు. అన్వర్ ( అనంత్ రామ్) స్నేహితుడనని పరిచయం చేసుకున్నాడు. అతడిని కలవాలి అన్నాడు.
" అనంత్ ను చూసి మూడు రోజులు అయింది. ఇప్పటి వరకు రాలేదు. బహుశా వాళ్ళ ఊరు వెళ్ళాడేమో. కానీ... ఎప్పుడు ఊరు వెళ్ళినా నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు.
ఈసారే కాల్ రాలేదు. అదే నాకర్థం కావడం లేదు." సర్దార్ జీ మాటల్లో కొద్దిపాటి కలవరం.
" మీరు ట్రై చేయలేదా?"" చాలా సార్లు చేశాను.నో రెస్పాన్స్"
" వాళ్ళదేవూరు?"
" తెలీదు. నేనెప్పుడూ అడగలేదు. అసలు అతడి వివరాలు
అడగవలసిన సందర్భం ఎప్పుడూ రాలేదు." విహారి సంభాషణ పొడిగించలేదు.ఆదిత్య వ్యూహమే విహారిది కూడా. లేబర్ కాలనీలు జల్లెడ పట్టాడు. నాలుగు రోజుల నిరంతర శ్రమతో చివరకు అన్వర్ అడ్రస్ తెలుసుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా మఫ్టీలో స్పెషల్ పోలీస్ ఫోర్స్ సమతా సదన్ చుట్టూ " పొజిషన్" లో ఉంచి సుఖదేవ్ ను కలిశాడు. అన్వర్ ( అనంత్ రామ్) స్నేహితుడనని పరిచయం చేసుకున్నాడు. అతడిని కలవాలి అన్నాడు.
" అనంత్ ను చూసి మూడు రోజులు అయింది. ఇప్పటి వరకు రాలేదు. బహుశా వాళ్ళ ఊరు వెళ్ళాడేమో. కానీ... ఎప్పుడు ఊరు వెళ్ళినా నాకు తప్పకుండా ఫోన్ చేస్తాడు.
ఈసారే కాల్ రాలేదు. అదే నాకర్థం కావడం లేదు." సర్దార్ జీ మాటల్లో కొద్దిపాటి కలవరం.
" మీరు ట్రై చేయలేదా?"" చాలా సార్లు చేశాను.నో రెస్పాన్స్"
" వాళ్ళదేవూరు?"
" తెలీదు. నేనెప్పుడూ అడగలేదు. అసలు అతడి వివరాలు
అడగవలసిన సందర్భం ఎప్పుడూ రాలేదు." విహారి సంభాషణ పొడిగించలేదు.

మూడు రోజుల నుండి గదికి రాలేదా. ! ఇందులో యాకూబ్
హస్తముందా? కొంపదీసి వీడూ వాడూ కలిసి ఉడాయించారా " ఇంతియాజ్ మాటల్లో కలవరం.
" అంత గుండె ధైర్యం యాకూబ్ కు ఉంటే మన మాట విని ఇన్ఫార్మర్ గా మారే వాడు .మనం గురించి అన్వర్ కు చెప్తే తనకే ప్రమాదం. జరిగింది హై కమాండ్ కు తెలిసి నెగ్లిజంస్ ఇన్ డ్యూటీ క్రింద యాకూబ్ ను కాల్చి పారేస్తారు."
" నిజమే. మరి ఎక్కడికి వెళ్ళినట్లు. ఊరికి వెళ్ళాడు అన్నది ఒక కట్టుకథ." నవ్వాడు ఏ.సీ.పీ
" ఏదైనా ప్రమాదం జరిగిందేమో ! హిట్ అండ్ రన్......" సందేహం గా ఆగాడు విహారి.
అవకాశం ఉంది. యాక్సిడెంట్ లో గాయపడి హాస్పిటల్ కు వెళ్ళాడేమో. లేక ఎవరైనా హాస్పిటల్ లో చేర్చారేమో ! కేసు క్రిటికల్ అయిందేమో. ఆ పరిస్థితుల్లో సర్దార్ జీ కి ఎలా ఫోన్ చేయగలడు ?"
" సార్ ! సిటీ లిమిట్స్ లో ఏం పోలీస్ స్టేషన్ లో అయినా హిట్ అండ్ రన్ కేసు రిజిస్టర్ అయిందేమో కనుక్కుంటాను.
ఏం హాస్పిటల్ లో అయినా హిట్ అండ్ రన్ కేసు క్రింద అన్వర్ అడ్మిట్ అయినాడో లేదో చెక్ చేస్తాను. ఐ నీడ్ ఎ ఫ్యూ అవర్స్. ఐ విల్ ట్రేస్ ఔట్ అన్వర్ , ఇఫ్ హి ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ హిట్ అండ్ రన్ కేసు " విహారి మాటల్లో ధీమా.
" గుడ్ ! డూ ఇట్ అట్ ది అర్లియస్ట్".


గాయపడిన మరుసటి రోజు దాదాపు పది గంటలకు అన్వర్ కు స్పృహ వచ్చింది. తను ఎక్కడ ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవడానికి పది నిమిషాలు పట్టింది. డ్యూటీ డాక్టర్, సర్జన్ వచ్చారు. పరిస్థితి వివరించి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. అన్వర్ వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
" మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మాకు కాదు. ....ఆదిత్య గారికి. ఓం గుడ్ సమారిటన్ లా మిమ్మల్ని టైం కు అడ్మిట్ చేశారు. గాయం వల్ల మీకు చాలా రక్తం పోయింది.
బ్లడ్ బ్యాంక్ లో మీకు అవసరమైనంత రక్తం లేదు. మేము హోప్స్ వదులుకున్నారు. కానీ అంత రాత్రి నిమిషాల్లో మీకు రక్తం అందేలా ఆయనే చొరవ తీసుకున్నారు ".
సర్జన్ చెప్పింది విని అన్వర్ కదిలి పోయాడు. తడి కళ్ళతో
ఆదిత్యను చూశాడు. పేషెంట్ కు చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి డాక్టర్స్ వెళ్ళిపోయారు. గదిలో ఆదిత్య, అన్వర్ మాత్రమే మిగిలారు.
" డాక్టర్ గారన్నట్లు మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలి ?"
ఆదిత్య చిరునవ్వు నవ్వాడు.
" నేనెవరో మీకు తెలియదు. దారిన పోయే దానయ్య ను. నా కోసం మీరింత రిస్క్ తీసుకున్నారు.
ఇప్పటి వరకు ఇంటికి కూడా వెళ్ళలేదు. .ఎంత ఖర్చు పెట్టారో ఏమో " మొహమాటంగా, సందేహంగా ఆగిపోయాడు.
" ఇప్పుడు అవేమీ ఆలోచించవద్దు.రెస్ట్ తీసుకోండి. మీరు త్వరగా కోలుకోవాలంటే బాగా రెస్ట్ తీసుకోవాలి. కృతజ్ఞత అన్నారు మనిషి కి మనిషి సాయం చేయడం కనీస ధర్మం.. నాకు అవకాశం వచ్చింది. చేశాను. "
" అలా ఆలోచించే వారు ఈ కాలంలో ఎవరున్నారు ?"
" ఒకరి విషయం మన కెందుకు. సరే , మీ వాళ్ళ కు ఫోన్ చేయాలి కదా ! సెల్ నెంబర్ చెప్పండి . చేస్తాను. ఇప్పుటికే వాళ్ళు కంగారు పడుతుంటారు. " సెల్ తీశాడు ఆదిత్య.
ఆదిత్య చేతిలో ఫోన్ చూసి తన జేబులు తడుముకున్నాడు అన్వర్.
" మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాగానే సెల్ కోసం మీ జేబులు
చెక్ చేశాను. కనిపించలేదు. ఆక్సిడెంట్ జరిగిన స్పాట్ లో పడిపోయి ఉంటుంది. "
క్షణం ఆలోచనలో పడి పోయాడు అన్వర్.
" ఏమిటి ఆలోచిస్తూ ఉన్నారు. మీ ఇంటి నెంబర్ చెప్పండి."
సార్ ! నేనొక మొబైల్ వెండార్ ను. నాకొక చెల్లెలు, , అమ్మ . తమ్ముడు గ్రామంలో ఉంటున్నారు.
వారికి చెబితే కంగారు పడతారు. చెప్పినా ఏం లాభం లేదు.
ఈ మహానగరంలో నన్ను వెదుక్కుంటూరాలేరు.. ఇక్కడ నేనొక్కడినే ఉంటున్నాను. ఓ సర్దార్ జీ ఇంటిపైన పెంట్ హౌస్ లో నా బస. ఆయనకు ఇప్పుడే వద్దు. రెండు రోజుల తర్వాత చెబుతాను. "
" నా మిత్రుడు ఒకడున్నాడు. వాడికి ఫోన్ చేసి చెబుతాను. వాడు వచ్చి నా బాగోగులు చూసుకుంటాడు. మీకు ఇవ్వవలసిన మనీ కూడా వాడే ఇస్తాడు "
రహీం కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. వెంటనే హాస్పిటల్ కు రమ్మన్నాడు. ఆదిత్య అన్వర్ బెడ్ మీద కూర్చున్నాడు. భుజంపై చనువుగా చెయ్యి వేశాడు.

" మీ ఫ్రెండ్ రానివ్వండి. మీకు తోడు గా ఉంటాడు. కానీ మీకు పూర్తిగా తగ్గి మీరు డిశ్చార్జ్ అయ్యేవరకు బాధ్యత నాది. డబ్బు సంగతి మర్చిపొండి".
అన్వర్ మరేమీ మాట్లాడలేకపోయాడు. ఆదిత్యది చాలా గొప్ప మనసు అనుకున్నాడు. ఆదిత్యకు తను తెలుసునన్న
విషయం అన్వర్ కలలో కూడా ఊహించలేదు.
ఆదిత్య సెల్ మోగింది . అవతల మెహర్. రిసెప్షన్ లో ఆదిత్య కోసం ఎదురు చూస్తోంది. .
**************************************************