Untainted Love Season - 1 in Telugu Love Stories by Abdul Sattar books and stories PDF | కల్మషం లేని ప్రేమ సీసన్ - 1

Featured Books
Categories
Share

కల్మషం లేని ప్రేమ సీసన్ - 1

ఇది కధ కాదు. అలాగని కల్పితం కుడా కాదు. కానీ ఒక నిర్దేశమైన పట్టణం లో నిజం జరిగిన సంఘటన ఆధారం గా రూపొడిందినదే. ఈ కల్మషం లేని ప్రేమ కధ.

మాది కడప జిల్లా లో అభిరుద్ది చెందిన పట్టణల లో ఒకటి మా ఊరు జమ్మలమడుగు. ( హీరో పేరు: అబ్దుల్ సత్తార్ ) దిల్ సత్తార్  గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో ( B.A. HEP గ్రూప్ లో 2 ఇయర్ చదువుతున్నా ఉంటాడు.) అబ్దుల్ సత్తార్ కి జమ్మలమడుగు లో sp జూనియర్ ఇంటర్ కాలేజీ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడి పేరు రామకృష్ణ. అంటే రామకృష్ణ అబ్దుల్ సత్తార్ కి మనీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఒకరోజు రామకృష్ణ అబ్దుల్ సత్తార్ కి కాల్ చేస్తాడు. అబ్దుల్ సత్తార్ ఆ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అబ్దుల్ సత్తార్ రామకృష్ణ ని జస్ట్ రామ అని పిలుస్తాడు. అలా ఆ విధంగా రామ కూడా అబ్దుల్ సత్తార్ ని జస్ట్ అబ్దుల్ అని పిలుస్తాడు. అంటే ఇద్దరు పిలుచుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. అని అలా పిలుచుకుంటారు. ఇద్దరు 

(అబ్దుల్ సత్తార్): హలో చెప్పు రా రామ కాల్ చేసేవు అని అబ్దుల్ సత్తార్ రామ ని అడుగుతాడు.

( రామకృష్ణ): ఏం లేదు రా నీకు నేను 5500 మనీ ఇవ్వాలి కధ రా ఇప్పుడు మనీ నా దగ్గర సెట్ అయ్యాయ్ రా మా కాలేజీ దగరికి వచ్చి నీకు నేను ఇవలిసిన మనీ ని తీసుకొని వెళ్లుద్దు రా రా నువ్వు అని రామకృష్ణ 

అబ్దుల్ సత్తార్ కి చెప్పుతాడు.

( అబ్దుల్ సత్తార్ ): హ వస్తాను రా రామ నాకు కూడా మనీ కొంచెం అవసరం ఉన్నాయి రా

అని అలా ఆ విధంగా అబ్దుల్ సత్తార్ sp జూనియర్ కాలేజీ లోకి వెళతాడు. Sp జూనియర్ కాలేజీ లో రామకృష్ణ చదివేది ( Bipc గ్రూప్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చదువుతు ఉంటాడు.

అలా అబ్దుల్ సత్తార్  bipc రూమ్ అనుకోని  పొరపాటున cec గ్రూప్ ఫస్ట్ ఇయర్ రూమ్ లోకి వెళతాడు. అక్కడే అబ్దుల్ సత్తార్ ఒక అమ్మాయి ని చూస్తాడు. అబ్దుల్ సత్తార్ ఆ అమ్మాయి ని చూసి చూడంగానే ఆ అమ్మాయి కి పడిపోతాడు. అలాగే లవ్ లో కూడా పడిపోతాడు.ఎప్పడు అబ్దుల్ సత్తార్ ఏ అమ్మాయి ని చూడనివాడు. అసలు అబ్దుల్ సత్తార్ ఏ అమ్మాయిని చూడనివాడు.అసలు అబ్దుల్ సత్తార్ అమ్మాయి లకే దూరం గా ఉండేవాడు. అలాంటిది అబ్దుల్ సత్తార్ ఆ అమ్మాయి ని అలాగే చూస్తూఉంటాడు. అప్పటికే అబ్దుల్ సత్తార్ ఆ అమ్మాయి ని చూసి చుండగానే పడిపోతాడు. దీనినే ఏమో లవ్ అండ్ ఫస్ట్ సైడ్ అని అంటారు. ఏమో అనేలా అబ్దుల్ సత్తార్ కి అని పించింది. కానీ అప్పటికి అబ్దుల్ సత్తార్ కి ఏదో కొడుతూ ఉంటుంది. ఎందుకంటే అబ్దుల్ సత్తార్ Bipc రూమ్ లో ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదే అని ఆలోచిస్తూ ఉంటాడు.ఈ అమ్మాయి అనే కాదు. అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. ఏంటి అని అబ్దుల్ సత్తార్ ఆలోచిస్తూ ఉంటాడు.కానీ అబ్దుల్ సత్తార్ ఆ అమ్మాయి ని అలానే చూస్తూ ఉంటాడు. ఇంత లో క్లాస్ రూమ్ లో ఉన్న సార్ పేరు రమణ రెడ్డి సార్ అబ్దుల్ సత్తార్ ని చూసి 

( రమణ రెడ్డి): బాబు ఎవరు బాబు నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు. నిన్ను ఈ కాలేజీ లో ఎప్పుడు చూడలేదు. నువ్వు ఈ కాలేజీ లో చేరడానికి వచ్చావా

అని రమణ రెడ్డి సార్ అబ్దుల్ సత్తార్ ని అడుగుతాడు.

(అబ్దుల్ సత్తార్): లేదు సార్ మా ఫ్రెండ్ తో మాట్లాడటానికి వచ్చాను. వాడితో కొంచెం పని ఉంటే 

(రమణ రెడ్డి ): ఇంతకీ ఎవరు బాబు నీ ఫ్రెండ్ ఇంతకీ వాడి పేరు ఏంటో చెప్పు 

అని రమణ రెడ్డి అబ్దుల్ సత్తార్ ని అడుగుతాడు.

(అబ్దుల్ సత్తార్): సార్ వాడి పేరు రామకృష్ణ సార్ 

అని అబ్దుల్ సత్తార్ రమణ రెడ్డి తో చెప్పుతాడు.

(రమణ రెడ్డి): రామకృష్ణ న ఈ పేరు తో ఈ కాలేజీ లో చాలా మంది ఉన్నారు. ఇంతకీ మీ ఫ్రెండ్ ఏ గ్రూప్ చెప్పు 

అని రమణ రెడ్డి అబ్దుల్ సత్తార్ ని అడుగుతాడు.

(అబ్దుల్ సత్తార్ ): సార్ మా ఫ్రెండ్ bipc గ్రూప్ సార్ 

అని అబ్దుల్ సత్తార్ రమణ రెడ్డి తో చెప్పుతాడు.

(రమణ రెడ్డి): ఏంటి bipc గ్రూప్ లో ని రామకృష్ణ నీ ఫ్రెండ్ నా మంచోడి తో ఫ్రెండ్షిప్ చేసేవు నువ్వు.

ఈ కాలేజీ లో వాడి అంత చిల్లర గాడు ఎవరు లేరు.

(అబ్దుల్ సత్తార్): ఏం సార్ అంత మాట అన్నారు. ఇంతకీ అంతగా ఏం చేసేడు సార్ వాడు.

అని అబ్దుల్ సత్తార్ రమణ సార్ ని అడుగుతాడు ఇంతటితో కల్మషం లేని ప్రేమ  ఎపిసోడ్ 1 ముగిసింది.

అబ్దుల్ సత్తార్ కి రమణ రెడ్డి సార్ రామకృష్ణ గురించి ఏం చెప్పేరో అలాగే అబ్దుల్ సత్తార్ కి రమణ రెడ్డి సార్ కి మధ్య తరువాత జరిగే సంభాషణ గురించి తెలుసు కోవాలనుకుంటే 

 కల్మషం లేని ప్రేమ  సీసన్ 1 లో ఎపిసోడ్ 2 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

 కొనసాగుతుంది.