Those three - 31 in Telugu Fiction Stories by LRKS.Srinivasa Rao books and stories PDF | ఆ ముగ్గురు - 31

ఆ ముగ్గురు - 31

అన్వర్ మొబైల్ వెండార్ కనుక ' ఆర్టరీ ట్రాఫిక్ లైన్స్ " లో రద్దీ ఉండే చోట వ్యాపారం చేయలేడు. అతడు అమ్మే వస్తువుల స్థాయిని బట్టి లేబర్ కాలనీల్లో అతడి వ్యాపారం జరుగుతోంది. ఈ ఆలోచనతోనే వాకబు చేస్తూ ఓ లేబర్ కాలనీలో ప్రవేశించాడు ఆదిత్య. అందరూ అన్వర్ కంప్యూటర్ ఇమేజెస్ గుర్తు పట్టారు. అంటే ఈ కాలనీలో అన్వర్ తరుచూ సరుకులు అమ్ముతాడు. అది పెద్ద కాలనీ . ఆశించిన స్థాయిలో సరుకులు అమ్మే అవకాశం ఉంది . పైగా తన ' మాల్' సప్లై కి ఈ కాలనీ చాలా అనుకూలమైంది. ఎవరినీ ఎవరూ పట్టించుకోరు. ఆదిత్య లో ఉత్సాహం పెరిగింది. అలాగే వాకబు చేస్తూ ఆ కాలనీ చివరకు వచ్చాడు. ఆ చివరి నుండి డబుల్ లైనర్ సిటీని కలుపుతుంది.
కాలనీ చివర ఓ చెట్టు క్రింద ఓ చిన్న బంకు ఉంది. అక్కడ బల్లమీద ఓ వయసు మళ్ళిన వ్యక్తి బీడీ కాలుస్తూ అరమోడ్పు కన్నులతో బ్రహ్మానందపు టంచులలో ఉన్నాడు.
అతడికి తపోభంగం చేశాడు ఆదిత్య. అతడు కళ్ళు తెరిచి ఆదిత్య చెప్పింది విన్నాడు.
" అనంత్ రామ్ గురించేనా మీరు ? అదిగో ఆ మేడ మీద గదిలో ఉంటాడు. " బీడీ విసిరేసి నింపాదిగా బదులిచ్చాడు.
ఆదిత్య కళ్ళల్లోకి రక్తం పొంగుకొచ్చింది.
" యురేకా " అని గట్టిగా అరవాలనిపించింది.
విహారి టీం మళ్ళీ అన్వేషణ లో పడింది. ఆ టీం లో ముగ్గురు ఆదిత్య వ్యూహాన్నే అనుసరించారు లేబర్ కాలనీలు జల్లెడ పట్టసాగారు. ఆ రోజు వారి కృషి ఫలించలేదు. తిరుగు ముఖం పట్టారు.
" బాగా అలిసిపోయావు. వేడి వేడి చాయ్ తో హోష్ తెచ్చుకో " టీ ఆఫర్ చేశాడు ఇంతియాజ్.
టీ మెల్ల మెల్లగా సిప్ చేస్తూ సేదతీర్చుకున్నాడు విహారి.
" డోన్ వర్రీ ! రేపటి లోపల అన్వర్ తప్పక దొరుకుతాడు. వి ఆర్ ఆన్ ది రైట్ ట్రాక్".
అవునన్నట్లుగా తలవూపాడు విహారి.
" యాకూబ్ ఇంటరాగేషన్ కాదు అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఆపరేషన్ జన్నత్ మూలాలు తెలుసుకోలేక పోయాం" నిట్టూర్చాడు ఇంతియాజ్.
" మిషన్ జన్నత్ రెగ్యులర్ డోనార్స్ లిస్ట్ తిరగేస్తే?"
" అదొక్కటే మన బ్రేక్ త్రూ. మరో క్లూ.... జన్నత్.--- ఆరెండు సంస్థల కామన్ వర్డ్ .
" సార్ ! నాకు తెలిసి అదే రైట్ బ్రేక్ త్రూ. డాక్టర్. ఇనాయతుల్లా మిషన్ జన్నత్ గురించి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వకముందే ఆపరేషన్ జన్నత్ పి.ఓ.కే మిలిటెంట్ ట్రైనీ క్యాంపు నుండి అయిదుగురు మిలిటెంట్ బయలుదేరారు."
" సో ! " విహారి కళ్ళలోకి చూశాడు ఇంతియాజ్.
" సో ! ఇనాయతుల్లా క్లోజ్డ్ సర్కిల్ లో ఒకరు ఆపరేషన్ జన్నత్ మాస్టర్ మైండ్ కావచ్చు.".
" ఎగ్జాక్ట్లీ. వెంటనే ఇనాయతుల్లా గారిని కలవాలి. డోనార్స్ లిస్ట్ చెక్ చేయాలి. మిషన్ జన్నత్ ప్లానింగ్ లో ఎవరెవరు ఆయనతో ఐడియాస్ షేర్ చేసుకున్నారో తెలియాలి. వారందరూ మిషన్ జన్నత్ రెగ్యులర్ డోనార్స్ అయివుంటారు."
" అలా భారీ స్థాయిలో ఫండింగ్ చేసేవాళ్ళు ఒకరికి మించి ఉంటే.....?
ఇంతియాజ్ నవ్వాడు.

" తప్పక ఒకరికి మించే ఉంటారు. అయినా ఇబ్బంది లేదు. వారి ప్రతి కదలిక గమనించాలి . రొటీన్ చెక్ చేయాలి. వారి ఫ్రెండ్స్ సర్కిల్స్, బ్యాంకు స్టేట్మెంట్, ఐ.టీ రిటర్న్స్...ఆల్ పాజిబుల్ సోర్సెస్ స్కాన్ చేయాలి. ఎక్కడో ఒకచోట క్లూ దొరక్కపోదు. కానీ అన్వర్ పట్టుబడక ముందే మాస్టర్ మైండ్ ట్రేస్ ఔట్ చేయాలి. డ్రగ్స్ నెట్వర్క్ లో అన్వర్ కీలకమైన వ్యక్తి. అతడి అరెస్ట్ తో డ్రగ్స్ పునాదులు కదులుతాయి. మనం వార్ ఫుట్ బేసిస్ లో ముందుకు కదలాలి. తప్పదు. ఇంతకు మించి మరో ప్లాన్ , పాజిబిలిటీ
మన దగ్గర లేవు.
" అవును సార్ ! దిసీజ్ అవర్ లాస్ట్ రిసార్ట్. రియల్లీ గా హిమాలయన్ టాస్క్. " విహారి.
************

సొంత వూరు యాకూబ్ కు జన్నత్ లా అనిపించింది.
బాట వెంబడి నడుస్తూ ఉంటే గుండె లో నిండా ప్రాణ వాయువు పొంగి నట్లయింది.
పెంకుటిల్లు వరండా లో దర్జీ పని లో తలమునకలుగా
కరీంఖాన్ ముఖం కమలంలా వికసించింది.
" అరే ! సునో ! యాకూబ్ ఆయా " తండ్రి మాటల్లో ఉత్సాహం, చలనంలో విద్యుత్ లాంటి చురుకు దనం.
కొడుకును ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు కరీంఖాన్.
తల్లి గుండెల్లోంచి పొంగిన ప్రేమ, అక్క చిరునవ్వు యాకూబ్ సేద తీర్చాయి. అమ్మ చేతి భోజనం, మామిడి చెట్టు క్రింద నవారు మంచంపై కునుకు తో సాయంకాలానికి పూర్తి గా సేదతీరాడు.
ఆ రోజు ఏదో పర్వదినం. ఊరి చివర విష్ణు మూర్తి కోవెలలో
సందడి గా ఉంది . పక్కింటి రెడ్డి గారి భార్య కు తోడుగా యాకూబ్ తల్లి గుడి దాకా వెళ్ళింది. రెడ్డి గారి కొడుకు, కూతురు హైదరాబాద్ లో చదువుకుంటున్నారు. రెడ్డి గారి భార్య కు యాకూబ్ తల్లి అన్నింటి లోనూ చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆ ఇల్లాలు యాకూబ్ తల్లి కష్టం ఉంచుకోదు. ఏదో రూపంలో తీరుస్తూనే ఉంటుంది.
ఈవిడ మొహమాటం తో , ఆత్మాభిమానం తో కాదన్నా ఆవిడ ఊరుకోదు.

కొనసాగించండి 32

Rate & Review

Be the first to write a Review!