Manasichi Chudu - 14 in Telugu Love Stories by Ankithamohan books and stories PDF | మనసిచ్చి చూడు - 14

Featured Books
  • ماسک

    نیا نیا شہر نئی امیدیں لے کر آیا ہے۔ دل کو سکون اور سکون ملا...

  • Wheshat he Wheshat - 5

    وحشت ہی وحشت (قسط نمبر 5)(بھیڑیے کا عروج: )​تیمور کاظمی صرف...

  • Wheshat he Wheshat - 4

         وحشت ہی وحشت(قسط نمبر( 4)جب تیمور گھر میں داخل ہوا، تو...

  • Wheshat he Wheshat - 3

    وحشت ہی وحشت( قسط نمبر (3)(منظر کشی :)رات کا وقت تھا، بارش ک...

  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

Categories
Share

మనసిచ్చి చూడు - 14

             మనసిచ్చి చూడు.....14


కళ్యాణ్ కాల్ చేసి బావ మీరు ఈరోజు ఇంటికి రండి భోజనానికి అంది.
కానీ నా వైఫ్ ఇక్కడ లేదు సమీరా,ఇద్దరం కలిసి ఇంకోసారి వస్తాములే అన్నాడు.

నో బావా తనతో మళ్ళీ రావచ్చు నువ్వు అత్తయ్య మామయ్య రండి అంది.

సరే సమీరా వస్తాము అన్నాడు.

భోజనానికి చాలా ఏర్పాట్లు చేస్తూ ఉంది అది గమనించి ఉమా గారు ఎవరు వస్తున్నారు సమీరా అంది.

మా బంధువులు వస్తున్నారు అత్తయ్య అందుకే అంది.

గౌతమ్కి తెలుసా వాళ్ళు వచ్చేది అని అడిగింది.

లేదు అత్తయ్య నేను వెళ్ళి చెప్పి వస్తాను ఉండండి అని గదిలోకి వెళుతుంది.

ఏవండీ అంటుంది....!!

చెప్పు సమీరా ఏమైనా కావాలా అంటాడు.

లేదు కాసేపటిలో మా బావ వాళ్ళు ఇంటికి వస్తున్నారు మీకు ఒకే కదా అంది గౌతమ్ని గమనిస్తు...??

ఒకే రానివ్వు కానీ ఎవరూ అన్నాడు.

కళ్యాణ్ మా బావా వాళ్లు అంది.

గౌతమ్ మొహం ఒక్కసారిగా ఎర్రగా అయిపోయింది.

ఏ ఊరు మీ బావ వాళ్ళది అన్నాడు.

ఇక్కడే బావ హైదరాబాద్కి దగ్గరలో ఉంటారు.

సరే సమీరా రానివ్వు నాకు కొంచం పని ఉంది బయటికి వెళుతున్నాను అన్నాడు.

వాళ్ళు వస్తున్నారు కదా ఇప్పుడు మీరు బయటకి వెళ్తే ఏమీ బాగుంటుంది చెప్పండి అంది.

త్వరగా వచ్చేస్తాను కొంచెం ముఖ్యమైన పని ఉంది అన్నాడు.

సరే అండీ త్వరగా రండి అంది.

నువ్వు జాగ్రత్తగా ఉండు ఇంట్లో బై అని బయటకు వచ్చాడు.

            *****************

పదకొండు ఆ సమయానికి కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది గౌతమ్ వాళ్ల ఇంటికి.

హ్యాపీగా వెళ్ళి అందరినీ పలకరించింది.

బాగున్నావా బావ అంది.

చాలా బాగున్నాను సమీరా నువ్వు ఎలా ఉన్నావు,మీ ఆయన ఎక్కడ అని అడిగాడు.

పని ఉండి బయటకు వెళ్లారు వచ్చేస్తారు బావ రండి మీరు అని లోపలికి తీసుకొని వెళ్లింది అందరినీ.

ఫ్యామిలీ అంతా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు, మధ్యాహ్నం భోజనాలు కూడా అయ్యాయి.

రెండు గంటలకు ఆ ప్రాంతంలో వచ్చాడు గౌతమ్ రావడం అందరినీ పలకరించాడు.

సమీరా వాళ్ల అత్తయ్య మామయ్యను,కళ్యాణ్ను పరిచయం చేసింది.

అగ్నిగుండంల గౌతమ్ గుండె మండిపోతుంది.

హలో బ్రదర్ అన్నాడు.

హై అని చెప్పి సమీరా భోజనం పెట్టు అన్నాడు.

తినేసి తన గదిలోకి వెళ్ళి మధుకి కాల్ చేశాడు.

నువ్వు గొడవ పడద్దు బావ తను చాలా దారుణమైన మనిషి అంది.

ఇన్ని రోజులు వేరు,ఇప్పుడు వేరు మధు నువ్వు ఉండు నేను చూసుకుంటాను వాడి సంగతి,టైమ్కి తిను ఆరోగ్యం జాగ్రత్త మధు అని ఫోన్ కట్ చేశాడు.

హాల్లోకి వచ్చి కళ్యాణ్ మీకు పెళ్ళి అయింది అని సమీరా చెప్పింది మరి మీ వైఫ్ని తీసుకొని రాలేదా అని అడిగాడు.

లేదు గౌతమ్ తను కొంచెం బిజీగా ఉంది అందుకే ఇప్పుడు రాలేదు అన్నాడు.

అవునా ఏ ఊరు అమ్మాయి అన్నాడు.

వీడికి ఏంటి నా వైఫ్ మీద అంత ఆసక్తి అనుకొని తను ఇక్కడ లేదు వేరే ఊరిలో ఉంది అన్నాడు.

అదే ఏ ఊరు కళ్యాణ్ అడిగాడు సూటిగా.

హైదరాబాద్ అన్నాడు.

సరే ఈసారి తప్పకుండా మీ వైఫ్తో ఇంటికి రావాలి....??

తప్పకుండా వస్తాను.

సరే కళ్యాణ్ బయట బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుందం పద అన్నాడు.

ఈయనకి బావతో ఏంటి మాటలు అని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది సమీరా.

బయట ఇద్దరు కూర్చుంటారు.

సమీరా వీళ్ళకి తెలియకుండా వీళ్ళ మాటలు వింటుంది.

అవును కళ్యాణ్ మీరు ఎక్కడ వర్క్ చేసేది అడిగాడు సూటిగా.

అమెరికాలో అన్నాడు.

సరే మీ వైఫ్ కూడా అక్కడే వర్క్ చేస్తారా...???

అవును అయిన అప్పటి నుంచి చూస్తున్నాను ఎందుకు పోలీస్లు అడిగినట్టు అడుగుతున్నారు.

ఎందుకా అని పైకి లేచి కాలర్ పట్టుకొని నీ గురించి తెలియని వాళ్ళకి నువ్వు మంచోడివి కావచ్చు కానీ నువ్వు ఏంటో నాకు బాగా తెలుసు.అసలు మనిషివేనా అన్నాడు.

హలో హలో ఆగండి అసలు ఎవరు అనుకొని ఎమ్ మాట్లాడుతున్నారు.

(సమీరా ఇది అంత చూసి టెన్షన్ పడుతుంది)

తెలుసు కళ్యాణ్ నువ్వు ఎవరో నా మరదలిని నా మీద పగతో ప్రేమించి పెళ్ళి చేసుకొని మధు జీవితాన్ని నాశనం చేశావు అలాంటిది నిన్ను చూసి ఎవరో ఏంటో అనుకొని ఎందుకు పొరబడతాను చెప్పు అన్నాడు చాలా కోపంగా.

కళ్యాణ్కి చెమటలు పట్టాయి.చెమటలు తుడుచుకొని ఓహో అంతా తెలిసి పోయిందా అన్నాడు వెటకారంగా.

తెలియకపోతే మధుని చంపేసేవాడివా .....???

నా భార్య నా ఇష్టం నీకు ఎందుకు రా మధ్యలో.

నీ భార్య కంటే ముందు తను నా మరదలు రా,అసలు నా మీద నీకు అంత పగ ఏంటి అసహనంగా అడిగాడు.

పగ కాదు నువ్వు అంటే కోపం,అసహ్యం,ద్వేషం అన్నాడు.

అదే ఎందుకు......???

ఎందుకు అంటే సమీరాని నేను ప్రేమించాను తన కోసమే మంచి జాబ్లో సెటిల్ అయ్యాను పెళ్ళి చేసుకోవాలి అనుకున్న టైమ్కి బలవంతంగా పెళ్ళి చేసుకున్నావు నీకు తన మీద ఏ హక్కు ఉంది అని అలా చేశావు చెప్పు....???

పెళ్లి అంటేనే ఇష్టం లేని నేను తనని మొదటి చూపులోనే ప్రేమించాను,కానీ నాకు పెళ్ళి మీద ఉండే అభిప్రాయం వల్ల తనని దూరం పెట్టాను కానీ తెలుసుకున్నాను తనని ప్రేమించాను అంతే గానీ నీల వేదించలేదు అన్నాడు.

ఇది అంత వింటున్న సమీరాకి చాలా ఏడుపు వస్తుంది అసలు ఏమీ జరిగిందో ఏమో అని టెన్షన్ ఒక పక్క, అనవసరంగా గౌతమ్ని అనుమానించినందుకు బాధ ఒక వైపు.

నీ వల్ల పాపం రా మధు చాలా బాధ పడుతుంది, ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చింది అయిన తనని పెళ్ళి చేసుకుంది మరి ఇంతలా బాధ పెట్టడానికా.......?????? 

మర్యాదగా నీ తప్పు తెలుసుకొని మధుని బాగా చూసుకో లేదు అంటే నాలో ఇంకో మనిషిని చూడాల్సి వస్తుంది అన్నాడు.

బెదిరిస్తున్నావా అన్నాడు.

బెదిరింపు కాదు బంధం గురించి చెప్తున్నాను తను ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు,కనీసం నీ బిడ్డ మీద కూడా నీకు ప్రేమ లేదా అన్నాడు.

అవన్నీ నీకు ఎందుకు అయిన నాకంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు నీకు తనకి ఏమైనా......చెంప చెల్లుమనిపించాడు.ఇంకొక మాట తప్పుగా వచ్చిన నీకు ఈ భూమి మీద ఇవే ఆఖరి క్షణాలు అన్నాడు.....???


ఇంకా ఉంది

               💐 ధన్యవాదాలు 💐

                  అంకిత మోహన్