Friend... - 2 in Telugu Love Stories by sharanya books and stories PDF | సఖి... - 2

Featured Books
Categories
Share

సఖి... - 2

సుధ గారు చూడు సఖి నువ్వు ఇలాగే మొహం మాడ్చుకొని ఉంటే..... మీ అత్తయ్య గారి వాళ్ళు వెళ్లి నీ మొగుడితో చెప్తారు....! వాడు నీకు కాల్ చేసి ఎలా మాట్లాడుతాడో తెలుసు కదా..! అని అంటారు.


సఖి సరే పదండి లేట్ అవుతుంది మళ్ళీ ఫోన్ చేసి అరుస్తాడు వేస్ట్ గాడు అని అంటుంది....

సుధ గారు సఖి నీకు ఇదే వద్దని చెప్పాను.... నాన్నకి ఇష్టమైన చూశారు నువ్వు అణుకువగా ఉంటే మంచిది.... అని కొంచెం కటువుగా చెప్తారు....



సఖికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఇంక ఏమీ మాట్లాడకుండా అక్కడినుంచి బయటకు నడుస్తుంది...


అప్పటికే కృష్ణ గారు లగేజ్ మొత్తం కార్లో సర్దించేయడంతో ఇక వెళ్లి కార్ లో కూర్చుంటుంది....

తన వెనకే కృష్ణ గారు , సుధ గారు కూడా కారు ఎక్కుతారు....! తర్వాత డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి అక్కడ్నుంచి చాలా స్పీడ్ గా తీసుకు వెళ్తుంటే.... కృష్ణ గారు బాబు ఇంకొంచెం స్పీడ్ గా తీసుకువెళ్ళు అంటారు...! 

డ్రైవర్ బాబు గారు చిన్నయ్య గారు ఫోన్ చేశారండి.... ఐన 10 నిముషాలు అంతే కదండి.... ఇంతకంటే మనం స్పీడ్ గా వెళ్ళామనుకోండి...! అసలే ఇదే మట్టి రోడ్డు.... పక్కనే ఉన్న చెరువులో తెలుతాము... అంటాడు 

సఖి మనసులో " ఏంటి డ్రైవర్ కి కూడా కాల్ చేసి చెప్పాడు...! అసలు వీడు ఎలాంటి వాడు రా బాబు...!? ఏమని అనుకోవాలి..!? " 

ఇటువంటి వేస్ట్ గాడు గురించి ఇష్టం లేదు అని చెప్పలేను...! చేసుకోను అని చెప్పి వీళ్ళని బాధ పెట్టలేను...! వీడి టార్చర్ భరించలేను...! అని అనుకుంటుంది .


అలా పది నిమిషాలు గడిచేసరికి వాళ్ళు చేరుకోవలసిన ప్లేస్ రావడంతో కార్ ఆగుతుంది....

కృష్ణ గారు , సుధ గారు , సఖి ముగ్గురు కార్ దిగి లగేజ్ మొత్తం తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటారు....

కృష్ణ గారు రావడం చూసినా వాళ్ళ తమ్ముడు రామ్ గారు అన్నయ్య అని కృష్ణ గారి సడన్గా హగ్ చేసుకుని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు....


మరొక పక్కా సుధ గారు రావడం చూసిన జానకి గారు కూడా వెంటనే అక్కయ్య అని ఆవిడని హగ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు..

వీళ్ళ ఓవరాక్షన్ చూసిన సఖి అబ్బ ఎంత నటిస్తున్నారు రా మీరు అని మనసులో అనుకుంటుంది....

వీళ్ళ ఓవరాక్షన్ ఇక నిన్ను చూడలేను అనుకొని...! సఖి పిన్ని చెల్లి ఎక్కడ ఉంది అని అడుగుతుంది.....



జానకి గారు లోపల ఉందే.... " ఏదో మేకప్ అని ఫేషియల్ అని ఫుల్ బాడీ మెకోవర్ చేయించుకుంటుంది..! " అంటారు....

సఖి అవునా పిన్ని సరే అయితే నేను వెళ్తాలే...! అంటుంది...

జానకి గారు మీ చెల్లి అడిగినవన్నీ తెచ్చారు కదమ్మా...!? అంటుంది.


సఖి అది అడగడం మా నాన్న కొనకపోవడం వలన పిన్ని అన్ని కొన్నారు అన్ని తీసుకెళ్లి తనకు ఇస్తాను అని తన చేతిలో ఉన్న లగేజ్ ను కష్టంగా మోసుకుంటూ లోపలికి వెళ్తుంది....



సఖిని చూడగానే " అక్క నేను అడిగినవన్నీ తెచ్చావా...!? అనుకుంటూ వస్తుంది ప్రియ...." 


సఖి రాగానే అక్క ఎలా ఉన్నావ్...!? అని అడుగుతావు అనుకున్నాను. కానీ నాకేం తెచ్చావ్ అంటున్నావ్..!? అంటుంది.


ప్రియా ఇప్పుడెందుకు అడుగుతానే...!? " నువ్వు పెళ్లయిపోయి... మా బావగారు తో హనీమూన్ కి వెళ్ళొస్తావు కదా...! అప్పుడు అడుగుతాను ఎలా ఉన్నావ్ అని....! కొంటెగా... అంటుంది. " 

సఖి హ్మ్.... అని నిట్టూరుస్తుంది...
ప్రియా అవును మీ మంద వస్తున్నారా...!? లేదా...!? అని అడుగుతుంది.


సఖికి వాళ్ళ మీద ఇష్టం లేకపోయినా ఎంత కోపం ఉన్నా కూడా ఎవరి దగ్గర వాళ్ళని బ్యాడ్ చేయదు....


దాంతో అదేంటే అలా అంటున్నావ్...!? మా వాళ్లంటే నీకు అంత చీప్ అయిపోయారా..!? అని అడుగుతుంది.


ప్రియా అయ్యో అక్కా నేను అలా అనలేదు నువ్వు ఫీల్ అవ్వకే...!? అంటుంది...

సఖి సరే సరే వాళ్లు వచ్చేస్తున్నారు...! నేను బయట ఉంటాను.... మళ్ళీ విహాన్ ఫోన్ చేస్తాడు.... అంటుంది....


ప్రియా సరే గాని ముందు నాకు తెచ్చినవి ఎక్కడ పెట్టావ్...!? అని అడుగుతుంది....

సఖి అదిగో ఆ బ్యాగ్ మొత్తం నీకే....! " మొత్తం అందులో వంద తులాల పైనే బంగారం ఉంది...! నువ్వు చాలా జాగ్రత్తగా పెట్టుకో....! నువ్వు అడిగినవన్నీ డాడీ చేయించి పెట్టారు....! " అంటుంది.


ప్రియా సరే అక్క అని అవి చూసుకోవడంలో పడిపోతే సఖి " విహాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ వస్తారు " అని....! బయటకు వెళ్లి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ..... ఉంటుంది.


తను ఎలా వెళ్లడమే విహాన్ ఫ్యామిలీ వాళ్ళు అలా వచ్చేస్తారు.....విహాన్ ఫ్యామిలీ అప్పుడే వస్తారు ...!   
సఖి అందర్నీ ఒకసారి చూసి బావున్నారా అని అడుగుతుంది... అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లాడదు.... వాళ్ళ చేతిలో ఉన్న లగేజ్ తీసుకోవడంలో పడిపోతుంది....

విహాన్ వాళ్ళ ఫ్యామిలీ రావడం చూసిన సుధా గారు... 

బాగున్నారా వదిన గారు... బావున్నారా అన్నయ్య... 
సఖి వాళ్ళ ఆడపడచుని... ఏమ్మా ఎలా ఉన్నావ్..!?  
అని.. అలా వచ్చిన వాళ్ళ అందరిని పేరు పేరున అందరిని పలకరించి.... అందరిని లోపలికి తీస్కొని వెళ్తుంది....



సఖి వాళ్ళని బాగున్నారా అండి అని వాళ్ళ చేతిలో ఉన్న లగేజ్ తీసుకోవడంలో మునిగిపోతుంది....