Her Story - 2 books and stories free download online pdf in Telugu

ఆమె కథ(వ్యధ) - 2

రాజీవ్ గారు లోపలికి రావడంతో!! కంగారుగా బయటకు వెళ్ళిపోతాడు సమీర్.

సమీర్,, సిరి ఒకటే కాలెజ్.... బట్ అతను ఆమె కన్నా సీనియర్.. ఆమె అందరితో ఉండే విధానం,,తన వ్యక్తిత్వం నచ్చి!! అతనికే తెలియకుండా ప్రేమలో పడిపోయాడు సమీర్. ఇప్పుడు కూడా తన ప్రపోజ్ తెలియడానికే ఈ పార్టీ.

ఇంట్లో సమీర్ గురించి చెప్పకుండా !! ఫ్రెండ్ బర్త్డే అని అందంగా రెడీ అయ్యి సమీర్ చెప్పిన హోటల్ కి స్టార్ట్ అవుతుంది సిరి.

ఆమె వచ్చేసరికి సమీర్ బయట నుంచుని సిరి కోసం వెయిట్ చేస్తుంటే!! ఆటోకి మనీ ఇచ్చి సమీర్ కనిపించడంతో!! చిరునవ్వుతో అతని దగ్గరగా వస్తుంది.

పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ లో సిరి అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంటే!! సమీర్ రెప్ప వేయ్యడం మరిచి ఆమె వైపు చూస్తూ ఉండిపోతాడు.

హెలో సార్ ఏంటి అలా ఉండిపోయారు??

సిరి యూ లూకింగ్ మార్వలెస్.

అతని మాటకి బుగ్గల్లో మందారాలు పుస్తుంటే!!

పదా సిరి లోపలికి వెళ్దాం అని తీసుకెళ్తాడు సమీర్.

వన్ ఫోర్ త్రీ రూమ్ కి తీసుకెళ్ళి!! డోర్ లాక్ చేయ్యడంతో!! సిరి భయపడుతూ!! ఏంటి సమీర్ గారు ఎవ్వరు లేరు అని బెరుగ్గా అడుగుతుంది.

ఇది మన పర్సనల్ పార్టీ బటర్ప్లై... ప్లీజ్ డోంట్ ప్యానిక్.

సమీర్ గారు నేను వెళ్ళిపోతాను??

ఒక్క టూ మినిట్స్ నేను చెప్పేది విను... తరువాత నీ ఇష్టం... నిజాయితీగా అంటాడు సమీర్.

సిరి బెరుగ్గా చూస్తూ నిలబడటంతో!!

చూసిన వెంటనే నచ్చేకన్నా!! చూసేకోద్ది నచ్చితే ఆ బంధం బలపడుతుంది అని ట్రస్ట్ చేస్తాను సిరి... నిన్ను చూసినప్పుడు ఎమ్ అనిపించలేదు... బట్ చూసేకోద్ది చాలా నచ్చేసావ్.... అందుకే నిన్ను వదులుకోవాలి అనిపించట్లేదు.... అతను నీల్ డౌన్ అవుతూ!! " ఐ లవ్ యూ సిరి!! విల్ యూ మ్యారీ మీ " ప్రేమనంతా కళ్ళల్లో నింపుకుని ప్రపోజ్ చేస్తాడు అతను.

అతని అలా ‌ప్రపోజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయ్యని సిరి! షాక్ అవుతూ చూస్తుండిపోతుంది...

ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది రా... ఈ హ్యపీ మూమెంట్ లో నా లవ్ మెటర్ కూడా షెర్ చేసుకోవాలనిపించింది. బటర్ప్లై ప్లీజ్ ఆక్సెప్ట్ మై లవ్ ??

సిరికి కూడా సమీర్ అంటే మనసులో గుడ్ ఇంప్రెషన్ ఉంది... మన వెనకాల ఎవరు తిరుగుతున్నారో?? తెలుసుకోలేనంత అమాయకులు కాదుగా ఈ జనరేషన్ యువత.. సమీర్ చూపులు అతని పనులు అన్ని తెలుస్తున్నా !! మనసులో నవ్వుకుంటూ ఎమి తెలియనట్టుగా తన చదువులో ఉండేది.

ఇప్పుడు అతని ప్రపోజల్ ని ఒప్పుకోమని వయసు ఆరాట పడుతుంటే!! మనసు వెనకడుగు వెయ్యమని !! ఇది సరైన వయసు కాదని హెచ్చరిస్తోంది.

ఆమె రెండింటి నడుమ సతమతమవుతుంటే!! ట్రస్ట్ మీ బటర్ప్లై..... లైఫ్ లాంగ్ నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను.... ఒక్కసారి నా మాట నమ్మి నడిచి చూడు... ప్రేమగా అంటాడు సమీర్.

మెడదు,, మనసు గోడవలో సమీర్ మాటలు ప్రభావం మైండ్ మీద పడుతూ!! ప్రేమగా ఆమె చేతిని అతనికి అందిస్తుంది సిరి.

సమీర్ సంతోషంగా ఆమె చేతిని పట్టుకుని రింగ్ తోడిగి ప్రేమగా ఆ చేతిని కిస్ చేస్తాడు.

తోలి మగవాడి స్పర్శ!! అతని పెదవుల తాకిడి వల్ల ఆమె శరీరం కంపిస్తుంటే !! బెరుగ్గా చేతిని వెనక్కి తీసుకుంటుంది సిరి.

బటర్ప్లై !! కెన్ ఐ కిస్ యూ?? మన మొదటి ముద్దు కూడా మెమరబుల్ గా ఉండాలి.... నీ కిష్టం లేకపోతే వద్దురా??

మనసుకి నచ్చినవాడు?? అతని కళ్ళల్లో కనిపిస్తున్న సిన్సియారీటీ?? అడిగింది ఇవ్వమని ప్రేరేపించే ఏకాంతం.

సిరి బిడియంగా కళ్ళు వాల్చడంతో !! ఆమె నుండి ఆన్సర్ దోరికింది అన్నట్టుగా!! సిరి దగ్గరిగా జరిగి ఆమె ఫెస్ ని పట్టుకుని " లుక్ ఎట్ మీ బేబి ". హస్కిగా పిలుస్తాడు సమీర్.

అతని వాయిస్ కి పెదవులు మరింత అదురుతుంటే!! " ప్లీజ్ సమీర్ .... ఐ కాంట్ " కష్టంగా మాట్లాడుతుంది.

అతని వెచ్చటి ఊపిరి నేరుగా ఆమె పెదవులకి తాకుతూ!! మరింత అదురుతుంటే అతను ఆగలేక ఆమె పెదవులని అందుకుంటాడు సమీర్.

చిన్నగా మొదలైన పెదవుల సయ్యాట ఇద్దరిలో మైకాన్ని తెప్పించి!! ఒకరి మీద ఇంకోకరికి తాపాన్ని పెంచి!! మరో స్టెప్ ముందుకెళ్ళేలా ప్రేరేపిస్తుంది ఆ ఏకాంతం.

ఇద్దరు గంట సేపటి తరువాత స్వర్గపుటంచులు వరకు వెళ్ళి!! అలసిన తనువులతో వేరు పడటంతో!! అప్పటి వరకు కమ్మిన మైకం !! సిరి కళ్ళ వెంట కన్నీరుగా ప్రవహిస్తుంటుంది.

వై ఆర్ యూ క్రైయింగ్ సిరి??

సమీర్ నాకు భయంగా ఉంది.... అని ఏడుస్తూ ఉంటుంది సిరి.

నేను నిన్ను చీట్ చేస్తాననుకున్నావా సిరి??

చిన్నగా షివరింగ్ వస్తుంటే!! నో సమీర్.... కాని ఎందుకో భయంగా ఉంది.

కూల్ సిరి... ఐ లవ్ యూ సో మచ్... ఆమెని హత్తుకుంటూ అంటాడు.

సమీర్ ఇప్పటికే లెట్ అయ్యింది.... నన్ను డ్రాప్ చేయ్యవా ప్లీజ్??

ఒకే పానిక్ అవ్వకు.... డ్రస్ వెర్ చేయ్.

ఆమె బెడ్షీట్ చూట్టుకుని వాష్రూమ్ కి వెళ్ళి!! కాసేపటి తరువాత కష్టంగా బయటకి వస్తుంది.

వాట్ హెపెండ్ సిరి??

నడవలేకపోతున్నాను సమీర్.

ఐమ్ సోరిరా!! అని ఆమెని ఎత్తుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు.

సిరి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయాక!! కమల గారికి ఎటువంటి అనుమానం రాకుండా తన రూమ్ కి వెళ్ళి !! తోలి కలయిక వల్ల ఆబ్డోమినల్ పెయిన్ వస్తుంటే!! టాబ్లెట్ వేసుకుని కళ్ళు మూస్తుంది సిరి.

ఆ మర్నాడు ఉదయాన్నే ఎయిట్ అయినా లేవకపోవడంతో!! కమల గారు సిరి రూమ్ కి వచ్చి ఆమెని తడుతూ ఉంటారు. ఆమె ఒళ్ళు వేడిగా కాలిపోతుంటే!! రాజీవ్ గారిని పిలిచి కంగారుగా హస్పిటల్ కి తీసుకెళ్తారు.

వన్ నాట్ వన్ జ్వరానికి రెండు ఇంజెక్షన్స్ చేయించి టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి వస్తారు ఇద్దరూ.

ఇంకా ఉంది.