Will this journey reach the coast...- 2 books and stories free download online pdf in Telugu

ఈ పయనం తీరం చేరేనా...- 2

ధరణి నీ పెళ్లి చేసుకో మంటే అల విడిగా వెళ్లి వుండటం చుసి ఏ తల్లితండ్రులు మాత్రం సంతోషంగా వుంటారు... అందుకే ధరణి గురించి చెప్పి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు... అలానే ఒక సంబంధం కుదిరింది... వయసు 45 ఏళ్ళు... పిల్లలు లేరు కానీ పిల్లలు కావాలి అతని కోరిక ను అతని ఇద్దరూ భార్య లు నెరవేర్చ లేదు అని ఇంకో పెళ్లి కి సిద్ద పడ్డాడు... డబ్బు కి లోటు లేదు కాబట్టి ధరణి అందం చూసి ధరణి తల్లితండ్రుల దగ్గర మాట తీసుకున్నాడు... వాళ్ళకి కూడా వేరే దారి తోచలేదు... ధరణి నీ ఒక ఇంటి మనిషిని చెయ్యాలి అనే ఆరాటం లో వాళ్లు ధరణి జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించ లేకపోయారు...


ధరణి ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే ధరణి తల్లి తన మీద ఒట్టు వేయించుకొని బలవతం మీద ఒప్పించింది... ధరణి కి వేరే దారి లేకపోగా వీరూ కి దూరం గా వుండాలి అంటే ఎక్కడో దిగులుగా వుంది.


అందుకే తను ఇన్ని రోజులు కష్ట పడి కూడబెట్టిన డబ్బు అంతా వీరూ పేరు మీద వేసి... పెళ్లి తర్వాత అక్కడి వాళ్ళు వీరూ నీ అక్సెప్ట్ చేస్తే తనతో తీసుకు వెళ్ళాలి అని అనుకుంది. ఎందుకు అంటే తనకి బాగా వీరూ నీ తన తల్లితండ్రుల దగ్గర వదిలి వెళ్లిపోతే వాళ్లు వీరూ ఒక పసి వాడిగా కూడా చూడకుండా కొడుతూ ఇంటి పని చేపిస్తారు కానీ స్కూల్ కి పంపరు... ఒక పాలేరు నీ చేస్తారు కాని ప్రయోజకుడిని చెయ్యరు... ఎందుకు అంటే వీరూ వల్లే ధరణి జీవితం నాశనం అయ్యింది అనే బ్రమ లో వున్నారు...


ఒక వేళ పెళ్లి కి ఒప్పుకోకపోతే ధరణి తల్లి ఎం చేసుకున్న చేసుకోకపోయిన వీరూ కి మాత్రం ప్రమాదం తలపెడతారు... అందుకే ఇష్టం లేపపిన ఒప్పుకుంది. ఒక వేళ తను వెళ్ళే చోట వీరూ నీ ఒప్పుకోకపోతే ఒక పని మనిషి బతుకు బతకడానికి అయిన సిద్ధమే... ఎందుకు అంటే ఇప్పుడు తను కూడబెట్టి డబ్బు తోనే వీరూ పెద్ద వాడు ప్రయోజకుడు అవ్వాలి... ఆ డబ్బు అంతా కూడా ధరణి కష్టం అయ్యి వుండాలి...


తను అసలు ఎందుకు పెళ్లికి ఒప్పుకుంది అనే కారణాలు ఆలోచిస్తూనే ధరణి రెంట్ కి వుండే ఇంటికి వెళ్ళింది. అక్కడ ఇంక ప్యాక్ చెయ్యాల్సిన వస్తువులు ప్యాక్ చేసి తన తల్లితండ్రుల ఇంటికి పంపించాలి.


ఇక్కడ రేడియో లో కథ నీ విని ఆ కథ గురించే ఆలోచిస్తున్న అతను ఎప్పుడూ అతని ఆఫీస్ కి చేరుకున్నాడు కూడా తెలియదు ఆఫీస్ ముందు ఆగిన కార్ శబ్దానికి ఈ లోకం లోకి వచ్చి కళ్ళు తెరిచి డోర్ ఓపెన్ చేసి కిందకి దిగి నిలబడ లేనట్టు తూలి పడబోయాడు... అతను పడటం గమనించిన డ్రైవర్... వెంటనే పరుగున వచ్చి అతనికి ఆసరా గా నిలబడి " జాగ్రత్త సార్... ఒక్క నిమిషం మీరు కార్ లో కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను..." అని అతనిని మళ్లీ కార్ లో కూర్చోబెట్టి వెనుక వైపు వున్న వీల్ చైర్ నీ తీసుకువచ్చి అందులో అతనిని కూర్చోబెట్టి ఆఫీస్ లో అతని క్యాబిన్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఆ డ్రైవర్ వెనక్కి వెళ్ళిపోయాడు.


ఇది అంతా బయట నుండి గమనిస్తున్న వాచ్మెన్ లు మాటలు...

మొదటి వ్యక్తి " ఎంత డబ్బు వుంటే ఎంటి బాబాయ్... కాలు లేని వాడికి..??"


రెండవ వ్యక్తి " అంటే అతనికి కాళ్ళు లేవా... మరి ఇందాక కార్ దిగాడు గా.."


మొదటి వ్యక్తి " ఆ దిగాడు... నీకో విషయం తెలుసా బాబాయ్ ఇతను నోయిడా లో రెండవ ధనవంతుడు అంట ఇక్కడ మొదటి ఐదుగురి ధనవతులలో ఇతను కూడా ఒకడే కానీ ఎం ప్రయోజనం కాళ్ళు లేని వాడు.."


రెండవ వ్యక్తి " మరి ఇందాక కార్ దిగాడు కదా..."


మొదటి వ్యక్తి " అదే బాబాయ్ అంతా డబ్బు వున్న కనీసం అరగంట కూడా నిలబడ లేడు అంట... రోజుకు మొత్తం మీద ఒక అరగంట మాత్రమే నడవగలడు అంట.."


రెండవ వ్యక్తి " అయ్యో పాపం..."


మొదటి వ్యక్తి " ఎం పాపమో ఏమో బాబాయ్... మన లాంటి కష్ట పడగల వ్యక్తులకి ఏమో ఇలా రోడ్డున నించునే ఉద్యోగం అల కాళ్ళు లేని వాళ్ళకి సలాం చెయ్యాలి... వాళ్లు మాత్రం నిగిని అంటే ఉద్యోగం... ఎంటో..." అంటుంటే... అటు గా వచ్చిన ఒక వ్యక్తి వీళ్ళ మాటలు విని అక్కడే ఆగి కోపం తో కళ్ళు ఎర్ర చేసి అతనికేసి చూస్తూ...


" అతను ఏమి నీల తెలివి తక్కువ వాడు కాదు... 23 ఏళ్ల వయసు అప్పుడే సొంత కంపనీ నీ స్థాపించి కష్ట పడి ఈ రోజు ఈ స్థాయి కి తీసుకువచ్చాడు... ఒకప్పుడు అతను అతని తల్లి ఇంతకన్నా హీనమైన బతుకు బతికి ఇప్పుడు ప్రపంచ ధనవంతుల లో అతని పేరు నీ నిలుపుకున్నారు... దాదాపుగా 9 సంవత్సరాల సమయం లో ఇది అంత ఎంత మందికి సాధ్యమో నువ్వే చెప్పు...??? ఇంక ఒక అరగంటలో వచ్చి నీకు కంపనీ నుండి రావల్సిన ఆఖరి జీతం తీసుకొని వెళ్ళు... జీతం ఇచ్చే వాళ్ల జీవితం ఇచ్చే వాళ్ల సేటైర్లు వేస్తే జీతం జీవితం రెండు బోల్తా పడవచ్చు జాగ్రత్త..." అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతను.


అతను నేరుగా మొదట వచ్చిన అతని క్యాబిన్ కి వెళ్లి... " ఎంటి రా ఎం డిసైడ్ చేసుకున్నావు..." అని అడిగాడు..


అతను " నాకు మీరు వేరే ఆప్షన్ ఇవ్వలేదు ప్రణయ్..." అంటాడు.


ప్రణయ్ " అంటే నీకు ఈ పెళ్లి ఇష్టమేనా..." అని అడిగాడు.


అతను " పెళ్లి ఇష్టమా అని నన్ను అడగలేదు... అడిగి వుంటే నా ఆన్సర్ మీకు తెలుసు..." అన్నాడు.


ప్రణయ్ " అది కాదు తను చాలా మంచి అమ్మాయి... తనని పెళ్ళి చేసుకున్నాక నీకే తెలుస్తుంది. నీ గతం అంతా మర్చిపోయి నువ్వే తనతో కొత్త జీవితం ప్రారంభిస్తాఉ అని నాకు అనిపిస్తుంది."


అతను " నెవర్.... అసలు అల జరుగుతుంది అని ఎలా అనుకుంటున్నావు రా... రై నీకు అర్దం అవుతుందా... నాకు ఐదు సంవత్సరాలు గా నా కాళ్ళు పనిచేయటం లేదు... ఏదో పవర్ ఫుల్ డ్రగ్ నాకు ఇంజక్ట్ చేశారు... అది ఎవరు అనేది నేటికి కూడా తెలీయదు... ఒక వేళ ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకున్న తనకి ఏ విధమైన సుఖం నేను ఇవ్వలేను... అది మీకు ఎందుకు రా అర్దం కావటం లేదు... ఒక వేళ తను అలాంటి వాటి కోసం వేరే దారులు వెతికితే...." అతని మాట పూర్తి కాకముందే


ప్రణయ్ కోపం తో ఎర్రబడ్డ కళ్ళతో " స్టాప్ ఇట్.... అసలు ఎం మాట్లాడుతున్నావు నీకు అర్దం అవుతుందా..." అని పెద్దగా అరిచాడు... ఆ రూమ్ అంతా దద్దరిల్లింది ఒక్క నిమిషం.


అంత కన్నా కోపంగా అంతా కన్న గట్టిగా..." మీకు అర్దం అవుతుందా.... మీరు ఎం చెయ్యాలి అనుకుంటున్నారు మీకు అర్దం అవుతుందా...." అని గద్దించాడు... నిజానికి ఆ అరుపు ఒక సింహపు గర్జన నీ గుర్తు చేసింది ప్రణయ్ కి. ఒక్క క్షణం ఆరు అడుగుల ఎత్తు సిక్స్ పాక్ బాడీ... గుండె నిండా దైర్యం వున్న ప్రణయ్ కూడా ఆ అరుపు కు వెన్ను లో వణుకు వచ్చింది.


ప్రణయ్ " రై ఐదు సంవత్సరాల క్రితం నీకు ఆ కాళ్ళతో పాటు బ్రెయిన్ కూడా పోయింది రా... అందుకే ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు..." అన్నాడు.


అతను " రై పోయింది బ్రెయిన్ కాదు రా నా మనసు... నా మనసు నాకు జాడ లేకుండా వెళ్ళిపోయింది... తనతో నే నా సర్వస్వం వెళ్ళిపోయింది... ఇప్పుడు ఇంక నేను బతికే వున్నాను అంటే దానికి కారణం అమ్మి, నువ్వు... మీకోసం ఒక జీవత్సవం లా బతుకుతుంటే... ఈ శవాన్ని చూసుకోమని ఇంకో అమ్మాయి గొంతు నా చేతుల తో నే కొయ్యమంటున్నరు రా మీరు..." అంటాడు.


ప్రణయ్ ' అమ్మాయి ఎవరో తెలియక పోతేనే వీడు ఇలా మాట్లాడుతున్నాడు... అదే అమ్మాయి ఎవరో తెలిస్తే చచ్చిన ఒప్పుకోడు...' అని మనసులో అనుకొని " రై అది కాదు రా నువ్వు షివి నీ ఎంత ప్రేమించావో నాకు తెలియదా... కానీ తను ఆ ప్రేమ నీ మరిపించి నిన్ను మామూలు మనిషిని చేసి నిన్ను తన ప్రేమ లో పడేసికుంటుంది అని మా నమ్మకం... నిజం చెప్పనా అత్త కి కూడా తెలియదు నువ్వు ఎవరిని చేసుకునేది కానీ నేనే చెప్పాను... ఎలా అయిన వాడిని ఈ పెళ్లికి ఒప్పించు అత్త త్వరలో నీ కొడుకు నీ పాత కొడుకు గా ఐదు సంవత్సరాల క్రితం వున్న వాడిలా మార్చి నేను చూపిస్తాను అని... అందుకే అత్త కూడా ఒప్పుకుంది... నా మీద కేవలం నా మీద నమ్మకం తో ఒప్పుకుంది.


నేను తన మీద తన ఓర్పు మీద తన ప్రేమ మీద నమ్మకం తో మి పెళ్లి చేస్తున్నాను... నువ్వు తనని పెళ్లి చేసుకుంటే మా పాత అసద్ మా కళ్ళ ముందుకు వస్తాడు రా మా పాత అసద్ శివమ్ కోసం ఈ పెళ్లి ఇంకేం మాట్లాడకు.." అని వెళ్ళిపోయాడు ప్రణయ్...


అలానే తన సీట్ లో వెనక్కి వాలి రెండవ సారి తన కి ఊబికి వస్తున్న కన్నీటికి స్వేచ్ఛ నీ ఇచ్చి వదిలేశాడు....

కొనసాగుతుంది...