అధ్యాయం – 1
ఒక తల్లి కోరిక
బంగారు రంగు చీర కట్టుకున్న రమ్య తలపై ఎర్రటి గుడ్డలో ఏదో మూటను పెట్టుకుని వేగంగా నడుస్తోంది. ఆమె అడుగుల్లో అలసట ఉన్నా, మనసులో మాత్రం ఒకే ఒక కోరిక.
వెనకాలే ఆమె భర్త కేశవ వస్తున్నాడు.
“ఎందుకే నీకు ఇన్ని కష్టాలు? ఎవడు పుడితే మనకేంటి?” అని కేశవ విసుగ్గా అడిగాడు.
రమ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది.
“నీకు ఏం తెలుసు కేశవా? మా అన్నయ్య కొడుకులు ఆస్తి కోసం ఒకరినొకరు కొట్టుకుని చచ్చిన రోజులు నేను కళ్లారా చూశాను. నాకు పుట్టబోయే ముగ్గురు కొడుకులు అలా కొట్టుకుని చావకూడదు. అసలు ఆస్తి కోసం గొడవ పడకూడదు.”
ఆమె గొంతులో బాధ పెరిగింది.
“ఎలాగో మనకు ముగ్గురు పిల్లలు పుడతారు. మనం వాళ్లందరికీ సమానంగా ఆస్తి ఇవ్వలేకపోవచ్చు. కానీ... కనీసం వాళ్లందరికీ సమానంగా ప్రేమ ఇవ్వగలిగితే? ఆ ప్రేమతో వాళ్లు మన కోసం కొన్నాళ్లైనా కలిసి ఉంటారు.”
కేశవ ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు.
“ఇదంతా నీకు తెలియదులే.”
“అది కాదు రమ్యా... కొత్తగా పెళ్లైన వాళ్లం. పెళ్లయి మూడు రోజులు కూడా కాలేదు. అప్పటి నుంచి గుడుల చుట్టూ పరిగెడుతున్నావు. ఇలా చేస్తే ముగ్గురు కాదు, కనీసం ఒక్క పిల్లాడు కూడా పుట్టడు.”
“ఇది చివరిది.”
“ఇప్పటివరకు ఎన్ని చివరిలో చెప్పావో లెక్కలేదు.”
రమ్య మాత్రం నవ్వుతూ ముందుకు నడిచింది.
“ఈ ఒక్క గుడి. అంతే.”
---
గణేశుడి ఆలయం
కొద్దిసేపటికి వాళ్లు ఒక పెద్ద గణేశుడి ఆలయం ముందు చేరుకున్నారు.
ఆలయం చుట్టూ భక్తులతో పాటు పూజారులు, పేదలు, అడుక్కునే వాళ్లు కనిపిస్తున్నారు. వచ్చే ప్రతి ఒక్కరినీ రూపాయి, రెండు రూపాయలు అడుగుతున్నారు.
రమ్య మాత్రం ఎవరి మీదా చిరాకు చూపలేదు. తన దగ్గరున్న డబ్బులో కొంత వారికి పంచి ఆలయంలోకి వెళ్లింది.
గణేశుడి ముందు నిలబడి, తన తలపై ఉన్న కొబ్బరికాయ, పూలు, పూజా సామగ్రిని దేవుడి ముందు పెట్టింది.
కళ్లుమూసుకుంది.
“గణేశా... నేను మీ దేవుళ్లందరి గుళ్లూ తిరిగాను. నూట ఎనిమిది గుళ్లు తిరిగాను. నా కోరిక మాత్రం ఒక్కటే.”
ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
“నాకు పుట్టబోయే కొడుకులు ఎప్పటికీ కలిసి ఉండేలా చూడు. ఒకరికి ఒకరు ప్రాణంలా ఉండాలి. ఒకరికి ఏదైనా జరిగితే మరొకరు తట్టుకోలేనంత ప్రేమ ఉండాలి. ఎప్పటికీ విడిపోకూడదు.”
ఆమె కొబ్బరికాయను గణేశుడి ముందు బలంగా కొట్టింది.
ఛట్!
కొబ్బరికాయ రెండు ముక్కలైంది.
కానీ...
ఆ రెండు ముక్కల మధ్య నుంచి ఒక పువ్వు బయటపడింది.
రమ్య కళ్లలో ఆనందం మెరిసింది.
“చూశారా!”
ఆమె ఆ పువ్వును కేశవ చేతిలో పెట్టింది.
“నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది.”
అని చెప్పి, జడలో పెట్టమన్నట్టుగా అతని ముందు వెనక్కి తిరిగింది.
కేశవ నవ్వుతూ పువ్వును ఆమె జడలో పెట్టాడు.
“నీ కోరిక నెరవేరుతుంది అనుకుందాం. కానీ నువ్వు కోరింది మాత్రం చాలా కష్టం.”
“ఏంటి?”
“ఈ కాలంలో అన్నదమ్ములు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ఆస్తి కోసం విడిపోకుండా జీవితాంతం కలిసి ఉండడమా? అది చాలా కష్టం.”
“అందుకే దేవుడిని అడిగాను.”
“నీ దేవుళ్ల సంగతి తెలుసు కదా. రాక్షసులు ఏదైనా అడిగితే దిమ్మతిరిగిపోయే వరాలు ఇచ్చారు. నువ్వు కూడా ఇలాంటి కోరిక అడిగితే మనకు ఏం జరుగుతుందో!”
రమ్య నవ్వింది.
“వాళ్లు రాక్షసులు. నేను తప్పు కోరిక అడగలేదు కదా.”
ఆమె మళ్లీ గణేశుడికి దండం పెట్టింది.
తర్వాత ఆలయం బయట ఉన్న పేదలకు డబ్బులు పంచి, కేశవతో కలిసి ఆటో ఎక్కింది.
ఆటో కదిలింది.
అదే సమయంలో...
ఆలయంలోని ఒక దీపం చిన్నగా రెపరెపలాడింది.
తర్వాత ఒక్కసారిగా పెద్దగా వెలిగింది.
గంటలు మోగాయి.
కెమెరా ఆ జ్వాలలోకి నెమ్మదిగా దూసుకెళ్లింది.
---
రహస్య ప్రయోగశాల
చీకటిగా ఉన్న ఒక రహస్య ల్యాబ్.
గాజు సిలిండర్లలో మెదడుకు సంబంధించిన నరాల వ్యవస్థలు తేలుతున్నాయి.
మూడు వేర్వేరు నర్వస్ సిస్టమ్స్ ఒకదానికొకటి దగ్గరగా అమర్చబడి ఉన్నాయి.
ఎక్కడో దూరంగా శాస్త్రవేత్తల అడుగుల శబ్దం.
“నిజంగా ఇది చేయాలనుకుంటున్నావా?”
ఒక శాస్త్రవేత్త ఆందోళనగా అడిగాడు.
“ఇది చాలా కష్టం.”
మరో వ్యక్తి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు.
“వాళ్ల DNA సరిపోకపోతే మెదడు ఆ వ్యవస్థను అంగీకరించదు.”
“అలాంటప్పుడు నువ్వు కోరుకున్నది జరగదు.”
ఆ వ్యక్తి కళ్లలో నమ్మకం మెరిసింది.
“జరిగి తీరుతుంది.”
“ఎలా అంత నమ్మకంగా చెబుతున్నావు?”
“దీని కోసం ఎన్నో సంవత్సరాలుగా పరిశోధన చేశాను. ముగ్గురిలో ఎవరో ఒకరి DNA తప్పకుండా సరిపోతుంది. మెదడు దాన్ని అంగీకరిస్తుంది.”
అతని మాటలు ల్యాబ్ అంతా మారుమోగాయి.
అప్పుడే...
మూడు నర్వస్ సిస్టమ్స్ ఒక్కసారిగా ఒకదానికొకటి ఢీకొన్నాయి.
భారీ వెలుగు.
---
కొన్ని నెలల తర్వాత
హాస్పిటల్ బయట రమ్య, కేశవ నిలబడి ఉన్నారు.
రమ్య చేతిలో ల్యాబ్ రిపోర్ట్ ఉంది.
ఆమె ముఖంలో ఆనందం.
“మన అదృష్టం బాగోలేదేమో కేశవా. ఈసారి ఒక్క పిల్లాడే ఉన్నాడంట.”
కేశవ ఊపిరి పీల్చుకున్నాడు.
“అమ్మయ్య!”
“కానీ నా కలలో ముగ్గురు పిల్లలు కనిపించారు.”
“ఒకరి తర్వాత ఒకరు పుడతారేమో.”
ఇద్దరూ నవ్వుకున్నారు.
అదే సమయంలో హాస్పిటల్ భవనం వైపు ఒక నర్స్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది.
---
ఐదు రోజుల ముందే
ఇంట్లో రమ్య గర్భవతి.
కేశవ ఆమెకు ప్రతి పనిలో సహాయం చేస్తున్నాడు.
“ఇంకా ఐదు రోజుల్లో మన కొడుకు పుట్టేస్తాడు,” అన్నాడు కేశవ.
“వాడు నీ కొడుకు. నన్ను కొట్టిస్తాడేమో చూద్దాం.”
“చూద్దాం. వాడు నా కొడుకు కాబట్టి ముందు నిన్నే కొట్టిస్తా.”
“వాడు నా కొడుకు. నిన్నే కొట్టిస్తాడు.”
ఇద్దరూ నవ్వుకున్నారు.
భార్య వంట చేస్తుంటే కేశవ సహాయం చేసేవాడు.
ఒకరికి ఒకరు గోరుముద్దలు తినిపించుకునేవారు.
వారి జీవితంలో ఆ రోజులు చాలా ప్రశాంతంగా సాగుతున్నాయి.
కానీ...
వాళ్లు ఊహించిన తేదీ కంటే ముందే రమ్యకు నొప్పులు మొదలయ్యాయి.
“కేశవా!”
ఆమె అరుపు విని కేశవ పరుగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు.
“