వీళ్లు ఏదో ఎస్కేప్ ప్లాన్ వేసి గోడ దూకితే....! మరొకపక్క ఆ పెళ్లి వాళ్ళు వీళ్ళకంటే ముందుగానే బయటికి వచ్చేస్తారు....
మన వినయ్ వెంటనే రియాక్ట్ అయ్యి.... అక్కడే మన అఖిల్ కార్ ఉండడంతో తను లేచి వాళ్ళని లేపి ఇద్దరినీ లాక్కొని వెళ్లి...
తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని మిగిలిన ఇద్దరిని త్వరగా ఎక్కి చావండి అని అంటాడు...
అఖిల్ కార్ ఎక్కకుండా ఆ మండపం వైపే చూస్తూ ఉంటాడు....
పెళ్లికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ముగ్గురుని పట్టుకోవడానికి అని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు...
అభయ్ కార్ ఎక్కి వినయ్ నువ్ కార్ స్టార్టింగ్ చెయ్ అని...
" అక్కి..! " బావా... రారా అని కంగారుగా పిలుస్తాడు...
అభయ్ ఎంత పిలిచినా అక్కి అదే మండపం వైపు చూస్తూ ఉండడంతో....
అభయ్ తన చెయ్యి పట్టుకొని ఒక గుంజు గుంజేస్తాడు..!
దాంతో అక్కీ వచ్చి సీట్లో పడతాడు.!
వెంటనే అభయ్ డోర్ వేసేసి లగెత్తరో ఆజాము... అని అంటాడు.
వినయ్ వెంటనే కార్ స్టార్ట్ చేసి...." వాళ్ళు ఇంక కారు దగ్గరికి ఇంకొక టూ స్టెప్స్ వేస్తే వచ్చేస్తారు..!
అనగా... వెంటనే అక్కడి నుంచి రేస్ కి వెళ్ళినట్టే ఒక రేంజ్ స్పీడ్ లో వెళ్తుంది కార్..! "
రేయ్ ఎందుకురా ఏదో పెద్ద పెంటైనట్టు అలా లాక్కొని వెళ్ళిపోతున్నారు.!
కొంచెం సేపు ఆగితే ఆ అమ్మాయితో పరిచయం పెంచుకుంటాను కదా.! అని అంటాడు మన అఖిల్
వినయ్ ఏంటి అక్కి పరిచయం పెంచుకుంటావా.!?
అసలు ఏమనుకుంటున్నావ్ రా నువ్వు..!?
పెళ్లి మండపంలో పెళ్లికూతురికి ఏదో ముద్దు పెట్టరా అని టాస్క్ ఇచ్చానే అనుకో..!
" నువ్వు వెళ్లి ఏం చేసావ్.? ఏకంగా డీప్గా లిప్ లాక్ పెట్టేసి.... మళ్ళీ ఇప్పుడు పరిచయం పెంచుకుంటాను అంటున్నావా.!? " వాళ్ళని చూసావా కడప రెడ్డిల్లా ఉన్నారు....
దొరికితే మేక పోతును వేసినట్టు నిన్ను కూడా ఒక్క వేటుకే వేసేస్తారు..! అని అంటాడు...
అభయ్ బావా జస్ట్ మిస్ లో పరలోకానికి పార్సిల్ అవ్వవలసిన నేను..! ఇలా భూమి మీద మిగిలిపోయాను..
చూసావు కదా నాకు చావు షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళింది...! అంటాడు.
అక్కి ఏంట్రా మీ వాగుడు... మనం ఎం అంత తక్కువ పర్సన్స్ ఎం కాదు..!
" మన బాబులు ఎవరో... మన బ్యాగ్రౌండ్ ఏంటో మర్చిపోయారా..!" అని అంటాడు...
వినయ్ రేయ్ అక్కి మనం చేసిందే తప్పు అంటే..! దానికి మన బాబులను మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావ్.!? అని అంటాడు...
అయినా ఈ విషయం తెలిస్తే ముందు మన వాళ్ళే చి అంటారు... చంపినా ఆశ్చర్యం లేద్దు రా...
బావా ఇది ఇంట్లో తెలిసిందనుకో ఎవరు ఎక్కువ..? లేదంటే బ్యాగ్రౌండ్ ఏంటి అని చూడరు. అంటాడు అభయ్
ముందు మన బాబులే మనకు బాగా పెడతారు..! అని అంటాడు....
అక్కి మాత్రం అసలు ఎం ఉంది రా బాబు పిల్ల...
ఆ లిప్స్ అయితే ఇంక చెర్రీస్ కి ఏ మాత్రం తీసిపోవు....
ఎంత క్యూట్ గా ఉంది...! నా డార్లింగ్... ఏంటో వాడు ఎలా ఉన్నడో చూసారా...
ముందు పొట్ట... వెనుక బట్ట.... డక్కూటా నాయాల అని తిడతాడు...
అభయ్ బావ.... వాళ్ళకి నచ్చినప్పుడు నీకేంట్రా ప్రాబ్లెమ్ అంటాడు....
వినయ్ పాపం ఎం కష్టం వచ్చిందో పిల్లకి అంటాడు...
అక్కి రేయ్ వినయ్...! తుప్పాస్ నాయాల మొత్తమ్ నీవల్లే వచ్చింది అంటాడు....
నేను ఏదో చెప్పి ఏడిస్తే నువ్వు కూడా నా వెనక్కి తోకలాగా చెప్పింది చేయాలా నువ్వు కరెక్ట్ గా ఉండాలి కదా రా అక్కి అంటాడు వినయ్....
యు ఇడియట్ ఇంట్లో తెలిస్తే ఏం చేస్తారో అని భయం గా ఉంది అంటాడు అభయ్...
అదంతే మీ ప్రాబ్లెమ్ నాకేం ఫరక్ పడదు అంటాడు వినయ్...
నీకు పడదు మా మావయ్యకి తెలిస్తే మాకు పడుద్ది...
వెధవ... అసలు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో... అంటాడు అభయ్.
ఏముంది నేను నచ్చి వాడిని చేసుకోను అని తనే చెప్తుంది ఖతం అంటాడు అక్కి....
ఉఫ్... ఫ్.. అవును నా రాజు వచ్చి నాకు ముద్దు పెట్టాడు.. నేను వాడివెంట వెళ్ళాలి అని వెనుక రెక్కల గుర్రం వెస్కొని వస్తుంది అంటాడు వినయ్...
అలా వాళ్ళు తిట్టుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తారు....
ఇక్కడ సీన్ కట్ చేస్తే...
4 డేస్ తర్వాత....
అభయ్ మొబైల్ రింగ్ అవుతుంది.... తను బద్ధకం గా లేచి కాల్ లిఫ్ చేసి చెప్పు డాడీ అంటాడు.....
ఆయన రేయ్ అడ్డ గాడిద ఇంకా లేవలేదా..!
ఇక్కడ మావయ్య మీరు ఇంక ఆఫీస్ కి రాలేదు... అని తిడుతున్నాడు.... త్వరగా రండి అని అంటాడు...
వస్తున్న డాడీ... నైట్ లేట్ అయ్యింది అందుకే అని సాగదీస్తూ... అంటాడు అభయ్..
మరి అఖిల్ ఎక్కడరా అంటారు ఆయన నా పక్క రూమ్ లోనే ఉన్నాడు... అంటాడు అభయ్...
అప్పుడే అభయ్ చేతిలో మొబైల్ లాక్కొని హేయ్ ఓల్డ్ మాన్ నీకేం పని లేదా అని ఒక అమ్మాయి మాట్లాడుతుంది...
ఆ వాయిస్ విన్న ఆయన షాక్ అయ్యి హేయ్ ఎవరే నువ్వు..!? అంటాడు....
అభయ్ ఒసేయ్..! అని తల కొట్టుకుంటాడు....
స్టోరీ ఎలా ఉందో చదివి ఒక కామెంట్ ఇవ్వండి.... అలాగే ఫాలో చేయండి....
అండ్ థాంక్స్ ఫర్ రీడింగ్ మై స్టోరీ....