OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

The shadow is true by LRKS.Srinivasa Rao | Read Telugu Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Telugu Novels
  4. నీడ నిజం - Novels
నీడ నిజం by LRKS.Srinivasa Rao in Telugu
Novels

నీడ నిజం - Novels

by LRKS.Srinivasa Rao Matrubharti Verified in Telugu Fiction Stories

  • 7.1k

  • 16.6k

  • 2

హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో దైన్యం , ...Read Moreలో సఘన విషాదం . ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి. “ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి ?” వృద్ధుడి కం

Read Full Story
Download on Mobile

నీడ నిజం - Novels

నీడ నిజం - 1
నీడ-నిజం నాంది హిమాలయ పర్వత ప్రాంతం లో ఒక గుహాన్తర్భాగం. సాయం సంధ్యారుణ కిరణాలు గుహలో ప్రసరిస్తున్నాయి. సమస్త ప్రకృతి ప్రశాంతం గా , ప్రమోదం గా ఉంది . గుహలో ఒక మూల శిలావేదిక పై వృద్దుడొకడు పద్మాసనం లో ఉన్నాడు. అతడికి చేరువలో నేలపై ఒక నడివయసు వ్యక్తీ . కళ్ళలో ...Read More, మొహం లో సఘన విషాదం . ఇందుకు భిన్నంగా వృద్ధుడి ముఖం లో అనంత దీప్తి, తృప్తి, కళ్ళు, జ్ఞానంతో , అనుభవం ప్రసాదించిన నిండుదనంతో జ్యోతుల్లా వెలుగు తున్నాయి. “ చిన్మయా ! మనో నిగ్రహం తో ,సాధన తో, రాగ-ద్వేషాలను జయించావు. నీలో ఈ అవ్యక్తం ఏమిటి
  • Read Free
నీడ నిజం - 2
రోజులు గడుస్తున్నాయి . ఓ నాడు ప్రా త: కాలాన ఋషీకేశ్ లో స్నానాదులు ముగించుకుని ధ్యానం లో కూర్చొన్నాడు చిన్మయుడు . మనసు సమాధి స్థితి పొందినప్పుడు అంతఃచేతనం సహస్ర దళ కమలం గా విప్పారిన వేళ అతడిలో మెరుపు లాంటి “ సంకేత”మొకటి తళుకుమంది . ఆ సంకేతం అతడిని వైకుంఠ ...Read Moreనాడు తిరుమలకు చేర్చింది . పవిత్ర వైకుంఠ ధామం చేరి , శ్రీనివాసుని ధ్యానించి , సాయం సంధ్య లో బంగారు శిఖరాల వైభవాన్ని , విమాన గోపుర పసిడి కాంతులను అవలోకించే చిన్మయానండు డికి గుదేవుడి భవిష్యవాణి తేటతెల్లమైంది. సందేహాలు సూర్యకాంతి సోకినా పొగమంచులా విడిపోయాయి.”కర్తవ్యం “ స్ఫురించింది.ఆ పవిత్ర క్షేత్రం లోనే అతడు విద్యాధరిని చూడటం తటస్థించింది .విద్యాదరి తండ్రికి భవిష్యవాణి” వివరించింది అక్కడే ! ఆ తిరుమల గిరిలోనే .అప్పుడు విద్యాధరికి పదేళ్లు. తెలిసీ తెలియని ఊహ. వయసు. చిన్మయానంద
  • Read Free
నీడ నిజం - 3
తనేం తప్పుగా ఆలోచించడం లేదు కదా. సాగర్ తల్లి ఎందుకు ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది . సాగర్ వైఖరి ఆమెకు అసలు నచ్చలేదు .తల్లి పై ప్రేమ ,"అనవసరం గా అమ్మని అనకు . ఆమె చెప్పిందని ఈ పని మానుకోలేదు . వేరే కొత్త వెంచర్ ప్లాన్ చేసాము . పేపర్ ...Read Moreజరుగుతున్నప్పుడు పెద్దగా నాకు పని ఉండదని ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ టేకప్ చేశాను . ఈ లోపలే మన న్యూ వెంచర్ బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది . పని ప్రారంభించాము . అందుకే ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ కు అప్పగించాను .అప్పుడప్పుడు సూపెర్వైస్ చేస్తే చాలు . .... ఈ విషయాలన్నీ నీకు తెలుసు . తెలిసి కూడా ఎందుకంత ఎమోషనల్ గా నన్ను అరుస్తావ్?”అతడు చెప్పిన కారణం విద్యాధరిని సమాధాన పరచ లేకపోయింది . ఆమె అసహనం గా
  • Read Free
నీడ నిజం - 4
.‌‌‌‌‌‌‌‌‌‌ఒకసారి సిటీ లో ఉగ్రవాదం పై ఒక సదస్సు జరిగింది. రెండు మతాలకు వేదిక లాంటి ఆ నగరం లో ప్రజల మధ్య సమన్వయం, అవగాహన పెంచే లక్ష్యం తో ఒక ఎన్.జీ.ఓ ఆ సదస్సు నిర్వహించింది . అప్పట్లో విధ్యాదరి ఓ పాపులర్ డైలీ లో ఓకే ప్రత్యెక కాలం నిర్వహించేది . ...Read Moreదిన పత్రిక తరపున సదస్సుకి ఆహ్వానింప బడింది . సదస్సుకు ముఖ్య అతిథి సాగర్. ఆ ఎం.జీ.ఓ మహారాజ పోషకుడు. అ సందర్భం లో విద్యాధరిని చూడడం , మాట్లాడటం జరిగింది . ఎందఱో ఉగ్రవాదం పై విభిన్న కోణాల్లో మాట్లాడారు . విద్యాధరి కూడా మాట్లాడింది . అందరితో పోలిస్తే ఆమె భావాల్లో సమస్య పై మరింత స్పష్టత, ఇరు మతాల వారికీ అనుకూలమైన ఆలోచనలు , అభిప్రాయాలూ ఉన్నాయి. ఆమె భావాలూ సదస్సులో చాల మందికి నచ్చాయి . నిజం చెప్పాలంటే
  • Read Free
నీడ నిజం - 5
అఘోరి వెంటనే మాట్లాడలేదు. మౌనం గాఉండి పోయాడు. “ మీ నవీన విజ్ఞానం కార్యాకారణాల పై ఆధార పడుతుంది. ప్రతి విషయానికి మీకు కారణం కావాలి. కారణానికి అందని విషయం మీ దృష్టిలో అభూత కల్పన. ప్రతి చిన్న విషయాన్ని తర్కించి, నిజానిజాలు నిగ్గు తేల్చే మీరు ఈ అనంత సృష్టికి ఒక మహత్తరమైన ...Read Moreఉందని ఎందుకు ఒప్పుకోరు. ఈ మహా విశ్వం లో అనంత కాలం నుండి వాటి వాటి నిర్దిష్ట కక్ష్యల్లో క్రమం తప్పకుండా పరిభ్రమించే కోటానుకోట్ల గ్రహ నక్షత్రాలు , మరణించే వరకు లయ తప్పని గతిలో స్పందిచే మానవ హృదయం. వీచే గాలి వికసించే పుష్పాలు వీటన్నిటికి ఏ కారణం లేదా అన్నింటి కన్నా మీ నవీన విజ్ఞానాని కన్నా అద్భుతమైనది మనసు. ------అంత అద్భుతమైన మనసును భగవంతుడు మానవ శరీరం లో అమర్చాడు. ఈ అనంత విశ్వం లోనే మానవుడిది అత్యుత్తమమైన సృష్టి.
  • Read Free
నీడ నిజం - 6
ఇప్పుడు ఆమె కలల్లో అస్పష్టత తొలగి, కొన్ని స్పష్టమైన రూపాలు , ప్రదేశాలు కనిపించసాగాయి. అ వివరాల ప్రకారం ఆమె మనసులో మెదిలే ప్రదేశాలు, పరిసరాలు, భౌగోళిక స్వరూపం రాజస్థాన్ రాష్ట్రానివని భరత్ రామ్ గుర్తించాడు. విశాల రాజస్థాన్ లో ఆమె వర్ణించే ప్రదేశాలు ఎక్కడని వెదకటం ? వెంటనే భారత్ రామ్ కు ...Read Moreరాజస్థాన్ మిత్రుడు గుర్తుకొచ్చాడు.అతడే శాంతిలాల్ .వృత్తిరీత్యా వ్యాపారస్తుడు. రాజస్థాన్ లో మూల మూల పరిచయం వుంది. భరత్ రామ్ అతడిని సంప్రదించాడు. విద్యాధరి కధనం సాంతం విన్నాక శాంతిలాల్ మనసులో రెండు ప్రదేశాలు మెదిలాయి. అ రెండు ప్రదేశాలు గ్రామీణ వాతావరణం లో ఉన్నవే. భరత్ రామ్ అన్ని కోణాల్లో సమస్యను పరిశీలించాక ఒక నిర్ణయానికి వచ్చాడు. అయన సూచన ప్రకారం సాగర్, విద్యాదరి ఒకసారి రాజస్థాన్ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు సందర్శించాలి. ఇందువల్ల విద్యాధరి సమస్యకు ఒక బ్రేక్ త్రూ వస్తుంది.
  • Read Free
నీడ నిజం - 7
అ గ్రామం లో గాలి దుమారం లా పరుగులు తీసి ఊరికి మరో చివరికి వచ్చింది. అక్కడ రాజమహల్ లా కనిపించే ఒక భవనాన్ని చూసి కదిలిపోయింది. బాధ, భయం, ఉద్వేగం, ఉద్రేకం- ఒక్కసారి కలగలిసి సాగర్ర కెరటాల్లా ఆమె ను చుట్టూ ముట్టాయి.ఆ తాకిడికి తట్టు కోలేక స్పృహ తప్పింది. సుదర్శనం డాక్టర్ ...Read Moreఆమె రక్షణ బాధ్యత తీసుకున్నాడు.వెంటనే అందరూ తిరుగు ప్రయాణ మయ్యారు. దారిలో ఎవరూ మాట్లాడుకోలేదు. ఎవరి ధ్యాసలో , ఆలోచన లో వారుండి పోయారు.విద్యాధరి రాక, ప్రతి కదలిక గ్రామ వాసుల్లో కలకలం, కలవరం రేపాయి. ఆమె ఏనాడో గతించిన "కోమలా దేవి" అన్న నిజం వారికీ అసలు మింగుడు పడలేదు. ఈ అద్భుతం వారికి దైవ ఘటనగా తోచింది. ఆమె దైవాంశ సంభూ తురాలు అన్న భావన వారి మనస్సులో బలం గా నాటుకుంది. ఎవరికీ తో చిన విధం గా వారు
  • Read Free
నీడ నిజం - 8
రాహుల్ కోమల కు దూరంగా ఉన్నాడు. చెరువు గట్టు మీద పచార్లు చేస్తున్నాడు. గట్టు మీద నడుస్తున్న రాహుల్ కు చెరువు లో ఒక మూల ఎర్ర తామరలు కనిపెంచాయి. వాటిని చూడగానే కోయాలనిపించింది. తెలిసీ-తెలియని వయసు ,ఉరకలు వేసే ఉత్సాహం -ముందు వెనుక చూసుకోకుండా చెరువులో దిగాడు. చివరి మెట్టుపై పేరుకు పోయిన ...Read Moreమొక్కలు రాహుల్ కాలుజారి చెరువులో పడేలా చేసాయి. అంతే భయం తో రాహుల్ పెట్టిన కేక ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. రాహుల్ నీళ్ళలో పడిన చోట లోతు ఎక్కువ. అందుకే నేల అందక నీళ్ళపై గిలగిల కొట్టుకుంటున్నాడు. క్షణాల్లో పరిస్థితి విషమించింది. ఎవరో ఒకరు సాహసం చేయకపోతే ఓ పసి ప్రాణం నీటి పా లవుతుంది. కోమల క్షణం ఆలస్యం చేయలేదు. మొండి ధైర్యం తో చెరువులో దూకింది.గట్టు మీద ఆడవాళ్ళు ‘జాగ్రత్త,జాగ్రత్త’ అని అరుస్తున్నారు. ఎలాగో ప్రాణాలకు తెగించి కోమల రాహుల్ ను
  • Read Free
నీడ నిజం - 9
తల్లి మనోవేదన చూసి కూడా వారు కదలలేదు.మెదలలేదు.తమ వైఖరి మారదన్నట్లు మౌనంగా వుండిపోయారు. విషయం తెలిసి విక్రమ్ బిగుసుకు పోయాడు.తనంటే ప్రాణం పెట్టే తమ్ముళ్ళే తన నిర్ణయాన్ని హర్షించలేక పోతున్నారు. ఇప్పుడు తనేం చేయాలి ? తమ్ముళ్ళ కోసం తన నిర్ణయాన్ని వెనక్కు తీసికోలేడు. అలాగని తమ్ముళ్ళను ఒప్పించ లేడు. తన అవసరం తనది.వారి ...Read Moreవారివి. రెండూ సమాంతర రేఖలు. తమ్ముళ్ళను పిలిచాడు. తమ ప్రవర్తన కు అన్ని గట్టిగా మందలిస్తాడని వారూహించారు. అన్నకు ఏ సమాధానం చెప్పాలో వారికి అర్ధం కాలేదు. అన్నను ఎదిరించలేరు..ఆయన నిర్ణయాన్ని ఆమోదించలేరు. చిత్రమైన పరిస్దితి. “...కోమలి తో నా వివాహం మీకు నచ్చలేదు. అందుకు మిమ్మల్ని తప్పు పట్టను. నా కోసం మీరు దిగి రావాల్సిన పని లేదు. మీ అభ్యంతరాలు మీవి.నా సమస్య నాది. మనది రాజవంశం.మన చరిత్ర గొప్పదన్న స్పృహ నాకూ వుంది...ఈ పరగణాన్ని. శాశిస్తూ అందరికీ ఆదర్శంగా వుండే
  • Read Free
నీడ నిజం - 10
ఈ విషయం పనివారి ద్వారా విక్రమ్ తల్లి కి తెలిసింది.ఆమెకు కొడుకు-కోడలి అవస్థ అర్థ మైంది.పర్వం పేరు తోనో,పండుగ పేరుతో నో రాహుల్ ను కొంతకాలం వారిద్దరి కీ దూరంగా వుంచాలనుకుంది. అందుకు దైవికంగా అవకాశం వచ్చింది. రాహుల్ ను ఎలాగో ఒప్పించి, ఆ పసివాడిని తీసికొని పక్క వూరికి ప్రయాణమైంది.మొదట రానని మొరాయించాడు. ...Read Moreనాయనమ్మ మాటల గారడీ కి పడి పోయాడు. పైగా అప్పుడు వేసవి శెలవులు. స్కూల్ బెడద కూడా లేదు.రాహుల్ కూడా హాలిడే మూడ్ లో వుండటంతో ఆమె పని సులువైంది. తల్లి సమయస్ఫూర్తి కి విక్రమ్ మనసులో నవ్వుకొన్నాడు. కోమల కూడా మనసులో నే కృతజ్ఞతలు చెప్పుకుంది. కోరినంత ఏకాంతం . కోమలా విక్రమ్ సింగ్ ల ను శారీరకంగా ఒకటి చేసింది. అంకిత భావం, ఆర్ద్రత, అనురాగం త్రివేణీ సంగమమై కోమల రూపంలో విక్రమ్ ను వరదలా ముంచెత్తాయి. ఇలా రోజులు క్షణాల్లా
  • Read Free
నీడ నిజం - 11
అఘోరి విక్రం లోగిలి లో అడుగు పెట్టగానే అప్రయత్నం గా ఉలిక్కిపడ్డాడు. ఆ ఉలికిపాటుకు కారణం అతడికి స్పష్టం గా స్ఫురించలేదు. కానీ, ఏదో అర్థం కాని అపశ్రుతి మనసు లో మెదిలింది . వెంటనే ఆ అనుభవం దంపతులకు వివరించాడు. జాగ్రత్త గా ఉండమని సూచన చేసాడు.విక్రం ఆ సూచన అంతగా పట్టించుకోలేదు. ...Read Moreకనుక కోమల కొంత జంకింది . ఏం జరుగుతుందో అన్న భయం ఆమె లో కాస్త అలజడి రేపింది .ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఓ ఎండవేళ , ఇంట్లో, చుట్టుపక్కల ఎవరూ లేని సమయాన ఓ ఆగంతకుడు విక్రం ఇంటి ముందు ‘ భిక్షాందేహి’ అంటూ నిలుచున్నాడు. అతడు ఔత్సాహిక క్షుద్రోపాసకుడు –పన్నాలాల్. ఆ పిలుపు విన్న కోమల భిక్ష వేసి వెళ్లి పోయింది. ఆ యువకుడు వెంటనే కదలలేదు .ఒక్క క్షణం చుట్టూ అనుమానం గా చూసాడు .
  • Read Free
నీడ నిజం - 12
కాళరాత్రి ఎలాగో గడిచింది . తెల్లవారింది .విక్రం సింహ్ మరణవార్త చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది . జనం తీర్థప్రజ లాగా రాసాగారు . పరగణా మొత్తం కదిలింది . సముద్రం లా పొంగిన జనసముహాలను , సానుభూతి పరులను ఆపటం విక్రం తమ్ముళ్ళకు అసాధ్యమైంది . అన్నగారి అంత్య క్రియలు మరో రోజుకు ...Read Moreవేయక తప్పింది కాదు . ఆ రోజు కూడా అరని శోకంతో నే గడిచి పోయింది . ఏది ఆగినా ఆగక పోయినా కాలం ఆగదు . సూర్యుడు పడమటి కొండల పై అలసట గా నిట్టూర్చాడు . ఊరి పై చీకటి మెల్ల మెల్ల గా పరుచు కుంటోంది . విక్రం శవాన్ని అ రోజు ఉదయమే పెద్ద లోగిలి కి తరలించారు . శవాన్ని ప్రత్యేకమైన తైలాలతో భద్రపరచారు . పూలవాసన తో , అగరుధూపం తో శవాన్ని ఉంచిన ప్రదేశం
  • Read Free
నీడ నిజం - 13
13వ ఎపిసోడ్ ఈ వివరణ తో పన్నాలాల్ కు మరింత ఆత్మ విశ్వాసం పెరిగింది . ప్రజల నమ్మకం, భక్తి ఓ రక్షణ కవచం లా అనుకొని అనుకున్నది సులభం గా సాధించవచ్చు . ఈ ప్రయత్నం లో తనకు అజయ్ సహకారం ఉంటె చాలు . పనివారిని అడిగితే అజయ్ మేడమీద ఉన్నాడని ...Read More. తన మంత్రాన్గానికి అదే అనువైన చోటు అని అనుకుంటూ మెడ మెట్లు ఎక్కాడు పన్నాలాల్ స్వామి వేషం లో ఉన్న పన్నాలాల్ ను అజయ్ మొదట గుర్తించలేదు . గుర్తించిన తర్వాత అతడి అసాధారణ వేషం చూసి ఆశ్చర్య పోయాడు . పెద్ద ఉపోద్ఘాతం లేకుండా ,నాన్చకుండా, సూటిగా అసలు విషయం వివరించాడు . “అజయ్ బాబు ! నేను చెప్పేది ప్రశాంతం గా వినండి . మీరిప్పుడు పుట్టెడు దుఖం లో ఉన్నారు . ఈ స్థితి లో మిమ్మల్ని
  • Read Free
నీడ నిజం - 14
అజయ్ నే అనుసరిస్తూ ఆ గదిలో అడుగు పెట్టిన కోమల ఎదురుగా కుర్చీలో కూర్చున్న సాధువు లాంటి ఆగంతకుడిని చూసి కలవర పడింది . అజయ్ ను ప్రశ్నార్థకం గా చూసింది . “ వదినా ! వీరు గొప్ప సాధువులు. ఈ కష్ట కాలం లో వీరి రాక కాస్త ఊరట కలిగిస్తుందని ...Read Moreపిలిపించాను . అన్నయ్య కు వీరు దైవం తో సమానం . వీరి మాటంటే అన్నయ్యకు వేదం . వీరు చెప్పేది శ్రద్ధగా వినండి . మీకు వీరి మాటలు నచ్చితే , అందువల్ల మీ బాధ తొలిగి పోతుందనుకుంటే వీరు చెప్పినట్లు చేయండి . అయితే – ఇందులో బలవంతం ఏమీ లేదు .” క్లుప్తం గా ముగించాడు అజయ్ . అనుకున్నది సాధించాలన్న లక్ష్యం తో అజయ్ కోమల తో అతి వినయం గా మాట్లాడవలసి వచ్చింది . ఇప్పటికే రెండు
  • Read Free
నీడ నిజం - 15
మరైతే నేను చెప్పేది జాగ్రత్తగా విను !రే పు నీ భర్తకు ఘనంగా అంత్య క్రియలు జరుగుతాయి. . ఈ ఊరి చరిత్ర లో అదొక మరిచి పోలేని అపూర్వ సంఘటన. విక్రం పుణ్యాత్ముడు . ధన్యజీవి! జీవితాన్ని ఒక సాధన గా , తపస్సు గా భావించిన మహామనీషి. అలాంటి ఉత్తముడు నీ ...Read Moreకావడం నీ పూర్వజన్మ సుకృతం . ఆయనతో నీ జీవితం అతి స్వల్పమే అయినా అదొక అపూర్వ వరం ! అలాంటి మ హా నుభావుడు శాశ్వతం గా తప్పుకున్నాక వైధవ్యం భరిస్తూ అసలెందుకు బ్రతకాలి ? అంతకన్నా అతడిని అనుసరిస్తూ పుణ్యస్త్రీ గా సహగమనం చేయటం ఉత్తమం కదా ?” “ మీరు చెప్పింది అక్షరాలా నిజం.” కోమల అతడి తర్కజాలంలో పూర్తిగా పడి పోయింది . పైగా మనసును భ్రమిమ్పజేసే మంత్ర ప్రభావం ! “ ఈ పరిస్థితి లో నీకు
  • Read Free
నీడ నిజం - 16
కోమల పద్మాసనం లో నిటారుగా, యోగినిలా ఉంది . చూపులు నేల వైపు, మొహం లో ఏ భావం లేదు . ఎవరేం చెప్పినా బదులు లేదు . మౌనం -------అందరి మతులను పోగొట్టే మౌనం .!పన్నాలాల్ కు పరిస్థితి అర్థమైంది . ఆమెను కాస్త కదిలించే ప్రయత్నం చేయాలి . కోమల కు ...Read Moreనిల్చున్నాడు . స్వరం మార్చి , విజయ్, తేజ్ సింహ లకుఅనుమానం రాకుండా “ అ మ్మా ! కోమలా అని మెల్లగా పిలిచాడు . కోమల ఉలిక్కిపడి పన్నాలాల్ ను చూసింది . కళ్ళు కలుసుకున్నాయి .“ చూడమ్మా కోమలా ! ఇందరు పెద్దలు ఇంతగా ప్రాధేయ పడుతుంటే మౌనంగా ఉండటం భావ్యం కాదు . అవతల ఆ పుణ్యాత్ముడికి అంత్యక్రి యలు జరగాలి . త్వరగా నీ మనసులో మాట వారికి చెప్పమ్మా . !” పన్నాలాల్ ‘సూచన ‘ చేశాడు
  • Read Free
నీడ నిజం - 17
విద్యాదరి సుదీర్ఘ కధనం ముగిసింది. చివరి సంఘటన లో ప్రభావం ఆమె ముఖం పై స్పష్టం గా కనబడుతోంది . బంగారు ఛాయలో మెరిసే ఆమె ముఖం లో అరుణ వర్ణం . విద్యాధరి తీవ్రమైన మానసిక సంఘర్షణ కు , ఉద్రేకానికి లోనవుతున్నట్లు ప్రొఫెసర్ భరత్ రామ్ గమనించాడు . “ కూల్ ...Read More“ ఆమె వెన్ను తట్టి అనునయించాడు . తండ్రి లాంటి భరత్ రామ్ అరచేతిని విద్యాధరి ఆర్తిగా చెంపకు ఆనించుకుని కళ్ళు మూసుకుంది . ఆమె కళ్ళు స్రవిస్తున్నాయి . భరత్ రామ్ కు ఆ క్షణాలు ఎంతో పవిత్రం గా అనిపించాయి . గతం లోంచి వర్తమానం లోకి ఆమె పూర్తిగా రాలేక పోతోంది . ఇంకా ఏవో జ్ఞాపకాల శకలాలు మనసు పొరల్లో ఉండిపోయి ఆమెను కదిలిస్తున్నాయి . ఇంకా ఏదో చెప్పాలన్న తహ తహ ఆమె కళ్ళల్లో స్పష్టం గా
  • Read Free
నీడ నిజం - 18
రాహుల్ బాబు ---ముప్పై అయిదు వసంతాల నిండు వ్యక్తిత్వం. ఆకర్షణీయమైన రూపం . కళ్ళ మెరుపుల్లో తళుకుమనే సౌజన్యం .సంస్కారం. గంభీరం గా కనిపించినా ఎదలో సున్నితంగా ప్రతిధ్వనించే ‘ చక్రవాక’ రాగం. ఓ చక్కని అనుభూతి, ఓ చక్కని అనుభవం వెరసి రాహుల్ బాబు .రాహుల్ కు మనసు తెలుసుకొని నీడలా మెలిగే ...Read Moreపదేళ్ళ లోపు కూతురు ఉన్నారు కూతురి పేరు -కోమలాదేవి !కోమలా దేవి మమతల యశోదా మయిలా రాహుల్ కు మాతృప్రేమ లో మాధుర్యం గోరుముద్దల్లా అందించింది . ఆ అనురాగం పూర్తిగా ఆస్వాదించక ముందే అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని కోమలా దేవి నాటకీయం గా లోకం నుండే తప్పుకుంది . ఆ వెలితి ఎవరూ పూడ్చలేనిది .రాహుల్ కూతుర్ని కోమలాదేవి ప్రతి రూపం గా పెంచుకుంటున్నాడు. కూతుర్ని అమ్మా’ అని పిలుస్తూ తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లి పోయిన తల్లిగాని తల్లిని అనుక్షణం
  • Read Free
నీడ నిజం - 19
విద్యాదరి రాజస్తాన్ నుండి హైదరాబాద్ వచ్చిందని తెలియగానే ఆమె తల్లితండ్రులు ,చెల్లెళ్ళు ఆమెను చూసేందుకు వచ్చారు. విద్యా వారితో కలిసి గ్రామానికి బయలుదేరింది. పుట్టిన ఊరు తల్లిలాంటిది. ఆ ఒడిలో లభించే ప్రశాంతత , ప్రేమ ఓ మధురానుభూతి . ఊరిలో అడుగు పెట్టిన మరుక్షణం ఆమె మనసు తేలికైంది. తల్లి ఆదరణ , ...Read Moreవాత్సల్యం, చెల్లెళ్ళ స్నేహానురాగాలు----విద్యాధరి కి రోజులు క్షణా ల్లా దొర్లిపోతున్నాయి . కూతురు చెప్పిన విషయాలు సాంతం విన్నాక మాధవరావుకు అఘోరి గుర్తుకు వచ్చాడు . అతడు చెప్పిన భవిష్యవాణి ఇంతవరకు జరిగింది ‘ ప్రారంభం’. కాదు కదా అనిపించింది . ! కాస్త భయం వేసింది . కానీ----తన అనుమానం కూతురుకు చెప్పలేదు . ఇదే సందేహం , భయం విద్యా లో కూడా ఉంది . తండ్రి లాగానే తనూ బయట పడలేదు . ఒకరోజు సాయంత్రం విద్యాధరి గుడికి వెళ్ళింది
  • Read Free
నీడ నిజం - 20
అజయ్ పెదవులపై చిరునవ్వు ‘ గొప్ప రాజవంశానికి ప్రతినిధి ‘ అన్న కామెంట్ మంత్రం లా పనిచేసింది . నిజానికి అతడి బలం, బలహీనత---రెండూ ఈ భావన లో నే ఇమిడి ఉన్నాయి . అతడి సంస్కారానికి , సంకుచిత మనస్తత్వానికి royal blood అన్న భావనే మూలం . అన్న విక్రం నుండి ...Read Moreగుణాలు పుణికి పుచ్చుకు న్నాడు . జాత్యహంకారం తో మొండిగా, బండ గా తయారయినాడు . ఇంతలో రూపా దేవి వచ్చింది . భార్య గా పరిచయం చేశాడు . పేరుకు తగ్గట్లే ఆమె చాలా అందం గా ఉంది . చదువు, సంస్కారం ఉన్న మనిషి లా అనిపించింది . ఈ బండరాముడికి, దొండపండు లాంటి రూపా దేవికి జత ఎలా కుదిరిందా ? అని జస్వంత్ ఆశ్చర్యపోయాడు . “ ...... సతి నిస్సందేహం గా దురాచారమే . ఈ అభిప్రాయం
  • Read Free
నీడ నిజం - 21
అతడి కామెంట్ కు అజయ్, రూపా దేవి మొహాల్లో తృప్తి , ప్రసన్నత కనిపించాయి. జస్వంత్ కోమల పునర్జన్మ పై ఏ ప్రశ్నలు వేయలేదు . ఆ సంఘటన వివరాలు తెలియనట్లే ఉండిపోయాడు . తను మాత్రం ఊరిలో చాలా మందిని కలిసి విద్యాధరి రాకకు సంబంధించిన వివరాలు సేకరించాడు . గ్రామం నుండి ...Read Moreతిరిగి వచ్చాడు . రిలాక్స్ అయాడు . Future plans
  • Read Free
నీడ నిజం - 22
" సతి" ---మరిచి పో దగిన ఓ చారిత్రిక సత్యం’—‘sati -A forget table historical fact--- అన్న మకుటం తో రెండు పేజీల సుదీర్ఘ వ్యాసం రెండు వారాల ‘ ఆదివారం అనుబంధం కోసం జస్వంత్ సిద్ధం చేశాడు . very very thought provoking and logical . మొదటి వారం ...Read Moreపుట్టు పూర్వోత్తరాలు chrological order lo వివరించాడు . కాలం తో పాటు సతి ఆచరణలో వచ్చిన విపరీతమైన , అమానవీయ మార్పులు , ఆ కాలం నాటి స్త్రీల నిస్సహాయత , దుస్థితి కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు . తన కధనానికి సాక్ష్యం గా చారిత్రిక సంఘటనలు ఉదాహరిస్తూ సతి దురాచారమని నిస్సందేహం గా తీర్మానించాడు . కానీ- కొన్ని అనివార్య పరిస్తితులలో , సందర్భాల లో , సతి—‘జౌహర్ విధి గా ఆచరించ వలసి వచ్చింది . రాజపుత్ర కుటుంబాలలో -రాజ్యం
  • Read Free
నీడ నిజం - 23
రాహుల్. కోమలా దేవి . మా అమ్మ.” మూడు పదులు దాటిన అ యువకుడిని జస్వంత్ పరిశీలన గా చూశాడు . సాదరం గా చేయి కలిపాడు . “ చెప్పండి. What can I do for you ?” మీకు ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు ఎలా తెలిశాయి ? రాహుల్ ...Read Moreవిషయాని కే వచ్చాడు . “ మీ ఊరి వాళ్ళ ద్వారా తెలిశాయి . “ కేవలం వాళ్ళు చెప్పిన వివరాలతో అంత సాహసం చేశారా ?” ‘సతి పై ఆర్టికల్ రాయటం సాహసమా ?” “ ఆర్టికల్ రాయటం సాహసం కాదు. చివర కొస మెరుపు జోడించటం “ రాహుల్ మాటలకు జస్వంత్ నవ్వాడు . “ మీ ఊహ కరెక్ట్ . ఆమె వివరాలు వేరే source ద్వా రా తెలిశాయి . అవి తెలిసిన తర్వాతే మీ ఊరు వచ్చాను
  • Read Free
నీడ నిజం - 24
ఎదురుగ ఉన్న అపరిచిత వ్యక్తుల్ని ప్రశ్నార్థకం గా చూశాడు భరత్ రామ్ . “ జస్వంత్, జర్నలిస్ట్, ...హి ఈజ్ రాహుల్.” మర్యాద పూర్వకం గా చేయి కలిపాడు . భరత్ రామ్ కళ్ళలో మెరిసిన ఆశ్చర్యం; జస్వంత్ , రాహుల్ కూర్చున్నారు . “జస్వంత్ ! చెప్పండి. “ జస్వంత్ విద్యాధరి డైరీ ...Read Moreపై ఉంచాడు . “ఈ డైరీ.....? “ విద్యాధరి గారిది . మీరు దిగిన లాడ్జ్ రూము లో వార్డ్ రోబ్ పై అరలో కనిపించింది .” ఈ ఆయుధం తో నే ఇంత సంచలనం సృష్టించారు కదూ .?” జస్వంత్ జవాబు.....చిరునవ్వు “ ఈ డైరీ చదవాలని మీకు ఎందుకు అనిపించింది . ...It reflects the mind of a lady….her sensitive feelings and thoughts. ..ఒకరి డైరీ చదవటం సంస్కారం కాదు . ..కానీ ముత్యాల సరాల్లాంటి అక్షరాలూ
  • Read Free

Best Telugu Stories | Telugu Books PDF | Telugu Fiction Stories | LRKS.Srinivasa Rao Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Telugu Short Stories
  • Telugu Spiritual Stories
  • Telugu Fiction Stories
  • Telugu Motivational Stories
  • Telugu Classic Stories
  • Telugu Children Stories
  • Telugu Comedy stories
  • Telugu Magazine
  • Telugu Poems
  • Telugu Travel stories
  • Telugu Women Focused
  • Telugu Drama
  • Telugu Love Stories
  • Telugu Detective stories
  • Telugu Moral Stories
  • Telugu Adventure Stories
  • Telugu Human Science
  • Telugu Philosophy
  • Telugu Health
  • Telugu Biography
  • Telugu Cooking Recipe
  • Telugu Letter
  • Telugu Horror Stories
  • Telugu Film Reviews
  • Telugu Mythological Stories
  • Telugu Book Reviews
  • Telugu Thriller
  • Telugu Science-Fiction
  • Telugu Business
  • Telugu Sports
  • Telugu Animals
  • Telugu Astrology
  • Telugu Science
  • Telugu Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
LRKS.Srinivasa Rao

LRKS.Srinivasa Rao Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.