Those three - 21 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 21 - లక్కవరం శ్రీనివాసరావు

మెహర్ ఇల్లు చాలా సాదాసీదాగా ఉంది. ఆ చిన్న హాల్లో స్టూల్ మీద కూర్చున్నాడు ఆదిత్య. కాసేపట్లో టీ ప్రేమతో మెహర్ వచ్చింది. ఓం కప్పు ఆదిత్య తీసుకున్నాడు. మరో కప్పు మెహర్ తీసుకుంది.
మెహర్ కిచెన్ లోకి వెళ్ళిన తర్వాత అతడి చూపులు హాలు మొత్తం చుట్టాయి. అప్పుడు గోడకు తగిలించిన ఓ ఫోటో అతడికి కనిపించింది.
ఓం పదహారేళ్ళ అబ్బాయి, పదేళ్ళ అమ్మాయి ఫోటో అది.
" ఆ అమ్మాయి మీరు. .......ఆ అబ్బాయి....?"

" మా అన్నయ్య" మెహర్ ముఖంలో ఏ భావమూ లేదు.
" అన్నయ్యా ? మీకో అన్నయ్య ఉన్నాడని ఎపుడూ చెప్పలేదే ! " ఆశ్చర్యం గా అడిగాడు ఆదిత్య.
" ఇల్లు వదిలి వెళ్ళి పోయి పదిహేను సంవత్సరాలు అయింది. ఎక్కడ ఉన్నాడో ? ఏం చేస్తున్నాడో ? తిరిగి రాని వాడి గురించి ఏం చెప్పేది ?" మెహర్ మొహంలో దైన్యం.
"
ఇల్లు వదిలి అంత చిన్న వయసులో ఎందుకు వెళ్ళాడు ?" టీ కప్పు ప్రేమలో పెట్టాడు.
కొన్ని క్షణాలు మౌనం. మెహర్ టీ తాగలేదు. కప్పు ప్రేమలో పెట్టింది.
" మాది అతి సాధారణ కుటుంబం. మా నాన్నది చిన్న గవర్నమెంట్ ఉద్యోగం. సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. అంటూ ఇటూగా ఇంటి ఖర్చులకు సరిపోయేది. అన్నయ్య కు పెద్ద పెద్ద కోరికలు ఉండేవి. తన ఫ్రెండ్స్ తో సమానంగా, దర్జా గా ఉండాలని ఆరాటపడేవాడు. వీలయ్యేది కాదు. నాన్న ముందు మాట్లాడే ధైర్యం లేక అమ్మ ను సతాయించేవాడు. పాపం అమ్మ మాత్రం ఏం చేస్తుంది ? ఇద్దరి మధ్య నలిగి పోతుంది. చివరకు ఒకరోజు అన్నయ్య వల్ల ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. అన్నయ్య మాట తూలాడు. నాన్న చేయి చేసుకున్నాడు. అడ్డు వెళ్ళిన అమ్మకు రెండు తగిలాయి. అన్నయ్య పెద్డగా అరుస్తూ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. " మెహర్ గొంతు వణికింది. బాధతో కళ్ళు మూసుకుంది. ఆనాటి దృశ్యం కళ్ళముందు మెదిలిందేమో . కళ్ళు తడి అయినాయి. ఆదిత్య ఓదార్పు గా తన చేతిని ఆమె చేతి మీద మృదువుగా ఉంచాడు.
" నాన్న అన్నయ్య ను వెదకని చోటంటూ లేదు . చివరకు పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాడు. అన్నయ్య ను వెదికి వెదికి అలసిపోయి ఆ దిగులుతోనే చనిపోయాడు. నేను, అమ్మ ఒంటరిగా మిగిలిపోయాం. ........ఆమె క్షణం ఆగింది. ఇతడు ఆమెనే చూస్తున్నాడు.
" అమ్మ ధైర్యం గా పరిస్థితులకు ఎదురు నిలిచింది. క్షణం క్షణం సైనికుడిలా పోరాడింది. అమ్మ రెక్కల కష్టం తోనే ఇంత దాన్ని అయ్యాను. ఇప్పుడు ఈ ప్రపంచంలో అమ్మ ఒక్కటే నాకు తోడు. "
"వారిద్దరి మధ్య చీమ చిటుక్కుమనేంత నిశ్శబ్దం. " అమ్మ జీవితమంతా పోరాడి అలసిపోయింది. ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. కానీ అమ్మను ఒక్క అంశం బ్రతికిస్తోంది. అన్నయ్య ఎప్పటి కైనా తిరిగి వస్తాడని ఆమె నమ్మకం. అన్నయ్య కు అమ్మంటే ప్రాణం. తన కోసం ఏదో ఒక రోజు తిరిగి వస్తాడన్న ఆశ ఆమెకు ఊపిరి పోస్తుంది.
నాకు మాత్రం నమ్మకం లేదు. ఇన్నాళ్ళు రాని వాడు ఇంకేం వస్తాడు. కాని అమ్మ నాకు కావాలి. అమ్మ నమ్మకాన్ని ఏనాడూ కాదనలేదు. అన్నయ్య రాడని వాదించలేదు."
ఇంతలో ఓ మూల చప్పుడైంది. మెహర్, ఆదిత్య అటువైపు చూశారు. మెహర్ తల్లి ఆమె గది ముందు పడి ఉంది. కాలికేదో తగిలి తూలి పడింది.
ఇద్దరూ ఆమె దగ్గరి కి పరిగెత్తారు. ఆమెను నెమ్మదిగా లేవదీసి కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమె తమాయించుకుంది.
మెహర్ నీళ్ళిస్తే తాగింది. ఆదిత్య ఆమె కాళ్ళ ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు. అతడు చాలా ఎమోషనల్ గా ఉన్నాడని మొహంలో భావాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఆమె మొహంలో అలసట, బాధ, ఉద్వేగం. నుదుటిపై చిరుచెమటలు. ఆమె ఆదిత్య ను ఆర్తిగా చూస్తోంది. అతడికి ఏదో చెప్పుకోవాలన్న ఆరాటం మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.
" అమ్మా !" ఆదిత్య గొంతు మెత్తగా పలికింది. " మీ కొడుకు తిరిగి వస్తాడన్న నమ్మకం నేను నిజం చేస్తాను. మీ నిరీక్షణ వృధా కానివ్వు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు. ఆ పేగు బంధం మీ కొడుకు ను వదిలిపెట్టదు. ఎక్కడున్నా ఏదో ఒకరోజు మీ కాళ్ళముందు పడేలా చేస్తుంది. పడేలా నేను చూస్తున్నాను. "
ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమె మొహంలో చాలా రోజుల తర్వాత వెలుగు చూడగలిగింది. ఆమె తృప్తిగా నవ్వింది.
అన్వర్ ఇన్నాళ్ళైనా ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళినట్లు ?
విహారి మెహర్ ను విషయం అర్థం కానట్లు చూశాడు.
ఆమె విరక్తి గా నవ్వింది.
" ఆ విషయమే తెలిస్తే ఇంకా సమస్యే లేదుగా ప్రకాష్ ".
విహారి ప్రకాష్ అన్న పేరు తో పరిచయం చేసుకున్నాడు.


కొనసాగించండి 22