true love story books and stories free download online pdf in Telugu

పవిత్రమైన ఓ తొలి ప్రేమ కథ

అందరికీ నమస్కారం🙏🙏 , ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరుపునుండి శ్రీరామనవమి శుభాకాంక్షలు
💐💐✍️💐💐💐💐.

అనగనగ అమలాపురంలో ఓ మధ్య తరగతి కుటుంబం నివసిస్తూ ఉంది, అ కుటుంబంలో ఒక భార్య, భర్త ఉన్నారు.వారికి ఒక పాప కూడా ఉంది, పాప పేరు శ్వేత.
శ్వేతకి మూడేళ్ల వయసు ఉంటుంది..ఆ భార్య,భర్తలకి
ఉన్నది ఒక్కరే పాప కాబట్టి చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా, గారంభంగా పెంచుతున్నారు. శ్వేతకి ఐదైళ్లు వచ్చిన తరువాత స్కూల్లో చేర్పించారు.చాలా బాగా చదువుతూ ఉంటుంది.రోజూ స్కూల్ ఫ్రెండ్స్ తో చాలా సంతోషంగా ఆడుకుంటుంది, అలాగే వాళ్ల కుటుంబంతో కూడా చాలా ప్రేమగా ఉంటుంది..వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ నాన్న గారు అన్ని రకాల టాలెంట్స్ నేర్పించారు.భరత నాట్యం, ఖో-ఖో, ఇతరులుతో మాటలే విధానం ఇంకా అన్ని రకాల టాలెంట్స్ నేర్పించారు.వాళ్ళు హిందూ ధర్మం పాటించడం మూలంగా శ్వేత భరతనాట్యం నేర్చుకుంది. ఇంతలోనే తన ఐదో తరగతి farewell పార్టీ వచ్చేసింది. ఆ పార్టీలో తాను భరతనాట్యం చేసింది,ఆ పార్టీకే హైలైట్.ఆ టాలెంట్ కి అందరు తనను చిన్న వయసులోనే ఇలాంటి ఒక అరుదైన కళ ఉండటం నువ్వు చేసుకున్న అదృష్టం అని చాలా బాగా మెచ్చుకున్నారు..ఇక శ్వేత అనందంకి హద్దులు లేవు.. వాళ్ల నాన్న గారు కూడా దానికి తనని ఎంతో
ఆనందించారు. ఇంతలోనే వాళ్ల నాన్న గారు తనని ఓ హైస్కూల్లో చేర్పించారు.. మొదట్లో చాలా ఇబ్బంది గానే ఉంది అంతా కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్ , తరువాత నెమ్మదిగా అందరితో కలిసింది.ఇంకా అందరికీ చాలా గట్టిగా పోటీ ఇచ్చేది అటు ఆటలలో, ఇటు చదువులలో, ఇంకా నృత్యములో కూడా. ప్రతి సంవత్సరం ఆటలలో ఖో- ఖో లో తానే వాళ్ల టీమ్ నీ గెలిపించేది.అల ఆరు, ఏడో తరగతి కూడా పూర్తిచేసింది.

తరువాత ఎనిమిదో తరగతికి వచ్చేసింది,వాళ్ల తరగతిలో అప్పుడు ఒక కొత్త అబ్బాయి వచ్చి చేరాడు.ఆ అబ్బాయి పేరు పీటర్..పీటర్ చాలా బాగా చదువుతాడు, మంచి అథ్లెటిక్,ఇంకా మంచి నృత్యకారుడు,మంచి దయాగుణం కలవాడు,అందరికీ హెల్ప్ కూడా చేస్తుంటాడు, మంచి క్రికెటర్, పీటర్ every day క్రికెట్ ప్రాక్టీస్ చేస్తాడు ఒక్క ఆదివారం తప్ప ఎందుకు అంటే ఇతను ఒక క్రిస్టియన్ అవ్వడం మూలంగా ప్రతి ఆదివారం
చర్చ్ కి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు ఇంకా చర్చ్ నుండి ఇంటికి వచ్చే దారిలో చాలా మందికి హెల్ప్ చేసేవాడు...
అప్పుడు ఏనిమిదో తరగతి
ఆగస్టు 15కి నృత్య ప్రదర్శన పోటీలలో శ్వేత మరియు పీటర్ కూడా పాల్గొన్నారు. మొదటిగా పీటర్ తన నృత్యాన్ని ప్రదర్శించాడు,దానికి అందరు చప్పట్లతో అతనిని మెచ్చుకున్నారు, తరువాత శ్వేత తన నృత్యాన్ని ప్రదర్శించింది,దానికి సభ మొత్తం చప్పట్లతో మోతమోగించారు.అప్పుడే శ్వేతనీ మొదటసారి చూస్తున్నాడు పీటర్ .పీటర్ తన నృత్యాన్ని ప్రదర్శించిన తరువాత మొదటి ప్రైజ్ ఆశించాడు కానీ శ్వేత నృత్యాన్ని చూసి
ముగ్దుడైయిపోయాడు ఇంకా అతనినీ అతడు మర్చిపోయాడు.

అతనికి తెలియకుండానే శ్వేత భరతనాట్యం
చేస్తునప్పుడు ఒక దేవతలా కనిపిస్తుంది.
అతనకి తెలియకుండానే తన గుండె చప్పుడు,
సముద్రపు అలలుగా కొట్టుకుంటుంది.
చూస్తుంది కొన్ని క్షణాలలో గల సంఘటనే అయిన
అతను ఊహించుకుంటుంది తన వందేళ్ళ జీవితాన్ని.

ఇంకా ఇవ్వన్ని జరిగిన తరువాత పీటర్ తన ప్రైజ్ సంగతే మర్చిపోయాడు.. అనుకున్నట్టుగానే శ్వేతకే మొదటి ప్రైజ్ వచ్చింది.ఇంక పీటర్ కి ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు.
ఆ అమ్మాయినే ఊహించుకొని మురిసి పోతున్నాడు.ఇంకా
ఏదో రకంగా ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవాలి అని
డిసైడ్ అయ్యి ఆ రాత్రి పడుకున్నాడు.

తరువాత రోజు స్కూల్ కి వెళ్ళాడు,ఆ అమ్మాయితో ఏదో
ఒకటి చేసి మాట్లాడాలి అని అనుకుంటున్నాడు కానీ
మాట్లాడ లేకపోతునాడు.

మాట్లాడు అని చెప్పే మనసునీ,
గుండె నుండి వచ్చే ఏదో తెలియని భయం
తనని మాట్లాడకుండా ఆపేస్తుంది.

ఇంతలో శ్వేతనే పీటర్ దగ్గరకి వచ్చి నువ్వు నిన్న
చాలా బాగా dance చేశావ్ అని చెప్తుంది.
దానికి పీటర్ స్పందిస్తూ చాలా కృతజ్ఞతలు అని చెప్తాడు.
శ్వేత అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

ఆ క్షణంలో పీటర్ నీ పీటర్ రే మనసులో తిట్టుకుంటున్నాడు.

అతను కూడబెట్టి తెచ్చుకునే ధైర్యం
అతను మాట్లాడాలనుకొనే మాటలు
అతను తెలియజేయాలనుకునే మనసులో భావాలు
ఇవ్వన్ని ఒక్క క్షణంలో శ్వేతనీ చూస్తే వదిలేస్తున్నాడు.

ఇలా ఆనందించే క్షణాలలో వారి ఏనిమిదో పూర్తిచేశారు..
ఇంకా exams కంప్లీట్ చేసుకొన్న తర్వాత తనలోని భావాలు చెప్పాలి అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది.ఇక పీటర్ ఏం చెయ్యలేక ఇంటికి వచ్చేశాడు..
ఇక ఈ వేసవి సెలవులనీ ,తనని చూడని నేను ఎలా సమయాన్ని గడపాలి అని ఆలోచిస్తున్నాడు....
ఇంకా రోజు తన గురించి ఆలోచిస్తూ అతనిలో ఉన్న
ఆనందాన్ని,బాధలని ఒక బుక్ లో రాస్తుంటాడు.అందులో రాసుకున్నది ఇది ఒక్కటీ..

@1. ఎందుకో తెలీదు నిన్ను మరులేకపోతున్నా
నువ్వు నాకు ఒక రోజులో సూర్యచంద్రుల అనిపిస్తావ్
నువ్వు కనబడితే ఉషోదయం అయ్యినట్టు ఉంటుంది అలాగే అంతలోనే కొన్ని క్షణాల తర్వాత చంద్రునిలా మాయం అయిపోతావ్,ఒక రోజుని సూర్య చంద్రులు పూర్తి చేస్తే ,ఆ ఒక్క రోజులో నాకు వచ్చే అనందాన్ని నువ్వు పూర్తి చేస్తున్నావ్..

అలా తనలోని భావాలును ఒక బుక్ లో రాసుకుంటూ అలా సమ్మర్ హాలిడేస్ నీ పీటర్ లో ఉండే ప్రేమని చాలా దగ్గరగా
వ్యక్త పర్చుకుంటాడు.తెలియకుండానే సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి, తరువాత రోజు పీటర్ స్కూల్ కి 8:00కే వెళ్ళిపోతాడు కాని శ్వేత మాత్రం 10:00 అయితే గాని రాదు.

ఎప్పుడు చూడని పీటర్ శ్వేత వైపు తన ప్రేమలో లీనం అవుతూ చూస్తూ ఉండిపోయాడు.. ఎప్పట్టీలానే స్కూల్ అయిపోయిన తర్వాత శ్వేతతో మాట్లాడాలి అనుకొని మాట్లాడాలేడు.అలా రోజులు గడుస్తున్న కొద్ది పీటర్
తన ప్రేమని చెప్పాలని ప్రయత్నిస్తాడు అలా ఒక సందర్భంలో తనని లైబ్రరీలో కలిసి తన కుటుంబం గురించి తెలుసుకుంటాడు. ఆ రోజు రాత్రి చాలా హ్యాపీ గా ఫీల్ అవుతూ పడుకుంటాడు.ఇంకా ఇలా కాదు అని చెప్పి తాను చెప్పాలనుకుంటున్నా మాటల్లన్ని లవ్ లెటర్ రూపంలో రాస్తాడు కానీ నా మనసులో భావాలు నా మాటల రూపంలోనీ చెపితే బావుంటుంది అని ఆలోచించి చింపేస్తాడు. తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుంటారు.

చివరగా 10 క్లాస్ లో చెప్పకపోతే ఎప్పటి కి చెప్పలేను అని చాలా బలంగా నమ్ముతాడు.అందుకు ఆ అమ్మాయి వాళ్ల ఇంటి అడ్రస్ తెలుసుకొని రోజు follow అవుతూ ఉంటాడు.ఇంకా తన గురించి తెలుసుకొంటూ ఉంటాడు..ఇంకా రోజు తనతో మాటలాడుతూ ఉండేవాడు.ఇంకా ఇన్ని చేసిన తరువాత
శ్వేత కి అనుమానం వస్తుంది.కొన్ని రోజులు పీటర్ తో సరిగా
మాటాల్లాదు.చివరగా వాళ్ల 10th క్లాస్ farewell party రానే వచ్చింది..

అప్పుడు పీటర్ శ్వేత దగ్గరికి వెళ్లి నీతో కొన్ని క్షణాలు మాట్లాడాలి అని చెప్తాడు
దానికి శ్వేత చెప్పు..అంటుంది.
అప్పుడు పీటర్ శ్వేతతో ఇలా చెప్తాడు
" నువ్వు నీకు తెలియకుండానే నాకు చాలా సంతోషాన్ని ఇస్తునావ్ ఏంత అని అంటే నేను క్రికెట్ అడినప్పుడు నా షాట్ చూసి నేనే మురిసిపోయంత అలాగే
ఒక తాజ్ మహల్ చూసి ఓ ప్రేమికుడుకి కలిగిన ఆనందం అంతా అలాగే ఒక రైటర్ కి తాను రాసిన కథ అతనే చదివి సంతోషపడినంత,ఇంత ఆనందాన్ని నువ్వే ఇస్తున్నవ్ అందుకే నువ్వే నా ప్రపంచం అవుతావు అని
అనుకుంటున్న I LOVE YOU...❤️❤️"

శ్వేత దానికి బదులుగా "ఇది మనకి తెలిసి తెలియని వయసు,ఇది అంతా ఒక ఆకర్షణ, ఇది ప్రేమ కాదు ఇప్పుడు ఇలాగే ఉంటుంది, తరువాత తెలుస్తుంది ఏది రైట్, ఏది రాంగ్ అని..."అని చెప్తుంది.

అప్పుడు పీటర్ "అది ఏమి కాదు నేను నిజంగానే చాలా నిజాయితీగా,చాలా స్వచ్ఛంగా,చాలా పవిత్రంగా ప్రేమిస్తున్నా" అని చెప్తాడు.

దానికి శ్వేత "కాదు ఇప్పుడు ఇలానే వుంటుంది కానీ తరువాత తెలుస్తుంది .ఇంకెప్పుడు ఇలాంటి ఉద్దేశంతో మాత్రం నా దగ్గరకు రావద్దు. గుడ్ బై 👋👋👋"అని చెప్తుంది...

అప్పుడు ఏం చెయ్యాలో తెలియక కుమిలి పోతూ బాధపడుతుంటాడు పీటర్...తన జీవితం ఇక ముందుకి వెళ్లనివ్వడు. ఎప్పటికైనా నాకోసం నా శ్వేత వస్తుంది అనే ఒక ఎదురు చూపు గల నమ్మకంతో వచ్చే ఊహలలో బ్రతుకుతాడు. పీటర్ తన జీవితాన్ని అక్కడే ఆపేస్తాడు...

అక్కడ నుండే పీటర్ ఒక మంచి రైటర్ అయిపోతాడు,తన శ్వేత వస్తుంది అనే ఒక ఒక్క ఆశతో కవితలు రాసుకుంటాడు ఎందుకు అంటే ఒక తొలిప్రేమ లో ఫెయిల్ అయిన వాడు మాత్రం ఒక గొప్ప రైటర్ అయిపోతాడు ఎంతలా అంటే తన కంటే మంచి రైటర్ ఇంకా ఎవరు లేరు అనే ఒక పిచ్చి ఊహలలో ఉండిపోతాడు..

అక్కడ నుండే హెల్పింగ్ నేచర్ నీ ఎక్కువగా చేస్తాడు..

శ్వేత మాత్రం తన 10th క్లాస్ పూర్తయిన తరువాత,ఇంటర్
ఇంటర్ తరువాత డిగ్రీ కళాశాలలో జాయిన్ అవుతుంది.
అప్పుడు డిగ్రీ రెండవ సంవత్సరంలో జాఫర్ అనే అబ్బాయితో చాలా ఫ్రెండ్లీగా కలిసి మాట్లాడుతుంది. అప్పుడప్పుడు
క్యాంపస్ లలో క్లాసెస్ అయిపోయిన తరువాత సరదాగా
మాట్లాడుకుంటారు.ఇంకా శ్వేత తన ప్రతి personal విషయం జాఫర్ తో పంచుకుంటుంది.రోజు తన డైరీలో తాను జాఫర్ తో మాట్లాడిన మాటలు రాసుకుంటుంది.ఇంకా అతని ఇష్టాలని ఆమె ఇష్టాలుగా మార్చుకుంది.ఒక రోజు తన డైరీలో తాను చిన్నప్పడు రాసిన కొన్ని లైన్స్... ఇవి

@1. నాకు వచ్చే భర్త నాక్కంటే కొంచం పొడువుగా ఉండాలి.
నాకు వచ్చే భర్త చాలా మంచివాడే ఉండాలి.
నేను పుట్టినప్పటి నుండి నేను నమ్మే మగవాళ్ళ లో
మొదటిది మా నాన్న గారు,రెండు నా భర్త అయ్యిఉండాలి.
ఇంకా నన్ను వాళ్ల అమ్మలా చూసుకోవాలి.

ఇలా కొన్ని తన భర్తకి షరతులు పెట్టుకుంది శ్వేత

ఇలా అన్ని జాఫర్ లో ఉన్నాయని గట్టిగా నమ్మి,తన భర్తగా ఊహికుంటుంది.ఒకరోజు శ్వేత వేసుకున్న డ్రెస్ 👗 చూసి జాఫర్ డ్రెస్ చాలా బాగుంది అని చెప్తాడు.ఇక శ్వేత ఆనందం కి అవ్వధులు లేవ్,తన ఊహలకు హాద్దులు లేకుండాపోయాయి.
ఒకరోజు చాలా సరదాగా కబుర్లు చెప్పుకునేటప్పుడు శ్వేత జాఫర్ నీ నేన్నాంటే నీకు ఇష్టమా కాదా?అని అడుగుతుంది.అప్పుడు దానికి బదులుగా జాఫర్ అవును నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్తాడు.ఇక శ్వేత ఆ రోజు రాత్రి పడుకొకుండా వెన్నెలలో తన కలల రాకుమారుడుని గురించి ఆలోచిస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉంటుంది,తన ఆలోనలకు ఆదుపు లేకుండాపోతుంది.ఆ వెన్నెల రాత్రిలో ఒక కవిత రాస్తుంది. అది ఇదే

బయట చల్లగా ఉంది
జాబిల్లి తెల్లగా ఉంది
నా రాకుమారుడు నా గుండెల్లో ఉన్నాడు,అని రాసుకుంటుంది

ఇంకా ఎలా అయిన తన డిగ్రీ కళాశాల రోజులలో కచ్చితంగా చెప్పాలనికుంటుంది..పీటర్ మాదిరిగానే అనుకుంటుంది.
శ్వేతకి తెలియకుండానే జాఫర్ పై ఆశలు పెట్టుకుంది.

ఏదైనా ఒక దానిపై ఆసక్తి ఉంటే ఇష్టం అంటారు
అదే ఇష్టం కొంచం ఎక్కువయితే ఆశ అంటారు
అదే ఆశ ఇంకొంచం ఎక్కువయితే అత్యాశ అంటారు
అంటే అత్యాశ అనేది ఆసక్తితోనే మొదలవుతుంది.

ఇప్పుడు నీపైన ఉన్న ఈ అత్యాశ గల ప్రేమ,ఒక్కప్పుడు
నాలో ఉన్న ఓ చిన్న అసక్తితోనే మొదలయ్యింది.
అని శ్వేత తన డైరీలో రాసుకుంటుంది.

అది డిగ్రీ కళాశాలకి వీడ్కోలు జరుపుకుంటున్న సమయం.
తన మనసులోని మాటలు తెలియజేయడానికి బయలుదేరిన సమయం.వారి మధ్య సంభాషణ ఇలా సాగింది

శ్వేత: హాయ్
జాఫర్: హాయ్
శ్వేత : ఏంటి ఫుల్ జోష్ లో ఉన్నట్టు ఉన్నావ్?
జాఫర్ : ఎంత అయిన ఈరోజు ఒక్క రోజే కదా? మన ఫ్రెండ్స్ నీ
అందరినీ వదిలి వెళ్ళల్లంటే చాలా బాధగా ఉంది.
శ్వేత : (తన మనసులో) ఆ నిన్ను వదిలి వెళ్లాలంటే నాకూ
బాధగా ఉంది...
జాఫర్ : మాది ఓ చిన్న మధ్య తరగతి కుటుంబం,నాకు
తెలియని సంతోషలని, బాధలని ఇక్కడే చూసాను..
అప్పుడప్పుడు అనిపిస్తుంది కొన్ని క్షణాలు అయిపోతే
బావుంటుంది అని" మనం క్లాసెస్ లాంటివి" అలాగే
కొన్ని సందర్భాల్లో ఈ క్షణాలు ఇంకా ఉంటే
బాగుంటుంది అని" అలాంటివే ఈ క్షణాలు కూడా"
అందుకే నాకు చాలా బాధగా ఉంది.
శ్వేత : అవును నాకు కూడా చాలా బాధగా ఉంది..మన ఫ్రెండ్స్
అందరినీ వదిలి వెళ్లాలంటే.. ముఖ్యంగా నిన్ను.
జాఫర్ : ఏంటి?
శ్వేత : అవును నేను చెప్పింది, నువ్వు విన్నది కూడా నిజమే.
నేను నిన్ను చాలా స్వచ్ఛంగా,చాలా పవిత్రంగా
ప్రేమిస్తున్నా..
జాఫర్ : ఇది ఏప్పటినుండి?
శ్వేత : నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుండి, ఏవో
తెలియని ఊహలు,ఆలోచనలు అవి అన్ని నీ గురించే.
నీకు గుర్తుందా? నువ్వు నన్ను నీ డ్రెస్ బాగుంది అని
చెప్పావ్ అప్పుడు నన్ను నేను మర్చిపోయి ఊహల్లలో
తేలేసాను.ఇంకా తరువాత ఇంకోసారి నిన్ను
" నేను అంటే ఇష్టమో లేదో అని అడిగాను గుర్తుందా?" అప్పుడు నువ్వు "అవును నాకు నువ్వంటే ఇష్టమే "అని
చెప్పావ్ అప్పుడు నేను నేనింకా డిసైడ్ అయ్యాను
అప్పుడు నువ్వే నా భర్త అని..ఇంకా నేను కోరుకున్న
నా రాకుమారుడుకి ఉండవలసిన లక్షణాలు అన్నీ నీలో
చూశాను...అందుకే " I LOVE YOU ❤️❤️❤️" జాఫర్.
జాఫర్ : ఓయ్ ఏం మాట్లాడుతున్నావ్ నేను ఇంకా కొన్ని క్షణాల
ముందే కదా నాది ఓ మధ్య తరగతి కుటుంబం అని
చెప్పాను, నాకంటూ కొన్ని జ్ఞాపకాలు ఈ కళాశాలలో
చూశాను అని అన్నాను,అప్పుడే ఇలాంటి వార్త వింటాను
అనుకోలేదు. నేను ఓ సాధారణంగా మధ్య తరగతి
కుటుంబంలో అంటే వేసుకోడానికి ఒక మూడు షర్ట్ లు,
ఒక రెండు ప్యాంట్లు, ఉండడానికి ఒక చిన్న గుడిలాంటి
ఇల్లు, సరిగ్గా మూడు పుట్లా తినడానికి తిండి కూడా
ఉండదు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఒక అబ్బాయికి
ప్రేమ అనేది అవసరమా? నాకు ఇలాంటి ప్రేమలపై
పెద్ద నమ్మకాలు లేవు,నువ్వు నన్ను మర్చిపో, నీ లైఫ్
నువ్వు చూసుకో, నీ మీద ఉన్నది పెళ్లి చేసుకునే అంతా
ప్రేమ ఏ మాత్రం కాదు,ఒక మంచి స్నేహితురాలిగా కలిసి
మాటలాడే ఓ ఇష్టం తప్ప. ఇంకెప్పుడు ఇలాంటి ఉద్దేశంతో
మాత్రం దయచేసి నన్ను కలవద్దు.good bye 👋👋👋..


శ్వేత పీటర్ మాదిరిగానే కుమిలి కుమిలి ఏడుస్తూ, చాలా బాధపడుతుంది.తన బాధ సముద్రంలో అఖాతం లాంటిది.
తాను జాఫర్ తో గడిపిన క్షణములు తిరిగిరావని తలుచుకుంటే
తన కంటిలో కన్నీళ్లు అగడంలేదు.జాఫర్ జ్ఞాపకాలతో తన కాలాన్ని గడిపేస్తుంది..

ఇవ్వన్ని చూసిన పీటర్ ఫ్రెండ్స్ పీటర్ తో లేనిపోని విషయాలు తాను మంచిది కాదురా అన్ని చెప్తారు కానీ పీటర్ వారి మాటలు
నమ్మాడు.కాదురా నా శ్వేత అలాంటి కాదురా...అని చెప్తాడు.

కొన్ని రోజులు తరువాత శ్వేతకి పీటర్ గుర్తువచ్చి ఒకసారి వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్తుంది, వెళ్ళిన వెంటనే శ్వేత పీటర్ నీ గుర్తుపట్టలేదు,పీటర్ మొత్తం గెడ్డాలు అన్నీ పెంచేసి దేవదాసులా
తయారవ్వుతాడు.పీటర్ శ్వేతనీ చూసి "నాకు తెలుసు శ్వేత నువ్వు నాకోసం వస్తావని,ఇన్నాళ్లు నువ్వు లేవని ఏదో తెలియని బాధ నన్ను ఒక ముర్కుడిగా ఉంచేసింది.ఇప్పుడు నువ్వు
వచ్చేసావ్వుగా ఇప్పుడు ఈ క్షణం నుండి చాలా సంతోషంగా ఉంటాను." అని చెప్తాడు.దానికి బదులుగా శ్వేత తన ప్రేమలో జాఫర్ తో జరిగిన విశేషాలు అన్నీ చెప్తుంది.అప్పుడు పీటర్
"నీ మీద ఉన్న ప్రేమ ఇప్పటికీ చనిపోలేదు,అది అలానే ఉంది
నీకు తెలుసో తెలీదో నేను ఒక ఆనాథానీ,నేను పుట్టినప్పుడే, చిన్నప్పుడే మా అమ్మ నాన్నలు చనిపోయారు..కానీ మా ఆమ్మ అంటే నాకు ఎంత ప్రేమ అంటే"" నేను చనిపోయిన మా అమ్మ ప్రేమని నేను ఋజువు చేసుకోలేనంత"". మా అమ్మ తరువాత అంతా ప్రేమని పెంచుకుంది నీపైనే...

నాకు అమ్మ, అమ్మాయి అని పలకడానికి ఒక అక్షరం తేడా అదే వారిపై ప్రేమనీ నిలపెట్టుకోడానికి రెండు అక్షరాలు గల
జన్మ సరిపోదు
అదే ఋజువు చేసుకోడానికి మూడు అక్షరాలా మరణం రావాలి.
వారిపై చూపేది ప్రేమ అయితే,ఆ ప్రేమని ప్రేమించింది నా ప్రాణం,ఆ ప్రేమ పోవాలి అంటే నా ప్రాణం పోవాలి..
అని పీటర్ చెప్పాడు.

దానికి ఏం మాట్లాడలేక శ్వేత అక్కడనుండి వాళ్ల ఇంటికి వెళ్లిపోతుంది.తరువాత శ్వేత ఇంటికి వెళ్లి చాలా దీర్ఘంగా
ఆలోచిస్తుంది,అయిన శ్వేత జాఫర్ ఆలోచనలో నుండి బయటకి రాలేదు...కానీ పీటర్ గురించి ఆలోచిస్తూ " ఏంటి ఐద్దెళ్ళ నుండి ఇంకా ప్రేమిస్తున్నాడా? చాలా ఆశ్చర్యంగా ఉందే" కానీ జాఫర్ నీ
తల్చుకుని చాలా బాధపడుతుంది. తరువాత రోజు నుండి పీటర్ ఇంటికి వెళ్లి రోజు మాట్లాడుతుంది.పీటర్ కి కూడా ఇష్టం కాబట్టి రోజు చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని రోజులు తరువాత జాఫర్ జ్ఞాపకాలు,పీటర్ తో ఉండడం వల్ల పీటర్ వల్ల వచ్చే ఆనందాలు, సంతోషాలు వలన పోతున్నాయి అని తెలిసి
మనం పెళ్ళిచేసుకుందాం అని అడుగుతుంది..

అవును పెద్దలు అంటారు కదా
ముల్లుని ముల్లుతో తీయ్యాలని అది నిజమే అలాగే
"ఒక అబ్బాయి నుండి వచ్చే బాధని
వేరే అబ్బాయి నుండి వచ్చే సంతోషంతోనే తీయ్యగల్లం"

నీతో గడిపే క్షణాలు వలన వచ్చే ఆనందాలు,
జాఫర్ వల్ల వచ్చే బాధని పోగొట్టేల చేస్తుంది.
అందుకే మనం పెళ్లి చేసుకుందాం అని అడిగుతుంది.
దానికి పీటర్ కూడా సరే అంటాడు....

ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోడానికి డిసైడ్ అయిపోతారు...

జాఫర్ ఒక రెండు సంవత్సరాల తరువాత లైఫ్ లో సెటిల్
అయ్యి ఒక అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుంటాడు.

ఇంకా శ్వేత వాళ్ల నాన్న గారు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు,చూసిన ప్రతి సంబందం,పీటర్ పై ఉన్న ప్రేమ వలన నచ్చలేదు అనేలా చూస్తుంది...అలా ఒక సంవత్సరం పాటు చూసిన పెళ్లి సంబంధాలు వాయిదా వేస్తూ వస్తుంది,
చివరిగా ఒక సంబంధం ఫిక్స్ చేస్తారు వాళ్ల నాన్న గారు.
ఈ విషయం తెలుసుకున్న పీటర్ శ్వేత వాళ్ల ఇంటికి వచ్చి
వాళ్ల నాన్న గారితో శ్వేతనీ ప్రేమిస్తున్నా సంగతి చెపుతాడు.
దానికి వాళ్ల నాన్న గారు" ఎవరు నువ్వు? నువ్వు ఎం చేస్తూ ఉంటావ్? మీ తల్లిదండ్రులు ఎవరు? మీ కులం ఏంటి? నీ మతం ఏంటి?" అని అడుగుతారు..వాటిలో ఏ ఒక్క దానికి కూడా పీటర్ దగ్గర సమాధానం లేదు...వాళ్ల నాన్న గారు చేసిన అవమానం
ఏం చేయాలో తెలియట లేదు కానీ ఏం చేయలేకపోతున్నాడు, శ్వేత మీద ప్రేమతో గల ఒకే ఒక్క కారణంతోనే... నీ ఆర్థిక స్తోమత ఏంటి? అని అడగగా దానికి నేను ఒక ఆనాథానీ
ప్రస్తుతానికి నాకంటూ ఏం లేదు..కానీ నేను ఒక ఉద్యోగం తెచ్చుకొని మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను అని చెప్తాడు.దానికి శ్వేత వాళ్ల నాన్న గారు నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని మా అమ్మాయిని అడగడానికి రా అప్పుడు చూద్దాం అని పీటర్ తో చెప్తారు.. దానినీ నిజంగానే ఒక జాబ్ నీ
గోల్ గా పెట్టుకొని ఎలా అయిన సాధించాలి అనుకుంటాడు.

పీటర్ ఎక్కడైతే తన జీవితాన్ని వదిలేద్దాం అనుకుంటాడో, అక్కడి నుండే జీవితాన్ని మళ్లీ మొదలుపెడతాడు..
తరువాత రోజు నుండే తన జీవితాన్ని మొదలుపెడతాడు.
అప్పటి వరకు,ఐదేళ్ళపాటు చదువు అంటే ఏంటో మర్చిపోయిన
పీటర్ మళ్లీ తన ప్రేమని గెలుచుకోడానికి మళ్లీ పుస్తకం తెరుస్తాడు...మొదటిలో చాలా కష్టంగా ఉంటుంది.. తరువాత
ఓ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు.ఇంకా చాలా నరకంగా
ఉంటుంది.వాళ్ళు చెప్పినవి ఏవి అర్దంకావు..అయిన తన ప్రేమని
సాధించుకోవడానికి చాలా కష్టపడి చదువుతున్నాడు. అలా ఆరు నెలలు కష్టపడి ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని శ్వేత వాళ్ల ఇంటికి వెళ్లి ,వాళ్ల నాన్న గారితో మాటలాడి తన ప్రేమను తనకిచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతాడు. దానికి వాళ్ల నాన్న గారు మీరు ఏ కులమునికి చెందినవారు అని అడుగుతారు, వెంటనే అప్పుడు వరకు తన తండ్రినీ ఎదురించని శ్వేత వాళ్ల నాన్న గారినీ ఏదురిస్తుంది. కులానికి, ప్రేమకి సంబందం ఏంటి
నాన్నగారు? పీటర్ నీ నాకిచ్చి పెళ్ళి చెయ్యకపోతే నేను చనిపోతాను అని వేడుకుటుంది.

చేసింది ఏంలేక ఆలోచించి తన కూతురిని పీటర్ కి పెళ్లి చేస్తారు.
ఇంకా పీటర్ శ్వేత నీ పెళ్ళి చేసుకుని సంపాదించిన ఉద్యోగంతో గెలుచుకున్న ప్రేమతో చాలా సుఖంగా, హాయిగా బ్రతుకుతారు....

చూశారు కదా ఫ్రెండ్స్ ఇది అసలయిన నిజమైన, స్వచ్ఛమైన, అతి పవిత్రమైన ప్రేమ.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయసులో ఎవరో ఒక వ్యక్తిపై ప్రేమని చూపిస్తారు.

ఈ నాటి రోజుల్లో ఎక్కువ మంది వ్యక్తులు డబ్బు కోసం,
కామ కోర్కెలు తీర్చుకోవడం కోసం, మరికొందరు టైమ్ పాస్ కోసం ఇలా రక రకాలుగా ప్రేమని వాడుకుంటున్నారు...

ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించిన తరువాత ఏంత దూరమైన వెళ్ళాలి, నిజాయితీగా చెప్పాలంటే చచ్చే అంతవరకు వెళ్ళాలి,అదే నిజమైన ప్రేమ.

పీటర్ అందుకే తన తొలి ప్రేమని గెలుచుకున్నాడు.
తనిని కాదని వెళ్ళిన తన ప్రేయసి కోసం ఓ ఐద్దేళ్లు ఎదురుచూపు,తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వినకపోవడం
తన ప్రేమని దక్కించుకోవడం కోసం ఒక ఉద్యోగం వేతుకోడం
ఈ మూడింటిలో ఏ ఒక్క పని చేయకపోయినా తన తొలి ప్రేమ
తనకి దొరికైది కాదు.

అన్నిటి కంటే ముఖ్యంగా తన ప్రేమే తనకి జీవితంలో
ఒక లక్ష్యంని ఏర్పరచుకునేలా చేసింది అదే తన ప్రేమని గెల్చుకునేలా చేసింది కూడా.

నిజమైన ప్రేమకి ధైర్యం కావాలి.తప్పదు అనే పరిస్థితిలలో
కాకుండా, తప్పకుండా అనే పరిస్థితిలలో తన నాన్నగారిని
ఎదురించడానికి శ్వేతకి,అలాగే తన ప్రేమని దక్కించుకోవడం కోసం పీటర్ కి ధైర్యం అవసరమైంది. అలాగే

నిజమైన ప్రేమకి నమ్మకం కావాలి. తనని కాదని వెళ్ళిన
శ్వేత మళ్లీ వస్తుంది అనే నమ్మకం,అలాగే జాఫర్ తనని కాదని వెళ్ళిన తరువాత శ్వేత పీటర్ ని నమ్మడం..వారికి అవసరం అయింది.

నిజమైన ప్రేమకి డబ్బు కూడా కచ్చితంగా అవసరం..
అలాగే కదా తనకి ఆర్ధిక స్తోమత లేక మొదటిగా శ్వేతనీ వాళ్ల నాన్న గారు పీటర్ కి ఇవ్వలేదు.

అలాగే నిజమైన ప్రేమకి వేరే వాళ్ల మాటలు వినే ఆలోచన ఉండకూడదు,అలాగే క్యాస్ట్ ఫీలింగ్స్, religion ఫీలింగ్స్ ఉండకూడదు.అందుకే కదా పీటర్(cristiyan) శ్వేతనీ(Hindus) లవ్ చేస్తాడు అలాగే శ్వేత జాఫర్(Muslim) నీ లవ్ చేస్తుంది.

చివరగా ఒక్క మాట ఈ కథ అంతా ఒక్కరిదే కాదు నాకు తెలిసిన లవ్ స్టోరీలుతో కలిసి నా లవ్ స్టోరీనీ కూడా
కలుపుకొని కల్పితంగా రాసిన కథ.
ఈ స్టోరీ చదివినప్పుడు కనీసం ఎక్కడో ఒక దగ్గర మీ లవ్ స్టోరీ
గుర్తు వస్తుంది అని ఆశిస్తున్నాను...🙏🙏

TRUE LOVE ALWAYS WORTH THE WAIT


ఇట్లు
మీ దుర్గా ప్రసాద్ (రాఘవ లారెన్స్ ఫ్యాన్)