YOUR THE ONE - 14 books and stories free download online pdf in Telugu

జతగా నాతో నిన్నే - 14








అన్వి చికెన్ చూడు సన్న ,సన్న పీసెస్ గా కొయ్యాలా లేకపోతే పెద్దగా కోయినా ? ఆ స్టవ్ పైన అవి మాడిపోతున్నట్టుగా ఉన్నాయి చూడు అంటూ ఇద్దరు తొందర పెట్టారు .


“ ఆ చూస్తున్న చూస్తున్న ....” అంటూ సెల్లో మల్లి పాటలు పెట్టేసి బెడ్ పై పడేసి వచ్చేసింది .వాళ్లు మళ్లీ ఆ పాటలు వింటూ చికెన్ చేయడంలో నిమగ్నమైపోయారు .ఒక 30 నిమిషాల తర్వాత చికెన్ గుమగుమలాడుతూ వాసనను బయటికి పంపింది. చికెన్ రెడీ అయిపోయింది.


“ ఇక బిర్యాని వద్దు మామూలుగా అన్నంతోనే తిద్దాం. ఎప్పుడు హోటల్ లో తింటున్నాం కదా బిర్యాని ” అంటూ అన్వి చెప్పగానే, సరే అని ఒప్పుకున్నారు. అప్పటికే స్టౌ పైన అన్నం ఉడికింది .



“ ఎన్ని రోజులైంది .ఇంటి వంట తిని .ఈరోజు మనకి నిశ్చయంగా స్వేచ్ఛ లభించినట్టుంది .మనకు నచ్చినంత సేపు బయటకు వెళ్లి తిరిగాము, ఇంకా నచ్చినట్టుగా షాపింగ్ చేశాము. ఇప్పుడు వంట కూడా! ఇక మన పార్టీ మూడ్ని మరింత పెంచుదాం. ఈరోజు ఏం సినిమా చూద్దాం ” అంటూ అన్వి అడిగింది.


“ మాకు ఏ సినిమా అయినా ఒకటే, చూసేద్దాం ” అంటారు ఇద్దరు .


“ సరే మీరు ఆ కూరలు ,అన్నం పట్టుకుని వచ్చేయండి .నేను ఏ సినిమా చూడాలో డిసైడ్ అయి డౌన్లోడ్ చేస్తాను ” అంది అన్వి సంతోషంగా .


“ అన్వి, మనం ఎలాగో పెప్సీ తెచ్చాం . ఇంకా ఇప్పుడేమో చికెన్ చేసుకున్నాము. ఇదంతా ఫస్టాఫ్ చూడ్డానికి సరిపోతుంది. మరి సెకండ్ హాఫ్ కి మజా ఏమంటుంది ” ప్రశ్నించింది గీత.


“ నువ్వు చెప్పింది కూడా నిజమేనే! సెకండ్ ఆప్ లో చాలా డిసప్పాయింట్ అవుతాము అనుకుంటా. సరే! అయితే నా దగ్గర ఒక 20 రూపీస్ ఏమో చేంజ్ ఉంది. వాటితో మనం కురుకురే ప్యాకెట్లు తెచ్చుకుందాం ” అంది అన్వి .


“ సరే ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్లి తీసుకొచ్చేయ్ ” అని చెప్పింది సంజన.



“ ఒసేయ్ ఇందాక కూడా నేనే వెళ్లాను కదా ! ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటుంది ” తనకే అంట గట్టేస్తూ .


ఇక తప్పదు అన్నట్టుగా బయటికి వెళ్లి తీసుకొచ్చింది .ఈ లోగా చికెన్ అన్ని సిద్ధం చేసి మూవీ కోసం అంతసేటప్ రెడీ చేసేసారు.ఆ చిన్న ఫోన్ ని ఒక తలగడ పైన పెట్టి బెడ్ పైనే కూర్చుని చూస్తూ ఉన్నారు.



వాళ్లని డిసప్పాయింట్ చేయకుండా అన్వి మూవీని ప్లే చేసింది.


“ ఇదేము మూవీనే పేరే వింతగా ఉంది ” అంటుంది సంజన .ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య అసలు సినిమాలే చూడలేదు .ఎప్పుడో స్కాలర్షిప్ వచ్చినప్పుడు ఒకటి రెండు సినిమాలు చూశారు. అంతే ! మళ్లీ ఇప్పుడే చూడటం.


“ ఏమోనే యూట్యూబ్లో సినిమాల కోసం చూస్తూ ఉన్నప్పుడు .ఇది వింతగా కనిపించింది. టైలర్ చూశాను అన్నీ జోనర్లు కలిపి ఉన్నట్టుగా కనిపించింది. దాంతో ఇక దీన్నే డౌన్లోడ్ చేశాను ” అంటూ ప్లే చేశారు.


మరోపక్క చికెన్ తినుకుంటూ ఆ మూవీ చూస్తూ “ నైట్ టైం డిన్నర్ ” అన్నట్టుగా ఊహలో తేలుతూ తినడం మొదలుపెట్టారు .



ఆ సినిమాలో వచ్చే సస్పెన్స్ ,అప్పటికప్పుడు మారిపోతున్న స్క్రీన్ పైన చూస్తూ ఆశ్చర్యంగా కొన్ని కొన్ని సార్లు నోరు తెరిచితూ ......తినడం ఆపేశారు. ఇంటర్వెల్ వరకు వాళ్ళు చికెన్తో ముగించేసి ,ఆ తర్వాత పెప్సీ , కురకురే ప్యాకెట్స్ కాంబినేషన్లో మిగతా సగం సినిమా అయిపోచేశారు .


“ అబ్బా ఏమన్నా ఉందా సినిమా? మంచి సినిమా డౌన్లోడ్ చేశావు ” అంటూ పొగుడుతూ ఉంది సంజన.

“ నాకు కూడా తెలియదు. ఇది ఇంత బాగుంటుందని ” అంటూ మాట్లాడుతూ మాటలు మధ్యలోనే వెళ్లి ఆ సామానంత కడిగేసి వచ్చి పడుకున్నారు.



ఆ తర్వాత రోజు అట్టహాసంగా మొదలయ్యాయి “ ఇంటర్నేషనల్ ఫెస్ట్ పోటీలు ”. మొదటిరోజు వాళ్ల వాళ్ల పోటీలు జరగటంతో అన్వి కొరియోగ్రఫీ చేసుకున్న డాన్స్ ని ఒక గదిలోకి వెళ్లి జడ్జెస్ ముందర వేసింది. అలా తనకి ఆరోజు గడిచిపోతే ; గీతకి చెస్ గేమ్ ఆడుతూ ఒక్కొక్క లెవెల్ దాటడంతోనే సరిపోతుంది. రిజల్ట్స్ చివరి రోజు అవటంతో రోజు ముగ్గురు బిసిబిసిగా గడిపేశారు. ఇక రాత్రికి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వచ్చేసి పడుకున్నారు .



ఆ మరుసటి రోజు కాలేజీ క్యాంపస్ కి వెళ్ళగానే అందరూ ఆర్చర్, క్రికెట్ రెండు గేమ్స్ పైన ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నట్టు వాళ్ళ గ్రహించారు. విషయం నెమ్మదిగా ఆరాధిస్తే ,అందులో రాహుల్ ఇంకా అభయ్ పాటిస్పేట్ చేస్తున్నారని అర్థమైంది.


మామూలుగానే చాలా ఆసక్తి ఉన్న అన్వి క్రికెట్ వైపు వెళ్దామని పట్టు పట్టింది .కానీ గీత ,సంజన వారించి, “ లేదు క్రికెట్ ఇప్పుడు ఇంకా క్వాటర్ మ్యాచ్ ఆడుతున్నారు .దాన్ని చూడాలంటే ఇంకా రెండు మ్యాచ్స్ ఉన్నాయి కదా! చూడొచ్చు .కానీ ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆర్చరీలో జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా మొదటి సారి మన క్లాస్ కాలేజ్ నుంచి రాహుల్ ఫైనల్ కి చేరాడు. నీకు అన్నిసార్లు సహాయం చేశాడు కదా! మనం వెళ్లి తనని ఎంకరేజ్ చేద్దాం ” అంటూ తీసుకొని వెళ్లారు.



ఆర్చరీలో రాహుల్ ఉన్నాడని తెలియగానే అన్వి సైలెంట్ అయిపోయింది . చిన్నపిల్లలాగా వాళ్ళ వెంటే నడిచింది .అప్పటికే చాలా రసవత్తరంగా సాగుతుంది పోటి. మామూలుగానే డ్రాకులాగా ఉన్న రాహుల్ కి కంటి చూపు చాలా ఎక్కువ. కానీ పోటీల్లో తనకి అనుభవం చాలా తక్కువ.


కేవలం అన్వి కోసం గత మూడు రోజులుగా ప్రాక్టీస్ చేసిన అనుభవం తప్పితే పెద్దగా ఏదీ లేదు.


అందుకే ప్రత్యర్థి చాలా కఠినమైన కాంపిటీషన్ ఇస్తున్నాడు .అప్పటికే ప్రత్యర్థి ఐదు బాణాలతో హై స్కోర్ లో నిలబడ్డాడు. ఇక చివరి బాణము రాహుల్ది. కానీ ఇప్పుడు 10 పాయింట్లు తీసుకొని వస్తేనే గెలిచినట్టు , 9 తీసుకొని వస్తే ఇద్దరూ ఫైనల్ విజేతలుగా నిలుస్తారు .



కానీ ఇప్పటివరకు రాహుల్ 9 కానీ 10 కానీ కొట్టలేదు. కేవలం ఎనిమిది రంగు కలిగిన రింగులోనే కొట్టాడు . ప్రతి బాణానికి తన్నుతాను ఎంత సర్దుబాటు చేసుకున్న సరే ,అది మాత్రం ఎనిమిదికి పైనే పడుతుంది .



అప్పుడే అక్కడికి చేరుకున్న అన్వి ,స్కోర్ బోర్డ్ పైన ఉన్న స్కోర్ ని చూసి ఆశ్చర్యపోయింది . అప్పటికే కాస్త రెస్ట్ తీసుకుంటున్నా రాహుల్ , తన జర్నీ ని చూపిస్తూ ఒక ఏవి వేశారు.


గత పోటీల్లో తను ఎంతగా కృషి చేశాడో అదంతా చూస్తూ ఉంది అన్వి. తెలియకుండానే రాహుల్ గెలవాలని కోరుకోవడం మొదలు పెట్టింది .అందరికి ఆర్చరీ పైన పెద్దగా ఇష్టం లేకపోవడంతో వాళ్ళ కాలేజ్ వాళ్లు రాలేదు. పైగా రాహుల్ పాటిస్పేట్ చేస్తున్నాడని ఇద్దరికీ ముగ్గురికి తప్ప ఎవరికి తెలియదు .


అప్పటికే వీర లెవెల్లో ప్రత్యర్థిని పొగుడుతూ చాలామంది ఆ స్టేడియంలో గోల చేశారు. రాహుల్ ని పొగడటానికి ఇద్దరు తప్పితే ఎవరూ లేదు .ఇప్పుడు అన్వి రావడంతో రాహుల్ అక్కడ ఉన్నాడు అన్న విషయం మిగతా అమ్మాయిలకు కూడా తెలిసి అందరూ వచ్చారు.


రాహుల్ ఆ స్టేడియంలో ఉన్న అందరిని ఒకసారి చూశాడు . అప్పటికే ఉదయం నుంచి ఒక్కొక్క లేవల్లో ఎలిమినేటర్స్ అన్ని దాటుకుంటూ రావడం వల్ల బాగా అలసిపోయాడు . పోటీలను తొందరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉండటంతో విజేతలకి వెంటవెంటనే పోటీలు పెట్టారు .



ప్రత్యర్థి నేరుగా విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్నాడు .కానీ రాహుల్ మాత్రం ఒక్కొక్క మెట్టు దాటుతూ ఫైనల్ కి చేరుకున్నాడు .దానివల్ల తను తినకపోవడం వల్ల చాలా నీరసంగా అనిపించింది . అది కాకుండా టార్గెట్ బోర్డ్ చాలా దూరంగా ఉండటంతో, బలమంతా కోల్పోయాడు .



నిస్సాయంగా తన విల్లు చూసుకుంటూ ఉన్నాడు .



అప్పుడే అన్వి గట్టిగా రాహుల్.......రాహుల్ అంటూ అరిచింది .ఆ అరుపుకి ఒక్కసారిగా అటువైపు చూశాడు రాహుల్ . ఒక క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి .అరుపులో నువ్వు గెలుస్తావని నమ్మకం వినిపిస్తున్నట్టు అనిపించింది.


చూట్టు అంత మంది ఉన్నా సరే, అన్వి మాటలు మాత్రమే చెవులకు వినిపిస్తున్నాయి. తను నమ్మకంగా సపోర్ట్ చేయడంతో అప్పటిదాక తనను ఆవరించిన నిశ్శత్వం మొత్తం ఎగిరిపోయింది .శరీరంలో రక్తం కొత్త ఉరకలు వేయడం మొదలు పెట్టింది .


చిన్నగా అన్వి వైపు చూస్తూ నవ్వాడు రాహుల్. మొదటిసారిగా రాహుల్ నవ్వితే ఎలా ఉంటాడో చూసింది అన్వి. తన కళ్ళు ఆశ్చర్యంగా అతడిని చూస్తూ ఉన్నాయి .అన్వి పక్కగా వచ్చిన కాలేజ్ వాళ్ళు రాహుల్ ని అక్కడ చూసి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు.


కొద్దిసేపు ప్రత్యర్థి ఫాలోవర్స్ ,మరోవైపు రాహుల్ ఫాలోవర్స్ మధ్య అరుపుల ప్రోత్సాహం అందింది ఇద్దరికీ ! రాహుల్ టార్గెట్ బోర్డ్ పైన ఉన్న లక్ష్యాన్ని గురి పెట్టాడు.



అప్పుడే అలసిన శరీరం కావడంతో తన నుదుటి నుంచి ఒక చెమట చుక్క చిన్నగా జారుతూ ముక్కు పైకి వచ్చింది . రాహుల్ ఒక కన్ను మూసుకొని మరీ ఆ టార్గెట్ ని క్షుణ్ణంగా చూశాడు .



చెమట చుక్క అలా నేలపైకి దూకిందో లేదో, వెంటనే రాహుల్ విల్లు నుంచి బాణం ప్రాణములా దూసుకుపోయింది. క్షణంలో జరిగిన ఆ పరిణామా వేగానికి అందరూ టార్గెట్ బోర్డు వైపు చూశారు .
బాణం నేరుగా వెళ్లి బుల్సయిని కొట్టింది.



డిజిటల్ స్క్రీన్ పైన 10 పాయింట్లతో రాహుల్ విన్నర్ గా చూపించింది .

“ ఏయ్ ......ఏయ్ .....రాహుల్ గెలిచాడు ” అంటూ పాట వాడుతున్నట్టుగా చిన్నపిల్లల ఎగిరారు ముగ్గురు . ఆ పోటీలో రాహుల్ స్పెషల్ అట్రాక్షన్ అయితే ,మరోవైపు వీళ్ళ అల్లరి ఇంకో అట్రాక్షన్ గా మారింది .



రాహుల్ ఆ మెడల్ తీసుకొని తన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి అందించాడు . క్షణాలలోని తన అకౌంట్లో డబ్బులు జమాయ్యాయి . అన్వి వాళ్ళతో ఎలాగైనా మాట్లాడాలని రాహుల్ ఆ షేర్మని అయిపోయిన వెంటనే పరుగు పరుగున బయటకు వచ్చాడు.



కానీ అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు అని తెలిసింది .



*******


“ ఏమన్నా వేశాడా బాణం . సరిగ్గా వెళ్లి మిడిల్ పాయింట్ని తగిలింది .అవును ఆ మిడిల్ పాయింట్ని ఏమంటారు గీత ” అంటూ జరిగిన దాన్నే వాళ్లకు ఎక్స్ప్లైన్ చేస్తున్నట్టుగా సంబరపడుతూ అడిగింది అన్వి.


“ దాన్ని బుల్సయి అంటారు ".


“ నన్ను చూసి రాహుల్ చిన్నగా నవ్వాడు చూడు, అప్పుడు ఎంత క్యూట్ ఉన్నాడో తెలుసా ” అంటుండు కళ్ళు పెద్దవి చేసి చెప్పింది అన్వి.


“ తను ఎక్కడో అక్కడ ఉన్నాడు .నీకు ఎలా కనిపించింది. తన ముఖంలో చిరునవ్వు ” అంటూ చిన్నగా తన వైపు చూశారు ఇద్దరు.


“ లేదు రాహుల్ నవ్వాడు .కావాలంటే నేను తనతో చెప్పిస్తాను ” అంటూ ఏదో చెప్తుంది అన్వి.



ఇంతలో ఏదో వస్తువు పడిపోవడంతో దాన్ని తీసుకోవడానికి అక్కడే ఆగింది గీత . తన నుంచి కాస్త దూరంగా మాట్లాడుకుంటున్నారు అన్వి , సంజన.


ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో ఏకంగా ఒక లారీ వేగంగా వచ్చి గీతను ఢీ కొట్టింది .అంతే ! తలకి బలమైన దెబ్బ తగలడంతో రక్తం గాల్లోకి ఎగచింమింది . ఆ లారీ వేగానికి ,గీత వెళ్లి దూరంగా పడింది.


తన చేతిలో ఉన్న వస్తువు కూడా దూరంగా పడింది. ఊహించని ఆ ప్రమాదంతో అన్వి,సంజన ఇద్దరు దాదాపు షాక్ అయిపోయారు .వెంటనే బాధగా ఏడుస్తూ “ గీతా .......” అంటూ పరిగెత్తారు.


——— ***** ———