Solar System books and stories free download online pdf in Telugu

సౌర కుటుంబం

మన సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల ముందు ఏర్పడింది. గ్యాస్, డస్ట్, ప్లాస్మా వున్న మాలిక్యులర్ క్లౌడ్ లో జరిగిన గురుత్వాకర్షణ శక్తి వల్ల మన సౌర కుటుంబం ఏర్పడింది. మొట్ట మొదట మన సూర్యుడు ఏర్పడ్డాడు. ఆ తర్వాత మిగిలిన గ్యాస్, డస్ట్ అంతా ఒక ప్లేన్ డిస్క్ లా అయి కొత్తగా ఏర్పడిన సూర్యుని చుట్టూ తిరిగింది. దీనినే ప్రొటోప్లానెటరీ డిస్క్ అంటారు. దీని నుండి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు ఏర్పడ్డాయి.

మన సౌర కుటుంబం 3 భాగాలు గా వుంటుంది.
1. ఇన్నర్ సోలార్ సిస్టమ్
2. ఔటర్ సోలార్ సిస్టమ్
3. ట్రాన్స్ నెప్ట్యూనియన్ రీజన్

ఇన్నర్ సోలార్ సిస్టమ్ లో 4 గ్రహాలు వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, అస్టిరోయిడ బెల్ట్ వుంటుంది. 4 గ్రహాలు ఏంటి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటిని రాతి గ్రహాలు అని కూడా అంటారు. ఇవి సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహాలు. బుధుడు, శుక్రుడు కి ఉపగ్రహాలు వుండవు. భూమి కి ఒకటి అంగారకుడు కి రెండు ఉపగ్రహాలు వున్నాయి. ఈ ఇన్నర్ ప్లానెట్స్ సిలికేట్ ని క్రష్ట్ గా మరియు ఐరన్, నికెల్ పదార్థాలను కోర్ గా కలిగి వుంటాయి.

బుధగ్రహం : సూర్యునికి చాలా దగ్గరగా ఉండే గ్రహం. ఇది సూర్యునికి 0.4 అస్ట్రోమికల్ యూనిట్ (57,909,000కిమీ)దూరం లో వుంది. సౌర కుటుంబం లో వున్న గ్రహాలలో బుధగ్రహం చిన్నది. దీని యొక్క మాస్ లో 60 శాతం కోర్ వుంటుంది. బుధగ్రహం మీద ఒక్క సంవత్సరం అంటే 88 భూమి రోజులు. ఒక్క రోజు అంటే 176 భూమి రోజులు. బుధగ్రహం తన చుట్టూ తాను చాలా నెమ్మదిగా తిరగడం వల్ల బుధగ్రహం మీద ఒక్క రోజు ఒక సంవత్సరం కంటే చాలా ఎక్కువ గా వుంటుంది.

శుక్రుగ్రహం : శుక్రగ్రహం సౌర కుటుంబం లో రెండవ గ్రహం. ఇది సూర్యుని నుండి 0.7 అస్ట్రోమికల్ యూనిట్(108,160,000కిమీ) దూరంలో వుంది. శుక్రగ్రహానికి ఉపగ్రహం, అయస్కాంతక్షేత్రం లేవు. ఇది భూమికంటే చాలా దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉంది. ఈ గ్రహం చాలా వేడిగా వుంటుంది ఇక్కడి ఉష్ణోగ్రతలు 400 డిగ్రీ సెంటీగ్రేడ్ కలిగి వుంటాయి.

భూగ్రహం : భూమి సౌర కుటుంబం లో మూడవ గ్రహం. ఇది సూర్యుని నుండి 1 అస్ట్రోమికల్ యూనిట్(146,600,000కిమీ) దూరంలో వుంది. భూమి కి ఒక ఉపగ్రహం వుంది. మన సౌర కుటుంబం లో కేవలం భూమి మీదనే జీవం వుంది అని భావిస్తున్నారు. కేవలం భూమి మీదనే టెక్టోనిక్ ప్లేట్స్ వున్నాయి. భూమి 21 శాంతం ఆక్సిజన్ ని కలిగి వుంటుంది. భూమికి అయస్కాంతక్షేత్రం వుంది.

అంగారకగ్రహం : అంగారకగ్రహం సౌర కుటుంబం లో నాలుగో గ్రహం. ఇది సూర్యుని నుండి 1.5అస్ట్రోమికల్ యూనిట్(227,990,000కిమీ) దూరంలో వుంది. అంగారకగ్రహం వాతావరణం ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ని కలిగి వుంటుంది. అంగారకగ్రహం ఉపరితలం ఎరుపు రంగంలో వుంటుంది దానికి కారణం ఈ గ్రహం మట్టిలో వున్న ఏరన్ ఆక్సైడ్ వల్ల అంటే తుప్పు వల్ల.

అస్టిరోయిడ్ బెల్ట్ ఇన్నర్ సోలార్ సిస్టమ్ లో చివరిది. ఇది అంగారకునికి బృహస్పతి కి మద్యలో వుంటుంది. ఇది సూర్యుని నుండి 2.3-3.3 అస్ట్రోమికల్ యూనిట్ దూరం లో వుంటుంది. అస్టిరోయిడ్స్ ని మైనర్ ప్లానెట్స్ అని కూడా అంటారు. అస్టిరోయిడ్ బెల్ట్ లో అతి పెద్దది సిరీస్. దీన్ని మరుగుజ్జు గ్రహం అని కూడా అంటారు. అస్టిరోయిడ్ లో 1 మీటర్ కంటే చిన్నగా వుండే వాటిని మీటిరాయిడ్స్ అంటారు. ఈ అస్టిరోయిడ బెల్ట్ లో కొన్ని మిలియన్ వస్తువులు వున్నాయి. 

సౌర కుటుంబం లో రెండవ భాగం ఔటర్ సోలార్ సిస్టమ్. ఇది చాలా పెద్ద గ్రహాలను కలిగి వుంటాయి. అవి గురుడు, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. ఈ ఔటర్ సోలార్ సిస్టమ్ లో నాలుగు పెద్ద గ్రహాలు కొన్ని ఉల్కలు వుంటాయి. గురుడు, శని అతి పెద్ద గ్రహాలు. ఇవి ఎక్కువ శాతం హైడ్రోజన్, హీలియం ని కలిగి వుంటాయి. యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు సూర్యునికి చాలా దూరంగా వుండటం వల్ల మంచుని కలిగి వుంటాయి. 
ఈ రెండు గ్రహాలను ఐస్ జైన్ట్స్ అంటారు. ఔటర్ సోలార్ సిస్టమ్ లో వున్న నాలుగు గ్రహాలకు వాటి చుట్టూ రింగ్స్ వుంటాయి. 

గురుగ్రహం: గురుగ్రహం సౌర కుటుంబం లో అయుదవ గ్రహం. ఇది సూర్యుని నుండి 5.2అస్ట్రోమికల్ యూనిట్(778,360,000కిమీ) దూరంలో వుంది. సౌర కుటుంబం లో అతి పెద్ద గ్రహం గురుగ్రహం. ఈ గ్రహం లో వున్న ఎక్కువ వేడి వల్ల క్లౌడ్ బాండ్స్, గ్రేట్ రెడ్ స్పాట్ ని కలిగి వుంటుంది. గ్రేట్ రెడ్ స్పాట్ మన భూమి కంటే చాలా పెద్దది. 1830 నుండి ఈ గ్రేట్ రెడ్ స్పాట్ ని గామనిస్తున్నారు. గురుగ్రహం 72 ఉపగ్రహాలను కలిగి వుంది. అందులో 4 పెద్ద ఉపగ్రహాలు వున్నాయి. అవి గానమిడ్, కలిస్టో, ఐఓ, ఇరోపా. గానమిడ్ సౌర కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం. 

శనిగ్రహం: శనిగ్రహం సౌర కుటుంబం లో ఆరవ గ్రహం. ఇది సూర్యుని నుండి 9.5 అస్ట్రోమికల్ యూనిట్(1,433,500,000కిమీ) దూరంలో వుంది. శనిగ్రహం యొక్క రింగ్స్ ఐస్ మరియు రాక్స్ పార్టికిల్స్ ని కలిగి వుంటాయి. శనిగ్రహం కి 62 ఉపగ్రహాలు వున్నాయి. అందులో టైటాన్, ఎన్సిలిడస్ లో జియోలాజికల్ ఆక్టివిటీస్ వున్నట్లు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

యురేనస్ : యురేనస్ సౌర కుటుంబం లో ఏడవ గ్రహం. ఇది సూర్యుని నుండి 19.2 అస్ట్రోమికల్ యూనిట్(2,872,400,000కిమీ) దూరంలో వుంది. యురేనస్ యొక్క ఆక్సిస్ 90 డిగ్రీలు వంగి వుంటుంది. యురేనస్ యొక్క కోర్ చాలా చల్లగా వుంటుంది. ఇది చాలా తక్కువ వేడి ని ఇస్తుంది. యురేనస్ కి 27 ఉపగ్రహాలు వున్నాయి. ఇక్కడ వున్న ఒత్తిడి వల్ల ఇక్కడ నీళ్ల బదులు వజ్రాలు వర్షం లా పడతాయి. 

నెప్ట్యూన్ : నెప్ట్యూన్ సౌర కుటుంబం లో ఎనిమిదో గ్రహం. ఇది సూర్యుని నుండి 30.1 అస్ట్రోమికల్ యూనిట్(4,498,400,000కిమీ) దూరంలో వుంది. నెప్ట్యూన్ కూడా యురేనస్ లా నే వుంటుంది. దీనికి 14 ఉపగ్రహాలు వున్నాయి. 

సౌర కుటుంబం లో మూడవ బాగం ట్రాన్స్ నెప్ట్యూనియన్ రీజన్. నెప్ట్యూన్ కక్ష్య ప్రాంతం దాటిన తర్వాత ట్రాన్స్ నెప్ట్యూనియన్ రీజన్ వుంటుంది. దీనిలో కైపర్ బెల్ట్, ప్లూటో, మరుగుజ్జు గ్రహాలు మరియూ ఓవర్లాపుడ్ డిస్క్ అఫ్  స్కాటర్డ్ అబ్జెక్ట్స్ వుంటాయి. వీటి కక్ష్య సౌర కుటుంబం కక్ష్య కి వ్యతిరేకంగా వంగి వుంటుంది. 

కైపర్ బెల్ట్ అస్టిరోయిడ్ బెల్ట్ లాగానే వుంటుంది. కాకపోతే ఇక్కడ అన్ని ఐస్ ని కలిగి వుంటాయి. కైపర్ బెల్ట్ ని నెప్ట్యూన్ ప్రభావితం చేస్తుంది. ఇది సూర్యుని కి 30-50 అస్ట్రోమికల్ యూనిట్ దూరం లో వుంటుంది. దీనిలో కొన్ని వేల మరుగుజ్జు గ్రహాలు వుంటాయి. కాని ఎక్కువ శాతం చిన్న చిన్న అస్టిరోయిడ్స్ వుంటాయి. మొత్తం కైపర్ బెల్ట్ లో ఒక లక్ష అబ్జెక్ట్స్ వుంటాయి కానీ వీటి మాస్ మొత్తం మన భూమి మాస్ లో 10 శాతం మాత్రమే వుంటుంది. 

ప్లూటో కైపర్ బెల్ట్ లో అతి పెద్ద మరుగుజ్జు గ్రహం. ఇది సూర్యుని నుండి 39 అస్ట్రోమికల్ యూనిట్ దూరం లో వుంటుంది. దీన్ని 1930 లో కనుగొన్నప్పుడు దీన్ని తొమ్మిదో గ్రహం గా పిలిచారు. కాని 2006 లో గ్రహలకు గల నిర్వచనం అర్దం చేసుకుని ప్లూటో గ్రహం కాదు అని ఇది ఒక మరుగుజ్జు గ్రహం అని తేల్చారు. దీని యొక్క కక్ష్య మన గ్రహాల కక్ష్య కంటే 17 డిగ్రీలు వంగి వుంటుంది. 

కైపర్ బెల్ట్ తర్వాత స్కాటర్డ్ డిస్క్ మొదలు అవుతుంది. దీన్ని నెప్ట్యూన్ ప్రభావితం చేయలేదు. అందుకే ఇవి ఎలా పడితే అలా తిరుగుతూ వుంటాయి. ఈ స్కాటర్డ్ డిస్క్ 
సూర్యుని కి 55-1000 అస్ట్రోమికల్ యూనిట్ దూరం లో వుంటుంది. అరిస్ అనేది స్కాటర్డ్ డిస్క్ లో ఒక మరుగుజ్జు గ్రహం. దీని కక్ష్య 45 డిగ్రీలు వంగి వుంటుంది. స్కాటర్డ్ డిస్క్ గురించి ఎక్కువ విషయాలు తెలియవు. ఎందుకు అంటే ఇది సూర్యుని నుండి చాలా దూరం లో వుండటం వల్ల ఇక్కడ కాంతి వుండదు,మనం టెలిస్కోప్ తో ఫోటో తీయలేము, ఒకవేళ ఇక్కడికి ప్రోబ్స్ ని పంపించాలి అంటే అవి స్కాటర్డ్ డిస్క్ ని చేరడానికి తక్కువలో తక్కువ 20 సంవత్సరాలు పడుతుంది.

స్కాటర్డ్ డిస్క్ తర్వాత ఓర్త్ క్లౌడ్ వుంటుంది. ఇది ఒక ఊహాత్మక క్లౌడ్ అంటే ఇది వుంది అని ఊహిస్తున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లేవు. ఇది సౌర కుటుంబం కి ఆకరిది. ఇది సూర్యుని నుండి 2000-20,000 అస్ట్రోమికల్ యూనిట్ దూరం లో వుంటుంది. ఇది సౌర కుటుంబం చుట్టూ ఒక బుడగ లా వుంటుంది. సూర్యుని గురుత్వాకర్షణ ఇక్కడ చాలా తక్కువగా వుంటుంది. ఈ అబ్జక్ట్స్ కొంచెం సూర్యుని గురుత్వాకర్షణ తో కొంచెం సౌర కుటుంబం బయట వున్న నక్షత్రాల గురుత్వాకర్షణ తో ప్రభావితం అవుతాయి. ఈ  అబ్జక్ట్స్ సూర్యుని చుట్టూ ఒక్క సారి తిరిగి రావడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది.

ధన్యవాదాలు, 
చంద్రకళ ? 


ఈ కథని మీరు చూడాలి ante నా యూట్యూబ్ చానెల్  Drishti Telugu లో చూడవచ్చు. ఆ వీడియో చూసి దాన్ని Subscribe చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు మీ అభిప్రాయాలు కామెంట్స్ చేయండి.