The shadow is true - 21 books and stories free download online pdf in Telugu

నీడ నిజం - 21

                                                                                                        అతడి కామెంట్ కు అజయ్, రూపా దేవి మొహాల్లో తృప్తి , ప్రసన్నత కనిపించాయి.

జస్వంత్ కోమల పునర్జన్మ పై ఏ ప్రశ్నలు వేయలేదు . ఆ సంఘటన వివరాలు తెలియనట్లే ఉండిపోయాడు . తను మాత్రం ఊరిలో చాలా మందిని కలిసి విద్యాధరి రాకకు సంబంధించిన వివరాలు సేకరించాడు .

గ్రామం నుండి జైపూర్ తిరిగి వచ్చాడు . రిలాక్స్ అయాడు . Future plans ఎ లా ఉండాలి, షెడ్యూల్ ఏమిటి అని ఆలోచించ సాగాడు .

“ తను రాసే ఆర్టికల్ లో కొసమెరుపు కోమలాదేవి పునర్జన్మ సంఘటన . కొసమెరుపు thought provoking గా ఉండాలి. రీడర్స్ లో సంచలనం కలిగించాలి . అందరి దృష్టి మారుమూల గ్రామంలో ఉన్న అజయ్ సింహ్ పైనే పడాలి .

“ అందరి లో తనొక హాట్ టాపిక్ అయినప్పుడు అతడి స్పందన ఎలా ఉంటుంది ? విద్యాధరి వివరాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడా ? తెలుసుకొని మళ్ళీ ఆమెకు కీడు తలపెడ తాడా ? అదంత సులభం కాదు .కోమలాదేవి ,....ఆమె ఇప్పుడు అమాయకురాలు , నిస్సహాయురాలు కాదు . ఆమె సమాజంలో ఉన్నత వర్గం లో ఉన్న వ్యక్తి . ఆస్తి, అంతస్తు, సోషల్ స్టేటస్ ఉన్న విద్యాధికురాలు. తెలివి, తెగువ, సమయస్ఫూర్తి సమపాళ్ళలో ఉన్న ఆధునిక యువతి .

“ ఒక్కటి మాత్రం నిజం. పరువు కోసం, వంశ గౌరవం కోసం పాకులాడే అజయ్ ఆనాటి సంఘటన వెలుగు చూడనివ్వడు . అదే జరిగితే అతడి ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది . కనుక విద్యాధరిని కలుస్తాడు . మంత్రం, తంత్రం లాంటి చౌకబారు ప్రయత్నాలు చెల్లవు గనుక అతడికి విద్యాధర ముందు తలవంచక తప్పదు .

ప్రాధేయపడక తప్పదు... సో—తన ఆర్టికల్ కారణం గా ఆనాటి సంఘటన అలజడి సృష్టించిన విద్యా కు ఎలాంటి ప్రమాదం ఉండదు . తను నిస్సంకోచం గా అడుగు ముందుకు వేయాలి .

‘ కొస మెరుపు చదివి ఉలిక్కిపడే వారిలో సాగర్ , విద్యాధరే కాకుండా భరత్ రామ్ కూడా తప్పక ఉంటాడు . అతడు ఆమెను ట్రీట్ చేసే సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు ---ఆమెకు మంచి స్నేహితుడు . , శ్రేయోభిలాషి . ‘...

అందరి కన్నా ఎమోషనల్ గా కదిలి పోయేవాడు రాహుల్ . కోమల తో అతడి అనుబంధం ఒక చక్కటి అనుభూతి ! భావన ! ఏ భాష కు అందని అనురాగ వల్లరి .....విద్యాధరి వివరాల కోసం రాహుల్ తనను తప్పక కలుస్తాడు . విద్యాధరి లో ‘ అమ్మ ను అతడే కదలించ గలడు . ఆమె లో కదలిక రావాలి . తన ప్రయత్నానికి అతడే కాటలిస్ట్ . అజయ్ సింహ్ లాంటి కొండను ఎదిరించాలంటే విద్యాదరికి రాహుల్ సపోర్ట్ చాలా అవసరం . అతడే ఆమె రక్షణ నిలయం . అన్న కొడుకును కాదని అజయ్ అడుగు కూడా ముందుకు వేయలేడు .

‘రాహుల్ ను మానసికం గా ధర్మ యుద్ధానికి సిద్ధం చేయాలి . తన ప్రపోజల్ కు విద్యాధరి అంగీకరించినా సాగర్ తప్పక ప్రతిఘటి స్తాడు . అతడు దిగి రావాలంటే భరత్ రామ్ సైకియాట్రిస్ట్ గా పూనుకోవాలి . ... విద్యాకు పూర్తి స్మృతి వచ్చింది . ...అంతే – సమస్య అలాగే ఉంది . ఆమె డైరీ చదివిన తర్వాతే ఈ నిజం తను తెలుసుకోగలిగాడు . ఈ నిజం సాగర్ కూడా తెలుసు కోవాలి . అందుకు భరత్ రామ్ చొరవ చాలా అవసరం . పైగా ఒన్ మాన్ ఆర్మీ లా తనొక్కడే ఈ సాహసం చేయలేడు . తనకొక టీం కావాలి . టీం స్పిరిట్ తో నే అజయ్ పై సమరం చేయగలడు . తన టీం లో భరత్ రామ్ కీలక వ్యక్తి . ... విద్యాధరి తప్పక అజయ్ పై విజయం సాధిస్తుంది . అందుకు సందేహం లేదు . అజయ్ తలవంచక తప్పదు

అతడు అన్ని విధాలా నిస్సహాయుడు . ఈ పోరులో తను, రాహుల్ విద్యాధరి కి రక్షణ కవచాలు. పైగా అజయ్ ఆవేశానికి, దూకుడుకు రూపాదేవి సేఫ్టీ వాల్వ్ .

పది రోజులు గ్రామం లో ఉండి విద్యా హైదరాబాద్ వచ్చింది . ఆమె రాక సాగర్ లో ఉత్సాహం నింపింది.

పగటి పూట ఇంటి పనులతో, పుస్తక పఠనం తో విద్యా క్షణం తీరిక లేకుండా ఉండేది . రాత్రి పూట సాగర్ తో పంచుకునే తియ్యటి అనుభవం . ఆ తర్వాత అలసిన దేహానికి ఆదమరచిన నిద్ర లో పూర్తి విశ్రాంతి . కానీ, ఆ స్థితి అలాగే కొన సాగే ఆశ లేదు .

అర్థరాత్రి .... సర్వ ప్రకృతి గాఢ సుషుప్తి లో ఉన్న సమయం లో ఎవరో తట్టి లేపినట్లు విద్యా ఉలిక్కిపడి లేచేది . ఆ తర్వాత ఆమెకు మిగిలేది కలత నిద్రే !

ఆ కలత నిద్ర లో పలవరింతలు – తన ఊపిరి లో ... హృదయం లో భాగమైన కోమల తో ముఖాముఖి .

కోమల విద్యా ముందు అతి దీనం గా నిలబడి తన గోడు వెళ్ళబోసుకునేది. ఒకోసారి –మరొకసారి ---విసుక్కునేది, ఊరడించేది, హితవు పలికేది. తత్వం తెలిపేది .

“ నీ ఆత్మ లో ఆత్మ ను. నీ ఊపిరి లో ఊపిరిని . ‘ నన్ను గుర్తిన్చడానికి ఎంత తపన పడ్డావ్ ? ఎంత క్షోభ అనుభవిన్చావు ? మరిప్పుడు...నా ఉనికి తెలిశాక , నా గతం తెలుసు కున్నాక మౌనం గా ఎలా ఉండగలుగు తున్నావ్ ? రాహుల్ బాబు గుర్తుకు రావటం లేదా ? వాడి పసి తనం , అమాయకమైన చూపులు , నా పై వాడి వెర్రి ప్రేమ మరచి పోయావా ? శ్మశానం లో అమ్మా అన్న వాడి పిలుపు, ఆ పిలుపు అందుకున్నా ముందుకు రాలేని నా పరిస్థితి , నేను చేసిన ఆర్తనాదాలు ,అన్నీ మరచి పోయావా ?

...నీకు నువ్వే ముఖ్యమా ? నేను కాదా ? మరి నేనెవరిని ? నేను నువ్వు కానప్పుడు నీ లో ఎలా ఉన్నాను ? ఏ బంధం నిన్ను నన్ను ఈ జన్మ లో కూడా కట్టి పడేసింది . .....విద్యా! ఇవి జవాబులు లేని ప్రశ్నలు కావు . ఈ ప్రశ్నలకు జవాబే నీ పూర్వజన్మ స్మృ తి . ఆ స్మృతికి సజీవ రూపం నేను. నీలో కల్లోలం రేపి నా ఉనికి తెలిపేలా చేసింది . నన్ను నీవు గుర్తిస్తావని . నాకు న్యాయం చేస్తావని . .. అ నాటి భయంకరమైన అనుభవం ఒక్కసారి గుర్తు చేసుకో . ... నా మనసుకు , మనుగడకు నీ దేహమే ఉపాధి.నా ప్రతి అనుభవం నిన్ను కదిలిస్తుంది . నేను ఆలోచిస్తాను ...అందుకు అనుకూలం గా నువ్వు స్పందిస్తావ్ ! నేను కలత పడితే నువ్వు కదిలిపోతావ్ . నేను బాధ పడితే నీ కళ్ళు చెమ్మ గిల్లుతాయి . నా ఆనందానికి, నీ హృదయం పొంగుతుంది . నా ఆవేశానికి , కోపానికి నీ కళ్ళల్లో ఎర్ర జీరలు అలుముకుంటాయి . నేను ఆలోచన , నీవు ఆచరణ. నేను హృదయం. నీవు స్పందన. నాలో ఉన్న “నీవు” . నీలో ఉన్న’ నేను ‘ ఒకరే ! గమ్యం ఏమిటో , ఎక్కడో తెలియని ఈ సుదీర్ఘ ప్రయాణం లో కోమలా దేవి ఒక మలుపు.---విద్యాధరి మరో మలుపు. ఇప్పుడైనా తెలిసిందా నా ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలో ? -------నా సమస్యకు ఎవరు పరిష్కారం చూపాలో ? మరి----- ఆలస్యం ఎందుకు ? ...అజయ్ సింహ్ లాంటి రాక్షసులను ఎదిరించే ధైర్యం , తెగువ నీ లో ఉన్నాయి . నాకు న్యాయం చేస్తేనే నువ్వు ప్రశాంతం గా ఉండగలుగుతావు . ఇది ముమ్మాటికీ నిజం !....

కోమలాదేవి ప్రతి రాత్రి విద్యాధరిని పలకరించే చీకటి నేస్తం అయింది . ఆనాడు....సమస్య అర్థం కాక తల్లడిల్లి పోతే , మరి ఈనాడు..... అదే సమస్య బహు ముఖాల తో , బహు రూపాలతో సమాధానం కావాలని వేధిస్తోంది . సమస్య తెలియక ముందు, తెలిసిన తర్వాత ఆమె పరిస్థితి లో మార్పు లేదు . మానసిక అలజడి తప్పటం లేదు .

ఆమెలో మార్పును సాగర్ గమనించాడు . నిద్ర లేమి వల్ల మొహం లో కనిపించే అలసట , అసహనం ; పగటిపూట నలుగురి లో కలిసి ఉన్నపుడు కూడా పరాకు ;

అడిగిన ప్రశ్నకు పొడి పొడి సమాధానాలు .

“ ఏంటలా ఉన్నావ్ ? మొహం లో అలసట......పరధ్యానం ! .. మళ్ళీ ఏదైనా కొత్త సమస్యా ? కోమలా దేవి పూ నారా ? “

భర్త మాటల్లో వ్యంగ్యానికి సాగర్ని చురుగ్గా చూసింది విద్యాదరి .

“ ఏమిటలా చూస్తున్నావ్ ? ...చూపుల తో నే శపిస్తావా ? ప్రస్తుతం నీ సమస్య ఏమిటి ? ఆవిడ నిన్ను వదలటం లేదా ? లేక నువ్వే ఆవిడను వదలటం లేదా ? ... సమస్య తిరగబడిందా ?”

విద్యాదరి సహనం కోల్పోయింది .

“ చూడండి ____ విషయం పూర్తిగా తెలుసుకోకుండా తోచినట్లు మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు . రాజస్థాన్ లో కూడా మీరిలాగే ప్రవర్తించారు . నా బాధ,ఆరాటం పట్టించుకోకుండా మీకు అనుకూలం గా రెస్పాండ్ కాలేదని క్షణక్షణం సాధించారు . పుల్ల విరుపు మాటలతో కాసేపు, మౌనం తో కాసేపు చిత్రవధ చేశారు .

చెంప చెళ్ళు మన్నట్లు అనిపించింది సాగర్ కు .తమాయించుకున్నాడు . అతడి లో బాధ ,కోపం.“ అంటే నీ ఉద్దేశ్యం ఏమిటి ? నేనొక బీస్ట్ లా కనిపిస్తున్నానా ? నీనుండి ఆశించేది అది ఒక్కటేనా ?.... నీ పై అభిమానం గాని, నీ సమస్య పట్ల సానుభూతి గాని లేవనా నీ అభిప్రాయం ?”

“ అలాంటి గుడ్ స్పిరిట్ మీకుంటే ఇలా మాట్లాడతారా ? ...అయినా మీ అప్రోచ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఎందుకని ? సమస్య పట్ల స్పష్టమైన అవగాహన ఉండదా ? are u not able to face the reality ? మళ్ళీ సాగర్ కు చురక . !

“ రియాలిటీ ఫేస్ చేసే ధైర్యం , కమిట్మెంట్ ఉన్నాయి . కనుకే నీతో రాజస్థాన్ వచ్చాను. నీ నీడలా ఉంటూ నీ బాధలో భాగం పంచుకుంటున్నాను . నువ్వు మళ్ళీ విద్యా లానే నార్మల్ లైఫ్ కు రావాలని నా వంతు ప్రయత్నం సిన్సియర్ గా చేశాను .రాజస్తాన్ లో నీ పట్ల చిరాకు, కోపం చూపటం తప్పు !....yes, it’s my fault . iam really sorry for it !”

విద్యాదరి కాస్త మెత్తబడింది . “నేనూ అర్థం లేని చిరాకు తో కాస్త తొందరపడ్డాను .

సారీ !”

సాగర్ మొహం లో ప్రసన్నత కనిపించింది. “okay ! Let’s forget everything. !... ఇప్పుడు చెప్పు ! ఎందుకు మళ్ళీ ఆందోళన గా ఉన్నావ్ ? కళ్ళల్లో అలసట, మొహం లో అలజడి ?...నిద్రలో కలవరిస్తున్నావ్? ...నాకు తెలిసి నీకు కౌన్సిల్లింగ్ కావాలి . నీ మనసులో ఇంకా ఏ మూలో కోమలా దేవి జ్ఞాపకాలు మిగిలి పోయాయి . ఆ బరువు కూడా దింపు కుంటే గాని నీకు పూర్తి ప్రశాంతత ఉండదు . భరత్ రామ్ అంకుల్ కు ఫోన్ చేయనా ? “

... అలాగే—ఉదయం ఫోన్ చేయండి . నేను మాట్లాడుతాను .

**************************"***
కొనసాగించండి 22