our country.. is very special to the world books and stories free download online pdf in Telugu

మన దేశం...ప్రపంచనికి ప్రత్యేకం - మన దేశం.... ప్రపంచానికి ప్రత్యేకం

కమలపుష్పములున్న కొలనుయందున్ననూ
కప్పలకు దెలుయూనా వాని విలువ
గుర్తించు దరిజేరు తుమ్మెదల వలె ఇపుడె
వేగిరమె మేలుకో బ్రహ్మపుత్రా నీవు

ప్రపంచానికి అక్షయ పాత్రలా కనిపించే మన దేశం మన వారికి మాత్రం భిక్షాపాత్రలా కనిపిస్తోంది.ఎన్నెన్నో బహుళ జాతి వాణీజ్య సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఎగురుకుంటూ వస్తుంటే మన వారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలుకంటుంటారు.ఇది విచిత్రమైన విషయం. మొత్తం ప్రపంచం మనని చూస్తుంటే మనం మాత్రం సూన్యంలోకి చూస్తూ కాలాన్ని వృధాగా గడుపుతున్నాం.నిజంగా మనకు ఏమీ తెలియదని మన వారి గట్టి నమ్మకం... ప్రగాఢ విశ్వాసం
నిజానికి మన పూర్వీకుడైన ఆర్యభట్టారకుడు సున్నాని కనిపెట్టకపోతే ప్రస్తుత ప్రపంచ ప్రగతి సూన్యమని మనలో ఎంతమందికి తెలుసు... మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసిన శుశృషుడు మవ వాడని మనలో ఎంతమందికి తెలుసు...మన నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలతో పరస్పర నిందారోపణలతో కాలం గడుపుతుంటారు... మన అభినేతలు ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతుంటారు.వీళ్ళ అభిమానులు వాళ్ళ వాళ్ళ నాయకుల గొప్పతనాన్ని ప్రచారం చేసుకోవటంలో నిమగ్నమై ఉంటారు
అవసరమనుకున్న వారికి చందాలిస్తారు..అడుగడుగునా ఆక్రమించి దందాలు చేస్తారు.వీళ్ళు మారతారు అనుకున్న వారిని వెర్రి వెంగళప్పల్ని చేసి తక్కెడలో కప్పల్లా అటూ ఇటూ దూకుతుంటారు
మన దేశం ఎంత వైవిధ్యమైనదంటే చీకటి వెలుగులనూ వినోద విషాదాలనూ ఒకే చోట చూడవచ్చు..ఈ దేశంలో రోజురోజుకీ ఆకలి కేకలు కరువు మరణాలు పెరిగిపోతున్నాయని వింటున్నాం.కానీ ఇక్కడ విందు వినోదాల వేడుకలకోసం మనలో చాలామంది చేసే దూబరా ఖర్చుతో చాలా కుటుంబాలు కొంతకాలం హాయిగా బ్రతకవచ్చని గుర్తించలేకపోతున్నాం
నిత్యం రద్దీగా ఉండే రహదారుల్లోకూడా కటిక నేలపై పడుకుని పొత్తిళ్ళలో పసిపాపల్లా నిద్రించే కష్టజీవులు ఎంతో మంది వున్నారు.మరోవైపు చలువరాతి మందిరాల్లో శీతల యఃత్రాలు బిగించిన గదుల్లో మెత్తటి పరుపులపై పీతల్లా పడుకుని రకరకాల దుష్ఠ ఆలోచనలతో నిద్ర పట్టక బురదలో పొర్లే పందుల్లా దొర్లుతుంటారు
   కొందరు తాము బ్రతకటంకోసం దాడులకూ దోపిడీలకూ హత్యలకూ పాల్పడుతుంటారు...ఇంకొందరు పవిత్రమైన ప్రేమ పేరుతో పైశాచిక అకృత్యాలకు పాల్పడుతుంటారు
మన దేశం లో పాఠశాలలే లేని ఊళ్ళు అనేకం ఉంటే... విద్యనే వ్యాపారంగా మార్చుకున్న సంస్థలుకొన్ని ఉన్నాయి.అక్కడ శిక్షణ పేరుతో పెట్టే ఒత్తిడి తాళలేక ఎంతోమంది విద్యార్ధినీ విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు
ముఖ్యంగా లైంగిక వేధింపులూ.. లింగ వివక్ష నేడు అన్ని రంగాల్లో విస్త్రుతంగా విస్తరిస్తోంది.నేడు వస్తున్న చలనచిత్రాలు ఇందుకు ఇతోధికంగా దోహదం చేస్తున్నాయి
   మేధావులుగా మనోవైజ్ఞానికులుగా చెప్పుకునేవారు గ్రంధాలు వ్రాస్తూ చర్చోపచర్చలు చేస్తూ వాటి పేరున జరిగే సన్మానాల్లో బిరుదులు అందుకుని భుజకీర్తులు తగిలించుకోవటంలో తీరికలేకుండా ఉన్నారు
మనవాళ్ళు బీజాన్ని ఎప్పుడో వదిలేశారు..కొమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారు. కొమ్మ విరిగి క్రింద పడ్డా 
నేల  మా క్రిందే ఉందని సమర్ధించుకుంటుంటారు.
ఇంగిత జ్ఞానాన్నీ విచక్షణా శక్తినీ గాలికొదిలేసి..భ్రమల్లో పరిభ్రమిస్తుంటారు.వేళ్ళులేని చెట్టుకి ఎన్ని కొమ్మలున్నా ఏం ప్రయోజనం... పునాదిలేని భవంతికి ఎన్ని అంతస్తులున్నా ఏం ప్రయోజనం
పిడిలేని కత్తి మొనలేని సూది బంగారంవే అయినా ఏం ఉపయోగం.అటువంటి పిడిలేని కత్తిని ఒరలో ఉంచడం ఎందుకు ... అలాంటి మొన లేని సూదికి దారం ఎక్కించటమెందుకు?
ముళ్ళ చెట్టైనా పళ్ళచెట్టైనా నేలను చీల్చుకుని మొలుస్తుంది.కాబట్టి ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చామన్నది ప్రధానం కాదు వచ్చి ఏం చేశామన్నదే ముఖ్యం
తిండి తింటే కుడిచేతినైనా సరే కడుక్కోవాలి..
అలాగే ఘన కీర్తినైనా అపకీర్తినైనా సరే ఇక్కడే వదిలి వెళ్ళిపోవాలి... ఈ వాస్తవాలు మరచిన కొందరు అజ్ఞాన అంధకారంలో సిగ్గు అనే రగ్గుకప్పుకుని నిర్లక్ష్యపు నిద్రలో మగ్గుతున్నారు
ఒకప్పుడు ఈ భూమ్మీద దేవతలుండేవారు.అది మనమే అంటే నమ్మరు పైగా వంకరగా చూసి వెకిలిగా నవ్వుతారు
ఎగతాలి చేస్తారు...పరమాత్మ అవతరించారు అని అంటే  ఇప్పుడే ఎందుకొచ్చారు.. ఇక్కడికే ఎందుకొచ్చారు అని సవాలక్ష యక్ష్య ప్రశ్నలు వేస్తారు.పాత ప్రపంచానికి రోజులు దగ్గర పడ్డాయంటే నకారాత్మక ఆలోచనలంటారు... సుఖ ప్రపంచం రాబోతోందంటే సుఖ దుఃఖాల కలయకే జీవితం అని మెట్ట వేదాంతం వల్లెపాప  వేస్తుంటారు...కొందరు గుళ్ళ చుట్టూ తిరుగుతుంటారు.. 
పాప ప్రక్షాళనకోసమని స్నానాలు చేస్తారు.నదులను కలుషితం చేసి వస్తారు.అదనపు సంపాదన కోసం ఆరాటపడి చేరరాని పనులన్నీ చేసి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు
అధర్మాన్ని అంతం చేయడానికి పరమాత్మ ప్రతీ యూగంలో ఐవతరిస్తారని శాస్త్రాల్లో వ్రాసి వుంది
కానీ అవినీతిని ఆశ్రయించిన ఈ అధర్మ పరాయణులు మాత్రం అనుక్షణం అవతరిస్తుంటారు...ఇలాంటి లంచావతారులు మన దేశం లో అడుగడుగునా అన్ని రంగాల్లో ఉన్నారు.. ఉత్ర దక్షిణ ధృవాలకు పరస్పరం ఆకర్షించుకునే గుణం వుంది.అలాగే ఈ చిల్లర రాయుళ్ళకు కూడా ఈ ఉపద్రవాలకు లొంగిపోయే అవగుణం ఉంది
ఇలాంటివారి వల్లనే ఒకనాడు నాలుగు పాదాల మీద నడయాడిన ధర్మం  నేడు అవినీతి నిరోధక వారి వాహనాల్లో సంచరిస్తోంది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తోంది
"ధర్మో రక్షతి రక్షితః"సత్యమేవ జయతే...ఇలాంటి ఎన్నో మహోన్నత సూక్తులను ఆచరించి ప్రపంచానికి అందించిన మన దేశానికా ఈ దుస్థితి..ఇది ఎంతగానో శోచనీయం
అంతం దగ్గరకు వచ్చినప్పుడు అతి తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే! .. ఇవి ముగింపు వాక్యాలు కావు... సుఖమయ పావన ప్రపంచ శుభారంభానికి ప్రారంభ వచనాలు...అనివార్యమైన ప్రయాణానికి ముహూర్తం ఎప్పుడన్నది అప్రస్తుతం
ఇప్పటినుండే సిద్ధమవటం సముచితం.అంతులేని అంతరిక్ష సంగతి పక్కన పెట్టి అంతరాళం లోని బలహీనతలు తొలగించుకోవడం సమయోచితం
ధన ఖజానాలతోపాటు.. పుణ్య ఆ శ్శీర్వాదాల ఖాతాలు జమ చేసుకోవటం అవసరం. విశ్వ సేవే ఇందుకు ఏకైక మార్గం.... స్వయంగా పరమ శిక్షకులు పరమ రక్షకులు సర్వుల సద్గురువు అయిన పరమాత్మచే స్థాపించబడి వారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా దినదిన ప్రవర్ధమానమౌతున్న ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఈ దిశగా అందరినీ సాదరంగా స్వాగతిస్తోంది
స్వ పరివర్తనే విశ్వ పరివర్తన.ఇక ఆలస్యం దేనికి రండి.. తరించండి... సర్వేజనా సుఖినోభవంతు... సర్వే భద్రాని పశ్యంతు... సమస్త సన్మంగళాని సంతు...ఓంశాంతి...ఓంశాంతి...ఓంశాంతి