Truth - 1 in Telugu Thriller by Rajani books and stories PDF | నిజం - 1

The Author
Featured Books
Categories
Share

నిజం - 1

రాయవరం ఒక ప్రశాంతమైన పల్లెటూరు , 20km దూరంలో అందమైన సముద్రం ,ఊరిలో పచ్చని పొలాలు ,కుల మత బేధాలు లేకుండా అందరూ కలసి, మెలసి ఉంటారు. ఆ ఊరి సర్పంచ్ రామారావు, ఆయన అంటే ఆ ఊరిలో అందరికీ చాలా గౌరవం ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుగా సాయం చేసేది రామారావు గారే. రామారావు గారి భార్య పేరు శాంతమ్మ పేరుకు తగ్గట్టే శాంతమూర్తి . కొడుకు పేరు మోహన్ ,కోడలు పేరు స్వప్న .మోహన్ ,స్వప్న దంపతులకు ఒక బాబు పేరు సంపత్ రెండవ తరగతి చదువుతున్నాడు. రామారావు ,శాంతమ్మ గార్ల రెండవ సంతానం గంగ. రోజూ సాయంత్రం సందడిగా ఉండే ఆ ఇల్లు ఈరోజు నిశ్శబ్దంగా ఉంది, స్వప్న బయట వరండాలో నుంచొని రోడ్డు వైపు చూస్తూ ఉంది తన కొడుకు సంపత్ కోసం , ఏమ్మా స్వప్న వస్తున్నాడా సంపత్ అంటూ లోపలి నుంచి అడిగింది శాంతమ్మ. లేదు అతయ్య ఇంకా రాలేదు రోజూ 4 గంటలకే వచేస్తాడు ఈరోజు 5 గంటలైనా రాలేదు నాకు భయంగా ఉంది అత్తయ్య అంది స్వప్న కళ్ళ నిండా నీళ్లతో, అయ్యో ఈ మాత్రానికే అంతలా భయపడ తావు ఎందుకు పిల్లాడు ఆటలో పడి ఆలస్యం అయి ఉంటుంది ,తనకోసం వీరయ్య వెళ్ళడుగా తీసుకొస్తాడు లే అంది శాంతమ్మ. వీరయ్య ఆ ఇంటి పాలేరు. కోడలికి ధైర్యం చెప్పింది కానీ తనకు కూడా లోపల కంగరుగానే ఉంది . ఒక అరగంటకి వచ్చిన వీరయ్య అమ్మ చిన్నబాబు వచ్చాడా ఇంటికి అని అడిగాడు దూరం నుంచే సైకిలు మీదనుండి చెమటలు కక్కుతూ , ఆ మాట వింటూనే కళ్ళు తిరిగాయి స్వప్నకి ఇది గమనించిన శాంతమ్మ వెనుక నుండి కోడలిని పట్టుకుని పడక కుర్చీలో కూర్చోపెట్టి ,రత్నం నీళ్ళు తీసుకురా అని పిలిచింది పనిమనిషి రత్తాలు ని. ఏంటి వీరయ్య బాబు కనపడలేదా అంతా చూసావా తన స్నేహితులను అడిగావా వాళ్ళు ఏమన్నారు అంది కంగారుగా. ఈలోపు నీళ్ళు తెచ్చిన రత్నం ,స్వప్నను చూసి అయ్యో అసలే కడుపుతో ఉన్న మనిషి అంటూ మొహం తుడిచి నీళ్ళు తాగించిన తరువాత కాస్త తేరుకుంది స్వప్న. ఈలోపు పొలానికి వెళ్లిన రామారావు, మోహన్ ఇంటికి తిరిగి వచ్చారు ,వాళ్ళు వస్తూనే ఏంటి వీరయ్య సంపత్ కోసం ఊరిలో వెతుకుతున్నావు అంటున్నారు ఏం జరిగింది అని అడిగారు ,స్వప్న శాంతమ్మ కూడా వీరయ్య వైపే చూశారు సమాధానం కోసం , అయ్యా రోజూ పక్కింటి చిట్టితో వస్తాడు బడి నుంచి మీకు తెలుసుగా పొద్దున్న నేనే బడి దగ్గర దించి వచ్చాను , ఈరోజు 4:30 అయినా బాబు రాలేదని చిట్టి ని అడిగితే ఈరోజు తను బడి వెళ్లలేదని చెప్పింది . బడికి వెళితే అక్కడ బాబు లేడు అక్కడ ఆడుకునే పిల్లల్ని అడిగితే సంపత్ బడి వదలగానే వెళ్ళిపోయాడు అని చెప్పారు, కానీ చినబాబు కనపడలేదు అంటూ కంగారుగా చెప్పాడు వీరయ్య. అరగంట లో ఈ విషయం ఊరంతా పాకింది, ఊరంతా కలకలం రేగింది.తలా ఒక దిక్కు చేరి వెతుకుతూనే ఉన్నారు. 7 గంటలకి పక్కింటి పట్నం నుండి వచ్చిన బస్సు లో నుండి దిగారు రామారావు కూతురు గంగ తన స్నేహితురాలు విద్య. గంగ ,విద్య ఇద్దరు చిన్నతనం నుండి స్నేహితులు ఇప్పుడు ఇద్దరూ పక్కన ఉన్న పట్నం లో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చువుతున్నారు . వాళ్ళు ఊరిలో దిగగానే జరిగింది విని కంగారుగా ఇంటికి వెళ్ళారు . రాత్రంతా ఊరిలో ఎవరికీ నిద్ర లేదు. అర్థరాత్రి అయ్యింది కొంత మంది జనం వూరి చివర గుమిగూడారు.

ఎప్పుడూ ఊరిలో ఇలా జరగలేదు అలాంటిది ఇలా సర్పంచ్ గారి మనవడే కనిపించకుండా పోవడం ఏమిటి అని అందరూ అనుకుంటున్నారు, అరే వీరిగా మన సర్పంచ్ గారంటే పడని వాళ్ళు వాళ్ళ బంధువులలో ఎవరైనా ఉన్నారేంట్రా అన్నాడు ఒకడు ,దానికి వీరయ్య నా చిన్నప్పటి నుండి చూస్తున్నా అయ్యగారు ఎవరితోనూ కోపంగా మాట్లాడటం కూడా చూడలేదు, అలాంటి అయ్యగారికి గిట్టని వాళ్ళు ఎవరుంటారు అన్నాడు వీరయ్య. ఒక పెద్దాయన మధ్యలో కల్పించుకుని రామారావును నేను వాడి చిన్నప్పటి నుండి చూస్తున్నా ఊళ్ళో అందరితో చాలా ప్రేమగా మాట్లాడేవాడు, పేద గొప్ప, కులం మతం బేధం వాడికి లేదు. పిల్లల్ని అలానే పెంచాడు ,వాళ్లకు తండ్రి ,తల్లుల బుద్దులే వచ్చాయి, కానీ అంటూ ఆపాడు ఆ పెద్దాయన, కానీ ఏంటి తాత అడిగాడు పక్కనున్న వీరేశం ,అదికాదు రా ఆ పక్కూరు పోలవరం సర్పంచ్ రామాలింగనికి ఎప్పుడూ మన ఊరి మీద కుళ్లే అన్నాడు తాత ఏదో ఆలోచిస్తూ, అదేంటి తాత దేనికి కుళ్ళు మన ఊరు ఏం చేసింది వాళ్ళకి అడిగాడు వీరేశం. అదేరా ప్రతి యేడాది మన చుట్టుపక్కల 6 ఊళ్లకి మధ్య జరిగే కుస్తీ పోటీల్లో గత 7 ఏళ్ళుగా మన ఊరే గెలుస్తుంది , అందుకే మన ఊరి మీద బాగా కుళ్ళు పెట్టుకున్నాడు ఆ రామలింగం అన్నాడు ఆ పెద్దాయన.అదేంటి తాత ఇంత చిన్న విషయానికి పగ పెట్టుకుంటారా ఎవరైనా అన్నాడు వీరేశం ఆశ్చర్యపోతూ ,నేను పగ అనలేదు కుళ్ళు అయితే ఉంది.అది పంతం గా మారింది అన్నాడు పెద్దాయన. ఇదంతా నీకెలా తెలుసు బాబాయ్ అన్నాడు అక్కడే ఉన్న head కానిస్టేబుల్ రాఘవులు, అదా పోయిన నెలలో ఆ ఊరిలో ఉండే మా బామ్మర్ది వచ్చాడు వాడి ద్వారా ఆ ఊరి విషయాలు తెలిశాయి అన్నాడు పెద్దాయన, ఏంటి బాబాయ్ ఆ విషయాలు అడిగాడు కానిస్టేబుల్ రాఘవులు .ఆ సర్పంచ్ రామలింగం ఈ యేడాది కుస్తీ పోటీల్లో పోలవరం గెలిస్తే ,గెలిపించిన వాడికి 2ఎకరాల భూమి రాసిస్తాడంట,ఈ సారి ఎలాగైనా వాళ్ళ వూరే గెలవాలని చాలా కోపంగా అన్నాడంట పంచాయితీ లో అందరి ముందు అన్నాడు పెద్దాయన.