Those three - 24 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 24 - లక్కవరం శ్రీనివాసరావు

ఈ అటాక్ లో మూడు వందల కన్నా కాస్త ఎక్కువే మిలిటెంట్లు చనిపోయారు. ఇదెలా సాధ్యం ? ఆర్మీ పర్సనల్ అంత కచ్చితంగా వారి ట్రైనీ క్యాంప్స్ ను ఎలా లొకేట్ చేయగలిగారు? ఆ స్థావరాల టోపోగ్రఫీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి సమాచారం ఇచ్చి ఉండాలి."
" ఆ వ్యక్తి అలీ కాదు గదా ! అన్వర్ లో చిన్న ఆశాకిరణం.అలీ జీవించి ఉన్నాడన్న ఆలోచన అన్వర్ మనసును తేలిక పరిచింది. ఏమాత్రం సందేహం లేదు. అలీ సహకారం లేనిదే
ఈ ఆపరేషన్ నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయితే ఛాన్సే లేదు. ఇప్పుడు అలీ తన గ్రామం లో తన వాళ్ళతో కలిసి ఆనందంగా కబుర్లు చెబుతూ ఉంటాడు.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు......... అన్వర్ మనసు లో ఊహ.
కానీ ఆ ఊహ తప్పదు.
సర్జికల్ స్ట్రైక్ లో అతడి సహకారానికి ప్రతిఫలం గా on compassionate and grounds అతడిని ఆర్మీ లో రిక్రూట్ చేసుకున్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ లో ఉన్నాడు.
మెహర్ , ఆదిత్య పార్క్ లో పచ్చటి లాన్ పై మెల్లగా నడుస్తున్నారు. చల్లటి గాలులతో సాయం సంధ్య మనోహరం గా ఉంది.
" ఆరోజు మా అమ్మ కు అంత ప్రామిస్ చేశారు. చాలా ఎమోషనల్ గా కూడా కనిపించారు.".
" నిజమే ..........మీ ఇంటి పరిస్థితి, కొడుకు కోసం మీ అమ్మ పాడే బాధ నన్ను బాగా కదిలించాయి.
కానీ నాది తొందరపాటు నిర్ణయం కాదు. తప్పకుండా నా మాట నిలబెట్టుకుంటాను."
మెహర్ చిరునవ్వు నవ్వింది.
" మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. కానీ మార్గమే కనిపించటం లేదు.ఎప్పుడో ఇల్లు వదిలి పోయిన వాడిని ఎలా వెదకటం.?"
" పట్టుదలగా ఆలోచించాలే గాని ఏదో ఒక దారి కనిపించకపోదు." ఆదిత్య లానుపై కూర్చున్నాడు. మెహర్ ఆదిత్య ప్రక్కనే కూర్చుంది.
" మీ అన్న ఇల్లు వదిలి వెళ్ళి పోయి పదిహేను సంవత్సరాలు అయింది.ఇప్పుడు తన వయసు ముప్పై దాటి ఉంటుంది.
కనిపిస్తే పోల్చుకోవడం కష్టం. వయసు తోపాటు మనిషి ముఖం మీద కంటూర్స్ అంటే సన్నని గీతలు ఏర్పడతాయి. దీన్నే Aging process అంటారు. ఈ కంటూర్స్ ఆధారంగా ఒక మనిషి ప్రస్తుత రూపాన్ని ఊహించవచ్చు. వయసుతో పాటు మనిషి మొహంలో ఏర్పడే మార్పులను చిత్రించే కళాకారులు చాలా అరుదు. ఒకవేళ ఉన్నా వారు చాలా టైం తీసుకుంటారు. అంతే సమయం మనకు లేదు. కంప్యూటర్ టెక్నాలజీ ఒకటే మనకు దిక్కు. మీ అన్న క్యాబినెట్ సైజ్ ఫోటో ఒకటి ఉంటే ఇవ్వండి. కంప్యూటర్ ఇమేజెస్ డిఫరెంట్ ప్రొఫైల్స్ లో రెడీ చేస్తాను."
" అన్వర్ అసలు ఈ దేశంలో ఉన్నాడో లేడో "........ ఆలోచిస్తూ అంది మెహర్.
" ఈ దేశం కాకపోతే మీరే దేశం వెళ్ళుంటాడు?"
"ఏమో?"
" తనకు విలాసవంతమైన జీవితం గడపాలని కోరిక. కానీ తను పెద్దగా చదువుకోలేదు. రెక్కలు కష్టం మీదే ఆధారపడాలి. ఇలాంటి వారికి ఒకే ఒక ఆశాకిరణం గల్ఫ్ దేశాలు. పైగా తను ముస్లిం.".
" అలా ఏ దేశానికో సంపాదన కోసం వెళ్ళకుండానే ఫర్వాలేదు." ఆలోచిస్తూ క్షణం ఆగింది.
" అంటే. ! అర్థం కానట్లు చూశాడు.
" అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఏ రౌడీ ముఠా లోనే చేరుంటే.......!Anti- social element అయ్యుంటే! " మెహర్ మొహంలో , మాటలో కలవరం.
వెంటనే ఆదిత్య మాట్లాడలేదు.
" అందుకు అవకాశం లేకపోలేదు. తెగిన గాలిపటం లాంటి వారిని ఉచ్చులో బిగించేందుకు చాలా రౌడీ గ్యాంగ్స్ ఉన్నాయి ఈ మహా నగరంలో.
ఆ పరిస్థితుల్లో అతడో మృగం అయ్యుంటాడు.ప్రేమ , బంధాలు మానవత్వం అన్నీ ఆవిరైపోయుంటాయి. అలాంటి కొడుకును చూస్తే మా అమ్మ గుండె పగిలి పోదా. ?" చివరి మాటలంటున్నపుడు మెహర్ గొంతు వణికింది. కళ్ళలో పల్చటి కన్నీటి పొర.
ఆదిత్య ఓదార్పు గా ఆమె భుజం తట్టాడు.
" ఎందుకలా ఆలోచించాలి ? మీ అన్నయ్య కు అమ్మంటే ప్రాణం. బింకం తో మీ నాన్న మీద కోపంతో ఇల్లు వదిలి పోయాడు. అతడి తొందరపాటుకు, తెగింపు కు మీ అమ్మ కారణం కాదు. అతడు ఎంత పతనమైనా అమ్మ ప్రేమ ను మర్చిపోలేడు. లెటజ్ బి హోప్ ఫుల్".
" ఆ నమ్మకం తోనే ప్రయత్నించాలి. అల్లా పై భారం వేసి ముందుకు కదలాలి. నా హోప్ మీరే. మీరు చూపే మార్గంలో కళ్ళు మూసుకుని అడుగు వేస్తాను."
ఆదిత్య రెండు చేతుల్ని కళ్ళకద్దుకుంది మెహర్.
" నౌ యు ఆర్ ఎమోషనల్. " ఆమె భుజాలపై మృదువుగా చేతులానించి అన్నాడు ఆదిత్య.
మెహర్ సిగ్గు తో తలవంచుకుంది.
అమ్మ, నాన్న, చెల్లెలు పదేపదే గుర్తొస్తున్నారు. హైదరాబాద్ నగరం మానని పుండుగా పదేపదే పాత జ్ఞాపకాలను ఉండుండి రేపుతోంది. అన్వర్ తను చదివిన స్కూల్ కు వెళ్ళాడు అన్వర్. అన్వర్ తను చదివిన స్కూల్ కు వెళ్ళాడు. నాటి రోజుల్ని నెమరు వేసుకుంటున్నాడు
.
బాధతో, జ్ఞాపకాల అనుభూతితో గుండె బరువెక్కింది. అలా ఎన్నెన్నో ప్రదేశాల పరిభ్రమణం తో బాల్యం, యవ్వనపు తొలి రోజులు మనసును రాగరంజితం చేశాయి. ఉన్నవాళ్ళ తో సమానంగా , దర్జాగా బతకాలని గొప్పలు పోయి జీవితాన్నే పోగొట్టుకున్నాడు.
కొనసాగించండి 25