A real-life story of a gem in the soil - 8 in Telugu Biography by rajeshwari shivarathri books and stories PDF | మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 8

Featured Books
  • ભૂલ છે કે નહીં ? - ભાગ 96

    આમ, જાણે જીવનની બીજી ઈનિંગ શરૂ થઈ હતી. પણ હવે, મમ્મીની કોઈ પ...

  • લાગણીનો સેતુ - 3

    શિખર માટે આ લંચ માત્ર માફી માંગવાનું નહોતું. તેના મનમાં ઊંડે...

  • NICE TO MEET YOU - 5

    NICE TO MEET YOU                               પ્રકરણ - 5 (...

  • Krishna 2.0

    --- કૃષ્ણ 2.0 : કલિયુગનો અવતાર(એક આધ્યાત્મિક – વિજ્ઞાન – ઍક્...

  • અસવાર - ભાગ 1

    પંચાળનો શુરવીર અસવાર દેવાયત એક ગોઝારા અકસ્માતમાં પોતાના પગ ગ...

Categories
Share

మట్టిలో మాణిక్యం నిజ జీవిత కథ సిరీస్ - 8

చూస్తూ వుండగానే ఎండాకాలం సెలవులు అయిపోయినాయి.
నేను 5 వ తరగతిలోకి అడుగు పెట్టాను.
ఆ సంవత్సరం వర్షం కాలం మెదటి నెలలో చాలా వర్షాలు పడ్డాయి .
.
.అయితే ఒక రోజు అమ్మ వాళ్ళు గోదావరి నది లోనే పని చేస్తూ వున్నారు... ఆప్పుడు మధ్యానం 1 గంట అవుతుంది ..పని దిగి అందరు అన్నం తినాలి అని అనుకున్నారు..
అన్నం తినడం కోసం నీళ్ల కోసం అమ్మ నీళ్ల క్యాన్ తీసుకొని నీటి చేలిమ దగ్గరకు వెళ్ళింది.
అమ్మ మురికి నీటిని తీసి పడపోసి తేట నీళ్లు రాగానే చెబ్బు తో క్యాన్ లో పోసుకుంటుంది..

అమ్మ చూస్తూ వుండగానే  చెలిమా లోని నీళ్లు అన్ని ఒకసారిగా మురికిగా అయిపోయాయి. ఎంటి ఇలా అయిపోయాయి నీళ్లు అని అనుకుంటుంది అమ్మ ..

అమ్మ మురికి నీళ్లు అన్నీ పారబోస్టు వుంది కానీ తెల్లటి నీళ్లు రావడం లేదు.అమ్మకు ఏం అర్థం కాలేదు..రోజు బాగానే వచ్చేవి ఈరోజు ఏమయింది అని అటు ఇటు చూస్తుంది.

అమ్మ కు 200 మీటర్లా దూరం లో గోదావరిలో  ఏదో తెల్లగా కనిపిస్తుంది..ఎండకు అమ్మ కు సరిగా  కనిపించడం లేదు
మళ్ళీ ఒకసారి కళ్లను గట్టిగా తుడుచుకొని కళ్లు పెద్దవి చేసి చూడగా..దూరం నుంచి గోదావరిలోకి నీలు పెద్ద అల్లలుగా  వస్తున్నాయి..
వర్షాలు బాగా పడడం తో బిర్జి తలుపులు తీసారు.

అమ్మ ఒకసారిగా భయపడి మా వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పింది .
అందరు భయం తో బయటికి పరుగులు తీసారు.
ఆ సమయానికి ఆ గంగలో లారీలు, ట్రాక్టర్ లు ,jcb వున్నాయి. 
ఒకరికొకరు అందరికీ చెప్పుకుంటూ అందరు గంగా నుంచి బయటికి వచ్చి.. త్రుతిలో చావు నుండి భయట పడ్డారు.
నిజానికి అక్కడ జరిగే పని గురించి గవర్నమెంట్ కి తెలుసు ..అలాంటపుడు గేటు లు తీస్తున్నాం అని ముందుగా అందరికీ సమాచారం ఇవ్వకుండ గేటు లు తీసారు.
కొద్దిగా అవుతే చాలా పదుల సంఖ్యలో  ప్రాణాలు పోయేవి.
వర్షాలు పడి గోదావరి నిండా నీల్లు వుండడతో అక్కడ మాకు పని లేకుండా పోయింది.

వేరే దగ్గర ఇదే గంగా పని వుంది వెళ్ళాలి అని నాన్నకు సర్ వాళ్ళు చెప్పారు.
దానికి నాన్నా సరే అన్నారు.
అంతర్గం అనే వూరికి పని కోసం వెళ్లాల్సి వచ్చింది.నాన్న నన్ను స్కూల్ మానిపించి అక్కడికి తీసుకొని వెళ్ళాడు.
ఆ వూరు రామగుండం కు దగ్గరలో వుంది.
అ వాతావరణం అంతా అడవి ప్రాంతంలా...వూరు కూడా అడవిలో వున్నట్టు..అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇల్లులు వున్నాయి.

ఈ వూరు నాకు అస్సలు నచ్చలేదు.

కానీ పని కోసం ఇక్కడ వుండక తప్పలేదు.

మేము ట్రాక్టర్ తీసుకున్న తరువాత ఎక్కడికి వెళ్ళిన ట్రాక్టర్ లోనే ప్రయాణం చేసే వాళ్లము..
అవసరం అయిన సామాను అంతా అందులో వేసుకొని వెళ్లే వాళ్ళము.
ఆ వూరికి వెళ్ళిన తరువాత నాన్న  అద్దె ఇల్లు కోసం చాలా ఇల్లులు తిరిగాడు.
కానీ ఎవరు ఇల్లు అద్దెకు ఇవ్వటానికి ముందుకు రాలేదు.
మమల్ని చూసి 
ఎవరో వీళ్ళు!... ఏందుకు వచ్చారో?..ఎలాంటి వారో ?
అని ఎవరు ముందుకు రాలేదు ఇల్లు అద్దెకు ఇవ్వటానికి.
చాలాసేపు తిరిగిన తరువాత ఒక అడ మనిషి రెండు రూం లను కిరాయికి ఇచ్చింది.

ఒక రూమ్ లో మేము ..ఇంకో రూమ్ లో మా నాలుగో బాబాయి వాళ్ళు వుండే వారు.

ఇల్లు అంతా శుభ్రం చేసుకొని సామాను అంతా సదురుకొని ఆ యింట్లో వున్నాము.

నాన్న మరుసటి రోజు నన్ను అక్కను అదే వూరిలో స్కూల్ లో చేరిపించాడు.
నేను ఆ సంవత్సరం తరగతి  మధ్యలో వెళ్ళాను.

ఆ స్కూల్ లో పిల్లలు ఎవరు సరిగా చదవరు అంటా..
నేను అడ్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళ గానే నన్ను చూసి ఆ స్కూల్ మాస్టర్ ఒక మాట అన్నారు.

"వున్న వారితోనే చచ్చిపోతునం..
మళ్ళీ కొత్తవల్లు వస్తున్నారు...
వీళ్లకు చదువు చెప్పుడు కంటే..
బరేలను  సాదుడు నయం.." అని 
ఇంకో టీచర్ తో చెబుతున్నాడు.

నాకు ..సర్ అలా అనడం తో కొంచం బాధగా అనిపించింది.

కానీ కొన్ని రోజుల తరువాత...
ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి అన్నా వారే ..
మా స్కూల్ కి వచ్చినందుకు సంతోషం గా వుంది అన్నారు.

స్కూల్ లో అందరు నేను బాగా చదువుతున్నాను అని చెప్పుకుంటున్నారు.

మా క్లాస్ లో విద్య అనే అమ్మాయి కూడా వుంది.
నేను వెళ్ళిన చాలా రోజుల వరకు తను స్కూల్ కి రాలేదు.
తను నవోదయ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది.
తను మాత్రమే క్లాస్ లో బాగా చదువుతుంది.

తను ఎగ్జామ్ రాసి స్కూల్ కి వచ్చిన తరువాత ..కొన్ని రోజులకు మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము.
ఇద్దరికీ ఏప్పుడు క్లాస్ లో పోటీ వుండేది.

ఒకసారి తను క్లాస్ ఫస్ట్ వచ్చేది ..ఒకసారి నేను క్లాస్ ఫస్ట్ వచ్చేది.
తను నాకన్నా బాగా చదివేది..
నాకు తన కంటే ఎక్కువ చదవాలి అని ఏ అనిపించేది.

తను మేము వున్న ఇంటి దగ్గరే వుండేది.
దానితో మా మధ్య స్నేహం  కూడా బాగా పెరిగింది.

ఇటు పక్క మా నాన్న వాళ్ళు ఇసుక క్వారీ లో రోడ్డు కోసం పాల పొరక కట్టెలు కొట్టి తెచ్చి రోడ్డులో వేసే వారు.

అది వర్షా కాలం కాబట్టి..రోడ్డు ఎప్పుడు బురుద బురుద గా వుండేది.
ఆ దారిలో లారీలు ఇసుక లోడ్ తో వెళ్లడం కష్టం గా వుండేది .
అందుకే పాల పొరుక కోసం చాలా దూరం వెళ్లి ట్రాక్టర్ లో కోసుకొని వచ్చేవారు..

మిగితా టైం లో ట్రాక్టర్ తో మట్టి కొట్టే వారు.

ప్రతి రోజూ మా నాన్న వాళ్ళకు పని దొరికేది.

కొన్ని రోజులు గడిచిన తరువాత ..
మాకు మా ఇంటి చుట్టూ పక్కల వాళ్ళతో కూడా మా కుటుంబం మంచిగా కలిసిపోయింది.
మేము చేసే పని మట్టి పని అయిన మా మాట తీరు..మా పద్దతి అన్ని అందరికీ నచ్చేవి.

మా అక్క కు మా ఇంటి పక్కన వున్న ఫ్యామిలీ తో మంచిగా స్నేహం కుదిరింది.
ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు వుండే వాడు..ఆ పిల్ల వాడు అక్కకు బాగా అలవాటు అయిపోయాడు.

అక్క కూడా తనని బాగా చూసుకొనేది.ఎంతగా అక్క వాళ్ళతో కలిసి పోయింది అంటే ఏప్పుడే ఆడడం మరిచిపోయిన  ఆ ఇంట్లో వారితో మా అక్క హోలీ ఆడించింది.

స్కూల్ లేని టైం లో నేను అమ్మ వాళ్ళతో పని దగ్గరకు వెళ్ళేది.
అక్కడ ఒక టాక్టర్ నడిపే అతనితో నాకు కూడా మంచి బంధం ఏర్పడింది.

అతనికి ఒక 25 ఏళ్ల వరకు వుంటాడు కావచ్చు..నన్ను ఎప్పుడు మంచిగా చూసుకొనే వాడు..నేను పనికి వెళ్ళిన ప్రతిసారి ఏదయినా కొనికొచ్చు ఇచ్చే వాడు.

నేను అన్నయ్య.. అన్నయ్య.. అంటూ తన చుట్టే తిరిగేదాని.

నాకు ఆ చిన్న వయసులోనే ట్రాక్టర్ నడపడం కూడా తనే నేర్పించాడు.
మట్టి పోసి వచ్చే  కాళీ ట్రాక్టర్ లో పక్కకు కూర్చొని ..డ్రైవింగ్ చేయడం నేర్పించాడు.

మా అమ్మ వాళ్ళు  వద్దు తనకు ఈప్పుడే ట్రాక్టర్ నేర్పిస్తే రోజు మా ట్రాక్టర్ నడుపుతా అంటాది..మళ్ళీ వాళ్ళ నాన్న కోపాడుతాడు అని అంటుంది.
అయినా సరే నేను ట్రాక్టర్ నడపడం మాత్రం నేర్చుకున్న.

ఎందుకంటే అక్కకు నాన్న నే ట్రాక్టర్ నడపడం నేర్పించాడు ..అందుకే నేను కూడా నేర్చుకుంట అని నేర్చేసుకున్న ..

ఆ "డ్రైవింగ్ చేసే ఫీలింగ్ వుంది చూడు అబ్బా " మాటలో చెప్పలేము..అందుకే కావచ్చు అబ్బాయిలు చదువు కంటే కూడా డ్రైవింగ్ ఫీల్డ్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపుతారు.
అక్క కూడా రోజు స్కూల్ కి వెళ్ళేది స్కూల్ లేని టైం లో పని చేసేది.

కొన్నిరోజుల తరువాత నా ఫ్రెండ్ విద్య కి నవోదయ లో సీట్ వచ్చింది.
దానితో తను స్కూల్ నుంచి వెళ్ళిపోతుంది...
తను వెళ్తున్నాంనదుకు  నాకు చాలా బాధ గా అనిపించింది.

మా స్కూల్ లో ఏప్పుడు క్విజ్ పోటీ పెట్టిన ఇద్దరం చెరో వైపు వుండీ ఒకరికొకరం పోటీ పడే వాళ్లము

కానీ యిప్పుడు తను వెళ్ళిపోతే నేను ఎవరితో పోటీ పడాలి అని చాలా బాధ వేసింది.

ఇంకో పక్క తను వెళ్తే ఇప్పటి నుంచి నేనే క్లాస్ లీడర్ అని సంతోషం కూడా వేసింది.

తను వెళ్లిపోయిన తరువాత నాకు అస్సలు స్కూల్ కి వెళ్లాలి అనిపించలేదు.

కొన్ని రోజులు గడిచిన తరువాత మా లాస్ట్ ఎగ్జామ్ అయిపోక ముందుకే మేము అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది.

మళ్ళీ తట్ట బుట్ట సర్దుకొని చెన్నూర్ అనే వూరికి వెళ్ళాం ..
ఆ వూరు చాలా పెద్దగా వుంది..అక్కడే పని చేయాలి కావచ్చు అనుకున్నాం ..కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ వెళ్ళిన 2 రోజుల తరువాత మళ్ళీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేసాము.

ఎంత దూరం అయిన అందరం ట్రాక్టర్ లోనే వెళ్లే వాళ్లము .
వెళ్లే దారిలో చీకటి పడితే ఒక దగ్గర ఆగి ..ఆ రాత్రి వడుకొని తెచ్చుకున్న అన్నం తిని ...ఆ రాత్రికి అక్కడే పడుకొనే వాళ్ళము.

ఆ వూరు నుంచి మేము వెళ్ళాల్సిన వూరు గోదావరి అవతలి వైపు వుంది దానితో ..
గంగా లో నీళ్లు ఒక దగ్గర మాత్రమే  తక్కువ వుండడం తో అక్కడి నుంచి గంగా దాటాలి అనుకున్నాం..

కానీ ఆ నీళ్ళను దాటే ప్రయత్నం లో మా ట్రాక్టర్ ఇసుకలో దిగపడిపోయింది.
చాలా సేపు ప్రయత్నించినా తరువాత ..ఆ గోదావరి నీటి నుంచి బయట పడ్డాము. 

మరుసటి రోజు .. మళ్ళీ సర్ వాళ్ళు ఫోన్ చేసి వేరే వూరు దగ్గర పని మంచిగా జరుగుతది అక్కడికి వెళ్ళండి అని చెప్పడం తో  ... మొక్కట్రావ్ పేట అనే వూరికి మా ట్రాక్టర్ ను తిప్పాము. 

ఇంక వుంది...
బతుకు బండి లాగడం కోసం ఎన్నో వుళ్ళు దాటాల్సి వచ్చింది