Will this journey reach the coast.. - 17 in Telugu Love Stories by Lakshmi Venkatesh దేవేష్ books and stories PDF | ఈ పయనం తీరం చేరేనా...- 17

Featured Books
Categories
Share

ఈ పయనం తీరం చేరేనా...- 17

చెప్పడం మరిచితిని.. ముందు భాగాలు చదివాకా ఇది చదివితే కధ అర్ధం అవుతుంది కొత్తగా ఓపెన్ చేస్తే అసలేం అర్ధం కాదు రేటింగ్ తగ్గుతుంది.. కాబట్టి ముందు 1-16 చదివాకా 17 ఓపెన్ చెయ్యండి.. నాకు తెలుసు మీరు మాట వింటారు.. 🤗🤗


పర్వీన్ కి ఇది వరకు కోడలు అంటే వున్న ప్రేమ కంటే కూడా ఇప్పుడు తనని చూసిన తర్వాత ఇంక ఎక్కువ అయిపోయింది.. వచ్చి ధరణి పక్కన కూర్చొని తన తల నిమురుతూ.. తన చేతిని తన చేతిలోకి తీసుకొని " అడగవచ్చ ఏంటి అమ్మ.. అడుగు.. నీకు అడిగే హక్కు వుంది.." ప్రేమగా చెప్తుంది..


ధరణి కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.. చనిపోయిన తల్లి కళ్ళ ముందు మెదిలింది.. దాదాపుగా తల్లి చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత మొదటి సారి ఇప్పుడే ఆ స్వచ్చమైన ప్రేమ నీ చూస్తుంది..


ధరణి కళ్ళల్లో బాధ నీ చూసి ఎందుకో అర్దం కాక " అమ్మ ధరణి.. ఏమైంది తల్లి.." అంటూ ప్రేమగా తన మోము నీ చేతుల్లోకి తీసుకొని కళ్ళు తుడిచి అడిగారు..


మొదటి సారి ఫార్మల్టీ గా కాకుండా మనస్ఫూర్తిగా " అత్తమ్మ " అన్నది.. ఆ ప్రేమ పర్వీన్ కి తెలిసింది అలానే గుండెలకి హత్తుకొని " ఏమైంది అమ్మ.." అని అడిగింది..


ఫామాల్టీ గా అంటే మొదట్లో భయం తో అనేది.. అత్తమ్మ అని ఆ తర్వాత అలవాటు అయ్యింది.. రెండు రోజుల అలవాటే కదా...


ధరణి కళ్ళు తుడుచుకొని " అది.. అది.. మరి.. మీరు.." అడగటానికి ఇబ్బంది పడుతుంటే..


పర్వీన్ " చూడు ధరణి నీకు ఈ ఇంట్లో అందరి గురించి.. అన్నిటి గురించి తెలుసుకునే హక్కు వుంది.. ఇలా వుంటే నాకు అస్సలు నచ్చదు.. నీ మనసులో ఏముందో దైర్యం గా అడుగు.." అనేసరికి


ధరణి " అది అత్తమ్మ మిమల్ని మీ పేరుని చూస్తుంటే ముస్లీం అమ్మాయి లా వున్నారు కానీ మీరు ఆచారాలు.. పద్దతులు అన్ని హిందూ సంప్రదాయాన్ని తలపిస్తున్నాయి.. ఎందుకో తెలుసుకోవచ్చ.." అని అడుగుతుంది.


దానికి పర్వీన్ " పిచ్చి తల్లి.. ఇది అడగటానికి ఇంత భాయపడ్డవ.." అని " నేను మీ మావయ్య గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నాము..


మీ మావయ్య గారి కుటుంబం వాళ్లు ఒప్పుకున్నారు కానీ మా పుట్టింటి వాళ్లు ఒప్పుకోలేదు.. అందుకే మీ మావయ్య గారి కుటుంబ అండ చూసుకుని పెళ్లి చేసుకున్నాము... మా మావయ్య గారిది మాది కూడా ఇక్కడికి దగ్గరలో ఊరే.. మా మావయ్య గారు ఊరి పెద్ద.. వాళ్ళకి వున్న ఏకైక సంతానం మా ఆయన.. ఆయన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నాం..


పెళ్లి అయ్యి అక్కడికి వెళ్ళాక అక్కడి పద్ధతుల కి నేను అలవాటు పడిపోయాను.. మా పెళ్లి అయిన కొత్తల్లో మా అత్తగారు నాకు ఎం ఎం చేయించారు అన్ని నీకు చేయించాను..


పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి కూడా నేను నెల్లోసుకొలేదు.. ఆయన ఏమో బిజినెస్స్ చేస్తాను అని ఇంట్లో అందరినీ ఒప్పించారు.. ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని బ్యాంక్ లో వున్న డబ్బు.. మా అత్తయ్య వి, నావి నగలు బ్యాంక్ లో పెట్టీ డబ్బు తీసుకువచ్చి బిజినెస్స్ పెడదాము అనుకున్నాం..


మేము ఇద్దరం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఆయన ఏదో పని మీద వెళ్ళిపోయారు.. నేను మా నగలు అన్ని తీసుకొని బ్యాంక్ కి వెళ్ళాను.. మా అందరి అకౌంట్ లో డబ్బు అంతా తెచ్చాను.. బంగారం పెట్టీ డబ్బు తీసుకోవటానికి ఆ ఆఫీసర్ రాలేదు అని చాలా సేపు కూర్చోబెట్టారు.. మధ్యాహ్నం కాస్త సాయంత్రం అయ్యింది.. బ్యాంక్ ముసే వేళ అయిన ఎవరు పట్టించుకోలేదు అందుకే నగలు, డబ్బు తీసుకొని వెళ్ళిపోయాను రేపు వచ్చి చూసుకోవచ్చు లే అని..


ఇంటికి వెళ్ళే సరికి మా వీధి వాళ్లు అంతా హడావుడిగా వున్నారు.. నాకు ఏమి అర్దం కాలేదు.. నేను వస్తుంటే అందరూ నా మొహం లోకి చూస్తూన్నారు.. అంటూ వణుకుతున్నారు.. అది చూసి ధరణి పర్వీన్ చేతిని గట్టిగ పట్టుకుంది..


వాళ్ల మొహాలు చూస్తుంటే ఎందుకో భయంగా అనిపించింది.. మా ఇంటి దగ్గరకి ఒక్కో అడుగు దగ్గర అవుతున్న కొద్దీ జనాల రద్దీ పెరుగుతూ వుంది.. గుండెల్లో గుబులు పెరిగింది.. ఇంటికి వెళ్తే ఇంటి స్థానం లో బూడిద వుంది.. కూలిపోయిన గోడలు.. విరిగిపోయిన తలుపులు.. ఇంటి పైకప్పు కూడా లేదు..


మా మావయ్య ఇచ్చిన తీర్పు నచ్చక.. ఎవరో వచ్చి అందరి గొంతు కోసేసి ఇల్లు తగలబెట్టి వెళ్ళారు అని చెప్పారు.. నేను కుప్పకూలి పోయాను.. అనాధ నీ అయ్యాను అనుకున్నాను.. నా ప్రాణం కూడా తీసుకోవాలి అనుకున్న ఆ సమయం లోనే కళ్ళు తిరిగి పడిపోతే అందరూ గుమ్మి గూడారు.. అందులో అనుభవం వున్న ఒక ఆమె నేను కడుపుతో వున్నాను అని చెప్పారు..


వాడి కోసం ప్రాణం లేని జీవాత్సవం గా బ్రతికాను.. మా కుటుంబం అంతా పోయినందుకు గవర్నమెంట్ కొంత డబ్బు ఇచ్చింది.. ఆ ఊరిలో మా కుటుంబం వారి జ్ఞాపకాలతో వుండలేకపోయాను.. అందుకే రైల్వేస్ స్టేషన్ కి వచ్చి ఏ ట్రైన్ ఎక్కనో తేలిక ఏదో ట్రైన్ ఎక్కాను.. నోయిడా వెళ్ళాను.. అక్కడ నా దగ్గర వున్న డబ్బు నీ మా నగలని డబ్బు రూపంలోకి మార్చి అసద్ పేరు మీద వేసాను.. ఏ తోడు లేకుండా ఎన్నో అవమానాలు పడి, ఎన్నో కష్టాలు పడి నిద్రలేని ఎన్నో రాత్రుళ్ళు లేచి ఏడుస్తూ వుంటే అసద్ లేచి ఏమి అర్దం కాక అలానే నన్ను చూసి చూసి నన్ను చుట్టుకొని పడుకునే వాడు.. అని పర్వీన్ చెప్తుంటే ధరణి కి వీరూ గుర్తు వచ్చాడు.. ఇంచు మించు ఇద్దరి పరిస్తితి ఒకటే..'


అల వాడికి ఊహ తెలిసిన తర్వాత నన్ను పని చేయ నిచ్చేవాడు కాదు.. కానీ నా చేతి వంట తప్పా ఏమి తినడు.. ఇంక ఇంటర్ అయ్యిన వెంటనే వాడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ పై చదువులు పూర్తి చేశాడు.. కొంచెం పెద్ద అయ్యాక.. వాడు అడిగాడు.. నాకు తండ్రి ఎవరు అని వాడి కుటుంబం గురించి అంత చెప్పాను.. అప్పటి నుండి వాడు నాకు కొడుకు కాదు తండ్రి అయ్యాడు.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటు.. వాడిని జాగ్రత్తగా చూసుకో అమ్మ.." అంటూ ధరణి చేతులు పట్టుకొని ఏడ్చారు..


ధరణి " అల అంటారు ఎంటి అత్తమ్మ.." అంటూ పర్వీన్ నీ ఓదార్చింది.. కాసేపు ధరణి బడిలోనే సేద తీరిన పర్వీన్ కాసేపటికి తేరుకొని తన గురించి అడిగింది.. ధరణి తన కథ క్లుప్తంగా చెప్పి వీరూ నీ తనతో వుండటానికి ఒప్పుకోమని ప్రాధేయపడింది.. మొన్న చెప్పిన సమాధానం ఏ ఈ రోజు కూడా పర్వీన్ చెప్పారు........


( చాలా భారంగా వుంది అండి రాయటానికి....😢😢😢😔😔😔)


అటు ఇంటి నుండి బయలు దేరిన ప్రణయ్ నేరుగా సిటీ ఔట్ సైడ్ లో జన సంచారం లేని ఏరియా కి వెళ్తాడు.. ప్రణయ్ అక్కడికి వెళ్లే సరికి అక్కడ అసద్ వుంటాడు.. వీల్ చైర్ లో కూర్చొని అల ఎటో సున్యం లోకి చూస్తూ వుంటాడు..


ప్రణయ్ కార్ ఆగిన సబ్దంకి అటు వైపు తిరిగి చూస్తాడు.. ప్రణయ్ వచ్చి అసద్ ఎదురుగా నించొని " అసద్ నువ్వు నన్ను చాలా అడగాలి అని చూస్తున్నావు.. కానీ నేను ఇప్పుడు నువ్వు అడిగే వాటికి సమాధానం చెప్పడానికి రాలేదు.. కేవలం నేను చెప్పాలి అనుకుంటుంది చెప్పి వెళ్ళిపోతాను.." అని అసద్ వైపు చూస్తాడు.. అసద్ కదలకుండా వుంటాడు..


ప్రణయ్ " అసద్ షివి అనుకొని పరిస్థితులకి లోనూ అయ్యింది.. తను చాల కష్ట కాలంలో నిస్సహాయంగా వుంది.. అందుకే మీ పెళ్లి జరిపించాను..


నేను కేవలం షివి గురించే ఆలోచించి ఇది చెయ్యలేదు.. చిన్నప్పటి నుండి నేను చూస్తున్న నా ఫ్రెండ్ ఐదు సంవత్సరాల క్రితం తప్పిపోయాడు.. వాడిని తను మాత్రమే తీసుకు రా గలదు.. ఇంక ఇది నీ మీద ఇష్టం తో నో నీ బాధ చూడలేక నో చెయ్యలేదు..


నీతో పాటు నన్ను కూడా కష్ట పడి పెంచిన నా తల్లి లాంటి అత్త కళ్ళల్లో ఆనందం చూడటానికి చేశాను.. తన కళ్ళల్లో ఆనందం చూసాను..


అసద్ ఇప్పుడు నువ్వు అనుకోవచ్చు మీ బంధాన్ని విడదీస్త అని కానీ ఒక సారి ఆలోచించు విడిపోయిన రాని ఆనందం కలిసి వుంటే వస్తుంది..


అసద్ షివి వున్న పరిస్తితి నేను నీకు చెప్పొచ్చు కానీ ఇప్పుడు మీరు భార్యాభర్తలు మీ మద్య దాపరికాలు వుండ కూడదు.. నువ్వు నన్ను షివి కి సెక్యూరిటీ గా వుండమన్నవు.. కానీ షివి గతం తెలుసుకో మని చెప్పలేదు.. నేను తన గతం తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు.. తన గతం తన ద్వారా నీకు తెలిస్తే చాలు..


అసద్ నేను నిన్ను మళ్లీ ప్రేమించ మని చెప్పను కానీ కనీసం స్నేహం అయిన చెయ్యి.. ఈ పరిస్తితి లో షివి కి నీ స్నేహం అవసరం.. దైర్యన్ని ఇస్తుంది.. ఆ తర్వాత మీరు ఒకటి అవ్వాలి లేదు అనేది మీ మీదే ఆధారపడి వుంది.. ఇంక నేను వెళ్తున్న.." అని తను చెప్పాలి అనుకుంది సుత్తి లేకుండా చెప్పి వెళ్ళిపోయాడు ప్రణయ్..


అసద్ మాత్రం ఇంటికి వెళ్ళలేదు.. ఒక విధంగా చెప్పాలి అంటే షివి చూడాలి అంటేనే భయం వేస్తుంది.. ఇది నిజంగా రికార్డ్ దేనికి.. ఎవరికి భయపడని అసద్ ఇప్పుడు షివి కి భయపడి.. మొహం చాటేశారు..


టైమ్ ఎలా గడిచిందో ఎవరికి తెలియదు ఎవరి ఆలోచనల్లో వాళ్లు వున్నారు.. ఒక్క పర్వీన్ మాత్రం చాలా సంతోషంగా వుంది.. ధరణి చిన్న వయసులో అసద్ పడిన బాధలు, కష్టాల గురించి ఆలోచిస్తుంది.. ఇప్పుడు వీరూ కూడా అలానే బ్రతకాలి.. నిజంగా అసద్ గురించి తెలుసుకున్న తర్వాత అసద్ మీద ఎనలేని గౌరవం కలిగింది.. అసద్ నీ అనవసరం హా ఎప్పుడు డిస్ట్రబ్ చెయ్యకూడదు అనుకుంది.


అసద్ ఏమో ఎం చెయ్యాలో తోచక అలానే ఉండి పోయాడు.. ప్రణయ్ అసద్ జీవితం గురించి ఇన్నాళ్లు పడ్డ బాధ అంతా తీరిపోయినట్టు కొంచొమ్ ప్రశాంతంగా వున్నాడు..


ధరణి అల ఆలోచనలోనే అసద్ రూమ్ లో అసద్ బెడ్ మీద పడుకొని ఎప్పటికో నిద్ర పొయింది.. అర్ద రాత్రి దాటిన తర్వాత వచ్చిన అసద్ తన రూమ్ లో తన బెడ్ పైన నిద్ర పోతున్న షివి నీ చూసి దగ్గరకి వెళ్లి తన చెయ్యి పట్టుకొని " నేను ఒక నిర్ణయానికి వచ్చాను షివి.. నాకు నువ్వు కావాలి.. నీ ప్రేమ కావాలి.. అందుకోసం నేను ఎమైన చేస్తాను.." అనుకుంటూ.. ఆ చేతికి తల ఆనించి గతం లోకి వెళ్ళాడు...


కొనసాగుతుంది...