The shadow is true - 3 books and stories free download online pdf in Telugu

నీడ నిజం - 3


తనేం తప్పుగా ఆలోచించడం లేదు కదా. సాగర్ తల్లి ఎందుకు ఎప్పుడూ తనకు వ్యతిరేకంగా

ఆలోచిస్తుంది . సాగర్ వైఖరి ఆమెకు అసలు నచ్చలేదు .తల్లి పై ప్రేమ ,

"అనవసరం గా అమ్మని అనకు . ఆమె చెప్పిందని ఈ పని మానుకోలేదు . వేరే కొత్త వెంచర్ ప్లాన్ చేసాము . పేపర్ వర్క్ జరుగుతున్నప్పుడు పెద్దగా నాకు పని ఉండదని ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ టేకప్ చేశాను . ఈ లోపలే మన న్యూ వెంచర్ బ్యాంకు లోన్ శాంక్షన్ అయింది . పని ప్రారంభించాము . అందుకే ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్ కు అప్పగించాను .అప్పుడప్పుడు సూపెర్వైస్ చేస్తే చాలు . .... ఈ విషయాలన్నీ నీకు తెలుసు . తెలిసి కూడా ఎందుకంత ఎమోషనల్ గా నన్ను అరుస్తావ్?”

అతడు చెప్పిన కారణం విద్యాధరిని సమాధాన పరచ లేకపోయింది . ఆమె అసహనం గా తల విదిలించింది . “ ఇది కేవలం సాకు . అసలు కారణం ఇది కాదు .మీ అమ్మగారికి నచ్చని పని మీరేది చేయరని నాకు తెలుసు . ఆమె మిమ్మలిని ఒక చట్రం లో బిగిన్చివేసింది . ఆ పరిధి దాటి మీరు బయటకు రాలేరు . స్వతంత్రం గా ఆలోచించలేరు . అదే మీ బలహీనత . ఆ బలహీనత కు మరో పేరు మీరు అమ్మ పట్ల ఏర్పరచుకున్న గుడ్డి ప్రేమ .

చివరి మాటతో సాగర్ అహం బాగా దెబ్బతిన్నది .” డోంట్ టాక్ రుబ్బిష్ ! నువ్వనుకున్న రీతిలో నేనుండ లేదని మధ్య లో అమ్మను ఆడిపోసుకుంటా వెందుకు ? ఎందుకో – అమ్మకు ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ లో నా ప్రమేయం అంతగా నచ్చలేదు . ఆమెను బాధ పెట్టి ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయడం ఎందుకు అనిపించింది . అయితే అది సోషల్ కాజ్ కనుక మధ్యలో ఆపటం పధ్ధతి కాదని వాలంటరీ ఆర్గనైజేషన్ కు అప్పగించి మానిటరింగ్ చేయాలను కొన్నాను ...తప్పా ?” ఆమె జవాబు చెప్పలేదు . తన ఫీలింగ్స్, , బాధ అతడు పట్టించుకోవటం లేదు . ఇక వాదించటం, మరింత గొడవ పెంచుకోవటం లో అర్థం లేదు . అతడు మారదు . ఆమెకు నీరసం ముంచుకొచ్చింది . భర్తను ముభావం గా చూసి విస వి స వెళ్ళిపోయింది . సాగర్ షాక్ తిన్నాడు .

సాగర్ తల్లికి, భార్యకు నడుం లఘు లోలోలకం లా ఊగిసలాగుతుంటాడు . తల్లంటే వెర్రి ప్రేమ . కోరి చేసుకున్న భార్యంటే అమితమైన అభిమానం . ఫాసినేషన్ . ఆమె రూపం . అసాధారణ వ్యక్తిత్వం సాగర్ని మొదటి చూపులోనే కట్టి పడేశాయి . అందుకే ఏరికోరి ,పట్టుబట్టి మరీ చేసుకున్నాడు . తమ స్థాయికి ఆమె ఏ విధం గాను సరి పోదు.

అయినా తన మక్కువ చూసి అమ్మ ఒప్పుకుంది . ఆమె పెద్ద మనసు , ప్రేమ తనను కదిలించింది . అందుకే తను అమ్మ మాటకు ఎదురు చెప్పలేడు . కానీ విద్య సెంటిమెంట్స్, ఆమె తనపై పెంచుకున్న ప్రేమ, నమ్మకం ఎలా కాదనగలడు ?” అమ్మను నొప్పించలేడు- భార్యను ఒప్పించలేడు.

సాయం సంధ్య మనోహరం గా ఉంది. పగలంతా వేడి గాడ్పులు బాధించినా సాయంకాలానికి ప్రకృతి చల్లబడింది . తెరలు, తెరలు గా వీచే చల్లగాలులు గ్రీష్మ తాపం తగ్గిస్తున్నాయి .

ఆ విశాలమైన భవనం ముందు లాన్స్ పై పనివాళ్లు నీళ్ళు పడుతున్నారు . గాలి వాలుకు నీటి తుంపర్లు విధ్యాదరి పై స్ప్రే లా చింది ఆమె సేద తీరుస్తున్నాయి .ఆమె అక్కడే కూర్చుని భర్త గురించి ఉండటం సహజం . ఉండాలి కూడా . కానీ అది వెర్రి ప్రేమగా మారి కొడుకు ప్రతి కదలికను ఆమె నియంత్రించడం విద్యాధరి జీర్ణించుకోలేక పోతుంది .

ఆమె అత్తగారు యామిని పూర్ణ తిలకం . పేరులోనే కాదు . ప్రవర్తన లోనూ డాబు, అహంకారం పుణికిపుచ్చుకున్న అసలైన అత్తగారు . కొడుకు పై మితిమీరిన ప్రేమ ఆమెను మొండిగా ,బండగా మార్చింది . కొడుకు, కోడలు ఆమె కను సన్నల లోనే మెలగాలి . ఏ మాత్రం స్వతంత్రించినా ఆమె తట్టుకోలేదు . వెంటనే రియాక్ట్ అవుతుంది . అయిత్ర్ ఆమెలో ప్రత్యేకత –కొడుకు పై తన అధికారం సూటిగా ప్రదర్శించదు. ఆమె అతడి పట్ల తన నిరసన ప్రదర్శించే తీరు విలక్షణం గా ఉంటుంది . మౌనం ఆమె చేతి లో బ్రహ్మాస్త్రం . అది అదను చూసి ప్రయోగిస్తే చాలు – సాగర్ కలవర పడిపోతాడు . ఆమె తిరిగి శాంతించి చిరునవ్వు తో పలకరించ్జెంత వరకు నిద్ర పోడు.

ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ నగరం లో చాలా మందిని కదిలించింది . ఎందఱో ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించేందుకు ఉత్సాహం చూపారు . ఈ స్పందన తో సాగర్ లో ఉత్సాహం రెట్టింపు అయింది . ప్రాజెక్ట్ ను మల్టీ డైమెన్షనల్ గా తీర్చి దిద్దాలని మరింత బిజీ అయిపోయాడు . ఈ హడావుడి లో సాగర్ తల్లిని నిర్లక్ష్యం చేయలేదు గని తరచుగా కలవటం తగ్గించాడు . ఈ పాటి చిన్న మార్పు కూడా ఆమె భరించలేక పోయింది . అందుకే మౌనం ప్రయోగించి దారికి తెచ్చుకునే మంత్రం వేసింది .మాటల గారడి తో అతడి మనసు మార్చి వేసింది . అంతే ! సూర్యరశ్మి సోకిన హిమఖండం లా సాగర్ ద్రవించి పోయాడు .ఎజ్ద్ హోం ప్రాజెక్ట్ కు మంగళం పాడేసి మాతృ విధేయుడు అయిపోయాడు . బయట ప్రపంచం తో, చైతన్యం తో అతడికి సంబంధం తెగిపోయింది అతడిలో మార్పు రావాలని ఆశించిన విద్యాధరి హతాశురాలైంది .

జరిగినదంతా తలుచుకొని విధ్యాదరి భారం గా నిట్టూర్చింది . ఆ బాధలో ఒంటరి తనం లో తల్లితండ్రులు గుర్తుకొచ్చారు. తన ఊరు గుర్తుకొచ్చింది. ఇద్దరు చెల్లెళ్లు మనసులో మెదిలారు . తన బొమ్మరిల్లులాంటి ఇంట్లో , పెరట్లో మల్లెపందిరి, పందిరి కింద చెల్లెళ్లు, తను చేసిన చిలిపి పనులు, అల్లర్లు, అమ్మ చేతి గోరు ముద్దలు, ఆ అమాయకమైన ప్రేమలు, అభిమానాలు గుండెలో మెదలి, మనసు కదలి కళ్ళు చెమర్చాయి .

విధ్యాదరి తండ్రి మాధవరావు తగినంత భూఉవసతి ఉన్న మధ్య తరగతి సగటు మనిషి. విలేజ్ పోస్ట్ మాస్టర్ . సోషల్ హార్మొనీ-సంఘ హితం మాధవరావు ఆదర్శం. తన ఆలోచనలకు అనుకూలంగా , కొడుకులా విద్యాధరిని పెంచాడు. పబ్లిక్ రిలేషన్స్ పై ఆసక్తి విధ్యాదరి ఎం.ఏ లో జర్నలిజం చేసింది.

***********************************

కొనసాగించండి 4 లో





































































































































































..