Naa Nuvvey - 1 in Telugu Love Stories by Vijayalaxmi Velamala books and stories PDF | నా నువ్వే - 1

Featured Books
Categories
Share

నా నువ్వే - 1

కీర్తి... త్వరగా లేవవే! ఎంతసేపు పడుకుంటావ్? క్లాస్‌కి టైమ్ అవుతుంది...

“రాత్రి రెండు వరకు ఫోన్ చూడడం... పొద్దున ఏమో దున్నపోతులా పడుకోవడం... రోజూ ఇదే పని నీకు!” అని ప్రియ కీర్తిని లేపడానికి ప్రయత్నిస్తుంది.

“ప్లీజ్ బంగారం... ఇంకో టెన్ మినిట్స్ పడుకుంటా...” అని నిద్రమత్తులో అంటుంది కీర్తి.

“అయినా తమరికి ఈరోజు ఏ క్లాస్ ఉందో గుర్తులేదా?” అని ప్రియ అనగానే...

“ఏ క్లాస్ ఉంది బంగారం?” అని కీర్తి అడుగుతుంది.

“విరాట్ సార్ క్లాస్ ఉంది బంగారం...” అని ప్రియ వెటకారంగా సమాధానం చెప్తుంది.

అంతే...

రెప్పపాటు క్షణంలో కీర్తి లేచి వాష్‌రూమ్‌కి పరుగెత్తుతుంది.

అది చూసి ప్రియ నవ్వుకుంటూ...

“తిక్క కుదిరింది!” అని అనుకునేలోపే...

కీర్తి బయటికి రావడం చూసి ప్రియ షాక్ అవుతుంది.

“అదేంటే! అంత వేగంగా మెరుపుతీగలా ఇలా వెళ్లి అలా ఎలా వచ్చావ్?” అని నవ్వుతూ అడుగుతుంది ప్రియ.

“అయినా ఆ సైకో సార్ క్లాస్ ఉందని ముందే ఎందుకు చెప్పలేదు?” అని కీర్తి అడుగుతుంది.

“తమరికి టైమ్‌టేబుల్ చూసే అలవాటు లేదు కదా... మరి నీకు ఎలా తెలుస్తుంది లే!” అని ప్రియ అంటుంది.

“సర్లే... పద. క్లాస్‌కి టైమ్ అవుతుంది.”

అంటూ కీర్తి, ప్రియ ఇద్దరూ ఫాస్ట్‌గా నడుచుకుంటూ క్లాస్‌కి వెళ్లిపోయారు.

@@@@@@@@@@

ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్

“ప్రియ... నాకు చాలా ఆకలిగా ఉంది. పద క్యాంటీన్‌కి వెళ్లి ఏమైనా తిని వద్దాం,” అని కీర్తి అడుగుతుంది.

“ఒసేయ్ మెంటల్! ఇంకా ఫైవ్ మినిట్స్ ఏ టైమ్ ఉంది. విరాట్ సార్ టైమ్‌కి వస్తారు. మళ్లీ క్లాస్‌కి లేట్ అయితే క్లాస్ బయట నిల్చుంటాం. బ్రేక్ టైమ్‌లో వచ్చి తిందాం లే,” అని ప్రియ అంటుంది.

“హ్మ్మ్... సర్లే. అసలకే ఆ సైకో సార్ క్లాస్ కదా... రిస్క్ చేయడం కష్టం. ఇంకేం చేస్తాం... వెళ్లిపోవడమే బెటర్,” అని కీర్తి అనబోతుండగా...

“ఆ సార్ పేరు విరాట్ సార్... సైకో సార్ కాదు,” అని ప్రియ అంటుంది.

“మీకు విరాట్ సార్ ఏమో కానీ... నాకు మాత్రం సైకో సార్ ఏ!” అని కీర్తి కోపంగా అంటుంది.

“అసలు ఆ సార్‌తో నీకు ప్రాబ్లం ఏంటే?” అని ప్రియ అడుగుతుంది.

ఈలోపు వాళ్లు క్లాస్‌లోకి రావడంతో...

“ఈ టాపిక్ ఇంకా వదిలేయ్,” అని నీరసంగా అంటుంది కీర్తి.

టైమ్ సరిగ్గా తొమ్మిది కావడంతో... క్లాస్‌లోకి మిస్టర్ పర్ఫెక్ట్‌లా ఎంట్రీ ఇచ్చాడు విరాట్ సార్.

అతన్ని చూడగానే అందరూ లేచి నిల్చుని...

“గుడ్ మార్నింగ్ సార్!” అని విష్ చేశారు.

కీర్తి మాత్రం కూర్చొని ఉండడం చూసి...

“ఒసేయ్... లేవవే!” అని ప్రియ కీర్తిని లేపుతుంది.

వైట్ షర్ట్‌లో, ఫెయిర్ స్కిన్‌తో జెంటిల్‌మ్యాన్‌లా కనిపించే విరాట్ సార్‌ని చూసి చాలామంది అమ్మాయిలు ఫ్లాట్ అయిపోయారు.

కానీ సార్ అంటే ప్రతి ఒక్కరికీ చాలా భయం.

చిన్న తప్పును కూడా వదిలిపెట్టరు.

అందుకే అందరూ సార్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు.

క్లాస్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అందరూ విరాట్ చెప్పే పాఠంలో లీనమైపోయారు.

విరాట్ ఏదైనా టాపిక్ చెప్తే... డైరెక్ట్‌గా స్టూడెంట్స్ బ్రెయిన్‌లోకి వెళ్లిపోయేంత బాగా చెప్తాడు.

ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్‌గా ఉంటాడు.

అందుకే అందరూ అతన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అని అంటారు.

అందరూ శ్రద్ధగా క్లాస్ వింటుంటే...

కీర్తికి మాత్రం కళ్ళు నెమ్మదిగా మూతపడుతున్నాయి.

“అమ్మో... ఇప్పుడు ఎలాగైనా ఈ నిద్రని కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఈ సైకో చేతిలో నా పని అయిపోద్ది.

కీర్తి... ఎలాగైనా కంట్రోల్ చేసుకోవే ప్లీజ్...” అని తనని తానే రిక్వెస్ట్ చేసుకుంటుంది.

కానీ ఇంకా తన వల్ల అవ్వకపోయేసరికి... తన ముందు ఉన్న అమ్మాయిని కొంచెం జరగమని చెప్పి, ఆ అమ్మాయి వెనకాల పడుకోవడానికి ప్రయత్నిస్తుంది.

తను అలా బెంచ్‌పై వాలడం చూసిన ప్రియ...

“ఒసేయ్! ఏం చేస్తున్నావే? దొరికిపోతావే సార్‌కి! లేవవే!” అని అంటుంది.

“రాత్రి పడుకునేసరికి మూడు అయిందే... నిద్ర వస్తుంది. నా వల్ల కావట్లేదు. ఒక్క ఫైవ్ మినిట్స్ పడుకుంటా...” అని చెప్పి నిద్రలోకి జారుకుంటుంది కీర్తి.

“నీ కర్మ...” అని అనుకుని ప్రియ క్లాస్ వింటుంది.

ఒక ఐదు నిమిషాల తర్వాత కీర్తిని లేపడానికి ట్రై చేసినా... కీర్తి లేవకపోవడంతో చేసేది ఏం లేక ప్రియ వదిలేస్తుంది.

క్లాస్ చెప్తున్న విరాట్‌కి బ్యాక్ బెంచ్‌లో ఎవరో పడుకున్నట్టు కనిపిస్తుంది.

వెంటనే ఆ బెంచ్ దగ్గరికి వెళ్లి చూస్తాడు.

పక్కనే ప్రియ ఉండడంతో... పడుకున్నది కీర్తి అని అర్థమవుతుంది విరాట్‌కి.

“తనని లేపు,” అని ప్రియకి చెప్పడంతో...

“కీర్తి... లే...” అని భయంగా లేపుతుంది ప్రియ.

“ఇంకొంచెం సేపు పడుకుంటా బంగారం...” అని నిద్రమత్తులో అంటుంది కీర్తి.

“నీ నిద్ర పూర్తయితే క్లాస్ నుంచి బయటికి వెళ్ళు.”

ఆ వాయిస్ కీర్తికి వినిపించడంతో...

వెంటనే లేచి చూసేసరికి అక్కడ విరాట్ ఉంటాడు.

అంతే...

కీర్తికి నిద్రమత్తు మొత్తం వదిలిపోతుంది.

“బయటికి పో!” అని విరాట్ గట్టిగా అరిచేసరికి... క్లాస్‌లో అందరి ముందు అవమానంగా ఫీల్ అయ్యి బయటికి వెళ్లిపోతుంది కీర్తి.

మళ్లీ విరాట్ తన క్లాస్ కంటిన్యూ చేస్తాడు.

కానీ బయట కీర్తి మాత్రం తనని తాను తిట్టుకోవడంలో బిజీగా ఉంది.

“ఛ... ఎప్పుడూ ఈ సైకో చేతిలోనే నేను బలి అవుతా! నా కర్మ! క్లాస్‌లో అందరి ముందు అరిచాడు. అయినా నిద్ర వస్తే పడుకోకుండా ఆడుకుంటారా... హ్మ్మ్... ఏం చేస్తాం లే!”

అని తనలో తానే మాట్లాడుకుంటూ... క్లాస్ చెప్తున్న విరాట్ వైపు చూసి మనసులో...

“రాక్షసుడు!” అని తిట్టుకుంది.

కొద్దిసేపటికి క్లాస్ అయిపోతుంది.

విరాట్ అటెండెన్స్ తీసుకుంటాడు.

కీర్తికి మాత్రం ఆబ్సెంట్ అని వేస్తాడు.

అది చూసిన కీర్తి విరాట్ దగ్గరికి వెళ్లి...

“సార్... నా అటెండెన్స్...” అని అడుగుతుంది.

“నువ్వు నా క్లాస్‌లో ఉన్నావా?” అని విరాట్ అడుగుతాడు.

ఇంకా రిక్వెస్ట్ చేసినా లాభం లేదని కీర్తికి అర్థమవుతుంది.

మనసులో తిట్టుకుంటూనే...

“ఓకే సార్,” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

విరాట్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

“ఒసేయ్ మెంటల్... సార్ గురించి తెలిసి కూడా అతని క్లాస్‌లో పడుకున్నావ్ అంటే నీ గురించి నేను ఏం అనుకోవాలే?” అని కీర్తి పక్కకు వచ్చి ప్రియ అంటుంది.

“ఏమీ అనుకోవద్దు.

అయినా నేను జస్ట్ పడుకున్నదానికి క్లాస్‌లో అందరి ముందు అరిచాడు... బయటికి పంపించాడు... అటెండెన్స్ కూడా వేయలేదు.

అందుకే నేను సైకో అంటాను,” అని ప్రియతో చెప్తూ ముందుకు చూస్తూ నడవకుండా వెళ్లిన కీర్తి... ఒక అబ్బాయికి గుద్దుకుంది.

తను బ్యాలెన్స్ తప్పి కింద పడబోతుంటే...

ఆ అబ్బాయి తన చేతితో కీర్తిని పట్టుకుని లాగుతాడు.

కీర్తి సన్నగా ఉండడంతో... ఆ అబ్బాయి లాగిన ఫోర్స్‌కి అతని భుజం మీద పడుతుంది.

ఇదంతా చూస్తున్న ప్రియ ఆశ్చర్యంతో నోరు తెరిచి అలానే ఉండిపోతుంది.

“కళ్ళు నెత్తిమీద పెట్టుకొని నడుస్తున్నావా...?” అనే వాయిస్ కీర్తికి వినిపిస్తుంది.

“ఏయ్! నువ్వు నీ కళ్ళు మోకాళ్లలో పెట్టుకొని నడుస్తున్నావా?” అని ఆ అబ్బాయి వైపు చూసి ఆ మాట సగంలోనే ఆపేసింది.

“వి... వి... విరాట్ సార్...!”

అతన్ని చూసిన కీర్తికి... తను అన్న మాట గుర్తొచ్చింది.

ఇంకా ప్రియతో మాట్లాడుతూ ముందుకు చూడకుండా నడుస్తున్నానన్న విషయం కూడా గుర్తురావడంతో...

“అయిపోయావే కీర్తి... మళ్లీ ఏం అంటాడో ఏంటో...” అని మనసులో అనుకుని...

“సారీ సార్...” అని విరాట్‌కి సారీ చెప్తుంది.

“ఇంకోసారి నువ్వు నడిచేటప్పుడు ఎవరితో అయినా మాట్లాడుతూ కనిపిస్తే... అప్పుడు చెప్తా నీ పని,” అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు విరాట్.

“అయినా ప్రతి సారి ఈ సైకోకి ఇలా దొరుకుతా ఏంటే?” అని ప్రియ వైపు చూసి అంటుంది కీర్తి.

“తమరు చేసే పనులు అలా ఉంటాయి మరి,” అని ప్రియ నవ్వుతూ అంటుంది.

కీర్తి ప్రియ వైపు కోపంగా చూస్తుంది.

ఈలోపు వెనక నుంచి ఒక అమ్మాయి...

“కీర్తి...” అని కీర్తిని పిలుస్తుంది.

ఎవరా అని వెనక్కి తిరిగి చూసేసరికి... కీర్తి చేతిలో ఒక లెటర్ పెడుతుంది భవ్య.

“భవ్య... ఏంటే ఈ లెటర్?” అని కీర్తి అడగడంతో...

“ప్లీజ్ కీర్తి... నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి,” అని భవ్య కీర్తిని అడుగుతుంది.

“అసలు ఈ లెటర్ ఏంటి? నేనేం హెల్ప్ చెయ్యాలి నీకు?” అని కీర్తి ఆశ్చర్యంగా అడుగుతుంది.

“ఈ లెటర్ నువ్వు విరాట్ సార్‌కి ఇవ్వాలి,” అని భవ్య అనడంతో...

“ఏంటి? నేను ఇవ్వాలా? అసలు ఏంటి ఈ లెటర్? ఏముంది ఈ లెటర్‌లో? నేను ఎందుకు ఇవ్వాలి?” అని వరుసగా ప్రశ్నలు వేస్తుంది కీర్తి.

“ఇది లవ్ లెటర్,” అని కీర్తి ప్రశ్నలకు చెక్ పెడుతూ చెప్పింది భవ్య.

భవ్య అలా చెప్పడంతో కీర్తి, ప్రియ ఇద్దరూ షాక్ అయ్యారు.

“ఏంటి? లవ్ లెటరా...?”

“అవును. విరాట్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. సార్‌కి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వే నాకు హెల్ప్ చెయ్యాలి,” అని భవ్య అడగడంతో...

“నేనేం హెల్ప్ చెయ్యాలి?” అని కీర్తి అడుగుతుంది.

“సార్ ఎవరితో మాట్లాడారు? నీ ఒక్కదానితో తప్ప...” అని భవ్య అనడంతో...

“హలో పాపా... ఆగు! నాతో ఎప్పుడూ మాట్లాడారు ఆయన?” అని అడిగింది కీర్తి.

“అంటే... నిన్ను ఎప్పుడూ తిడతారు కదా... దాన్ని మాట్లాడడం అంటారు మీ ఊరిలో?” అని వెటకారంగా అంటుంది కీర్తి.

“నీతో అలా అయినా మాట్లాడతారు కదా!” అని భవ్య అనడంతో...

ప్రియ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతుంది.

కీర్తి భవ్యకి హెల్ప్ చేస్తుందా?

ఆ లెటర్ విరాట్ సార్‌కి ఇస్తుందా?

               


                    కొనసాగుతుంది...❤️