The shadow is true - 23 books and stories free download online pdf in Telugu

నీడ నిజం - 23

రాహుల్. కోమలా దేవి . మా అమ్మ.” మూడు పదులు దాటిన అ యువకుడిని జస్వంత్ పరిశీలన గా చూశాడు . సాదరం గా చేయి కలిపాడు .

“ చెప్పండి. What can I do for you ?”

మీకు ఆ అజ్ఞాత వ్యక్తి వివరాలు ఎలా తెలిశాయి ? రాహుల్ సూటిగా విషయాని కే వచ్చాడు .

“ మీ ఊరి వాళ్ళ ద్వారా తెలిశాయి . “

కేవలం వాళ్ళు చెప్పిన వివరాలతో అంత సాహసం చేశారా ?”

‘సతి పై ఆర్టికల్ రాయటం సాహసమా ?”

“ ఆర్టికల్ రాయటం సాహసం కాదు. చివర కొస మెరుపు జోడించటం “ రాహుల్ మాటలకు జస్వంత్ నవ్వాడు .

“ మీ ఊహ కరెక్ట్ . ఆమె వివరాలు వేరే source ద్వా రా తెలిశాయి . అవి తెలిసిన తర్వాతే మీ ఊరు వచ్చాను . మీ చిన్నాన్న గారిని కలిశాను .. మరిన్ని వివరాల కోసం గ్రామం లో వాకబు చేశాను .

“ ఆమె వివరాలు నాకు ఇవ్వగలరా ? ... ఆమె ను కలవాలి.

“సారీ !...ఇవ్వలేను. I have to follow certain professional ethics

“ కోమల తో నా బంధం మీకు తెలుసు. ఆమె నన్ను ప్రేమ తో పెంచిన తల్లి . పదేళ్ళ వయసులో అమ్మను పోగొట్టుకున్నాను . ఆమె పునర్జన్మ నాకు వరం . ఆమెను మీరూ కలవాలనుకుంటున్నారు.

“ మీకో లక్ష్యం ఉంది. అందుకు నా సాయం అవసరం. “ జస్వంత్ ను నిశితంగా చూశాడు . జస్వంత్ పెదవులపై మళ్ళీ చిరునవ్వు .

“ రాహుల్ బాబు! ఆ సంబోధనతో రాహుల్ ఉలిక్కి పడ్డాడు .

“మీరెందుకలా పిలిచారు. మా అమ్మ పిలిచేది అలా . ఆ పిలుపుకు దూరమై పాతిక సంవత్సరాలైంది .” రాహుల్ కళ్ళల్లో బాధ నీడలా కదిలింది. విద్యాధరి ఊహల్లో జీవం పోసుకున్న రాహుల్ జస్వంత్ కు స్పష్టం గా కనిపించాడు.

“అజ్ఞాత యువతిని కలవటం నా లక్ష్యం అన్నారు . నా లక్ష్యం ఏమిటి “?

“ మీరు investigative journalist.కోమలాదేవి ‘మిస్టరీ వెనుక ఉన్న రహస్యం వెలికి తీసి నిజానిజాలు లోకానికి తెలియచేయటం .”

“అంతేకాదు . ---ఆనర్ కిల్లింగ్ పేరుతొ మీ బాబాయ్ అజయ్ కోమలాదేవిని ఎలా బలి పశువును చేశాడో నిరూపించటం”. ఆశ్చర్యం గా చూశాడు రాహుల్.

“ అసలేం జరిగిందో మీకు తెలుసా ? మాకే పూర్తిగా తెలీదు . గ్రామం లో కూడా మీకు ఎలాంటి ‘క్లూ దొరికి ఉండదు . “

ఈ డైరీ చదవండి. “ జస్వంత్ చిరునవ్వు తో ఓ డైరీ ని ముందుకు తోశాడు .

“ఎవరిదీ ?” రాహుల్ ఆశ్చర్యం గా చూశాడు .

“”ఆ అజ్ఞాత యువతిది”. అదిరి పడ్డాడు రాహుల్.

“మీకెలా దొరికింది?

“ఆ వివరాలు మళ్ళీ చెబుతాను. ...చదవండి “

“తెలుగు మధ్య మధ్య లో కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.”

“తెలుగు నాకు వచ్చు.” జస్వంత్ ఆశ్చర్యం గా చూశాడు .

“నేను వైజాగ్ లో ఉన్నప్పుడు అరకు లోయలో ఒక గురుకుల విద్యాలయం లో ఇంగ్లీష్ లెక్చరర్ ని. తెలుగు భాషలో కమ్మదనం తెలుసు. తెలుగు వారి ఆతిధ్యం, ఆత్మీయత తెలుసు.... మా అమ్మ తెలుగు వారి లో పుట్టడం అద్భుతం . .. ఆమె పేరేంటి ?”

“ విద్యాధరి “.

“ విద్యాధరి---కవి కాళిదాస్ అర్ధాంగి . .అమ్మ వారి పట్ల ఆమె భక్తి, నమ్మకం కాళిదాసును మహాకవిని చేశాయి . జ్ఞానానికి, పాండిత్యానికి, పట్టుదలకు ఆమె మారుపేరు . “

“ తెలుగు విద్యాధరి ఆమెకు ఏ మాత్రం తీసి పోదు . ఈమెలో ఆలోచన ఉంది . వివేచన ఉంది . ఎలాంటి సమస్య నైనా right approach తో చూడ గలదు . .

తన సమస్యను ఒక సైకియాట్రిస్ట్ లా ఎలా విశ్లేషించుకుందో డైరీ చదివితే మీకే తెలుస్తుంది . “

రాహుల్ డైరీ చదవటం లో లీ నమై పోయాడు .పేజీ పేజీ కి అతడి మొహం లో మారుతున్న రంగులు విభిన్న భావాల వర్ణ సమ్మేళనం లా అనిపిస్తున్నాయి . ... చదవటం పూర్తయింది . కళ్ళలో తడి . డైరీని ఒకసారి ప్రేమతో నిమిరి టేబుల్ పై ఉంచాడు . మనసులో ఆలోచనల జడి . జ్ఞాపకాల జడి .

ఆ రోజు రాత్రి సాధువు మా అమ్మపై మంత్రం ప్రయోగం చేశాడు . నేను చూశాను . సాధువు నేలపై అమ్మ కెదురుగా కూర్చున్నాడు . మెల్లగా ఏదో చెబుతున్నాడు . గది బయట కిటికీ చాటున నక్కి ఉన్న నాకు అతడి మాటలు వినిపించలేదు . గది లో ఒక మూల చిన్నాన్న నిలబడి ఉన్నాడు . నాకు ఒక్కటి అర్థమైంది . వారు అమ్మను ఏదో చేయమని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు . వారి వల్ల అమ్మకు ప్రమాదముంది ....అంతే ! అంతకు మించి నా పసిమనసు అర్థం చేసుకోలేదు . “...

జస్వంత్ రాహుల్ ను కన్నార్పకుండా చూస్తున్నాడు . “.....అమ్మ నా కోసమే మళ్ళీ పుట్టింది . మా చిన్నాన్నను ఆమె సాయం తోటే అందరి ముందు దోషిలా నిలబెడతాను . రూపా పిన్ని ఆయనకు ఆరో ప్రాణం. ఆమె దృష్టి లోనే ఆయన పతనం కావటం మరణ శిక్ష తో సమానం. ఆయన అవమానం తో సగం చచ్చి పోవాలి “. రాహుల్ మాటలు పదునైన కత్తుల్లా ఉన్నాయి .

‘అతడి లో ఆవేశం, తెగింపు, పట్టుదల తనకు ప్లస్ పాయింట్స్ . ‘ జస్వంత్ లో జర్నలిస్ట్ ,పరిస్థితి అంచనా వేశాడు .

“ మీ చిన్నాన్న లో మార్పు గమనించారా ? ఆలోచన,మాట తీరు మారాయి . విద్యాదరి ఊహల్లో అజయ్ రాక్షసుడు . ఆమె కోమలా దేవి దృష్టి తో నే మీ చిన్నాన్నను చూడగలదు . ఈనాడు నేను చూసిన అజయ్ రూపాదేవి చెక్కిన శిల్పం .”

“నిజమే ! మా పిన్ని రేడియంట్ పర్సనాలిటీ ముందు ఆయన అహం, ఆవేశం, మొండితనం తలవంచాయి . ఆమె లో అసాధారణమైన రీజనింగ్ ఉంది . పైగా ఆమెది పాజిటివ్ అప్రోచ్ .ఆప్టిమిస్ట్ ! అనుకున్నది సాధించేవరకు నిద్రపోదు . అందుకే బాబాయ్ మారవలసి వచ్చింది . “ రాహుల్ నవ్వాడు .

అవునన్నట్లు తల ఊపాడు జస్వంత్.

“ఒకే ! ఇప్పుడు అసలు పాయింట్ కు వస్తాము.. నా దృష్టి లో మా అమ్మ సమస్య కుటుంబ పరమైంది . మా కుటుంబ సభ్యుల నడుమే ఈ సమస్యకు పరిష్కారం అని నా ఆలోచన . పది మందికి తెలిస్తే కుటుంబం పరువు పోతుంది . అందుకని...

“అందుకని నా ప్రయత్నం మానుకోమంటారా ?”

“ నేను చెబితే మీరు మానుకుం టారా ?”

జవాబుగా జస్వంత్ నవ్వాడు .

“ఒక్కసారి ప్రశాంతం గా ఆలోచించండి . ! మీ ప్రొఫెషనల్ జీల్ క్షణం పక్కన పెట్టండి . మీ లక్ష్యం కోసం విద్యాధరి వ్యక్తిగత జీవితాన్ని జాతీయ వేదిక పై తీసుకు రావటం సబబు కాదేమో ?”

“ యు ఆర్ రైట్ .బట్ , విద్యాధరిని కలిసే ప్రయత్నం లో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి . అమ్మ సెంటిమెంట్ తో ఆమెను ఒప్పించవచ్చు . మరి—ఆమె భర్త మీ ప్రపోజల్ ఒప్పుకుంటాడా ? సాగర్ కు అజయ్ రాక్షసుడని తెలుసు కోమలాదేవికి న్యాయం చేయాలని తన భార్యను సాధనం గా వాడుకుంటానంటే అతడెలా ఒప్పుకుంటాడు ? ఆమె

పూ ర్వజన్మతో విద్యాదరికి సంబంధం ఏమిటి “?

రాహుల్ ఆలో చన లో పడిపోయాడు.

“మిమ్మల్ని నిరుత్సాహపరచటం లేదు . గ్రౌండ్ realities చెబుతున్నాను. “

“......ఈ సమస్య కు బ్రేక్ త్రూ ఏమిటి ?”

“...నాకు తెలిసి -ఆమె సమస్య నుండి పూర్తిగా బయట పడ లేదు . ఆమె డైరీ లో చివరి వాక్యాలు చదువుతాను . –“ గతం గుర్తుకు వచ్చినా, చిక్కుముడి విడిపోయినా ఏదో అలజడి .ఆరాటం !

కో మలను మరచిపోయి ప్రశాంతం గా ఉండగలనా అన్న నమ్మకం కలగటం లేదు .ఆమెను పూర్తిగా మరిచిపోవాలంటే,

నా వాళ్ళ తో ప్రశాంతమైన జీవితం గడపాలంటే నేనేం చేయాలి ? అర్థం కావటం లేదు . మళ్ళీ భరత్ అంకుల్ హైదరాబాద్ రావాలేమో ! కాలమే నిర్ణయిచాలి .’---ముందు ఈ అయోమయ స్థితి లోంచి ఆమె బయట పడాలి . ...ఆమె ఊహ కరెక్ట్ . మళ్ళీ భరత్ రామ్ రంగ ప్రవేశం చేయాలి . ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాతే మీరైనా, నేనైనా ఆమెను కలిసేది . “

“సైకియాట్రిస్ట్ భరత్ రామేనా ? ఆయన అడ్రస్ ఎలా తెలుసుకోవటం ?”

“ఎందుకు?

“ మనమే ఆయనను కలుద్దాం . డైరీ చూపిస్తాము. ఈ డైరీ ఆధారంగా ఆయనొక నిర్ణయానికి రావచ్చు . ఆ తర్వాతే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ . “

“ మనము ‘ అంటున్నారు, మీరు నాతొ చేతులు కలిపినట్లేనా ?” జస్వంత్ పెదవులపై చిరునవ్వు.

“ మా అమ్మ మళ్ళీ పుట్టిందన్న ఎమోషనల్ స్టేట్ లో లాజిక్ పూర్తిగా మరిచి పోయాను . ఐ యాం జస్ట్ ఎ లెక్చరర్ . మీరు ఇన్వెస్ట్ గేటివ్ జర్నలిస్ట్ . మీ సాహసం, చొరవ, ప్లానింగ్, నాకు అసలు లేవు . మీ సాయం లేనిదే నేను అడుగు ముందుకు వేయలేను . ఇద్దరి లక్ష్యం ఒకటే అయినప్పుడు కొద్దిపాటి అభిప్రాయ బేధాలకు వాదన లెందుకు ? “ మళ్ళీ జస్వంత్ చిరునవ్వు.

“మీరన్నట్లు ముందు భరత్ రామ్ ను కలవాలి . తర్వాత మీతో నే సాగర్ని కలవాలి . మీ చిన్నాన్న , సాగర్ నాపై కోపంగా ఉన్నారు . మీ చిన్నాన్నకు ఆనాటి మిస్టరీ బయట పడుతుందన్న భయం . కొసమెరుపు తో విద్యాదరి ఉనికి లోకానికి తెలిసిందన్న కోపం సాగర్ కు . నన్ను తన ఇంట్లోకి కూడా రానివ్వడు .

విద్యాదరి వల్ల మీ ఎంట్రీ కి ఢోకా లేదు. మీ వెనకే నేను......

రాహుల్ వినోదం గా నవ్వాడు.

“ భరత్ రామ్ అడ్రస్ , వివరాలు ఈ డైరీ లో నే ఉన్నాయి .

“నన్ను మీరు అనకండి . వయసులో , అనుభవం లో మీ కన్నా చిన్నవాడిని . చనువుగా , ప్రేమతో “నువ్వు” అనండి చాలు .

జస్వంత్ స్నేహ పూర్వకం గా రాహుల్ భుజం తట్టాడు .

******

“హలో , సాగర్ “ ఆ వైపు భరత్ రామ్ .

“ అంకుల్ ! విద్యా మీతో మాట్లాడుతుంది “.

“ గుడ్ మార్నింగ్ అంకుల్ ! రాత్రి పూట నిద్ర పట్టటం లేదు . ...పది రోజులు గా ఇదే పరిస్థితి. రోజూ కోమలాదేవి కనిపించి తన సమస్యకు పరిష్కారం కావాలని నన్ను అడుగుతోంది .ఏం చెయ్యాలో తోచటం లేదు .”

విద్యా మాటల్లో కలవరం భరత్ రామ్ గమనించాడు . తను ఊహించిందే జరిగింది . She has been facing the second phase of her problem .

“కోమలాదేవి సమస్య ఏమిటి ‘ ఎదురుగా సాగర్ ఉన్నాడు . కోమల సమస్య పై వివరణ ఇస్తే అతడు కంగారు పడతాడు . తనలో కోమలాదేవి ఉనికే భరించేలేని

సాగర్ ముందు ఏం మాట్లాడ గలదు ?

“ ఫోను లో వివరాలు చెప్పలేదు అంకుల్. ! శ్రమ అనుకోకుండా మీరొక సారి వస్తే ....”

తర్వాత అయిదు నిమిషాలు భరత్ రామ్ చెప్పే విషయాలు వింటూ ఉండిపోయింది . మధ్యలో పేపెర్ మీద ఏదో రాసుకుంది .

“అంకుల్ ఏమన్నారు “?

“అంకుల్ ఏదో నేషనల్ కాన్ఫరెన్స్ అటెండ్ కావాలట. ఆ ప్రిపరేషన్ లో బిజీ గా ఉన్నారు . పది రోజుల తర్వాత వస్తారట. ఈ లోపల ఈ మందులు వాడమన్నారు . “ పేపర్ చూపింది. సాగర్ భారం గా నిట్టూర్చాడు . భర్తను విద్యా సానుభూతి గా చూసింది .

**************************

కొనసాగించండి 24 లో