Suresh (Veedo Pedda Dhoolesh) in Telugu Comedy stories by Suresh Josyabhatla books and stories PDF | సురేష్ (వీడొ పెద్ద ధూలేష్)

Featured Books
Categories
Share

సురేష్ (వీడొ పెద్ద ధూలేష్)

మన జీవితంలో స్నేహితుల్లో కానీ... బంధువుల్లో కానీ...
మనకి ఎప్పుడో ఒకప్పుడు ఒక ధూలగాడు తగులుతూనే ఉంటాడు.

ధూలగాడు అంటే...

ఏదో ఒకటి చేద్దామని పెద్ద పోటుగాడిలా ప్రయత్నిస్తాడు.
కాని అది చివరికి బెడిసికొడుతుంది.

తన్నులు తినేది వాడొక్కడే అనుకుంటే పొరపాటే...
వాడి పక్కన ఉన్నవాడికి కూడా తన్నులు పడేలా చేస్తాడు.
అలాంటి ధూలేషుల్లో ఒకడే...
మన సురేష్.
ఇది వాడి కథె.

వాడి ధూలేషాలేంటో తెలుసుకుందాం పదండి...

───

సాధారణంగా ఏ మనిషికైనా కౌమార దశ వచ్చాక బుర్ర దొలవడం మొదలవుతుంది.

కానీ...
మన సురేష్‌కి మాత్రం ఆ దొలుపు by birth నుంచే మొదలైంది.

ఏంటి?
నమ్మడం లేదా?

అయితే... వాడి చిన్నతనంలొ జరిగిన సంఘటన ఒకటి చెప్తా...

అది 1990 నవంబర్.
అప్పుడు మన సురేష్‌గాడికి రెండేళ్లు.

వాళ్ల అమ్మ ఆరు నెలల గర్భవతి.

గర్భంతో ఉన్న వాళ్ళ అమ్మకి ఇబ్బంది కాకూడదని, మన సురేష్‌గాడిని వాళ్ల అమ్మమ్మ, తాతయ్య వాళ్ల ఊరికి తమతో పాటు తీసుకెళ్లారు.

మొదట్లో మనవడు చేసే పనులు చూసి ఆ ముసలి వాళ్లు తెగ మురిసిపోయారు.

“మనవడు ఎంత ముద్దుగా ఉన్నాడో!”
అని.

కానీ...
15 రోజులు గడిచేసరికి...

అదే ముసలి వాళ్లు:
“మనవడు ముద్దుగానే ఉన్నాడు... కానీ మాకొద్దు.”

అని నిర్ణయించుకుని, సురేష్‌గాడిని తిరిగి విశాఖపట్నం తీసుకొచ్చేశారు.

అంతటితో కథ అయిపోయిందనుకుంటే ఎలా...
ఇది సురేష్ కథ.

ఇంకా మొదలే కాలేదు.

తర్వాత వాళ్ల తాతయ్య, గర్భవతి అయిన సురేష్ వాళ్ల అమ్మకి సహాయంగా వాళ్ల అమ్మమ్మని విశాఖపట్నంలోనే ఉంచి, తన పనికి వెళ్లిపోయాడు.

───

1990 డిసెంబర్.
చలికాలం.

ఒక మధ్యాహ్నం...

సురేష్ వాళ్ల నాన్న భోజనం చేసి TVS Excel మీద బయటికి వెళ్లారు.

కొంతసేపటికి...
ఇంట్లో సురేష్ వాళ్ల అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ అలసటతో నిద్రపోయారు.

అదే...
మనోడికి కావాల్సిన golden opportunity.
😈
అప్పుడే బయట నుంచి...

“ట్ర్ర్ర్ర్ర్ర్ర్...”🛵

అంటూ TVS Excel శబ్దం వినిపించింది.

మన సురేష్‌గాడు వెంటనే కళ్లు తెరిచాడు.

సురేష్: నాన్న!
అంతే.

ఆలోచన లేదు.

అనుమతి లేదు.

ఎవరికీ చెప్పడం లేదు.

పరిగెత్తడం మొదలు.

వచ్చిన బండి వాళ్ల నాన్నదే అనుకుని...
ఆ బండి వెనకాల పరిగెత్తుకుంటూ...
మనోడు నేరుగా Railway Stationకి వెళ్లిపోయాడు.

───

ఇంట్లో కొంతసేపటికి...
సురేష్ వాళ్ల అమ్మకి, అమ్మమ్మకి మెలుకువ వచ్చింది.

అమ్మ : సురేష్ ఎక్కడ?

అమ్మమ్మ : ఏమొనె ఇక్కడే ఉన్నాడనుకున్నా...

ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.

అమ్మ : అయ్యో! నా బిడ్డ 

అక్కడినుంచి మొదలైంది...
OPERATION: సురేష్ ఎక్కడ?

ఇంట్లో వెతికారు. ఇంటి చుట్టూ వెతికారు కనబడలె...

వీధిలో వెతికారు. చుట్టుపక్కల వెతికారు కనబడలె..

సురేష్ వాళ్ల అమ్మ, ఆరు నెలల గర్భంతోనే ఆందోళనగా వెతుకుతోంది.

చివరికి వాళ్ల నాన్న పని చేసే చోటుకి వెళ్లి

అమ్మ : సురేష్ కనిపించడం లేదు!

దాంతొ వాళ్ళ నాన్నతొ పాటు అక్కడున్న వాళ్లు కొంతమంది కూడా వెతకడం మొదలుపెట్టారు.

───

Meanwhile... Railway Station
మన సురేష్‌గాడికి మాత్రం అసలు ఏమీ తెలియదు.
అక్కడికి వచ్చే వాళ్లని...
వెళ్లే వాళ్లని...
చూస్తూ...

సురేష్ : హెలో... హెలో... 😁
అని చూస్తూ నవ్వుతూ పలకరిస్తున్నాడు.

ఎవరికీ భయపడటం లేదు.

ఇంట్లోవాళ్ళు ...
“పిల్లాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు!” 😨

మనోడు Railway stationలో ...
“హెలో... హెలో...” 😁

సరిగ్గా అప్పుడే అక్కడ పని చేస్తున్న వాళ్ల తాతయ్య స్నేహితులు ఇద్దరు మనోడిని గమనించారు.

ఒకరు ఇంకొకరిని చూసి:
“అరే... ఈ పిల్లాడు మన కృష్ణమూర్తి మనవడు కదూ?”
“అవున్రా!”

వాళ్లు మన సురేష్‌గాడిని తీసుకుని అక్కడున్న టెలిఫోన్ ద్వారా వాళ్ల తాతయ్య పని చేసే చోటుకి ఫోన్ చేశారు.

“కృష్ణమూర్తి గారూ... మీ మనవడు ఇక్కడ Railway Stationలో ఉన్నాడు!”

అంతే.
తాతయ్య వెంటనే వచ్చి మనోడిని చంకలో ఎత్తుకున్నారు.

మన సురేష్‌గాడు?
ఏమీ జరగనట్టే ఉన్నాడు.

───

ఇక సురేష్ వాళ్ల నాన్న...
పిల్లాడు కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇవ్వడానికి బయలుదేరారు.

అంతలో...
ఎదురుగా...
ఇంతలా భీబత్సం చేసి కూడా ఏం తెలియకుండా...

మన సురేష్‌గాడు వాళ్ల తాతయ్య చంకలో కూర్చొని...
కళ్లుమూసుకుని...
కూనిరాగాలు తీసుకుంటూ...
వస్తున్నాడు.

నాన్న ఒక్కసారి ఆగిపోయాడు.
సురేష్ ఒక్కసారి చూసాడు.

నాన్న : “...సురేష్?”

సురేష్ : “హెలో!” 😁

“ఇదండీ మన సురేష్ గాడి ధూలేషాల మొదటి అధ్యాయం.
వయసు రెండేళ్లు.
కానీ అప్పటికే ఒక విషయం మాత్రం clear...
వీడు పెద్దయ్యాక ఏం చేస్తాడో దేవుడికే తెలియాలి.”

అధ్యాయం 2 — వయసుతో పాటు పెరిగిన ధూల

మన సురేష్‌గాడి వయసుతో పాటు వాడి ధూల కూడా పెరుగుతూ వచ్చింది.

రెండేళ్ల వయసులో వాడి ధూల వల్ల ఇప్పటివరకు అవతల వాళ్లకే effect ఉండేది.

కానీ వయసు పెరిగేకొద్దీ...
“మనోడు కూడా damage అవ్వాలి కదా!”
అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.

అప్పటివరకు...
సురేష్ ధూల → ఇతరులకు తలనొప్పి.

తర్వాత...
సురేష్ ధూల → ఇతరులకు తలనొప్పి + మన సురేష్‌కి తలబొప్పి.

క్రికెట్‌లో మొదటి బొక్క

ఇది వాడి కౌమార దశ మొదలయ్యే ముందు సంగతి.

మనోడికి క్రికెట్ అంటే మహా ఇష్టం. ఒకరోజు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ మన సురేష్‌గాడు వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.

కీపర్ అంటే ఏదో చిన్న position కదా? మనోడు అలా అనుకోలేదు. ఇండియా తరఫున వికెట్ కీపింగ్ చేస్తున్నట్టే బిల్డప్.

ఫ్రెండ్ గాడు: రేయ్ సురేష్... కొంచెం వెనక్కి ఉండు.

సురేష్ : నువ్వు ఆట మీద concentrate చెయ్యి. వికెట్ సంగతి నేను చూసుకుంటా.

ఫ్రెండ్ గాడు : ఖర్మ రా బాబు...

అని ఫ్రెండ్ బాలు వేశాడు. ఇంకేముంది అంత confidenceతో ఆడుతున్న మనోడు. అదే ఆటలో...
బుర్ర బొక్క పెట్టుకున్నాడు.

అప్పుడే మొదటిసారి మన సురేష్‌కి అర్థమైంది:
“బిల్డప్ ఇవ్వడం వేరు... దెబ్బ తినడం వేరు.”

కానీ ఆ పాఠం ఎక్కువ కాలం నిలవలేదు.
ఎందుకంటే...
ధూల ఇంకా పూర్తిగా develop అవ్వలేదు.

స్పైడెర్ మ్యాన్ - సురేష్

కౌమార దశ మొదలయ్యే సమయానికి మనోడిలో కొత్త టాలెంట్ బయటపడింది.

Spider-Man.
ఎక్కడో కార్టూన్ లొ చూసాడో...
ఎవరో చెప్పారో...
ఏమో!

కానీ మన సురేష్‌గాడికి ఒక్కసారిగా:
“నేను కూడా చేయగలను.”
అన్న నమ్మకం వచ్చేసింది.

ఒకరోజు...
ఒక ఇంటి మేడ మీద నుంచి ఇంకో ఇంటి మేడ మీదకి దూకే కార్యక్రమం మొదలుపెట్టాడు.

ఫ్రెండ్ గాడు : రేయ్! పడిపోతావురా!

సురేష్ : ఏమీ కాదు రా...!

ఫ్రెండ్ గాడు : రేయి వద్దు రా...!

సురేష్ : నువ్వు చూస్తూ ఉండు రా...

అంటూ మనోడు దూకాడు.
కానీ...
Spider-Manకి లేని ఒక సమస్య మన సురేష్‌కి ఉంది. అదె ధూల...

దూకెటప్పుడు మధ్యలో ventilation glass ఉంది.
ధడామ్!
గాజు పగిలింది.
గాజు ముక్కలు మనోడు కాలిలోకి దిగింది.

Spider-Man stunt...
సురేష్‌కి hospital stuntగా మారింది.

అటు ఇంటి యజమానికి:
“Ventilation glass కొత్తది వేయాలి.

ఇటు సురేష్ వాళ్ల నాన్నకి:
“Hospital bill.

అంటే...
ఒక stuntకి రెండు bills. 😂

సైకిల్ అధ్యాయం

తర్వాత మన సురేష్‌గాడు కొత్తగా సైకిల్ నేర్చుకున్నాడు..

సాధారణంగా కొత్తగా సైకిల్ నేర్చుకున్న పిల్లాడు ఏం చేస్తాడు?

బయట అద్దెకి సైకిల్ తీసుకుంటాడు. జాగ్రత్తగా తొక్కుతాడు.

కాని అలా చేస్తె మన సురేష్ ధూలేష్ ఎందుకు అవుతాడు..?

ఒకరోజు దొంగచాటుగా వాళ్ల నాన్న సైకిల్ తీసుకెళ్లాడు. కాని
తిరిగి వచ్చేటప్పటికి...సైకిల్ ముక్కలై వచ్చింది.

దాంతొ మనోడికి వాళ్ళ నాన్న చేతిలొ...
బడిత పూజ. 😂

ఆ దెబ్బకి వాళ్ల నాన్న ఒక నిర్ణయం తీసుకున్నారు.
పదో తరగతి పాస్ అయ్యేంతవరకు నీకు సైకిల్ లేదు.

అది సురేష్ జీవితంలో సైకిల్‌పై విధించిన అధికారిక నిషేధం.

పదో తరగతి పూర్తయ్యింది — సైకిల్ వచ్చింది

పదో తరగతి పూర్తయింది. సురేష్ పాలిటెక్నిక్ కాలేజీలో చేరాడు.

కాలేజీకి ఇంటికి సుమారు 5 కిలోమీటర్లు దూరం.

ఇక తప్పదు అని
వాళ్ల నాన్న వాడి కోసం సైకిల్ కొన్నారు.

కొత్త సైకిల్.
మొదటి రోజు.

సురేష్: 😎🚲

రెండో రోజు...
సురేష్‌గాడు సైకిల్ మీద ఫీట్లు చేస్తూ ఒక ట్రాక్టర్‌ని గుద్దాడు.

ధామ్!
ముందు చక్రం విరిగింది.
మనోడికి దెబ్బలు తగిలాయి.
మరోసారి...
వాళ్ళ నాన్నకి తడిసి మోపెడు.

అప్పటికి వాళ్ళ నాన్నకి ఒక విషయం అర్థమైంది:
"సైకిల్ నె వీడు బైక్ లా వాడుతున్నాడు స్టంట్లు చేస్తున్నాడు. అదె బైక్ కొంటే ఇంకేం చేస్తాడొ.."

సరె కాలేజీకి వెళ్లేసరికి ధూల తగ్గిందా?
లేదు.
అది తగ్గితే మన సురేష్ ధూలేష ఎందుకు అవుతాడు?
పాలిటెక్నిక్ అయిపోయింది.
ఇంజినీరింగ్‌లో చేరాడు.
వయసు పెరిగింది.
కానీ...
బుర్రలోని ధూల మాత్రం ఇంకా activeగానే ఉంది.

వాలీబాల్ ఆడిన రోజు — అమ్మాయిల ముందు పరువు పోయింది అదె రోజు

ఒక సాయంత్రం.
హాస్టల్ ప్లే గ్రౌండులో సురేష్ తన స్నేహితులతో కలిసి వాలి బాల్ ఆడుతున్నాడు.

అదే సమయంలో కొంతమంది కాలేజీ అమ్మాయిలు ఆ వైపు వస్తున్నారు.

ఇక మనోడికి...
ధూల + యవ్వనం + ప్రేక్షకులు = ప్రమాదకరమైన combination.

బాల్ సురేష్ వైపు వస్తుంది.

ఫ్రెండ్ గాడు : రేయ్... వదిలేయ్! నేను కొడతా.

సురేష్ : నువ్వు ఆగు బే...

ఫ్రెండ్ గాడు : రేయ్ వద్దురా!

సురేష్ : చూడుబె ఇప్పుడు!

అమ్మాయిలు చూస్తున్నారు.
మనోడు తనలోని జాతీయ స్థాయి వాలి బాల్ ఆటగాడిని బయటికి తీశాడు.

బాల్‌ని బలంగా కొట్టడానికి అని ఎగిరాడు....

బాల్‌ని కొట్టాలని చూశాడు.....
అది వాడి ముఖానికి తగిలి వేరె వైపు వెళ్ళింది....

అదె సమయంలొ...
సురేష్ గాడి కుడి కాలు కూడా మరొ directionలోకి వెళ్లింది.

అయ్యో!...
కింద పడిపోయాడు.

అప్పుడు గుర్తొచ్చింది...మనోడు కాళ్ళకి షూస్ వేసుకోలేదు అని..

అంత ఎత్తుకి ఎగిరి దూకితే...
కాలు బెణకక ఏం అవుతుంది?

పాపం మనోడికి మొహం పగిలింది. కాలు బెణికింది. 

ఇక అమ్మాయిల ముందు:
సురేష్ : 😐

ఫ్రెండు గాడు : నేను ముందే వద్దన్నా విన్నావా !

సురేష్‌కి దెబ్బలు తగిలిన నొప్పి కంటే...
పరువు పోవడమే ఎక్కువ నొప్పి. 😂

ఇలా ఎన్నో ధూలేషాలేస్తూ...
ఎన్నో దెబ్బలు తింటూ...

ఎప్పుడో ఒకసారి తెలివిగా కూడా ఉండి...
ఎలాగోలా మన సురేష్‌గాడు B.Tech కూడా పాస్ అయిపోయాడు.

ఇక చదువు అయిపోయింది.
ఉద్యోగం వచ్చింది.

స్థలం? - బెంగళూరు.
అక్కడికి వెళ్లాకైనా ధూల తగ్గుతుందా?
...
మీకు ఇప్పటికే జవాబు తెలుసు.

ఫ్రొఫేషనల్ ధూలేష్..👨‍💼

ఫ్యాక్టరీలో ఉద్యోగం.
మిషెన్లు.
ఇంజినీరింగ్.
టెక్నికల్ knowledge.

ఇక మనోడు settle అవుతాడనుకున్నారా?
అక్కడె తప్పులో కాలేశారు.

సురేష్ : నేను ఇంజీనేర్ ని నీకంటె నాకు బాగా తెలుసు

అని అక్కడున్న టెక్నీషన్ ని ప్రక్కకు తోసి ఏదో పీకుదామని ఒక మిషెన్ setting చేయాలని చూస్తాడు. కాని మొదటికె మొసం. ఏకంగా మిషెన్ పని చేయడమె మానేస్తుంది.

సురేష్ : ఏమైంది?

టెక్నీషన్ : మిషెన్ పోయింది సార్...

సురేష్ : 😢

దాంతొ ఓనర్ దగ్గర నుంచి తిట్లు.

ఓనర్ : సరే... next time జాగ్రత్త.

అని వదిలేశాడు.

కానీ next time వచ్చినప్పుడు...
మళ్లీ అదే.
ఎందుకంటే...
ధూలగాడికి experience పెరుగుతుంది.
కానీ ధూల తగ్గదు కదా..

చిన్న గొడవ... పెద్ద స్ట్రైక్

ఒకరోజు ఫ్యాక్టరీలో ఒక బిహారీ worker, తనలాంటి మరో engineerతో గొడవ పడుతున్నాడు.

సాధారణ మనిషైతె ఏం చేస్తాడు?
గొడవ సద్దుమణిగేలా చేస్తాడు....

కాని మన సురేష్?

సురేష్ : అరే ఏం గొడవ?

అని వెళ్లాడు.
చూసి...
విషయం settle చేయాల్సింది పోయి...
ఆ బిహారి గాడిని నాలుగు పీకాడు.
అంతే.

వాడు ఊరుకోలేదు.
ఫ్యాక్టరీలో ఉన్న పనిచేసె వాళ్ళందరినీ పిలుచుకొచ్చాడు.
Strike చేశాడు...!

ఒక చిన్న గొడవ...
మన సురేష్ చేతిలోంచి...
Factory-wide strikeగా మారింది. 😂

ఇప్పటివరకు మన సురేష్ తన ధూలతో తన family, friends, తనని తాను మాత్రమే ఇబ్బంది పెట్టేవాడు.

ఇప్పుడు మాత్రం...
ఏకంగా factory workforceని involve చేశాడు.

అదృష్టవశాత్తూ పై అధికారులు, HR Manager కలగజేసుకుని strike ఆపించారు.
గొడవ సద్దుమణిగింది.

యజమాని కూడా సురేష్‌ని పెద్దగా ఏమీ అనలేదు.
అంతా అయిపోయింది.

కానీ...
మన సురేష్ ధూల మాత్రం ఇంకా అయిపోలేదు.

రౌడీలతొ గోల -  రచ్చరంబోలా...

ఫ్యాక్టరీలొ గొడవ జరిగిన వారం తర్వాత...

మధ్యాహ్నం భోజనం చేయడానికి అని సురేష్, తనతో పనిచేసే ఇంకొ ఇంజినేర్ తొ కలిసి బయట హోటల్‌కి వెళ్లాడు.
ఆ ఫ్యాక్టరీ ఎలక్ట్రీషన్ బైక్ తీసుకొని.

హోటల్‌లో భోజనం చేస్తూ...
మనోడు మళ్లీ బీరాలు మొదలుపెట్టాడు.

సురేష్ : మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.

2nd ఇంజినేర్ : అవును అవును...

సురేష్ : మెతకగా ఉండకూడదు.

2nd ఇంజినేర్ : అవును అవును...

సురేష్ : Workers అందరినీ ఇలాగే భయపెట్టి పనిచేయించాలి.

2nd ఇంజినేర్ : అవును అవును...

పాపం ఆ 2nd ఇంజినేయర్ కి అప్పటికి ఇంకా తెలియదు...
ఇంకో గంటలో ఈ philosophyకి practical demonstration వస్తుందని. 😂

భోజనం అయిపోయింది. బయటికి వచ్చారు.

బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు.

ట్ర్ర్... ట్ర్ర్... ట్ర్ర్...🏍

Start కాలేదు.

2nd ఇంజినేర్ : నేను ముందు నడుచుకుంటూ వెళ్తా. నువ్వు బైక్ స్టార్ట్ చేసుకొని రా...

అని నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
సురేష్ మాత్రం బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

అంతలో అక్కడున్న ఒక local వ్యక్తిని పిలిచాడు.

సురేష్ : Brother, help please.

అని వచ్చి రాని కన్నడంలొ అడిగాడు...

ఆ వ్యక్తి వచ్చి ఏదో చేసి...
బైక్ స్టార్ట్ చేశాడు.

సురేష్ : థాంక్స్ అండి..

అని బైక్ తీసుకోబోతుంటే...

ఆ వ్యక్తి : నేను ఒకసారి trail వేసి ఇస్తా.

సురేష్ : సారి కుదరదు. ఇది నాది కాదు.

అతను మళ్లీ అడిగాడు.

సురేష్ : లేదు. ఇవ్వను.

అతను మొండికేశాడు. సురేష్ బైక్ తాళాలు లాక్కున్నాడు.

అతనికి కోపం వచ్చింది.
నువ్వెక్కడ ఉంటావు?

మన సురేష్‌గాడు...
చాలా తెలివైన వాడనుకునే ధూలగాడు కదా...

అందుకే తను వాళ్ళ ప్రక్క company పేరు చెప్పాడు.

ఆ వ్యక్తి : అయితే నువ్వు ముందు వెళ్లు. మేము నీ వెనకాల వస్తాం.

అని వెళ్లిపోయాడు.

సురేష్ : ఏంట్రా వీడు ఇలా తగులుకున్నాడు?

అని బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లాడు.
కానీ...

ఆ వ్యక్తి తన బైక్‌తో సురేష్ బైక్ మీదకు వచ్చి గుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఒకసారి.
రెండోసారి.
మూడోసారి.
చివరికి...
సురేష్ కింద పడ్డాడు...!

అంతే.
మన సూరిగాడికి కోపం వచ్చింది.

సురేష్ : ఒరేయ్.... నీ యబ్బా!

అది విన్న ఆ వ్యక్తి బైక్ ఆపి వచ్చి సురేష్ చొక్కా పట్టుకున్నాడు. కొట్టడానికి ప్రయత్నించాడు.

ఇక మనోడు...
అప్పటికే factoryలో workerని కొట్టి మంచి ఫామ్‌లో ఉన్నాడు కదా.

ఫట్ ! ఫట్ ! ఫట్ ! అని వాడి రెండు చెంపలు వాయించేశాడు

అంతె తాగి ఉన్న ఆ వ్యక్తి సురేష్ చెంపదెబ్బలకు కింద పడిపోయాడు.

అ వ్యక్తి లేచి:
ఇక్కడే ఉండు! నా మనుషులతో వస్తా!

అని అరుస్తూ బైక్ మీద వెళ్లిపోయాడు.

సురేష్ మాత్రం : భయపడి పారిపోయాడు.😎

అని విజయోత్సాహంతో factoryకి తిరిగి వచ్చాడు.

ఒక గంట తర్వాత...
📞 Electrician call

Electrician : ఏంటి సురేష్ గారు... ఇలా చేశారు?

సురేష్ : నేనేం చేశాను..?

Electrician : పోయి పోయి లోకల్ రౌడీలతో గొడవ పెట్టుకున్నారే!

సురేష్ : లోకల్ రౌడీలా....?😥

Electrician : మీరు కొట్టిన వాడు లోకల్ దాదా మనిషి. వాడు మీరొచ్చిన bike number బట్టి మిమ్మల్ని వెతుక్కుంటూ తన మనుషులను వేసుకొని factoryకి వచ్చాడు.

సురేష్ : ఇంకా ఉన్నారా?

Electrician : లేదు. మీరు Hyderabad నుంచి వచ్చారు అని... గంట క్రితమె తిరిగి వెళ్లిపోయారని చెప్పి పంపించేశాను.

సురేష్ : చాలా thanks అయ్యా బ్రతికించావు..

Electrician : పరవాలేదు. కానీ మీరు జాగ్రత్త. వాళ్ల కంట పడితే మిమ్మల్ని వదలరు.

సురేష్ : 😰

చూశార....
“ఒక గంట క్రితం వరకు...
‘ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు’
అన్న మన సురేష్‌గాడు...

ఇప్పుడు...
‘నన్నెవరూ గుర్తుపట్టకూడదు’
అని దేవుడిని ప్రార్థించే స్థితికి వచ్చాడు.”
🤣

అదృష్టవశాత్తూ factory లోపలే quarters ఉన్నాయి.
దాంతో మనోడు...
దాదాపు నెల రోజుల పాటు factory బయట అడుగు పెట్టలేదు.

ఏం కావాలన్నా?
“అన్నా... తీసుకురా.”

Food?
“అన్నా... తీసుకురా.”

అవసరం?
“అన్నా... నువ్వే వెళ్లి తెచ్చేయ్.”

మన సురేష్‌గాడు factoryలోనే...
VIP House Arrest. 😂

నెల తర్వాత ఒక రాత్రి...
ముసుగు వేసుకుని ఊరికి వెళ్లాడు.

వారం తర్వాత తిరుపతిలో...
గుండు కొట్టించుకొని తిరిగి వచ్చాడు.

అయినా పది రోజులు factory బయటకు రాలేదు.

తర్వాత మెల్లగా...
రాత్రిళ్లు...
ముసుగేసుకుని బయటికి రావడం మొదలుపెట్టాడు.

ఒకరోజు...
ఎవరూ తనని గుర్తుపట్టడం లేదని అర్థమైంది.

మనోడు ఊపిరి పీల్చుకున్నాడు.
సురేష్ : బ్రతికానురా దేవుడా!

అలా ఆ సంఘటన తర్వాత...
మన సురేష్ గాడి ధూలేషాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి.

Pause.
“కొంచెం మాత్రమే లెండి.”
😂

అన్నట్టు...
మనోడికి ఒక చెల్లి కూడా ఉంది.👧

కానీ ఆమె గురించి ఈ కథలో ఏమీ రాయడం లేదు.
"వ్రాస్తె నన్ను తంతా!

అని మా చెల్లి ముందే నాకు deadly warning ఇచ్చింది.

నాకు మా చెల్లితో పెట్టుకునేంత ధూల లేదు.
అందుకే...
ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ఆపేస్తున్నా..

ఇక్కడితో మన సురేష్ గాడి ధూలగాధ సమాప్తం.
ఇట్లు...
ధూలేష్...
సారీ సారీ...
సురేష్. 🙏