Neenu..Naadi.. - 1 books and stories free download online pdf in Telugu

నేను.. నాది.. - 1

నేను.. నాది..

- బివిడి ప్రసాదరావు 

 సుకన్య..

 నల్లగా ఉంటుంది. లావుగా ఉంటుంది. యుక్త వయసుది కనుక.. నిగనిగ లాడుతుంటుంది. 

 తన చదువు.. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం.

 నా చదువు.. పదో తరగతి.

 ఇద్దరం.. ఎదురెదురు ఇళ్ల వాళ్లం.

 ఇద్దరం.. పక్క పక్కగా నడుస్తున్నాం.

 శివరాత్రి జాగరణ.. అంటూ.. మెల్కొని ఉన్నాం.

 'ఒక టిక్కెట్టుతో రెండు సినిమాలు' అంటే.. వెళ్తున్నాం.

 "సుకన్యా.." పిలుస్తోంది తన తల్లి.  

 సుకన్య ఆగి.. అటు చూసింది.

 నేనూ.. సుకన్యతో పాటు నిలిచి పోయాను.

 మా వెనుక.. సుకన్య అమ్మ.. మా అమ్మ.. వస్తున్నారు.

 "నెమ్మదిగా నడవండి.." సుకన్య తల్లి చెప్పింది.

 "మీతో మేము నడవ లేక పోతున్నాం" అమ్మ అంది నవ్వుతూ.

 ఇక తప్పక.. అందరమూ కలిసి నడిచాం.

 సినిమా హాలులోకి చేరుకున్నాం.

 మా అమ్మలు.. మా ముందు కుర్చీల్లో.. 

 నేను.. సుకన్య.. సరిగ్గా వాళ్ల వెనుక కుర్చీల్లో..

 కూర్చున్నాం.

 సుకన్యే.. పక్క పక్క సీట్లు కావాలని.. మమ్మల్ని అలా సర్దింది.

 మొదటి సినిమా మొదలైంది.

 లవ్ సాంగ్ అవుతుంది.

 సుకన్య.. సడన్ గా.. తన కుడి చేతితో.. నా ఎడమ చేతిని.. తన కుడి తొడ మీదికి లాగి.. పట్టుకుంది.

 నాకు కొత్తగా.. చక్కగా.. అనిపిస్తుంది.

 ఆమెని చూశాను.

 సుకన్య నవ్వుతుంది.

 "సినిమా చూస్తుండు.." మెల్లిగా చెప్పింది.

 నేను సినిమా వైపు తల తిప్పేశాను.

 సినిమాలో.. దయ్యం భయపెడుతుంది.

 సుకన్య.. నా ఎడమ చేతిని మరింత గట్టిగా నొక్కుతుంది.

 నేను ఓర్చుకోలేక.. సుకన్య వైపు చూస్తున్నాను.

 "దయ్యం అంటే భయం.." గుసగుసగా చెప్పింది.

 నాకూ భయమే. కానీ నేను చెప్పలేదు. 

 పైగా.. "నాకు భయం లేదు" అనేశాను పెంకిలా.

 "నువ్వు హీరోవి. అందుకే నువ్వు నాకు ఇష్టం." సుకన్య చెప్పింది మళ్ళీ గుసగుసగా.

 నేను ఒక్కమారుగా పొంగిపోయాను.

 "సినిమా వైపు చూస్తుండు.." గొణిగింది సుకన్య.

 నేను అటు తల తిప్పేశాను.

 సుకన్య.. నా చేతిని వదలడం లేదు..

 మొదటి సినిమా ఐపోయింది. 

 విరామంగా లైట్లు వెలుగుతున్నాయి.

 సుకన్య నా చేతిని వదిలేసింది.

 అంతలోనే.. లేచి.. మా ఇద్దరి సీట్లు మార్చింది.

 ఇప్పుడు.. నేను.. ఆమె.. అటు.. ఇటు.. కుర్చీలు మారి.. కూర్చున్నాం.

 "నా సీటు కిర్రు కిర్రు లాడుతుంది. నేను నీలా బిగుసుకుపోయి కూర్చోలేను." సుకన్యే చెప్పింది.. నవ్వింది.

 "దీనికి కుదురు లేదు" సుకన్య అమ్మ అంది.

 తర్వాత.. రెండవ సినిమా మొదలైంది.

 తర్వాత.. చటుక్కున.. సుకన్య.. నా ఎడమ అర చేతిని పట్టి.. దాని మీద.. 

తన ఓణీ పైటుని కప్పింది.

 "ఎందుకు" గొణిగాను.

 సుకన్య ఏమీ చెప్పలేదు. 

 కానీ.. "మాట్లాడకు.." చెప్పింది మెల్లిగా.

 తర్వాతి ఆమె పనులన్నీ.. నాకు వెచ్చగా.. చక్కగా అనిపిస్తున్నాయి.

 సినిమా ఐ పోతుందనగా.. సుకన్య.. నా చేతిని చటుక్కున వదిలేసింది.

 సినిమా ఐపోయింది.

 హాలులో లైట్లు వెలుగుతున్నాయి.

 సుకన్య లేచి నిల్చుంది.

 నేనూ లేచి నిల్చుండిపోయాను.

 సుకన్య.. నన్ను చూసి నవ్వింది.

 నేనూ నవ్వేసి.. కదిలాను.

 కొద్ది రోజుల తర్వాత..

 సుకన్య.. "అమ్మ రమ్మంటుంది ఆంటీ" అంది మా అమ్మతో.

 "మేము బజారుకి వెళ్తున్నాం. ఆకలి వేస్తే అన్నం పెట్టుకో" అమ్మ నాకు చెప్పింది. 

 సుకన్య ఇంటి వైపు కదిలింది.

 అమ్మతోనే సుకన్య కూడా వెళ్లి పోయింది.

 తర్వాత.. పావు గంట గడిచేక.. తిరిగి మా ఇంటికి సుకన్య వచ్చింది.

 నేను వరండాలోనే ఉన్నాను. 

 మా ఇంటి వీథి గుమ్మం తలుపు మూసి.. గడియ పెట్టింది సుకన్య.

 "నువ్వు వెళ్లలే" అడిగాను తికమక పడుతూ.

 సుకన్య ఏమీ చెప్పక.. నా కుడి చేతిని పట్టుకొని.. నేరుగా నన్ను గది లోకి లాక్కొని వచ్చేసింది.

 తన చేతి లోని తాళం కీని నాకు ఇస్తూ..  "మా ఇంటిది. ఆ బల్ల మీద పెట్టు" చెప్పింది.

 నేను అలాగే చేశాను.

 సుకన్య.. తన ఓణీ వెనుక నించి.. తన పొట్ట వైపు నించి.. తన లంగా పై వైపు లోనించి.. ఒక విసిడి కేసెట్ ని తీసింది. 

 దానిని.. మా విసిడి ప్లేయర్ లో సెట్ చేసి.. టివి వేసింది.

 "ఏ సినిమా" అడిగాను.

 సుకన్య ఏమీ చెప్పలేదు.

 టివిలో బొమ్మ వస్తూ వస్తూ.. సడన్ గా మారింది చూసి.. సుకన్య వైపు చూశాను.

 "అటు చూడు.. మా అమ్మ నాన్న.. రాత్రి చూశారు.. నేను తలుపుల సందులోంచి చాటుగా చూశాను.. నీతో కలిసి మళ్లీ చూడాలనుకున్నాను.  వీలు చిక్కింది కనుక తెచ్చాను. చూడు.. చూడు"  అంది సుకన్య.

 ఆ వెంటనే.. తను మంచం మీద కూర్చుంటూ.. "రారా.. ఇలా నా పక్కన కూర్చో" చెప్పింది.

 నేనూ అలానే చేసేశాను.

 టివి వంక చూస్తున్నాను.

 ఆ ఆడ.. ఆ మగ.. ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు.

 "ఇంగ్లీష్ సినిమా" అడిగాను.

 "నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూశావా" సుకన్య చటుక్కున అడిగింది.

 "ఒక్కసారి. మా ఫ్రెండ్స్ తో.. సినిమా హాలులో.. అదీ భయం భయంగా.. 

ఇంట్లో చెప్పక" చెప్పాను గడబిడిలా.

 "అవునా. ఇప్పుడు మన ఇద్దరమేగా. భయ పడకుండా చూడు..  ఇలాంటివి హాలులో చూపరులే.. ఇది వేరే లెవెల్ ది." చెప్పింది సుకన్య.

 నిజమే.. ఇది పూర్తిగా వేరు.

 సుకన్య.. నా భుజాల చుట్టూ తన కుడి చేతిని తిప్పి.. నన్ను దగ్గరగా లాక్కుంది.

 వెంటనే నా ముఖాన్ని తన ముఖం వైపుకి తిప్పేసు కొని.. నా పెదాలు మీద చక్కున ముద్దు పెట్టింది.

 నాకు చిత్రంగా అనిపించింది.

 "నీకు తొలి ముద్దు కదూ.." అడిగింది సుకన్య.

 నిలువుగా తలాడించాను.

 "బాగుందా.. ఇంకా కావాలా" అడిగింది.

 నిలువుగా తలాడించాను.

 సుకన్య నిల్చుంది. నన్ను నిలబెట్టుకుంది. నన్ను దగ్గరగా లాగేసుకుంది.

 అప్పుడే.. వీథి తలుపు చప్పుడు అయ్యింది.

 నన్ను వదిలి పెట్టేసింది సుకన్య.. "అబ్బా.. వెళ్ళు చూడు.. మనోళ్లు అప్పుడే రారు.. ఎవరైనా.. ఏదో చెప్పి పంపించేసి.. వచ్చేయ్"  చెప్పింది.. ఆ కేసేట్ ని విసిడి లోనించి బయటికి తీసేస్తోంది.

 నేను గది బయటికి రాగానే.. గది తలుపు మూసేసింది. 

 నేను వీథి తలుపు తీశాను. 

 గిరి వచ్చాడు. వాడు నా ఫ్రెండ్.

 గబుక్కున.. "మా నాన్న ఉన్నార్రా" చెప్పేశాను.

 వాడికి మా నాన్న అంటే భయం. మా నాన్న క్లాస్ పాఠాల ప్రశ్నలు అడుగుతుంటారు.

 వాడు.. "తర్వాత వస్తాను" అంటూ పారిపోయాడు.

 నేను తిరిగి గది లోకి వచ్చాను. చేసింది చెప్పాను.

 "మంచి పని చేశావు" అంది.

 సుకన్య..  తిరిగి కేసెట్ ని  విసిడిలో పెట్ట బోతుండగా.. కరెంట్ పోయింది. 

 సుకన్య.. "అయ్యో" అంది.

 తర్వాత.. ఎంతకీ కరెంట్ రావడం లేదు.

 సుకన్య.. కరెంట్ వాళ్ళని తిడుతూనే ఉంది.

 నాకూ చిరాకు అవుతోంది.

 అంతలోనే.. మళ్లీ వీథి తలుపు చప్పుడు ఐంది.

 నేను వెళ్ళి చూస్తే.. పని మనిషి.. చొరవగా లోనికి వచ్చేసింది. 

 "అమ్మగారు బట్టలు ఉతకమని ఉదయం చెప్పారు" చెప్పింది. 

 ఆమె.. ఆ పనికై తెములుతోంది.

 సుకన్య.. తాళంకీని.. ఆ కేసెట్ ని.. పట్టుకొని.. ఏమీ చెప్పకుండానే.. తన ఇంటికి వెళ్ళి పోయింది విసురు విసురుగా.

 నాకు ఏడుపు ముంచుకు వచ్చేసింది.

 మర్నాడు..

 నేను.. సుకన్య ఇంటికి వెళ్లి.. ఆమె గదిలో.. ఆమెతో ఉన్నాను.

 సుకన్య కోరగా..  నేను.. ఆమె పెదాలపై ముద్దు పెడుతుండగా.. 

 అప్పుడే.. అక్కడికి.. తన అమ్మ వచ్చేసింది.

 సుకన్య.. ఒక్కమారుగా.. గట్టిగా.. "ఫో" అంటూ నన్ను తోసేసింది.

 నేను ఇంటికి పరుగుతో వచ్చేశాను.

 నాకు భయం వేస్తోంది. ఏం జరుగుతుందో అనుకుంటున్నాను.

 ఆ తరువాత.. బయటికి రాలేక.. ఇంట్లోనే ఉండి పోయాను.

 సుకన్య అమ్మ కూడా.. మా ఇంటికి తర్వాత రాలేదు.

 కానీ.. ఆ మర్నాడు తెలిసింది.. సుకన్య.. నిన్నటి సాయంకాలమే..  తన అమ్మమ్మ వాళ్లింటికి.. తన అమ్మతో కలిసి వెళ్ళిందని.

 ఆ తరువాత.. రెండు రోజులు తరువాత తెలిసింది.. సుకన్య.. ఇక.. అక్కడే ఉండి పోతుందని.. అక్కడే చదువుకుంటుందని. 

 ఆ తరువాత.. కొద్ది రోజుల్లోనే.. సుకన్య నాన్నగారు ట్రాన్స్ఫర్ తో.. వేరే..  ఏదో ఊరు.. వెళ్లి పోయారు.. పూర్తి సామాన్లు తీసుకొని.. సుకన్య అమ్మతో.

 ఆ తరువాత.. నేను.. సుకన్య.. మరి కలవ లేక పోయాం.

 అలాగే.. వాళ్లు వెళ్లిపోయిన లగాయితు.. సుకన్య అమ్మ కూడా.. మా అమ్మ టచ్ లోకి రాలేదు.

***

 ఆరతి.. తెల్లగా ఉంటుంది. బొద్దుగా ఉంటుంది. పొట్టిగా ఉంటుంది. పదవ తరగతి చదువుతుంది.

 ఉదయం..

 ఆరతి.. స్కూలుకి వెళ్తుంది.

 అప్పటికే.. ఎప్పటిలాగే.. నేను  మా షాపు బయట వేచి ఉన్నాను.

 ఎత్తు నుంచి జారుతున్న బంతిలా.. ఆరతి నడుస్తోంది. తన పుస్తకాలని.. తన రెండు చేతులతో.. తన గుండె కేసి నొక్క పెట్టుకుంది. ఆ పుస్తకాల్లో.. నేను.. తన గుండె వైపున ఉన్న.. తొలి పుస్తకం ఐతే బాగుణ్ణు.. అనుకున్నాను.. ఎప్పటి లాగే. చిన్నగా నవ్వుకున్నాను.

 అంతలోనే.. ఆరతి.. నన్ను చూసి నవ్వింది.

 "ఆరతి.. ఆరతి.." తన వెనుకున వస్తున్న.. తన స్నేహితురాలు పిలుస్తుంది.

 ఆరతి ఆగింది.

 ఆరతి.. సరిగ్గా.. అప్పుడు..  మా షాపుకి ఎదురుగా వచ్చి ఉంది.

 తన స్నేహితురాలిని చూస్తూనే.. మరో మారు నన్ను చూస్తూ.. మళ్లీ నవ్వింది.

 తర్వాత.. తనని తన స్నేహితురాలు కలవడంతో.. ఆమెతో కలిసి.. ముందుకి కదిలి పోయింది.

 వీథి మలుపు వద్ద.. వెను తిరిగి.. నన్ను చూస్తూనే.. ఆ మలుపు తిరిగి..

మైన్ రోడ్డు మీదికి వెళ్లి పోయింది ఆరతి.

 నేను షాపు లోకి వెళ్లిపోయాను.

 నేను.. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం.. ఇంగ్లీష్ పరీక్ష.. వరుసగా రెండు మార్లు తప్పడంతో.. మా వీథిలో.. మా ఇంటి ముందు భాగంలో.. నాన్న..  తను అంత వరకు నిర్వహిస్తున్న పుస్తకాల షాపులో నన్ను కూర్చుండ పెట్టేశాడు.

 తొలుత.. ఇష్టం లేక.. కష్టంగా ఉన్నా.. షాపుకి వచ్చే అమ్మాయిలు.. ఎక్కువగా ఉండడంతో.. షాపు లోనే ఎక్కువగా ఉండుటకు.. నేను  మక్కువ పడ్డాను.

 ఆ తోవ లోనే.. ఆరతి.. నాకు పరిచయం ఐంది. 

 పైగా.. మా షాపు దాటుకొనే తను స్కూలుకి వెళ్ళడం.. రావడంతో..  మా మధ్య.. మరింత చనువు చోటు చేసుకుంది. 

 అలాగే.. ఆదివారాలు.. సెలవు రోజుల్లో.. నా కోరిక మేరకు.. ఏదోలా కలిసే వెసులుబాటుకి తను సమ్మతించడంతో.. నేను మరింతగా ఆమె వైపు మొగ్గాను.

 నా పుట్టిన రోజున.. ఆరతిని ఒప్పించి.. ఏకాంత చోటుకి.. ఆమెని తోడ్చుకు పోయాను. 

 అక్కడ.. మేము ఇద్దరమే.. ఎదురెదురుగా.. గుట్టలాంటి ఆ ప్రదేశంలో..

కూర్చుని ఉన్నాం.

 "నా పుట్టిన రోజుకి కానుక లేదా" అడిగాను నెమ్మదిగా.

 "ప్చ్. ఏమీ తేలేక పోయాను" నొచ్చుకుంది ఆరతి.

 "పోనీ.. అడగనా.. ఇస్తావా" అడిగాను కొంటెగా.

 "ఏం కావాలి" అడిగింది ఆరతి వింతగా.

 "ముద్దు" చెప్పేశాను.

 "అమ్మో వద్దు" అంది.

 గమ్మున లేచి నిల్చుండిపోయింది.

 నేనూ నిల్చున్నాను. 

 ఆరతి రెండు చేతులని.. ఒడుపుగా పట్టుకున్నాను. 

 ఆమెకి నాకు మధ్య.. కొద్ది దూరమే.. ఖాళీగా ఉంది.

 "ప్లీజ్. ఒకే ఒకటి" అన్నాను.

 "అబ్బ వద్దు" ఆరతి అంది.

 ఆ వెంటనే.. "వెళ్లి పోదాం" అంది కూడా.

 నేను బతిమలాడుతున్నాను. గబుక్కున ఒంగి.. ఆమె పాదాలు పట్టు కున్నాను. 

 ఆరతిలో.. విసురు.. విసుగు.. గుప్పున తగ్గి పోయాయి. 

 తను నిలకడ ఐంది. 

 కదలక.. ఆగింది.

 నిలకడగా.. నిలిచింది.

 నేను పొంగి పోయాను.

 "ఒక్కటే" అన్నాను.

 ఆరతి ఏమీ అనలేదు.

 ఆమెకి దగ్గరగా జరిగాను. 

 మా ఇద్దరి మధ్య.. దూరం లేదు. 

 ఆమెని గమ్మున కౌగిలించుకున్నాను. 

 ఆమె కుదురుగానే ఉంది.

 నా రెండు అర చేతుల తోను ఆమె ముఖం పట్టు కున్నాను. అది నిండుగా ఉంది. మెత్తగా ఉంది. వెచ్చగా ఉంది. 

 ఆరతి.. తన కళ్ళ రెప్పలు మూసుకుంది.

 నా పెదవులతో.. ఆమె పెదాల మీద.. ముద్దు పెట్టాను.

 తరువాత.. ఆరతి.. తన తలని వెనుక్కు లాక్కుంది. 

 "ఒక్కటే అన్నానుగా.  అదీ ఇంకా కాలేదుగా" అన్నాను దిగులుగా.

 ఆరతి కళ్లు సాగతీస్తూ.. "హే" అంది.