YOUR THE ONE - 13 in Telugu Fiction Stories by Chaithanya books and stories PDF | జతగా నాతో నిన్నే - 13

జతగా నాతో నిన్నే - 13


అన్వి తీసుకున్నది ఒక రూమ్ అవ్వడం వల్ల ఎదురుగా ఉండే ఒక హాస్టల్లో వాళ్లకి తినడానికి ఫుడ్డు లభిస్తుంది .


నిజానికి వాళ్లు వంట చేసుకోవడానికి టైం ఉన్న, వాళ్ళ దగ్గర సరుకులకి కావాల్సినన్ని డబ్బులు ఉండేవి కాదు . అందుకని కొంత మొత్తాన్ని ఆ హాస్టల్ వార్డెన్ కి ఇచ్చి ముగ్గురు తినేవాళ్లు.


ఇప్పుడు కాఫీ షాప్ ఓనర్ ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా వీళ్ళకి వండుకోవడానికి స్వతంత్రం లభించింది .


“ వావ్ ఈరోజు ఆంటీ దోస వేశారు తెలుసా! ” అంటూ గదిలోకి వచ్చిన గీత దాని తెరచింది వాసన చూస్తూ !


“ ఏంటే నిజమా! ” అంటూ పరుగు పరుగున గీత చేతులలో బాక్స్ లాక్కున్నారు . ( నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే, ఏ హాస్టల్లోనైనా దోసనే కొంచెం తినేలాగా ఉంటుంది మరి )


ఇక ముగ్గురు వాళ్ళ ప్లేట్స్ కడుక్కొని వచ్చి తినడం మొదలుపెట్టారు .


“ ఈ దోస కోసం అన్న ,ఆంటీకి నెల నెల డబ్బులు ఇవ్వవచ్చు. దాంట్లో తప్పే లేదు ” అంది అన్వి.


“ అవును అన్వి ! ఇప్పుడు మనకి పార్ట్ టైం లాగా డబ్బులు వస్తాయి కదా .మనమే కుకింగ్ చేసుకుందాం .ఈ ఖర్చులన్నీ మిగిలిపోతాయి కదా ” అంటూ అడిగింది సంజన .


“ ఇప్పుడు బాగానే చెప్తారు. కుకింగ్ చేసేటప్పుడు మాత్రం రమ్మంటే ఒక్కరూ రారు ” అంటూ కాస్త అమాయకురాల్లాగా మొఖం పెట్టింది అన్వి.


“ అబ్బా అప్పుడంటే ఏదో అలాగా. కానీ ఇప్పుడు మన పనులు మనం చేసుకోవచ్చు కదా ” అంది గీత


“ కానీ ఆంటీ చేసినన్ని వెరైటీస్ మనం చేసుకోలేము కదా! ఏవో ఒకటి రెండు ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు . హూరికే అనవసరం అనుకుంటా ” అంది అన్వి.


“ నువ్వు ఎన్నన్నా చెప్పవే! ఆంటీ చేసే దాంట్లో ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగుండదు .అలా ఇష్టం లేనివి కూడా మనం తినడం ఎందుకు .మనమే చేసుకుంటే ఎలాగైనా బాగుంటుంది కదా ముగ్గురం ” అని అన్నారు ఇద్దరు.“ సరే మీ కోరికని నేను నెరవేరుస్తున్నాను ” హామీ ఇస్తున్నట్టుగా చేతిని చూపిస్తూ మరో చేతితో తింటూ ఉంది . ఇంతలోనే ఏదో గుర్తొచ్చింది దానిలాగా “ ముందైతే మనం ఆ స్కిట్ కంప్లీట్ చేయాలి .ఇంకా ఆ డాన్స్ ని కొరియోగ్రఫీ చేయాలి .ఈ రెండు పనులు అయిపోతే ఆ తర్వాత మనం బయటికి వెళ్లి గ్రోసరీస్ ఇంకా చికెన్ ,రైస్ తెచ్చుకుందాం .ఎలాగో ఇంటి వాళ్ళు కొన్ని సామాన్లు వదిలేశారు. వాటితో మనం వండేయొచ్చు ”“ నువ్వు ఇంత తేలికగా చెప్పేసావు. కానీ మన దగ్గర అంత డబ్బులు లేవేమో కదా ” అంటు పటాయించింది గీత.


“ పర్లేదు నా దగ్గర 2000/- ఉన్నాయి .వీటితో మనని నెలకి కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ వచ్చేస్తాయి. నేను ఆ డబ్బుల్ని వార్డెన్ కి ఇద్దామనుకున్నాను. కానీ మీరు ఇలా ప్లాన్ మార్చేశారుగా! ఇక ఆ డబ్బులు ఇవ్వకుండా మనమే ఖర్చు పెట్టుకుందాం ” అంటూ చిన్న పిల్లల చేతుల అటు ఇటు తిప్పుతూ చెప్పింది అన్వి.ఇక వాళ్ల ప్లాన్ ని అమలు చేయడం మొదలుపెట్టారు . పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఆ స్కిట్ ని సెలెక్ట్ చేశారు . అది “ ఝాన్సీ— చివరిపోరాటం ” అనే నాటకం. అందులో చాలా ఎమోషనల్ డైలాగ్స్ రాసి ప్యాక్ చేశారు. ఒకటి రెండుసార్లు దాన్ని ప్రాక్టీస్ కూడా చేశారు.ఇక మధ్యాహ్నం నుంచి అన్వి కోసం బాగా పాపులర్ అయిన పాటలని ,క్లాసికల్ , మోడ్రన్ డాన్స్ తో కలిపి ఒక ఐదు పాటలని డిజైన్ చేశారు.

టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు అసలు ఉండవు. ఇది మాత్రం నిజం. అందుకే వాళ్ళు చేసిన ఆ పనిలో చాలా క్వాలిటీ వచ్చింది . వాటిని కూడా ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత అన్వికి అలవాటైపోయింది .ఇక సాయంత్రం ఐదు గంటలు అవుతుండడంతో సంజన లేచి , “ అన్వి నువ్వు చెప్పిన ప్రకారమే చేసాం కదా! ఇప్పుడైనా వెళ్దామా " అంటూ మారంగా అడిగింది .


“ ఏంటి ఇలాగే వెళ్తావా ? వెళ్లి స్నానం చేద్దాం. అసలే పొద్దున అనగా కూర్చున్నాము. చూడు చెమట వాసన వస్తుంది ” అంటూ ముఖం మూఫై వంకర్లు పెట్టి బట్టలు తీసుకొని బాత్రూం లోకి వెళ్ళిపోయింది .కాసేపటికి బయటకు వచ్చాక మిగిలిన ఇద్దరు కూడా స్నానం చేసి వచ్చారు . ఇక పదండి .యుద్ధానికి సిద్ధమా ? అంటూ ఒక పెద్ద డైలాగ్ వాళ్ళ మొఖాన పడేసి , డోర్ తీసుకొని బయటికి వచ్చారు . ఆ టౌన్ లోని ఒక మార్కెట్ కి వెళ్లి వాళ్లకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నారు.


పెద్ద పెద్ద డి మార్ట్ లో ఖర్చులు ఎక్కువ అవుతాయని ముందే ఊహించి ,చిన్న చిన్న దుకాణాలలో వాళ్లకు కావాల్సిన నిత్యవసర సరుకులు తీసుకున్నారు . ఇక వాళ్ల రూమ్ కి కాస్త దగ్గర్లో ఉన్న మస్తాన్ భాయ్ చికెన్ షాప్ లో చికెన్ కొట్టించుకొని వాళ్ళ రూమ్ కి వచ్చారు.ఆ రెండు వేలతో వాళ్లకు కావాల్సిన ప్రతి వస్తువుని బేరమాడి మరి కొన్నారు. ఇంకా వాళ్లుకు అలా షాపింగ్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. మొదటిసారి వాళ్ళ, అలా బయటికి వెళ్లి డబ్బులు పెట్టి, అన్ని వస్తువులు తీసుకురావడం .అందుకే వాటిని చూపిస్తూ కాసేపు కూర్చున్నారు .


“ అన్వి మనం ఒకటి మర్చిపోయాం. నీ ఫోన్ కి నెట్ వేస్తాను అన్నావు ” అంటూ గుర్తు చేసింది గీత .


“ అవును కదా .నా మతిమండ .పక్కన ఒక చిన్న షాపు ఉంది కదా అందులో వేస్తారేమో వేయించుకోస్తావా ?" అంటూ అడిగింది సరుకుల పైన ఉన్న చూపును మరలిస్తు అన్వి.“ నువ్వే వెళ్లి రా పో! మేము అంత లోపల కాస్త చికెన్ కి కావాల్సిన వాటిని తయారు చేస్తాము. "


సరే అయితే అంటూ చెప్పులు తోడుక్కొని తొందర తొందరగా కిందికి వెళ్ళింది. పక్కనే ఉన్న మెడికల్ స్టోర్లో రీఛార్జ్ చేయించుకుని, మళ్ళీ గదికి వచ్చింది .


రాగానే వాళ్ళ ఇద్దరి ఫ్రెండ్స్ చేస్తున్న పనులకి ,“ ఇప్పుడే మొత్తం ఖాళీ చేసేయండే ” అంటూ వాళ్ళ దగ్గర నుండి సరుకుల సంచిని తీసుకుంది మన అన్వి .


పాపని బయటకు పంపించేసి ,అందులో ఉన్న పప్పులని ,బుడ్డలని ఒక్కొక్కటిగా నోట్లో వేయడం మొదలుపెట్టారు వీళ్లు .


“ అందుకేనా మీరు నన్ను బయటికి పంపించారు ” అంటూ సీరియస్ గా వాళ్ళ వైపు చూస్తూ వెంటనే పక్కున నవ్వేసింది.


“ అంటే ఫస్ట్ వంట చేద్దాం అనుకున్నాము. కానీ నువ్వు లేకుండా చేస్తే ఏం బాగుంటుంది అని అలా సైలెంట్ అయిపోయాం .మధ్యలో బోర్ కొడితే వాటిపై ఒక కన్నేసం అంతే ” అంటూ చిన్నగా చెప్పింది సంజన.


“ అఘోరించారులే ! పదండి ఇక వంట మొదలుపెడదాం ”


వివాహ భోజనం భూ.......విందైన వంటకంబు......వియ్యాలి వారి విందు .....ఆహా ఆహా నాకేం ముందు అంటూ ఘటోత్కచుల్లాగా పాడుతూ కిచెన్ లోకి వెళ్లిపోయింది అన్వి.కొత్తగా వేసుకున్న ఆ నెట్తో ,పగిలిన తన సెల్లును ఇంకాస్త జాగ్రత్తగా కిచెన్ లో పెడుతూ, యూట్యూబ్ ఆన్ చేసింది . అందులో చికెన్ రెసిపీ ఎలా చేయాలో ముగ్గురు కలిసి చూశారు. ఒకపక్క ఫోన్లో కనిపిస్తున్న ఆ చికెన్ ముక్కలని చూస్తూ నోటిని చప్పరిస్తూ ఉన్నారు ముగ్గురు.


ఆ తర్వాత వీడియో పూర్తి అవ్వగానే నెట్ ఆఫ్ చేసేసింది అన్వి. ఆ తర్వాత ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసిన పాటలని పెట్టి ఇక వంట చేయడం మొదలుపెట్టారు.


గీత ఏమో కూరగాయలు తరుగుతుంది. సంజన ఏమో వాళ్ళకి కావాల్సినవి అందిస్తుంది. అన్వి ఇక చికెన్ చేయడం కోసం వంట గదిలో నన్న తండాలు పడుతుంది .తనకి హెల్ప్ చేయడం కోసం పక్కనే ఉన్న ఇంకో గ్యాస్ పైన రైస్ పెట్టింది సంజన.


“ ఏ సంజు ఏం చేస్తున్నావే ? రెండు వాడితే తొందరగా గ్యాస్ అయిపోతుంది .అప్పుడు ఓనర్ గారు మనల్ని తిడతారు ” అంటూ వారించింది.


“ కానీ ఇప్పటికే చాలా రాత్రి అయింది కదా! ఆకలి కూడా వేస్తుంది ” అంటుంది సంజన.“ సరే నేను గ్యాస్ వాడుతున్నట్టు ఇంటి ఓనర్ కి ఫోన్ చేసి చెప్తాను ” అంటూ పాట లాక్ చేసి బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడడం మొదలు పెట్టింది.


కొన్ని రింగుల తర్వాత ఫోన్ ఎత్తిన ఇంటి ఓనర్, “ ఆ చెప్పు అన్వి. ఏంటి ఇలా ఫోన్ చేశావు ” అంటూ ఆప్యాయంగా పలకరించింది ఆవిడ .


“ అదే మేడం .మీరు సగం గ్యాస్ ఉందని చెప్పారు కదా ! దాన్ని మేము ఇప్పుడు వంట చేసుకోవడం కోసం వాడుతున్నాను. ఆ విషయం మిమ్మల్ని అడుగుదామని చేశాను ” అంటూ తటపట ఇస్తేనే చెప్పింది .


“ అయ్యో! నేను అసలు అలా ఏమీ అనుకోనులే! అయినా నేను ముందే చెప్పాను కదా. మీరు హాస్టల్ ఫుడ్ ని తినే బదులు ,మీరే వంట చేసుకోవచ్చు కదా అని .మీరే వినలేదు .మొత్తానికి ఏమి అయితే ఏముందిలే ఇప్పుడైనా మీరు నా మాట విని ఇంట్లోనే వండుకుంటున్నారు ” అంటూ సంతోషిస్తున్నట్టు చెప్పింది ఆవిడ.


“ అంటే మేడం మీకు మళ్లీ గ్యాస్ డబ్బులు ఇవ్వాలి ఏమో కదా ” అంటూ అసలు విషయంలోకి వచ్చింది.


“ ఓ దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? పిచ్చి పిల్ల! మిమ్మల్ని మేము మూడు సంవత్సరాలుగా చూస్తున్నాము. ఇక్కడే ఉండి చాలా కష్టపడి చదువుకుంటున్నారు. మీ పైన పెట్టుకునే నమ్మకాన్ని మీరు ఎప్పుడూ వమ్ము చేయలేదు .మీ ముగ్గురు ఎంత మంచి ఫ్రెండ్సో మాకు చాలా బాగా తెలుసు. మీకు ఎన్ని సమస్యలున్నా కూడా నెల నెల నాకు మాత్రం అద్దె సరిగ్గా ఇచ్చేవాళ్ళు .ఆ గ్యాస్ గురించి మీరు ఏమి ఆలోచించొద్దు . నేను కూడా నీకు అమ్మలాంటిదాన్నే కదా! ఆ గ్యాస్ అయిపోగానే కొత్తది పెట్టించమని నేనే చెప్తాను అది కూడా ఉచితంగానే! ” అంటూ భయాలన్నీ పోగొడుతున్నట్టు మాట్లాడిందావిడ .


ఆ మాటలకి ఎక్కలేని ఉత్సాహం వచ్చేసి,“ అమ్మ నిజంగానా? ” అంటూ ఆశ్చర్య కంఠంతో అడిగింది అన్వి.


“ హా నిజంగానే ! ఇక మీరు తాగటానికి నీళ్లు మాత్రం తెచ్చుకోండి . ఆ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. స్టోర్ రూమ్ లో ఒక ఫ్రిజ్ ఉంది. అది మేము వాడకపోవడం వల్ల కాస్త పాడైనట్టుంది .దాన్ని కొద్దిగా రిపేర్ చేస్తే చాలు మీరు వాడుకోవచ్చు .ఇక కరెంట్ బిల్ కి ఒక వంద రూపాయలు ఎక్కువ రెంట్ తో పాటు చెల్లించాలి సరేనా? ” అంటూ చెప్పింది ఆవిడ .


“ తప్పకుండా మేడం . మీరు మాకు ఇన్ని ఇచ్చారు . కచ్చితంగా చేస్తాము ” అంటూ నవ్వూతూ చెప్పి ఫోన్ పెట్టేసింది.

గదిలోకి వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్పి మళ్ళీ వంటలోకి దిగింది అన్వి.


——— ***** ———


Rate & Review

Be the first to write a Review!