Amma kosam season - 1 in Telugu Spiritual Stories by Abdul Sattar books and stories PDF | అమ్మ కోసం సీసన్ - 1

Featured Books
Categories
Share

అమ్మ కోసం సీసన్ - 1

ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి  ఒక అంగడి దగ్గర బయట కూర్చుని సిగరెట్ తాగుతూ ఉంటారు. హీరో పేరు శ్రీను హీరో ఫ్రెండ్ పేరు రామ్.

 శీను కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. శీను అమ్మ పేరు  పార్వతి. శ్రీను కాల్ ని లిఫ్ట్ చేస్తాడు.

(శ్రీను): నువ్వు ఎందుకు అమ్మ నాకు కాల్ చేస్తున్నావ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మ నాకు కాల్స్ చేయకు అని నీకు కొంచమైనా తెలివి ఉందా లేదా అమ్మ ఎప్పుడూ నాకు కాల్ చేసావ్ విసిగిస్తూనే ఉంటావు.

(పార్వతి): నయన  ఇలా అనవద్దు నయన  నిన్ను చూడాలని ఉంది రా ఏదో నిన్ను కొట్టానని ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు  నువ్వు బాగుపడాలని  నేను నీపై చేయి చేసుకున్న  అంతేకానీ  నేను నిన్ను కావాలని కొట్టలేదు రా  నువ్వు నా ప్రాణం రా  నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరు ఉన్నారా  నువ్వు లేకపోతే నేను ఉండలేను రా  నిన్ను చూడాలని ఉంది రా ఒక్కసారి వచ్చి వెళ్ళు రా 

(శ్రీను): చూడు అమ్మ నువ్వు నాకు ఇలాగే కాల్స్చే సి విసిగించావు. నేను చచ్చిపోతాను. అప్పుడు నువ్వు హ్యాపీ గా ఉండు అమ్మ.

(పార్వతి): నాయనా అంత మాట  అన్న వద్దు నాయనా ఇప్పటినుండి నీకు కాల్స్ చేయను. నీకు కాల్స్ చేసి విసిగించను. నువ్వు జాగ్రత్త నాయన  టైం కి తింటూ ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నాయన.

 శీను కాల్ కట్ చేసి చాలా సేపు అయ్యి ఉంటుంది.

 కానీ ఇది అమ్మకు తెలియదు. తర్వాత అమ్మ చాలా ఎరుస్తుంది.

 అలా మరుసటి రోజు ఉదయం  శీను అలాగే రామ్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూకి వెళతారు. అలా శీను ఇంటర్వ్యూలో  సక్సెస్ అవుతాడు. కానీ శీను హెచ్ఆర్ రౌండ్ లో క్వాలిఫై కాడు. అలా రామ్ ఇంటర్వ్యూలో  సక్సెస్ అవుతాడు. అలాగే రామ్  హెచ్ ఆర్  రౌండ్  లో కూడా క్వాలిఫై అవుతాడు. ఇలా ఈ విధంగా శీను కి ఉద్యోగం రాదు. కానీ రామ్ కి ఏమో ఉద్యోగం వస్తుంది. దీంతో శీను కొంచెం కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. అలా తర్వాత రామ్ 

(రామ్): రేయ్ శీను నువ్వేం బాధపడకు రా ఈ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగం నీకు వస్తుంది రా నువ్వు కొంచెం ట్రై చేయరా  నీకు నేను ఉన్నారా  అని శీనుగిరం ధైర్యం చెప్తాడు.

(శ్రీను): సరే నేను మళ్ళీ వేరే కంపెనీ ట్రై చేస్తాను రా.

(రామ్): హా సరే రా శీను నేను నీకు ఉన్నారా నేను నీకు హెల్ప్ చేస్తాను రా

(శ్రీను): సరే రా రామ్ థాంక్స్ రా  జాబ్ వచ్చింది కదరా పార్టీ లేదా రా  రామ్ 

(రామ్): ఎందుకు లేదు మచ్చా  రాత్రికి మందు తాగుతూ  సరదాగా గడిపేద్దాం  

 అలా రామ్ అలాగే శీను ఇద్దరు కలిసి ఆరోజు రాత్రి  మందు తాగుతూ ఉంటారు.

(రామ్): రేయ్ శీను  నేను ఒకసారి మన ఊరికి  వెళదాం అని అనుకుంటున్నారా నువ్వు కూడా రావచ్చు కదరా

(శ్రీను): ఎందుకురా రామ్  ఊరికి నేను రాను రా  కావాలంటే నువ్వు వెళ్లి రా రా 

(రామ్): అది ఏందిరా  అలా అంటావ్  నాకు ఉద్యోగం వచ్చింది కదరా మన ఊరికి వెళ్లి  మన ఫ్రెండ్స్ కి  పార్టీ ఇద్దామని రా  అలాగే ఫ్రెండ్స్ తో కలిసి  ఎంజాయ్ చేసి వద్దాం అని రా అంతేకాకుండా అమ్మానాన్నలతో  కలిసి టైం స్పెండ్ చేయాలి రా  ముఖ్యంగా మా అమ్మని చూడాలని ఉందిరా నేను మా అమ్మని  చూడక చాలా రోజులు అవుతుంది రా  

(శ్రీను): నువ్వు ఏంట్రా  చిన్నపిల్లాడిలా అమ్మ అని అంటూ ఉంటావు. నువ్వు మీ అమ్మతో మాట్లాడకుండా  నువ్వు ఉండలేవా రా.

(రామ్): అదేంట్రా  ఎంతైనా  అమ్మ కదరా మనకి అమ్మని  మించిన దైవం లేదురా ఉండదు కుదర 

(శ్రీను): కానీ మా అమ్మ నన్ను ఎప్పుడు కొడుతూ ఉంటుందిరా 

(రామ్): కొట్టింది అమ్మే కదరా మనం బాగుపడాలని కొడుతుంది రా  కానీ కావాలనే అమ్మ మనల్ని కొట్టదు కదా రా అలా అంటే నువ్వు ఇంటికి ఎన్నిసార్లు  ఆలస్యంగా వెళ్లి ఉంటావు  నువ్వు ఇంటికి వచ్చేవరకు తను కూడా తినకుండా నీకోసం నువ్వు వస్తావు అని ఎదురుచూస్తూ ఉండేది రా మీ నాన్న నిన్ను కొడుతున్నప్పుడు ఆ దెబ్బలు నీకు తగలకుండా  అడ్డుపడి  అదెబ్బలను తను స్వీకరించేదిరా  ఇప్పటికైనా అమ్మ విలువ తెలుసుకోరా అలాంటి అమ్మకోసం  మనం ఎన్నిసార్లు  చూడడానికి వెళ్లిన తప్పులేదురా 

 ఈ మాటలు వినగానే శీను కాళ్ళలో కన్నీళ్లు వస్తాయి. అనుకోకుండా మందు గ్యాస్ కింద పడిపోతుంది.

(శ్రీను): శ్రీరామ్ నువ్వు చెప్పేదాకా నాకు అమ్మ విలువ తెలియదు రా నేను మా అమ్మని చాలా బాధ పెట్టాను రా మా అమ్మ నాకు నిన్న కాల్ చేసినప్పుడు ఇంకోసారి  నువ్వు నాకు కాల్స్ చేయవద్దు అని కసురుకున్నారా మన ఇద్దరం కలిసి మన ఊరికి వెళ్లుదము నేను ముఖ్యంగా మా అమ్మని చూడాలి మా అమ్మ ని చూసి తన పాదాల మీద పడి  క్షమాపణలు అడగాలి. ఇంకా ఆలస్యం చేయకుండా పదరా వెళ్దాం మన ఊరికి 

 అలా ఆ విధంగా  ఇద్దరు కలిసి  వారి స్వ గ్రామానికి బయలుదేరుతారు. అలా వాళ్ళిద్దరూ  వారి స్వ గ్రామానికి చేరుకుంటారు. (వారి ఊరి పేరు  ఉరవకొండ) ఊరికి వెళ్ళాక చూస్తే  శీను వాళ్ళ ఇల్లు  మొత్తం పడిపోయి ఉంటుంది. అంటే శీను వాళ్ళ ఇల్లు ఒక గుడిసె ఇంటి బయట ఒక పెద్ద చెక్క పెట్ట ఉంటుంది. ఊరి జనాలందరూ  శీను ని కోపంగా చూసు  మీ అమ్మ నువ్వు వస్తే  ఈ చెక్క పెట్ట  నీకు ఇవ్వమని మాకు చెప్పింది. అలా అని చెప్పి వాళ్లు  ఆ చెక్క పెట్టను శీను కి ఇస్తారు. అలా శీను ఆ చెక్క పెట్టను  ఓపెన్ చేస్తాడు. ఆ చెక్క పెట్టెలో  శీను చిన్నప్పటి బట్టలు అలాగే శీను చిన్నప్పుడు ఆడుకునే ఆట బొమ్మలు ఉంటాయి. వాటితో పాటు  ఒక ఉత్తరం అందులో ఉంటుంది. ఆ ఉత్తరాన్ని శీను  తీసుకొని ఓపెన్ చేస్తాడు.

 (అమ్మ శీనుకు రాసిన ఉత్తరం  :)

(పార్వతి ఉత్తరం): నాయన శ్రీను నేను నిన్ను కావాలని కొట్టలేదు రా  నువ్వు తప్పు చేశావని తప్పుడు మార్గంలో వెళ్తున్నావని చిరు స్నేహాలు చేసినావని కోపంతో ఒక దెబ్బ నీ మీద వేశాను రా 

 అంతేగాని నిన్ను కావాలని నేను కొట్టలేదు రా ఎంతైనా నువ్వు  బాగుపడాలని నేను నిన్ను కొట్టాను కానీ  కానీ నువ్వు  నేను నిన్ను కొట్టానని ఒక కారణం తో నువ్వు ఇల్లు వదిలేసి నన్ను వదిలేసి నన్ను ఒంటరిదాన్ని చేసి  నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావు రా  మీ నాన్న బతికి లేరని తెలిసిన  నువ్వు నా నుండి దూరంగా వెళ్లిపోయావు రా నిన్ను కొట్టిన తర్వాత  నాలో నేను ఎంత బాధ పడ్డానో నాకు మాత్రమే తెలుసు నిన్ను నేను కొట్టినందుకు క్షమాపణలు చెబుదామని అనుకునే లోపల నువ్వు ఇల్లు వదిలేసి వెళ్లిపోయావు రా నువ్వు ఇల్లు వదిలేసి వెళ్లిపోయాక నాలో నేనే  ఒక్కదాన్నే  కుమిలి పోయాను రా తర్వాత నేను నీతో మాట్లాడి మన ఇంటికి పిలుచుకుని వద్దాం అనుకుంటే  నువ్వు ఏమో నాకు ఇంకొకసారి కాల్ చేసే  చచ్చిపోతాను  అని అన్నావు రా  అలా నువ్వు అంత మాట అన్నాక  ఏ కన్నతల్లి అయినా  మళ్లీ కొడుకు కాల్ చేస్తుందా  రా ఏ కన్నతల్లికైనా కొడుకు మరణం తీరని లోటును మిగిలిస్తుంది. అందుకే దాని తర్వాత నేను నీకు  కాల్ కూడా చేయలేదు రా. నేను నీకు ఈ ఉత్తరం రాసేముందు  నా ఆరోగ్యం చినిగించిపోయింది  నువ్వు ఈ ఉత్తరం చదివే లోపల నేను ఉంటాను ఉండను నాకు కూడా తెలియదు రా నాకు క్యాన్సర్ వచ్చింది. ఫైనల్ స్టేజీలో ఉందని డాక్టర్ వాళ్ళు చెప్పారు. నువ్వు బతికిన మూడు నెలల కంటే ఎక్కువ బతుకు  అని డాక్టర్ వాళ్ళు నాకు చెప్పారు రా నేను ఇన్ని రోజులు బతుకుతాను నాకు కూడా తెలియదు రా  ఉన్నన్ని రోజులు  నీతో కలిసి హ్యాపీగా ఉందామని నేను నీకు కాల్ చేశాను  రా కానీ నువ్వు అలా మాట్లాడతావ్. నేను అసలు అనుకోలేదురా

 ఇంతతో ఉత్తరం ముగిసింది 

 అలా శీను  ఉత్తరం చదువుతూ శీను  వెక్కి వెక్కి ఏడుస్తూ  ఈ ఉత్తరాన్ని  చదివాడు. అలా తర్వాత sశ్రీను కి ఊరి వారు చెప్తారు. ఇలా మీ అమ్మగారు బ్లడ్ క్యాన్సర్ తో చనిపోయారు. యువతరం అలాగే ఈ పెట్టా నువ్వు వస్తే  నీకు ఇవ్వమని మీ అమ్మగారు చెప్పారు. అలా ఆ విధంగా  ఊరి ప్రజలు  శీను ని  చాలా తిడతారు.

 అలా తర్వాత రామ్

(Ram): నువ్వు నా ఫ్రెండు  వి అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది రా. నువ్వు అసలు నువ్వు మనిషివేన రా అని రామ్ శీనుకి చెప్పి శీను చెంప మీద కొట్టి రామ్ అక్కడినుండి వెళ్లిపోతాడు.

అలా తరువాత ఉరి ప్రజలందరూ శ్రీను వాళ్ళ అమ్మ ని సమాధి చేసిన చోటును శ్రీను కి చెపుతారు. అలా శీను అమ్మ సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు. శీను అమ్మ సమాధి దగ్గరికి వెళ్లేటప్పుడు  శీను కాలు కి గాయం అవుతుంది. శీనుకు రక్తం కూడా  చాలా కారుతుంది. అయినా కానీ శీను  కుంటుకుంటూ కుంటుకుంటూ అమ్మ సమాధి దగ్గర వెళ్తాడు. శీను అమ్మ సమాధి దగ్గరికి వెళ్లి  చాలా బాధపడుతూ  ఏడుసు  అమ్మ నేను అమ్మ  శీను ని వచ్చాను. లేయమ్మా ఒక్కసారి నన్ను చూడమ్మా  అంటూ శీను ఏడుస్తూ ఉంటాడు.

లాస్ట్ గా కధ లో సందేశం అనగా మెస్సేజ్ :

 ఇప్పుడు ఎంత ఏడ్చినా  ఏం ప్రయోజనం అమ్మ బతికి ఉన్నప్పుడే అమ్మని  రాణిలా  చూసుకో లేకపోయినా  అమ్మని అమ్మలా చూసుకోండి. చనిపోయాక అన్నదానం చేయడం. వస్త్ర దానం చేయడం. చేయడం కాదు. అమ్మ బతికి ఉన్నప్పుడే అమ్మని అమ్మలా చూసుకోండి. ఇప్పటికైనా కొంతమందిక కి అమ్మ విలువ తెలియని అమ్మ విలువ తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం  అమ్మని అమ్మలా చూసుకునే వాళ్ళందరికీ నేను రాసిన అమ్మ కోసం  ఈ కథ అంకితం  మా అమ్మ చనిపోయింది. కానీ మా అమ్మ ఇప్పటికీ నాతోనే ఉండాలి. అంటే ఈ బాధ ఎప్పటికీ నాలోనే ఉండాలి.


 ఈ కథ ఇంతటితో ముగియలేదు. అసలు శీను ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి కారణం ఏంటి? అసలు అమ్మ శీను నువ్వు కొట్టడానికి కారణం ఏంటి? అమ్మ శీను ని ఎందుకు పుట్టింది? అసలు శీను చేసిన తప్పేంటి? శీను వాళ్ళ నాన్నగారు ఇలా చనిపోయారు? అన్ని తెలుసుకోవాలంటే? అమ్మ కోసం సీజన్ 2 కోసం ఎదురు చూడండి.?

 ఇంతటితో అమ్మ కోసం సీజన్ 1 ముగిసింది.

 సీజన్ 2 కోసం ఎదురుచూడండి. అతి త్వరలో  సీజన్ 2 రాస్తాను. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే  అమ్మకోసం సీజన్ 2 కోసం ఎదురు చూస్తూ ఉండండి