YOUR THE ONE - 25 books and stories free download online pdf in Telugu

జతగా నాతో నిన్నే - 25









భూమి పైన మాయమైనా రాహుల్ నేరుగా డ్రాకులాల రాజ్యంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చుట్టూ పరికించి చూస్తే , తనకి ఏదో తేడా కనిపించింది .

గాలిలో ఈ వాసన ఏంటి ? చాలా వింతగా ఉంది . ఈ గ్రామంలో ప్రజలు ఉండాలి కదా ! ఎక్కడికి వెళ్లారు ? అంటూ చుట్టూ చూస్తూ ఉన్నాడు .


ఇంతలో ఏవో అరుపులతో తనపైన ఒక పది, పదిహేను దయ్యాలు దూకాయి . అవి అలా రాహుల్ పైకి దూకగానే తను వెంటనే అక్కడి నుండి తప్పించుకున్నాడు .


కానీ తనతో పాటు తీసుకువచ్చిన శవలను మాత్రం మాయ చేయలేకపోయాడు . ఆ దయ్యాలు పిచ్చి పట్టిన వాటిలాగా ఆ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కొరకడం మొదలుపెట్టాయి.


అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో రాహుల్ కి అర్థం కాలేదు .



ఈ సామ్రాజ్యంలో నేను యువరాజుని ప్రతి ఒక్క దయ్యానికి తెలుసు! కానీ వీటి వింత ప్రవర్తన ఏంటి? ఇలా ఉంది అంటూ ఏదో మాయ శక్తిని ఉపయోగించి, చనిపోయిన ఆ వ్యక్తి యొక్క గుండెని మాయం చేశాడు .


రాహుల్ గబ్బిలం లాగా మారి చూట్టూ చూస్తూ ఎగురుతున్నాడు. అప్పుడే తను గుర్తించిన విషయం ఏంటి అంటే ? తన పైన దాడి చేయడానికి వచ్చిన ఆ దయ్యాల కళ్ళు మామూలుగా కంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. అవి నీలిరంగుల మెరుస్తూ ఉన్నాయి .



“ మొత్తానికి నేను లేని సమయం ఇక్కడ ఏదో జరిగింది. దాన్ని ఎలాగైనా కనుక్కోవాలి . నేను ముందు నాన్నని కలవాలి ” అని తనలో తానే అనుకుంటూ , వేగంగా భవంతి వైపుకి ఎగరాడు.



అక్కడికి చేరగానే బిక్కుబిక్కుమంటూ ఆ రాజభవనం చుట్టూ చాలా మంది రక్తపిశాచాలు కాపాలా కాస్తున్నారు. వాళ్ల పైకి దాడి చేయడానికి అన్నట్టుగా గ్రామాల్లో ఉండే చిన్న చిన్న దయ్యాలు గుంపులు గుంపులుగా దండేతాయి .


గబ్బిలం రూపంలో ఉన్న రాహుల్ ని చూడగానే వాళ్ళూ కాస్త ధైర్యం తెచ్చుకొని ; “ యువరాజు వచ్చేసాడు . ఇక భయం లేదు ధైర్యంగా ఎదుర్కొండి? ” అంటూ వాళ్లే ధైర్యం నింపుకున్నారు .


గబ్బిలం రూపంలో ఉన్నా రాహుల్ నేరుగా రాజభవనంలోకి వెళ్ళాడు. అక్కడ సింహాసనం పైన చాలా ఇబ్బంది పడుతూ , భరించలేని బాధను అనుభవిస్తున్న తన తండ్రిని చూడగానే “ నాన్న ఏమైంది మీకు ?” అంటూ పరుగు పరుగున దగ్గరికి చేరుకోబోయాడు .


అలా పరుగులో ఉండగానే రాహుల్ గమనించిన ఒక విషయం . తన తండ్రి కళ్ళు కూడా నీలిరంగులో ఉన్నాయి అనీ!


ఆ విషయం గమనించగానే అడుగు ముందుకు పడలేదు . ఒక క్షణం అలాగే ఆగి కళ్ళు మూసుకుని తీవ్రమైన మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు.


గదిలో ఎవరు లేకపోవడం వల్ల తనలోని కోరికను విపరీతంగా అణుచుకుంటున్న ఆ పెద్ద డ్రాకులా .....ఎదురుగా రక్తపు మాంసాలతో ఉన్న తన కొడుకుని చూడగానే చంపడానికి పైకి లేచాడు.


ఇంతలో తనలో ఏదో ఆపుతున్నట్టుగా తన రూపాంతరాన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా వెళ్లలేక అడుగులు భారంగా వేస్తున్నాడు . ఆ డ్రాకులాలోని మంచితనం తన కొడుకుని చంపనివ్వకుండా అడ్డుకుంటుందని ఆయనకు కూడా తెలుసు.


తన కొడుకును చంపాలంటే తనకు చేతులు రాకపోయినా , తన శరీరం మాత్రం ఉరకలు వేస్తుందని......దీన్ని ఎలా ఆపాలో అర్థం కాక సతమతమవుతున్నాడు. చూస్తుండగానే ఒక్క గెంతులో, కోరలు పెద్దగా చాపి రాహుల్ పైకి దూకాడు.



కళ్ళు మూసుకొని మంత్రాలు చదివిన రాహుల్ ఏ మాత్రం కదలకుండా , అలాగే మంత్రాలు చదువుతున్నాడు . పెద్ద డ్రాకులా తనను తాకగానే అదేదో షాక్ కొట్టిన వాడిలాగా దూరంగా ఎగిరిపోయి పడ్డాడు .


అప్పుడే చిన్న ట్రాకులైన రాహుల్ నుదిటి నుంచి ఒక బంగారు వర్ణం కలిగిన తీగ శక్తి బయటకు వచ్చింది . అది మెరుస్తూ మెరుస్తూ పెద్ద డ్రాకులా యొక్క నుదుటిలోకి అమాంతం పోయింది.


అప్పటిదాకా నీలిరంగులో మెరిసిన ఆ కళ్ళు నెమ్మది నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయని రాహుల్ , తండ్రిని సమీపించి ఆ మనిషి యొక్క గుండెని తండ్రికి ఇస్తాడు.


దాన్ని తిన్న తర్వాత కొంచెం బలం వచ్చిన వాడిలాగా , రాహుల్ ని ప్రేమగా చూశాడు పెద్ద డ్రాకులా!


“ నాన్న అసలు ఇక్కడ ఏం జరుగుతుంది .మీకు ఏమయింది ?” అన్నాడు కన్నీళ్ళతో చూస్తూ .


“ నేను నీకు చెప్పా కదా బంగారు తండ్రి . నువ్వు ఆ మనిషి రూపంలో ఉండే అమ్మాయిని ప్రేమించి వరించాలి. లేని పక్షంలో మన సామ్రాజ్యం మన చేతనే అంతమవుతుంది . ”


“ ఏం మాట్లాడుతున్నారు మీరు? నా ప్రేమకు దీనికి సంబంధం ఏంటి? ” ప్రశ్నించాడు ముక్తసరిగా .


“ ఉంది . నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ ఇలాంటివి చాలా సంవత్సరాలకొకసారి వస్తుంది. అప్పుడు దీనిని నివారించే బాధ్యత ఆ యువరాజు తీసుకుంటూ ఉంటాడు. ఇప్పటివరకు ఇలాంటివి చాలానే జరిగాయి .


మన పూర్వీకులు కాకపోతే ప్రేమించిన ఆ మానవ కన్నెని రక్తం తాగి చంపేసి , దాన్ని తాత్కాలికంగా అరికట్టారు తప్ప పూర్తిగా నివారించలేకపోయారు ” అంటూ నిట్టూర్పు విడిచాడు.


“ మన దగ్గర ఎక్కువ సమయం లేదని ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది . నాన్న! మీరు ఇకపై జాగ్రత్తగా ఉండండి . దీనికి పరిష్కారం ఇందాక నేను మీపై ప్రయోగించిన మాయనే!.


దాన్ని వీలైనంతమందికి మీరు ప్రయోగించి ,వాళ్ళని మామూలు దయ్యాలలాగా మార్చండి .బలం కోసం నేను కొంత మందిని చంపి ఆ శరీరాలని తీసుకొని వస్తాను ” అంటూ తండ్రికి పలు విధాలుగా జాగ్రత్తలు చెప్పి , పైకి లేచాడు రాహుల్.


తన వెంట తను నమ్మిన ఒక ఐదుగురు రక్తపిశాచాలని వెంటబెట్టుకొని భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు.


తన ఫోన్లో ఉన్న చెడ్డవాళ్ళ పేర్లన్నీటిని చూపించాడు . సమయం చూసుకొని ఒక్కొక్క రక్తపిశాచి ......ఒక్కొక్క వ్యక్తిని , చీకటిలోని హతమార్చింది .


ఆ శవలని నేరుగా అక్కడి నుండి మాయమై డ్రాకులాల సామ్రాజ్యమైన పెద్ద డ్రాకులా గదిలో పడేసాయి. అలా సామ్రాజ్యానికి సరిపడినన్ని అంటే దాదాపు ఒక వందమందిని రాత్రికి రాత్రి ఆ పట్టణం నుండి మాయం చేసేసాడు రాహుల్ .


వీలైనంతగా తన శక్తిని ఉపయోగిస్తూ , తన నుంచి వెలువడే ఆ బంగారుపు తీగలను ఆ ఊరిలోని ప్రజలపై ప్రయోగించాడు . దానితో మామూలు రూపాలలోకి వస్తున్న అవి ......మరి కొంతమందిని బాగు చేయడం మొదలుపెట్టాయి .


వాటికి శక్తి కోసం ఈ మనుషుల ఆహారాన్ని ఇచ్చాడు . చూస్తుండగానే తెల్లవారేసరికి అంతా ఆ సమస్య పోయింది.


“ విడింబిక ఇలా తనను తాను అదుపు చేసుకోలేక చంపాలని కోరిక అధికమవడం వల్ల భూమి పైకి వచ్చిందని అర్థం అవుతుంది . చూస్తూ ఉంటే నాన్న చెప్పిన ప్రకారం నాకు ఎక్కువ సమయం లేదు. వీలైనంత తొందరగా నేను అన్వికి అసలు విషయం చెప్పాలి . కుదరకపోతే తనని చంపడానికైనా కూడా వెనకాడకూడదు . ఇది యువరాజుగా నా ప్రజల కోసం నేను చేసే ఒక యాగం ” అని అన్వి గురించే తలుచుకుంటూ బాధలోకి కూరుకున్నాడు .


ఉదయం అవ్వగానే ఆ ఊరి ప్రజలను అంతా చూసి , తమ ఇళ్ళకి రక్ష వేసుకోమని చెప్పాడు. దాని కారణంగా వాళ్లు అంత తొందరగా ఆ మాయలో పడి ఇలా విచిత్రంగా ప్రవర్తించారు .



అక్కడినుండి మాయమైన రాహుల్ నేరుగా మళ్లీ ఆ ట్రంప్ యాడ్కి వచ్చాడు.


తను భూమి పైకి వచ్చాడో లేదో ఫోన్ విపరీతంగా మోగడం మొదలైంది . బహుశా భూమిపైన తను ఉన్న సిగ్నల్స్ గుర్తించాయి అనుకుంటా!


ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని "హలో ......." అన్నాడు రాహుల్ .


“ ఎక్కడున్నావు? నేను ఆ అభయ్ని . రాత్రంతా నువ్వు అసలు ఇంటికే రాలేదు . నీకు చెప్పడం మర్చిపోయా? ఈరోజు రెండు మంచి విషయాలు జరిగాయి . నువ్వు త్వరగా రూమ్ కి వచ్చేయి. రెడీ అయ్యి మన ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం.....ఆ నీ డౌట్ నాకు అర్థమైంది. నీ నెంబర్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందని కదా? నీ నెంబర్ నాకు ఇంటి ఓనర్ ఇచ్చారు ”” అంటూ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా చెప్పాలనుకున్నదంతా చెప్పేసి ఫోన్ పెట్టేసాడు.


ఇప్పటిదాకా నేను పనిచేయడం వల్ల బాగా అలసిపోయాను .ఇప్పుడైనా నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటే , ఏంటి ఇలా జరిగింది అనుకుంటూ నడుచుకుంటూ తన రూమ్ కి వెళ్ళాడు.


అక్కడే అభయ్, రాహుల్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు . తను రావడంతోనే “ పదా .......పదా....ఇంకేంటి ఇలా ఉన్నావు? మనం ఫంక్షన్ కి వెళ్ళాలి . తొందరగా రెడీ అవ్వు” అంటూ లోపలికి తోసాడు.


“ ఫంక్షనా......?” అంటూ ఏదో అడగేలోగా, నేను ఒక పది నిమిషాల్లో మళ్ళీ కలుస్తాను అంటూ బయటికి నడిచాడు అభయ్.


“ ఏంటి వీడు .... ఈరోజు చాలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు ” అని చిరాక వెళ్లి ,రెడీ అయ్యాడు. కొన్ని క్షణాల్లోనే ఆర్గనైజేషన్ చేరుకున్నారు .


మిగతా విషయాలు ఎవరికీ తెలియదు . అందుకే వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా వినడం కోసం వచ్చేసారు. .


అక్కడ తీరిగ్గా కూర్చున్న అభయ్ “ మొదటి విషయం ఏంటి అంటే మన సిటీలో ఉన్న చెడ్డ వ్యక్తులు దాదాపు సగం మంది నిన్న నైట్ నుంచి మాయమైపోయారంటా! ఈరోజు ఇదే హాట్ టాపిక్ తెలుసా ?” అన్నాడు వాళ్ళ వంక చూస్తూ.


“ ఇది చెప్పడానికి నన్ను ఇంత తొందరగా రెడీ చేసావా నువ్వు ? ” అన్నట్టు కోపంగా చూశాడు రాహుల్.


“ ఇలాంటి విషయాలన్నీ మాకు ముందు ముందే తెలిసిపోతుంది ” అని చెప్పి జడ వెనక్కి వేసుకుంది సంజన.


“ ఇక రెండో విషయం ఏంటి అంటే మనం మన కంపెనీని రిజిస్ట్రేషన్ చేసి మంచి పని చేశాము. ఇప్పుడు మన కంపెనీ గుర్తింపు పొందినది .కాబట్టి మిగతా కాంపిటీటివ్ పోటీపటానికి ఎలిజిబుల్ అయింది . ఇప్పుడు మన కంపెనీ అన్ని కంపెనీలను వెనక్కి తోస్తూ మన ఐడియాలజీ క్లిక్ అవడం వల్ల టాప్ టెన్ లో ప్లేస్ సంపాదించింది.


ఇప్పుడు మన ఆదాయం డబల్ అయింది ” అంటూ చెప్పాడు .


“ ఏంటి నిజంగానా ....?” అంటూ ఆశ్చర్యంగా అన్వి గీత చూశారు . రాహుల్ కి మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుగా పిచ్చలైట్ అన్నట్టు మాములుగా కూర్చున్నాడు .


ఇంతలో సంజన మొబైల్ కి నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే, తనకి వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చారని యూట్యూబ్ నుండి నోటిఫికేషన్ వచ్చింది. అది అందరికీ చూపిస్తూ ” చూశారా .......చూశారా మనం సాధించాం ”అంటూ ఎగిరి గంతువేసింది.


అందరు సంతోషంగా వాళ్ళ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు.



“ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను .ఈరోజు సాయంత్రం మన కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం పార్టీ ఇస్తున్నాము. అది కూడా ఫైవ్ స్టార్ హోటల్లో! దానికి కావాల్సిన మనీ అరేంజ్మెంట్లన్నీ ఆల్రెడీ చేసేసాను” అన్నాడు సంతోషంగా అభయ్ .


“ ఏంటి ఫైవ్ స్టార్ హోటల్ లోనా? నిజంగా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా ” అంటూ ఆశ్చర్యపోతూ అంది .


“ ఆ మరి ఇప్పుడు మనం బిలినీయర్ . డబ్బులు అన్ని డబల్ అవడానికి కారణం మన సేవింగ్స్ ఇంకా స్టాక్ మార్కెట్స్ లో పెట్టడం. కొన్ని కొత్త కంపెనీలకి హెల్ప్ చేయడం” అంటూ చెప్పాడు .


అందరూ ఆసక్తిగా అతడు చెప్పే మాటలే వింటూ ఉన్నారు .


“ మీరు విన్నది చాలుగాని , ఇక వెళ్లి రెడీ అవ్వండి. సాయంత్రం పార్టీ ఉంది కదా! ” అంటూ తలో ఒక 10000 ట్రాన్స్ఫర్ చేశాడు .


“ ఏంటి వీటితో మేము ఖర్చు పెట్టుకోవచ్చా? ” అడిగింది గీత .


“ ఆ పెట్టుకోవచ్చు. ఈరోజు సాయంత్రానికి మంచి షాపింగ్ చేసేయండి . ”


“ షాపింగ్ .........”అంటూ దాదాపు సంతోషంతో గాల్లో తేలిపోయారు వాళ్ళ ముగ్గురు.



సాయంత్రం పార్టీ మొదలైంది . వాళ్ళ కాలేజీ నుంచి చాలామంది అక్కడికి వచ్చారు . ఆ కాలేజీలో చదివేది పెద్ద పెద్ద కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు .


వాళ్లకి తగ్గట్టుగా ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ అరేంజ్ చేశాడు అభయ్ . ఇక ఆ పార్టీలో మొత్తం బిల్ కూడా తానే పే చేసాడు .అంతే కాకుండా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే? వాళ్ళ ఆర్గనైజేషన్ ని వేర్వేరు ప్రాంతాల్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు.


దానికోసం ఎంప్లాయిస్ గా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ల కాలేజ్ విద్యార్థులు తీసుకున్నన్నారు. ఆ పవిత్ర వృక్షన్ని కాపాడడానికి మంచి ఆత్మలు అంటే ఏంజెల్స్ కావాలి కదా? దానికోసమే ఇన్ని రోజులు అభయ్ ఆగాడు .


ఇప్పుడు తనకు కావాల్సిన ఒక పది మంది ఏంజెల్స్ తనకు దొరికారు. అందుకే తన ఈ నిర్ణయం తీసుకున్నాడు . ఆరోజు పార్టీ చాలా సంతోషంగా గడిచింది అందరూ బాగా తిని, తాగేసి అక్కడే కొంతమంది కూర్చున్నారు .



ఇంకొంతమంది తూలుతూ ఇండ్లకి బయలుదేరారు.


రాహుల్ కూడా బాగా అలసిపోవడంతో పడుకోవడం కోసం ఒంటరిగా రోడ్డుపై నడుస్తూ వెళుతున్నాడు.


ఆ పౌర్ణమి చంద్రుడు.......చుట్టూ ఉన్న చిమ్మ చీకటి......గలగల సాగిపోయే శబ్దాల మధ్యలో ఒక మూలగా నడుస్తూ వెళ్తున్నాడు రాహుల్.



అప్పుడే ఆ ప్రయత్నం గా తన చూపు ఎదురుగా ఉన్న ఒక షాపు వైపు పడింది.



——— ***** ———