Beautiful World books and stories free download online pdf in Telugu

అందమైన ప్రపంచం

                                                 అందమైన ప్రపంచం

హా! వస్తున్నా వస్తున్నా! ఈ సారి తప్పకుండా వచ్చేస్తున్నా  అని  కలవరిస్తున్న అక్ష ని ఎక్కడికే వెళ్ళిపోతావు నిద్ర లో కళలు కనింది చాలు ఆఫీస్ కి టైం అవుతుంది లెగు అని నందిని అంటుంది.  అక్క  ఆ ప్లేస్ చాలా బావుంది అపురూపంగా చాలా నిశ్శబ్దంగా , ఆనందనీయంగా, మనసుకి  హాయిగా అనిపించింది అక్క  అక్కడ ఉన్న చెట్లు ప్రకృతి నన్ను  పిలుస్తునట్టుగా  అనిపిస్తుంది  ఎవరో నన్ను చెయ్యి పట్టుకొని తీసుకువెళ్తున్నారు ఇంతలో నువ్వు నన్ను లేపేసావ్ ఛ ఇంకో 10 మినిట్స్ అగితె ఎవరు తీసుకువెళ్తున్నారో చూసేదానిని .

నందిని: హా! చూస్తావ్ చూస్తావ్  ఇప్పుడు కరెక్ట్ టైం కి నువ్వు ఆఫీస్ కి వెళ్లకపోతే నీకు ని మేనేజర్ చూపిస్తారు వేరొక ప్రపంచం. నీకు ఈరోజు మీటింగ్ ఉంది మర్చిపోయావా నువ్వే ప్రెసెంట్  చెయ్యాలి అది కూడా గుర్తుచెయ్యన నేను.

నందిని అన్న మాటలకి అవును  కదా ! ఆమ్మో టైం అయిపోతుంది వెళ్ళాలి లేకపోతే ఆ మేనేజర్ నన్ను చంపేస్తాడు అని గబగబా  లేచి గాబరా పడుతున్న అక్ష ని చూసి నందిని నవ్వుకొని  నేను వెళ్తున్న ఆఫీస్ కి  నా బస్సు వచ్చింది బాయ్ ఈవెనింగ్ కళ్లుదాం టేబుల్ మీద టిఫిన్ పెట్టాను తినేసి డోర్ బాగా లాక్ చేసి వెళ్లు మొన్న కూడా అలానే మర్చిపోయి డోర్ ని లాక్ చెయ్యలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది నందిని . నందిని ,అక్ష ఇద్దరు అక్క చెల్లెలు వీళ్లది విలేజ్ కావటం తో చిన్నప్పటినుంచి హాస్టల్ లోనే చదువులు  చదువు తరువాత మంచి జాబ్స్ రావడం తో  సిటీ లోనే ఉండటం , అమ్మ నాన్నలకి సిటీ వాతావరణం పడక విలేజ్ లోనే ఉండిపోవటం   నెలకి ఒకసారి  వాళ్ళని చూసి రావటం అలవాటు అయిపోయింది .

ఈవెనింగ్ 6  అవుతుంది  ఇద్దరు ఇంటికి వచ్చేసారు  వస్తూనే

అక్ష: అక్క నా ప్రాజెక్ట్ సక్సెస్ అయింది US క్లయింట్  వాళ్ళు మా ప్రాజెక్ట్  ఒప్పుకున్నారు అంది నవ్వుతూ.

నందిని: మీ మేనేజర్ ఏమ్మన్నారు ?

అక్ష: యజ్యుజుయల్  నన్ను మాత్రం  ప్రశంసించడు !   నేనంటె అంత చిరాకు దేనికో  తెలీదు?

అయినా  తను నీ క్లాస్మేట్ కదా ఒకసారైనా మాట్లాడొచ్చు కదా  నేను నీ చెల్లిని అని తెలిసిన నుంచి  ఇంకా ఎక్కువ చేస్తున్నాడు . నీకు తెలుసా ! నువ్వు రిజెక్ట్ చేసిన నుంచి ఏ అమ్మాయితోను సర్రిగా మాట్లాడాడు  అంట  అక్క ఒకసారి ఆలోచించొచ్చు కదా  మా మేనేజర్ చాల మంచోడు.

నందిని: నీకెందుకే ! అయినా నువ్వు నాకు చెల్లివా లేదా నీ మేనేజర్ కా !  నేను రిజెక్ట్ చేసానని నీ మేనేజర్ నీతో రాయబారం పంపుతున్నాడా ?

అక్ష : అమ్మ తల్లి నీకొక దణ్ణం ? అతను ఏమి అనలేదు మంచోడు కొంచెం ఆలోచించొచ్చు కదా అని అన్నాను అంతే ? నీ ఇష్టం నాకెందుకు అమ్మ!

నందిని: నువ్వు ఇవి ఏం పట్టించుకోకుండా నీ వర్క్ నువ్వు కరెక్ట్ గా చెయ్యి అది సరే కానీ ! ఈ వీక్ ఏం ప్లాన్ వేసుకున్నారు  నువ్వు నీ ఫ్రండ్ శ్రీ ? ఎప్పుడు వీకెండ్ ప్లాన్స్ వేసుకొని బయటకి వెళ్ళిపోతారు గా వీక్ అంత  దేవుడికి ప్రే కూడా చెయ్యరు కానీ వీకెండ్ అయ్యేసరికి ఎక్కడి లేని డైవభక్తి తన్నుకువచ్చేస్తది నీకు నీ ఫ్రండ్స్ కి ఫ్రైడే నైట్ కె ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతారు గా మళ్లీ  సోమవారం తెల్లవారికి కానీ కనిపించరు .

అక్ష: లేదు ? అక్క ఈ వీక్  నో ప్లన్స్ చాలా రోజులనుంచి "రంగనాధస్వామి టెంపుల్ "కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము  కొత్తగా కట్టారు అంట కదా ఇంకా అక్కడకి వెళ్ళడనికే చాలా టైం పడుతుంది అంట గా తెల్లవారి వెళితె మధ్యాహ్నం దిగుతాం అంట కదా  సరిగా ఫెసిలిటీ లేదు అట అక్కడకి వెళ్ళాలి అంటే బాగా వెహికల్ నడిపేవాడు ఉండాలట మినీ బస్సు బుక్ చేసాం  ఫ్రండ్ శ్రీ తో పాటు కొంతమంది దాని ఫ్రండ్స్ కూడా వస్తారట సో మంచిగా వెహికల్ డ్రైవ్ చేసేవాడికోసం వెతుకుతున్నాం నువ్వు వస్తావా  ఈసారి !

నందిని: లేదు ఈ నెల రోజులు నాకు కాళీ ఉండదు నువ్వు వెళ్లి జాగ్రత్త  గా వచ్చెయ్. అవును ఆ ఊరి పేరు ఏంటి?

అక్ష:" బ్రహ్మపురి " పేరు బావుంది కదా!

నందిని: ఏదో కొత్తగా ఉందే పేరు సరే కానీ ఫ్రెష్ అప్ అయ్యి రా ! ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది.

నెక్స్ట్ వీక్ రానే వచ్చింది మినీ బస్సు బుక్ అయ్యింది ఎట్టకేలకు మంచి డ్రైవర్ దొరికాడు అని శ్రీ కాల్ చేసి అక్ష కి చెబుతుంది

అక్ష: శ్రీ నాకు టైం చాలలేదే షాపింగ్ చెయ్యడానికి

శ్రీ: ఏం పర్లేదు , నేను మొన్ననే షాపింగ్ చేశా నీకు కూడా తెస్తా  నువ్వు హ్యాపీ గా నిద్ర పో రేపు మార్నింగ్ 8కళ్ల  స్టార్ట్ అయిపో రెడ్ బస్సు మర్చిపోకు

అక్ష : ఓకే ! బై గుడ్ నైట్ !ఫోన్ పెట్టేసా కానీ నా మనసులో ఏదో అలజడి ఎందుకో? ఈ ట్రిప్ అనుకున్న నుంచి ఏదో అవరోధం !ఎన్ని సార్లు అనుకున్న వెళ్ళడానికి వీలు కాలేదు టైం కుదరక ,లేదా ఎక్కువ వర్షాలు పడటం అలాంటివి ఇప్పుడు డ్రైవర్ దొరకకపోవడం , ఇలాంటివి జరిగిన నేను, శ్రీ కచ్చితంగా వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాం? అందుకే పట్టువదలని విక్రమార్కుల్లా ఈ సారి ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాం. ఎందుకో తెలీదు ఏదో అత్యుత్సాహం నన్ను వెంటాడుతూవుంది వెళ్ళాలి అని "బ్రహ్మపురి" !! అని పేరు వినగానే అదొక వైబ్రేషన్ వచ్చింది . నా మనసులోంచి చాలా కొత్తగా , హ్యాపీ గా ఏదో పోయినది అంతా నా దగ్గరకి వస్తున్నట్లు, ఏదో విడదీయరాని సంబంధం నా దగ్గరికి వచ్చేయమంటున్నట్లుగా అని అనిపిస్తుంది ? ఈ పేరు వింటుంటేనే ఇలా అనిపిస్తుంది అంటే అక్కడకి వెళితే ఏమనిపిస్తుందో ?  

నైట్ కూడా సర్రిగా పడుకోలేదు ఎప్పుడు తెల్లవారుతుందో అని  శ్రీ 8 కంటె నేను 7 కె రెడీ అయిపోయి  అపార్ట్మెంట్ ఎదురుగా వెయిట్ చేస్తున్న టైం 8 కావొస్తుంది  అప్పటివరకు  నార్మల్ గా ఉన్న వాతావరణం అంతా హుటాహుటిన మారిపోయింది .  సడన్ గా ఏదో ఈదురుగాలులు, దుమ్ము , అప్పటివరకు అక్కడ ఉన్న జనాలందరూ ఒక్కసారిగా ఆలా ఆగిపోయారు  ఆ క్షణం ఏం జరుగుతుందో కూడా ఆలోంచించలేకపోతున్న అంతలో మంచి సువాసన దూరంనుంచి ఒక ఎర్రగా ఉన్న ఆకారం నా దగ్గరికి వస్తుంది అది దగ్గరికి సమీపితుండగా దానిలోంచి హాయ్ ! అని డోర్ బయట నుంచి శ్రీ చెయ్యి ఊపుతుంది . అది చూడడానికి పూరాతనంగా చాలా స్లో గ వస్తుంది .ఇంతలో ఆ బండి వచ్చి నాదగ్గర ఆగింది! అది అసలా బస్సు లాగా లేదు, ట్రైన్ లాగా లేదు మన వాడే ఏ వెహికల్ లాగా లేదు.

శ్రీ : రావే బండి ఎక్కు అని పిలుస్తుంది ?

అక్ష: ఇవ్వనీటినుంచి  తేరుకొని బండి ఎక్కేసా ఎక్కుతూనే శ్రీ మనం వెళ్ళడానికి ఈ బండి తప్ప ఇంకో బండి దొరకలేదా అని అన్న?

శ్రీ : నువ్వు లోపల చూస్తే ఇలా అనవు పిల్ల రా లోపలకి

అక్ష:  ఆ బస్సు బయట అంత పూరాతనంగా ఉన్న లోపల అంత మన ఇప్పటి టెక్నాలజీ కన్నా మరీ అడ్వాన్స్డ్ గా ఉంది. చాలా బావుంది . ఆ బండి డ్రైవర్ సీటుకి దూరంగా పాసెంజర్స్ సీట్స్ డ్రైవర్ సీట్ కి పాసెంజర్ సీట్స్ కి మధ్య ఒక పెద్ద డోర్ కరెక్ట్ గా డ్రైవర్ సీట్ దగ్గర ఒక విండో పాసెంజర్స్కి డ్రైవర్ కి కమ్యూనికేషన్ కొరకు .
లోపల అంతా మినీ సైజు రెస్టారంట్ లా ఉంది బండి బయటనుంచి చూడడానికి చాలా చిన్నది గా కనిపించిన లోపల చాలా పెద్డది.

మధ్యాహ్నం అవుతుంది లంచ్ కి కూడా కిందకి దిగలేదు డిగితె కరెక్ట్ టైం కి వెళ్లలేం అని డ్రైవర్ అన్న చెప్పారు అంతా లోపలే ఎవరి సీట్స్ ఎదురుగా టేబుల్స్ వున్నాయి అక్కడ టేబుల్స్ మీద లంచ్ బాక్స్ ఉన్నాయి.  శ్రీ తో వచ్చిన ఫ్రండ్స్ అందరూ నా క్లాస్మేట్స్ కూడా వాళ్ళతో బాగా మాట్లాడుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేసాం 5  అవుతుంది ఇంకా మేము ఆ ప్లేస్ కి వెళ్లలేదు కోపం వచ్చి డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఏమయ్యా నీకు అసలా ఆ ప్లేస్ తెలుసా  ఇంత టైం అవుతున్న ఇంకా  ఆ టెంపుల్ జాడ కనపడట్లేదు అని అడిగా "డ్రైవర్ రిప్లై ఇవ్వట్లేదు అని డ్రైవర్ ని విండో లోంచి ,డ్రైవర్ బూజం మీద చెయ్యితో  పిలిచా అటు వైపు తిరిగి ఉన్న పేస్ ని ఇటు తిప్పాడు ! మొకం అంతా పాములా ఉంది . అప్పటివరకు అక్కడ నుంచొని ఉన్న నేను భయం తో వెంటనే చెయ్యి తీసి మాట రాక సీట్ లో కూర్చోండి పోయా ఇంతలో పాము పేస్ పోయి నార్మల్గా  ఆ డ్రైవర్  నవ్వూతూ  నన్ను చూసాడు నన్ను ఆ నవ్వు లో ఏదో అర్ధం ఉంది ఆ డ్రైవర్ చూపులో తాను నాకేదో చెప్పాలని ట్రై చేస్తునట్టు అనిపించింది." ఇంతలో శ్రీ ఇలా చూడు అని ఎదురుగా చెయ్యి చూపి చూడమంది శ్రీ చూపించిన వైపే చూసా చూసిన నేను షాక్ .