Secret… - 1 books and stories free download online pdf in Telugu

రహస్యం.. - 1


........రహస్యం వెల్లడయింది.......

[ Part ___1 ]

బాబ్ ప్రాక్టస్:----- (రచయిత ,వ్యక్తిగత మార్గదర్శకుడు... )రహస్యం మీకేం కావాలంటే అది అందిస్తుంది.... ఆనందం, ఆరోగ్యం, సంపద.....

డాక్టర్ జో విటాల్ :---(ఆదిభౌతిక తత్వ జ్ఞాని, అమ్మకాల నిపుణుడు ,రచయిత) మీరేది కావాలనుకుంటే దాన్ని పొందవచ్చు... చేయవచ్చు... అలా రూపొందించవచ్చు...

జాన్ అస్సారఫ్:--- (పారిశ్రామికవేత్త ధనార్జన నిపుణుడు )
మనం ఎంచుకున్నది ఏదైనా దాన్ని మనం పొందవచ్చు... అది ఎంత పెద్దది అనే విషయం అంత ముఖ్యం కాదు... మీకు ఎటువంటి ఇంట్లో ఉండాలని ఉంది ...మీరు ల క్షాధికారి కావాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు... మీరు మరిన్ని విజయాలు సాధించాలని అనుకుంటున్నారా ?అసలు మీకేం కావాలి?


డాక్టర్ జాన్ డెమోర్టీనీ:---( తాత్వికుడు, వెన్నెముకల వైద్యుడు, స్వస్థత చేకూర్చేవాడు, వ్యక్తిగత మార్పులని తీసుకొచ్చే నిపుణుడు.) ఇది ఒక గొప్ప జీవన రహస్యం.....


డాక్టర్ .డెనిస్ వెట్ లీ:----( మనో రోగ నిపుణుడు ,మానసిక సామర్థ్య శిక్షకుడు,) గతంలో నాయకుల వద్ద రహస్యం ఉండేది... దాని శక్తిని ఇతరులతో పంచుకోవడానికి వారు ఇష్టపడలేదు... జనానికి ఆ రహస్యం తెలియకుండా జాగ్రత్త పడ్డారు ...జనం పనుల్లోకి వెళ్లి పని చేసి ఇంటికి చేరుకునేవారు ...వాళ్లు గానుగద్దుల్లా ఒకే గాడిలో పడి శక్తి లేని స్థితిలో జీవించారు.. ఎందుకంటే రహస్యం కొందరి వద్దనే ఉండిపోయింది ...
చరిత్ర తిరగేస్తే మొదటినుంచి ఎంతోమంది ఈ రహస్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలని, ఉబలాట పడ్డారని, ఎంతోమంది ఈ జ్ఞానాన్ని ప్రపంచమంతా విస్తరింప చేసేందుకు మార్గాన్ని కనుక్కున్నారని మనకు తెలుస్తుంది

....
మైఖేల్ బెర్నార్డ్ బెక్ విత్:---( భావకుడు ఎగేప్ ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ వ్యవస్థాపకుడు.)
మనుషుల జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరగటం నేను చూశాను... ఆర్థిక పరమైన అద్భుతాలు ,వ్యాధుల నుంచి కోలుకోవటంలో అద్భుతాలు, మానసికంగా కోల్పోవడం, మానవ సంబంధాలు బాగుపడటం......


జాక్ కాన్ఫిల్డ్:----( రచయిత, గురువు, జీవితాలకి మార్గదర్శి ,స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసకుడు .) రహస్యన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటం వల్ల ఇదంతా సంభవించింది....


ఏమిటా రహస్యం????




బాబ్ ప్రాక్టర్:---
మీరు బహుశా అక్కడ కూర్చుని ఏమిటా రహస్యం??? అని ఆలోచిస్తూ ఉంటారు... నేను దాన్ని ఎలా అర్థం చేసుకున్నానో మీకు చెబుతాను... మనమందరం ఒక అనంతమైన శక్తితో పనిచేస్తాం... ఒకే రకమైన నియమాలతో ,మనం ముందుకి సాగుతాం... ఈ విశ్వంలోని ప్రాకృతికమైన నియమాలు ఎంత నిర్దిష్టమైనవంటే అంతరిక్ష యానాలని నిర్మించటానికి, మనం ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోము... మనం చంద్రమండలం మీదికి మనుషులని పంపించగలం.. క్షణంలో ఎన్నో వంతు లెక్క చేయాలన్నా వేసి, అంతరిక్ష నౌకని భూమి మీ ధికి దిగేట్టు చేయగలం....



మీరు ఎక్కడున్నా! ఇండియా ,ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ , స్టాక్ హోమ్ ,లండన్, టోరెంటోమాన్స్ట యల్ లేదా న్యూయార్క్___ మనమందరం ఒకే శక్తితో, ఒకటే సిద్ధాంతంతో పనిచేస్తున్నాం... అదే ఆకర్షణ ....ఆ రహస్యమే ఆకర్షణ సిద్ధాంతం....


మీ జీవితంలోకి వచ్చేదంతా ,మీరు ఆకర్షిస్తేనే మీ జీవితంలోకి వస్తోంది... మనసులో మీరు ఏర్పరచుకున్న రూపాల కారణంగా, అది మీ వైపు ఆకర్షింపబడుతోంది... అవి మీ ఆలోచనలు... మీ మనసులో చెలరేగే ఆలోచనలన్నింటినీ మీరు మీలోకి ఆకర్షించుకుంటున్నారు.... ప్రింటిస్ మల్ ఫోర్డ్...


ఈ లోకంలోని అతి గొప్ప గురువులందరు ఆకర్షణ అనే సిద్ధాంతం, ఈ విషయం మొత్తంలో అన్నిటికన్నా శక్తివంతమైన సిద్ధాంతమని మనకు చెప్పారు....

విలియమ్ షేక్స్పియర్ ,రాబర్ట్ బ్రౌనింగ్, బ్రేక్ వంటి కవులు దాన్ని తమ కవితల్లో చెప్పారు ..... లుడ్విగ్ వాన్ భీథోవెన్ లాంటి సంగీతజ్ఞులు తమ సంగీతం ద్వారా దాన్ని అవి వ్యక్తీకరించారు.... లియోనార్డో ధ వించి వంటి కళాకారులు తమ చిత్రకళలో దాన్ని చూపించారు ...సోక్రటీస్, ప్లేటో, రాల్ఫ్ వాల్డో
ఎమర్సన్ , పైథాగొరస్, సర్ ఫ్రాన్సిస్ బేకన్, సర్ ఐజాక్ న్యూటన్ ,జోహాన్ ఉల్ఫ్ గాంగ్ వోన్ గెథే , విక్టర్ హ్యూగో వంటి గొప్ప తత్వవేత్తలు తమ రచనల ద్వారానూ, బోధనల ద్వారానూ దాన్ని పంచుకున్నారు... వాళ్ల పేర్లు అమరత్వాన్ని సంతరించుకున్నాయి ...వాళ్లు కథల రూపంలో, దశాబ్దాల తరబడి ఇంకా జీవించే ఉన్నారు ...


హిందూ ధర్మం, హెర్మే టిక్ సంప్రదాయాలు, బౌద్ధ మతం, యూదుల మతం, క్రైస్తవ మతం ,ఇస్లాం, బాబిలోనియా ,ఈజిప్టు వంటి నాగరికతలూ తమ రచనల ద్వారానూ, గాథల ద్వారానూ, ఈ రహస్యాన్ని అందించాయి.... యుగయుగాలుగా ఎన్నో రూపాలలో నమోదు చేయబడిన ఈ న్యాయ సూత్రాన్ని కొన్ని శతాబ్దాలకి చెందిన రచనలలో చూడవచ్చు.... 3000 బీ.సీ లో దాన్ని రాతు మీద చెక్కారు... కొంతమంది ఈ జ్ఞానాన్ని ఆకాంక్షించినప్పటికీ ,అలా దాన్ని సంపాదించుకున్నప్పటికీ ,ఎవరైనా వెతికి జేజిక్కించుకునేందుకు, అది అందుబాటులోనే ఎప్పుడూ ఉంది....

ఈ సిద్ధాంతం కూడా కాలంతో పాటే ప్రారంభమైంది... అది ఎప్పుడూ ఉంది ఉంటుంది....


ఈ సిద్ధాంతమే ఈ విశ్వమంతా క్రమబద్ధతనీ, మీ జీవితంలో ప్రతిక్షణాన్ని, నీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని నిర్ణయిస్తుంది.... మీరెవరు, ఎక్కడున్నారు ,అనేది ముఖ్యం కాదు... ఈ ఆకర్షణ అనే సిద్ధాంతం మీ జీవితంలోని మొత్తం అనుభవానికి ఒక రూపాన్నిస్తోంది.... అతి శక్తివంతమైన ఈ సిద్ధాంతం మీ ఆలోచనల ద్వారా దాన్ని సాధిస్తుంది..... ఆకర్షణ సిద్ధాంతాన్ని కార్యరూపంలో పెట్టేది మీరే .....మీరు మీ ఆలోచనల ద్వారా దాన్ని చేయగలుగుతున్నారు.....


1912లోచార్ల్స్ హానేల్ ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇలా వివరించారు .....:---ఇది సృష్టి తాలూకు సంపూర్ణ వ్యవస్థ ఆధారపడే అతి ముఖ్యమైన అత్యంత అమోఘమైన సిద్ధాంతం.....


బాబు ఫ్రాక్టర్:--- తెలివైన వాళ్ళు దీన్ని గ్రహించారు... మీరు ప్రాచీన బాబిలోనియా నాగరికత సంస్కృతిలో కూడా దీన్ని చూడగలరు.... వాళ్ళకి ఈ విషయం ముందే తెలుసు ...అలా తెలిసిన వాళ్లకి ప్రత్యేకంగా ఎంచుకున్న ఒక చిన్న బృందం.....
ప్రాచీన బాబిలోనియన్ల సంస్కృతిలోని సమృద్ధిని చాలామంది చిత్రకారులు పుస్తకాలలో రాసి ఉంచారు.... ప్రపంచంలో ఏడు అద్భుతాలుగా చెప్పుకుంటున్న వాటిలో ఒకటైన హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ ని సృష్టించింది వాళ్లే ...విశ్వంలోని నియమాలని అర్థం చేసుకొని అమలు చేయడం ద్వారా చరిత్రలో అత్యధిక ధనవంతులుగా వాళ్ళు పేరు సంపాదించుకున్నారు.....



బాబ్ ఫ్రాక్టర్:----ర్ ఈ లోకంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బుని జనాభాలో ఒక శాతం మాత్రమే ఎందుకు సంపాదిస్తుందనుకుంటున్నారు మీరు??? అలా జరగటం యాదృచ్ఛికమని మీరు అనుకుంటున్నారా??? లేదు అది అలా ఏర్పాటు చేయబడింది ... ఆ ఒక శాతం జనాభా ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు ...వాళ్లు రహస్యాన్ని అర్థం చేసుకున్నారు.... ఇప్పుడు మీకు కూడా ఆ రహస్యం పరిచయమవబోతోంది....

తమ జీవితాలలోకి డబ్బుని ఆకర్షించుకున్న వాళ్ళందరూ ఈ రహస్యాన్ని ఉపయోగించుకున్నారు.... తెలిసో, తెలియకో వాళ్లు సమృద్ధి గురించి, ధనం గురించి ఆలోచిస్తారు... దీనికి వ్యతిరేకమైన ఆలోచనలు వేటిని వాళ్ళు తమ మనసులోకి రానివ్వరు.... వాళ్ళు ముఖ్యమైన ఆలోచనలన్నీ సంపద గురించే.... వాళ్లకి సంపద ఒక్కటే తెలుసు... వాళ్ళ మనసులో ఇంకేమీ ఉండదు... వాళ్లకి దాని గురించి అవగాహన ఉన్నా, లేకపోయినా వాళ్ళకి సంపద గురించి ఉన్న ముఖ్యమైన ఆలోచనలే వాళ్ల దగ్గరికి సంపదని తీసుకొచ్చాయి ....ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపం ఇది.....

ఈ రహస్యాన్ని ఆకర్షణ సిద్ధాంతం తాలూకు కార్యరూపాన్ని తెలియజేసే ఒక మంచి ఉదాహరణ చూడండి.....
బోలెడంత ధనాన్ని సంపాదించి, కొద్దికాలంలో మొత్తాన్ని కోల్పోయి, మళ్లీ త్వరలోనే బోలెడంత ధనాన్ని సంపాదించుకున్న వాళ్ళు మీకు తెలిసి ఉండవచ్చు... వాళ్ల విషయంలో జరిగింది ఏమిటి? వాళ్లకి తెలుసో ,తెలియదో కానీ వాళ్ళు ముఖ్యమైన ఆలోచనలు ధనం చుట్టూ తిరిగేవి. ఆ విధంగానే ముందు వాళ్ళు దాన్ని సంపాదించుకున్నారు... ఆ తర్వాత వాళ్లు తమ మనసులోకి ఆ ఆస్తినంతా పోగొట్టుకుంటామేమోననే, భయాన్ని రానిచ్చారు.... అవి అలా కొన్నాళ్ళకి వాళ్ళ మనసులోని అతి ముఖ్యమైన ఆలోచనలుగా మారాయి ...ధనం గురించిన ఆలోచన నుంచి పోగొట్టుకోవటం వైపు త్రాసు మొగ్గు చూపింది... అందుకే ఉన్నదంతా పోగొట్టుకున్నారు... ఒకసారి అంతా పోగొట్టుకున్నాక ఇక పోగొట్టుకుంటామేమో అనే భయం మాయమైంది ...మళ్లీ త్రాసు దనం సంపాదించుకోవటం గురించిన ఆలోచనల వైపు మొగ్గు చూపింది... దనం మళ్ళీ వచ్చింది...

మీ ఆలోచనలకి ఈ సిద్ధాంతం స్పందిస్తుంది అవి ఎలాంటివి అయినా సర

🌹🌹ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి🌹


జాన్ అస్సారఫ్ :----ఆకర్షణ సిద్ధాంతాన్ని గురించి ఆలోచించినప్పుడు, నన్ను నేను ఒక అయస్కాంతం లాగా ఊహించుకోవడం, నాకు అన్నిటికన్నా సులభమైన మార్గంగా తోస్తుంది ....ఎందుకంటే అయస్కాంతం ఆకర్షిస్తుందని నాకు తెలుసు.....

మీరే ఈ విషయంలో కెల్లా అతిశక్తివంతమైన అయస్కాంతం... ఈ ప్రపంచంలో ఇక దేనికీ లేని ఆకర్షణ శక్తి మీలో ఉంది... ఆ అంతులేని ,ఆగాధమైన అయస్కాంత శక్తి మీ ఆలోచనల్లో బయటపడుతుంది....


బాబ్ డాయ్ ల్ :---(రచయిత, ఆకర్షణ సిద్ధాంతం నిపుణుడు )...ప్రధానంగా ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది... కానీ మనం ఇక్కడ మాట్లాడేది ఆలోచనల స్థాయి గురించి....

ఆకర్షణ సిద్ధాంతం ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని చెబుతుంది... అందుకని మీరు ఒక ఆలోచన చేస్తే ,అటువంటి ఆలోచనలు అన్నిటిని మీరు ఆకర్షిస్తున్నారు.. ఈ క్రింది చెప్పిన కొన్ని ఉదాహరణలు మీ జీవితంలో అనుభవంలోకి వచ్చే ఉంటాయి....
మీరు ఎప్పుడైనా మీకు నచ్చని ఒక విషయం గురించి ఆలోచించడం ప్రారంభించారా? దాని గురించి ఆలోచించిన కొద్ది నీ బాధ ఎక్కువైందా? అలా ఎందుకు జరుగుతుంది అంటే, మీరు ఒకే విషయాన్ని గురించి చాలా సేపు ఆలోచిస్తూ ఉన్నారంటే ఆకర్షణ సిద్ధాంతం వెంటనే అటువంటి మరిన్ని ఆలోచనలన్నీ మీ వైపుకి ఆకర్షిస్తుంది... ఒక్క విషయంలో అటువంటివే బోలెడన్ని బాధాకరమైన ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి.... మీ బాధ మరింత పెరిగి పరిస్థితి మరింత పాడవుతుంది.... దాని గురించి ఆలోచించిన కొద్ది మీరు మరింత బాధపడతారు....

మీరు ఏదైనా ఒక పాట విన్నప్పుడు కూడా ఆ పాటకు సంబంధించిన ఆలోచనల వంటివే నీ మనసులో తలెత్తి ఉండవచ్చు... ఆ తర్వాత ఆ పాట మిమ్మల్ని వదలటం లేదని తెలుసుకుని ఉంటారు... మీ మనసులో ఆ పాట మళ్ళీ మళ్ళీ మారుమొగుతూనే ఉండిపోయి ఉంటుంది... మీరు పాట వింటున్నప్పుడు ఆ విషయం గ్రహించలేకపోయినప్పటికీ, మీ మనసు ,మీ ధ్యాస ,పూర్తిగా దాని మీదే లగ్నమై ఉండాలి... మీరు అలా చేస్తున్నప్పుడు అటువంటివే ఇతర ఆలోచనలు మీ మనసులోకి బలంగా ఆకర్షింపబడి, ఉంటాయి... ఆ పాటకు సంబంధించిన అదే రకం ఆలోచనలు.... అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం క్రియాశీలత నొంది,ఆలోచనలని మళ్ళీ మళ్ళీ మోసుకొస్తుంది......


జాన అస్సారఫ్:----- మనుషులుగా పని మనకి కావాలనుకున్న వాటి గురించి ఆలోచించడం ,మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవటం, ఇక అక్కడి నుంచి ఈ విశ్వంలోని అతి గొప్ప సిద్ధాంతాలలో ఒక్కదానిని ఆవాహన చేయటం అదే ఆకర్షణ సిద్ధాంతం.... మీరు ఏం ఆలోచిస్తారో దాదాపు అలాగే మీరు తయారవుతారు..... కానీ మీరు తరచూ ఆలోచించే విషయాలని మీ దగ్గరికి ఆకర్షించుకుంటారు...

ప్రస్తుతం మీ జీవితం మీరు గతంలో ఆలోచించిన దానికి ప్రతిబింబం.... అందులో గొప్ప విషయాల తో పాటు, మీరు అంత గొప్ప విషయాలు కావాలనుకునేవి కూడా కలిసే ఉంటాయి... మీరు దేన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దాన్ని మీ దగ్గరికి ఆకర్షించుకుంటారు.... కాబట్టి మీ జీవితంలో ప్రతి విషయం గురించి అన్నిటికన్నా ముఖ్యమైన ,మీ ఆలోచనలేమిటో సులభంగా తెలుసుకోవచ్చు... ఎందుకంటే మీకు అనుభవంలోకి వచ్చినవి, అవే... ఇప్పటివరకూ! ఇప్పుడు మీరు ఈ రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు... ఇక ఈ జ్ఞానంతో మీరు అన్నిటిని మార్చేయవచ్చు.....



బాబ్ ఫ్రాక్టర్ :------మీరు మీ మనసులో దేన్నైనా చూడగలిగితే, అప్పుడు అది మీ చేతిలోకి వస్తుంది... మీకు ఏం కావాలనే దాని గురించి మీ మనసు ఆలోచించగలిగితే, దాన్నే అన్నిటికన్నా ముఖ్యమైన, ఆలోచనగా చేసుకోగలిగితే, దాన్ని మీరు మీ జీవితంలోకి తీసుకొస్తారు....



మైక్ డూలీ :---( రచయిత ,అంతర్జాతీయ వక్త )ఈ సూత్రాన్ని సులభంగా మూడు మాటల్లో కుదించచ్చు.... ఆలోచనలే వస్తువుగా రూపొందుతాయి.....

ఈ అతి శక్తివంతమైన సిద్ధాంతంతో, మీ ఆలోచనలు మీ జీవితంలో వస్తువులుగా మారతాయి ...మీ ఆలోచనలు విషయాలుగా మారుతాయి.... దీన్ని మీ మనసులో మళ్ళీ మళ్ళీ అనుకుంటూ, స్మృతిలోకి, స్పృహలోకి ఇంకనివ్వండి... మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి....



జాన్ అస్సారఫ్ :------ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ ఉంటుందనే సంగతి చాలా మందికి తెలియదు ...ఆలోచనని మనం కొలవచ్చు... అందుకని ,ఒకే ఆలోచనని మీరు మళ్ళీ మళ్ళీ విడవకుండా ఆలోచిస్తూ ఉంటే ,ఆ కొత్త కారు మీ సొంతం అవ్వాలని, మీరు కలలు కంటూ ఉంటే ,మీరు అవసరమైన డబ్బుని చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉంటే ,ఆ కంపెనీని అభివృద్ధి చెయ్యాలనుకుంటూ ఉంటే, నీ మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవాలని అనుకుంటూ ఉంటే, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే ,ఆ ప్రకంపనలను మీరు నిరంతరం వెలువరిస్తున్నారన్నమాట.....



డాక్టర్. జోవిటాల్ :----ఆలోచనలు ఆ అయస్కాంత సంకేతాలని పంపిస్తున్నాయి.... అవే సమానాంతర ఆలోచనలని మీ దగ్గరికి చేరున్నాయి....

చార్ల్స్ హానెల్:----"అతి ముఖ్యమైన ఆలోచన ,లేదా మానసిక వైఖరి ఒక అయస్కాంతం లాంటిది... మరి ఇక్కడ సిద్ధాంతం ఏమిటంటే, ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షింపబడతాయి అనేది... తత్ఫలితంగా మానసిక వైఖరి,తన స్వభావానికి అనుగుణమైన పరిస్థితులనే తప్పకుండా ఆకర్షిస్తుంది."


ఆలోచనలు అయస్కాంతాల వంటివి... ఆలోచనలకి ఫ్రీక్వెన్సీ (ఆవృత్తీ )ఉంటుంది... మీకు ఆలోచిస్తున్నప్పుడు, అవి విశ్వమంతటా వ్యాపిస్తాయి... అదే ఆవృత్తి గల ఆ రకమైన విషయాలని అవి అయస్కాంతం లా ఆకర్షిస్తాయి... బయటికి పంపబడినవన్నీ మూలం దగ్గరికి వెనక్కి వస్తాయి ...ఆ మూలమే "మీరు"...


ఈ విషయాన్ని ఇలా అనుకుని చూడండి.... టెలివిజన్ స్టేషన్ లోని ట్రాన్స్ మిషన్ టవర్ ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా ప్రసారం చేస్తుందని మనకి తెలుసు... అదే మీ టెలివిజన్ తెరమీద బొమ్మ రూపంలో కనబడుతుంది... మనలో చాలామందికి అది ఎలా పని చేస్తుందో నిజంగా తెలియదు ...కానీ ప్రతి ఛానల్ కి ఒక ప్రెగ్నెన్సీ ఉందని, మనకి తెలుసు... ఆ ఫ్రీక్వెన్సీ కి ట్యూన్ చేసినప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని టీవీ తెరమీద చూడగలుగుతాం ....ఛానల్ ని ఎంచుకోవడం ద్వారా మనం ఫ్రీక్వెన్సీ ని ఎంచుకుంటాం ...అప్పుడు ఆ చానల్లో ప్రసారమయ్యే కార్యక్రమం మనకి వస్తుంది.... మనం టెలివిజన్ లో వేరే కార్యక్రమం చూడాలనుకుంటే, చానల్ మార్చి కొత్త ఫ్రీక్వెన్సీ కి ట్యూన్ చేసుకుంటాం...

మీరొక మానవ ట్రాన్స్మిషన్ టవర్.... ఈ భూమి మీద సృష్టించబడిన అన్ని టీవీ టవర్ల కన్నా , మీరే ఎక్కువ శక్తివంతులు ఈ విశ్వంలోనే మీరు అన్నిటికన్నా శక్తివంతమైన ట్రాన్స్మిషన్ టవర్ ....మీ ట్రాన్స్మిషన్ ప్రసారం మీ జీవితాన్ని సృష్టిస్తే, అది ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది ...మీరు ప్రసారం చేసే ప్రెగ్నెన్సీ నగరాలని ,దేశాలని, ప్రపంచాన్ని దాటి వెళుతుంది ....అది విశ్వం అంతటా ప్రతిధ్వనిస్తుంది.... ఆ ఫ్రీక్వెన్సీని మీ ఆలోచనలతో ప్రసారం చేస్తున్నారు....



నీ ఆలోచనల ద్వారా ప్రసారం చేసి, మీరు అందుకునే చిత్రాలు, మీ డ్రాయింగ్ రూమ్ లోనే టెలివిజన్ తెరమీద కనబడేవి కాదు... అవి మీ జీవితం తాలూకు చిత్రాలు... మీ ఆలోచన మీ ఫ్రీక్వెన్సీ ని సృష్టిస్తాయి... ఆ ఫ్రీక్వెన్సీ కి సంబంధించిన సమానమైన విషయాలని ఆకర్షించి, వాటిని మీ జీవితం తాలూకు చిత్రాలుగా వెనక్కి ప్రసారం చేస్తాయి... మీరు మీ జీవితంలో దేన్నైనా మార్చుకోవాలనుకుంటే, ఛానల్ మార్చండి. మీ ఆలోచనల్లో మార్పు తెచ్చుకొని ఫ్రీక్వెన్సీ ని మార్చండి ....

చార్ల్స్ హానెల్:--- " మానసిక శక్తుల ప్రకంపనలే, అస్తిత్వంలో అన్నటికన్నా అతి సున్నితమైనవీ, ఆ కారణంగా అతి శక్తివంతమైనవి "



బాబ్ ఫ్రాక్టర్ :----మిమ్మల్ని మీరు సమృద్ధిగా జీవిస్తూ ఉన్నట్లు ఊహించుకోండి ...సమృద్ధిని మీరు ఆకర్షించగలుగుతారు.. అలా ప్రతిసారి ప్రతి వ్యక్తికి జరుగుతుంది...


మీరు సమృద్ధిగా జీవిస్తున్నారని ఊహించుకున్నట్లయితే ,మీరు ఆకర్షణ శక్తి సిద్ధాంతం ద్వారా మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా నిర్ణయించుకున్నట్లే.... అప్పుడు ఒక ప్రశ్న మన మనసులో తలెత్తక మానదు.... అందరూ తాము కలలు కానీ జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు......


🌹🌹🌹 ధన్యవాదములు 🌹🌹🌹

Fallow my account continuation,🙏
Thank you ....