Those three - 1 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 1

ఆ ముగ్గురు
ఓ ముందుమాట. 1
నాకు తెలిసి ఉగ్రవాదం వైపు మళ్ళిన వారిని రెండు వర్గాలు గా విభజించవచ్చు. ఒక వర్గం వారు మతోన్మాదులు.వారిని అల్లా కూడా మార్చలేడు. వారిది విథ్వంసక ప్రవృత్తి. మరో వర్గం వారిలో చాలామంది ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉగ్రవాదానికి బలవుతున్నారు. ప్రస్తుత రచన "ఆ ముగ్గురు" లో అన్వర్,అలీ, యాకూబ్, రెండో కోవకు చెందిన వారు. విభిన్న సామాజిక నేపథ్యాల నుండి ఉగ్రవాదం వలలో చిక్కిన ఈ ముగ్గురు ఎలా జీవన స్రవంతి లోకి రాగలిగారో , ఏ అనూహ్య పరిస్థితులు ఈ మార్పుకు కారణం అయినాయో అన్నది. ఈ నవల ప్రథాన శిల్పం.
ఇందులో " మిషన్ జన్నత్ " ఈ రచయిత ఆకాంక్ష, స్వప్నం. ఈ సంస్థ వ్యవస్థాపకుడు డా. ఇనాయతుల్లా రచయిత ఆదర్శ పాత్ర . నేటి యువత కు మతాలకు
అతీతంగా జీవితానికి పనికి వచ్చే చదువు, సామాజిక బాధ్యత, జీవితం పట్ల అవగాహన, శాంతి యుతి సహజీవనం లాంటి అర్హత లు ,ఆకాంక్షలు,. ఆదర్శాలు తప్పక వుండాలి. కాని, అమానుషత్వం, అరాచకం, అవినీతి, స్వార్థం లాంటి అవలక్షణాలు తో పుచ్చి పోయినా నేటి సమాజం నుండి " అనుకూల పవనాలు " ఆశించటం పగటికలే. అలాగని --- సమతా వాదం, ప్రగతి అసాధ్యం అన్ని నిస్పృహలతో తో చేతులు ముడుచుకొని కూర్చుంటే ముందు తరాల భవితవ్యం ప్రశ్నార్థకం కాదా ? మన వంతు ప్రయత్నం గా ముందడుగు వేయవలసిన బాథ్యత లేదా ? ఫలితం కనుచూపు మేరలో లేకున్నా ప్రయత్నం చేయాలి కదా ?
ఉడత సాయం చేయటం ధర్మం కదా ? కోటానుకోట్ల బిందువులన్నీ కలిస్తేనే మహా సింథువవుతుంది.
ఈ ఆలోచనే ఈ రచనకు ప్రేరణ.

***********
ఆ విశాల మైన మైదానంలో అక్కడక్కడ విసిరేసి నట్లు గా చెట్లు. వాటి మధ్య బారులు తీరిన గుడారాలు.
వేరే జనావాసాలు లేవక్కడ.

పదుల వరుసలో నిలబడి ఉన్న యువకులకు నడివసులో ఉన్న కొందరు రైఫిల్ ఫైరింగ్ లో శిక్షణ
ఇస్తున్నారు. శిక్షణ తీసుకుంటున్న వారిని యువకులు
అని పిలిచేకన్నా నూనూగు మీసాల పసివాడు అనటం సబబు . ప్రశాంత ఉషోదయాన్ని రైఫిల్ చప్పుళ్ళు నిరంతరం గా భంగపరుస్తున్నాయి .
పాక్ ఆక్రమిత భూభాగం లో కొండల నడుమ మనిషి
సంచారమే లేని ఆ మైదానంలో అదో మిలిటెంట్ స్థావరం. మారణాయుథా ల్లాంటి మనుషుల్ని తయారు చేసే కార్ఖానా .
అన్వర్ ఆ పెద్ద గుడారం లోకి అడుగు పెట్టాడు. అది
ఆ మిలిటెంట్ క్యాంప్ ఆఫీస్. క్యాంప్ ఇన్ ఛార్జ్ అబుల్
సలాం . వారి సంప్రదాయ పద్ధతిలో ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు.
" ఏది నువ్వు వద్దనుకుంటున్నావో అదే నీ మెడకు
చుట్టుకుంటోంది ." నవ్వుతూ అంటూ కూర్చోమన్నట్టు కుర్చీ చూపించాడు .

" అంటే ___ హైదరాబాద్ వెళ్ళక తప్పదా ?" అబుల్
సలాం మాటల్లో భావం అర్థమైంది అన్వర్ కు. కూర్చున్నాడు.
" హైదరాబాద్ స్లీపింగ్ సెల్ హమీద్ మూడు రోజుల క్రితం మెసేజ్ పెట్టాడు.అక్కడో కొత్త మిషన్ ప్రారంభిస్తున్నారు .
_____ ఆపరేషన్ జన్నత్ .
" ఆపరేషన్ జన్నత్ ?" అర్థం కానట్లు చూశాడు అన్వర్.
అవును. ఆ మిషన్ కు నిన్నే ఎందుకు పంపుతున్నారు ?"
నువ్వొక్కడివే కాదు. నీతో నలుగురినీ పంపుతున్నారు. నువ్వు టీం లీడర్ వి."

" నా ప్రశ్నకు అది జవాబు కాదు ."
అబుల్ సలాం నవ్వాడు.
" మిలిటెంట్ మిసైల్ లాంటి వాడు. అల్లా పై నమ్మకం, ఆవేశం అతడికి వుండవలసిన Assigned duty తప్ప అతడి మనసులో మరో ఆలోచన ఉండకూడదు."
" మరి నేను ?"

" నీలో ఆవేశం ఉంది. తెగింపు వుంది . కాని, అవసరం వచ్చినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నీవు ఆలోచిస్తావు.___బెదరవు. నీ ఆలోచన లే నిన్ను ముందుకు నడిపిస్తాయి."
" నన్ను బాగా స్టడీ చేశావు." అన్వర్ నవ్వాడు.
"క్యాంప్ లీడర్ గా ఆది డ్యూటీ కదా ?" తనూ నవ్వాడు.
" ఆపరేషన్ జన్నత్ లక్ష్యం ఏమిటి ?"
" ఇస్లాం విస్తరణ. ( Enhancing Islamic influence in non_muslim society. ). భారత దేశపు ప్రధాన నగరాల్లో ముస్లిం యూత్ ను అన్ని విధాలా సపోర్ట్ చేయటం . . వారిని, వారి బలాన్ని పెంచటం ."

"ఇస్లాం రాజ్య స్థాపన కాదా ? "
"రెండూ ఒకటి కావా ?" ఆశ్చర్యం గా చూశాడు అబుల్ సలాం.
" ఎలా అవుతాయి ? ఇస్లాం రాజ్య స్థాపన ఆయుధ
తోనే సాధించగలం . ఒక జాతి పై, ఒక సమాజం పై పట్టు సాధించటం ‌‌‌‌‌‌‌‌‌‌‌పపపపోరాటం తో నే సాధ్య మవుతుంది. మన జీహాద్ లక్ష్యం అదే. విస్తరణ లో ఆయుధం ఉపయోగించటం చాలా అరుదు .ఇక్కడ ప్రాపర్ ప్లానింగ్ కావాలి. ప్రతి సందర్భంలోనూ జాగ్రత్త గా ఆలోచించి నిర్ణయం తీసుకో వాలి ."
"ఇప్పుడు అర్థం అయిందా , నిన్నే ఎందుకు పంపు తున్నామో ? Any way __ నీ వ్యక్తిగత సమస్య లు తో మాకు సంబంధం లేదు. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. తప్పదు." అబుల్ సలాం స్వరం లో అధికారం. అన్వర్
మౌనంగా వుండిపోయాడు. ఇక మాట్లాడి ప్రయోజనం
లేదు .
" చలి బాగా ముదిరింది. సరిహద్దు పొడవునా మంచు
దట్టంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయాలి. కాని సరిహద్దు దాటటానికి ఇదే
సరైన సమయం. మంచు తీవ్రత వల్ల సరిహద్దు దేశాలు అంత హుషారుగా ఉండవు. ఉండలేవు కూడా.
All the best . భుజం తట్టాడు సలాం.


‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
ధారావాహిక 2 contd