మంచి ఉన్నత స్థితిలో ఉండి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని
ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి కానుకలు ఆశించకుండా అమ్మాయిని జీవితాంతం
బాగా చూసుకుంటున్నా సరే ...
ఆ అబ్బాయి అంటే అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర
ఎప్పటికీ క్యారెక్టర్ లేని వాడే
ఆ అమ్మాయి ఎప్పటికీ ఒక క్యారెక్టర్ లేని అమ్మాయి
వాళ్ల పెంపకాన్ని గౌరవ మర్యాదలను నాశనం చేసిన అమ్మాయి
అలాకాకుండా
తల్లిదండ్రులు వాళ్లకు నచ్చిన సంబంధం చూసి
లక్షలు కట్నం పోసి
ఒక క్యారెక్టర్ లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసి
వాడి చేతిలో ఆడపిల్ల జీవితం నరకం అనుభవిస్తున్న సరే
ఆ అల్లుడు ఉత్తముడు గొప్పోడు
ఆ అమ్మాయి క్యారెక్టర్ ఉన్నది
ఇక ఆ అమ్మాయి జీవితం అంటారా
అది ఆ అమ్మాయి తలరాత
ఇది తల్లిదండ్రులు ఆలోచించే ఆలోచన విధానం
అబ్బాయి కట్నం తీసుకోను అని అంటే
ఆ అబ్బాయి క్యారెక్టర్ లేని వాడయిన అయి ఉండాలి
లేదంటే
ఏదైనా శారీరక లోపమైన అయి ఉండాలి
అంతే తప్ప తమ బాధని అర్థం చేసుకున్నాడు అని మాత్రం
ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు అనుకోరు
ఈ సమాజం అనుకోనివ్వదు
కట్నం అనే పేరుతో అప్పు చేసి మరి కూతురు పెళ్లి చేసి
జీవితాంతం వడ్డీలు కడుతూ కష్టాలపాలు అవుతున్న
తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు
అయినా కూడా సరే ఇచ్చేవాళ్లకు తీసుకునే వాళ్లకు
ఆలోచన లేదు బుద్ధి కూడా లేదు
ఇంకా చెప్పాలి అంటే...
తీసుకునే కట్నాన్ని బట్టి అల్లుడు రేంజ్ ని డిసైడ్ చేసే
స్థాయికి మన సమాజం రోజురోజుకి ఎదుగుతుంది
ఎక్కువ కట్నం తీసుకుంటే గొప్పవాడుగా
తక్కువ కట్నం తీసుకుంటే మామూలుగా
అసలు కట్నమే తీసుకోకపోతే ఏదో లోపం ఉన్నవాడిగా
చూస్తుంది ఈ సమాజం
ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేసి
కట్న కానుకలు ఇచ్చి
సంతోషంగా ఆ ఇంటి నుంచి సాగనంపడం అనేది
ఒక మామూలు మధ్యతరగతి తండ్రి యొక్క
జీవిత సంపాదన
తన జీవితాంతం కష్టపడి సంపాదించి
రూపాయి రూపాయి కూడబెట్టి
తను తిన్నా తినకపోయినా అప్పు చేసి మరి
ఆడపిల్ల పెళ్లి చేస్తున్న పరిస్థితి
ఎందుకంటే...
ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే
కట్నం గురించి బాధపడి భయపడాల్సిన పరిస్థితికి
చేరుకుంది వ్యవస్థ
తమ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నా
సరే అదేంటో తెలియదు కానీ
అబ్బాయిని కన్న తల్లిదండ్రులు తమ ఇంటికి వచ్చే కోడలు కట్నం తెస్తే ఒక విధంగా చూస్తారు
కట్నం తీసుకురాకపోతే ఒక విధంగా చూస్తారు
ఎక్కువ కట్నం తెస్తే ఒకరకంగా
అసలు కట్నం తీసుకురాకపోతే మరో విధంగా చూస్తారు
అంతేకానీ ఒక ఆడపిల్ల తండ్రిని ఎందుకు బాధ పెట్టాలని మాత్రం అనుకోరు
పోనీ అంత కట్నం తీసుకొచ్చినా కూడా
ఆ అమ్మాయి సంతోషంగా ఆనందంగా ఉంటుందా అంటే అది లేదు...
అందుకే చాలామంది ప్రేమ పెళ్లి అనే వాటికంటే బంధానికి ఎక్కువగా విలువ ఇస్తున్నారు ఇంకొక మాట లో చెప్పాలి అంటే పెళ్లి అయినా కూడా మరొక బంధం వైపుకు అడుగులు వేస్తున్నారు దీన్ని సమాజం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అని కాదు అబద్ధం వీళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది ఎంతగా అంటే తాము ఇష్టపడే ఆ వ్యక్తి తమతో లేకపోయినా తమ పక్కన లేకపోయినా తన మాట వింటే చాలు ఏదో తెలియని ఆనందం ఏదో తెలియని సంతోషం
ఇందులో తప్పు ఒప్పులు నిర్ధారించాల్సిన పనిలేదు ఎందుకంటే
కొందరు పరిచయమైన కొద్దికాలంలోనే మనసుకు దగ్గరవుతారు.
వారి మనసునీ తమ ప్రేమతో ముడిపడేలా చేయగలరు.
మరికొందరు అవతలివ్యక్తి గురించి తెలిసిన తర్వాత
వారి పైన ఇష్టాన్ని అభిమానాన్ని పెంచుకోవడం
మొదలు పెడతారు.
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ఎంత బాగుంటుందో
అంతే కష్టంగా కూడా ఉంటుంది.
కేవలం ఉత్తరాలు ఫోన్ ఈ రెండు మాత్రమే ఆ రిలేషన్ కి ఆధారం
కొన్ని సందర్భాలలో అందరిలాగా గంటల తరబడి మాట్లాడుకోలేకపోవచ్చు
కొంత సమయాన్ని మాత్రమే కేటాయించవచ్చు
కానీ..
ఆ బంధాన్ని కాపాడుకోవడానికి ఇరువురు చేసే ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంటుంది
. ఒకరికొకరు తమ గురించి అవతలివారికి చెప్పడానికి
చేసే ప్రయత్నంలోనే వాళ్ల ప్రేమ దాగి ఉంటుంది
ఇరువురి నడుమ ప్రతి చిన్న విషయమూ తీయగా అనిపిస్తుంది.
చిన్నచిన్న చిలిపి తగవులు కూడా మరింత దగ్గర చేస్తాయి.
ఒకరితో మరొకరు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు.
ఆ తర్వాత దాన్ని శాశ్వతం చేసుకోవాల్సిన బాధ్యత ఇరువురిది.
మొదట్లో ఉండే ప్రేమను కలకాలం ఉండేలా నిలబెట్టు కోవడానికి ఇద్దరు కృషి చేయాలి
ఎదుటివారిని అర్ధం చేసుకోవడం ప్రారంభించాలి.
వారి బలాలు, బలహీనతలను గుర్తించి గౌరవించాలి. బలాలను ప్రశంసించక పోయినా ఫరవాలేదు. బలహీనతలను మాత్రం విమర్శించకూడదు.
అలా చేస్తే వారిని అవమానించినట్లుగా భావించే ప్రమాదం
ఉంటుంది.
ఇరువురూ తమకంటూ సమయాన్ని కేటాయించుకోవాలి.
జీవితంలో వివిధ దశల్లో వచ్చే సవాళ్లను కూడా కలిసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
సమస్య వచ్చినప్పుడు అది ఏ ఒక్కరిదైనా ఇరువురిదీ అనుకోవాలి.
తమ బాధ్యతగా స్వీకరించి పంచుకొని చర్చించాలి. కుటుంబ సమస్యలనూ.. సున్నితంగా పరిష్కరించుకోగలగాలి.
అప్పుడే ఇరువురి మనసులూ.. ఒకేలా ఆలోచించడం మొదలు పెడతాయి.
ఒకరి కోసం మరొకరు అన్నట్లు మనసులు ముడిపడి, ఇద్దరి మధ్య ప్రేమ బందం శాశ్వతమవుతుంది.
బంధంలో ఏదో విషయంలో ఎప్పుడో ఒకప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సహజం.
ఒక్కోసారి గట్టిగా గద్దించినట్లు మాట్లాడినా..
అది క్షణికావేశం మారిపోవాలి
కోపాన్ని ఎక్కువసేపు దాచుకోవడం
ఎక్కువగా చూపడం బంధాన్ని బీటలు వారెలా చేస్తుంది
చిరాకులూ పరాకులూ... పనులు బాధ్యతలతో అలసిపోతున్నారా? ఈ భారం మోయలేకపోతున్నానంటూ విసుక్కుంటున్నారా? ఇది మీ బంధానికి ఎంత మాత్రం మంచిది కాదు
తరచుగా కోపతాపాలు చూపితే పర్యవసానంగా
అవతలి వ్యక్తికీ అసహనం కలుగుతుంది.
అప్పుడిక గొడవలూ ఘర్షణలూ తప్పవు.
అందుకే నెమ్మదించండి.
కోపానికి బదులు మీ బాధను, అంతర్మథనాన్ని వ్యక్తం చేయండి.
చేయూత దొరుకుతుంది, ప్రశాంతత చేకూరుతుంది.
బాధ్యతల మధ్య కొన్నిసార్లు మీ సమయం కరిగిపోవచ్చు కానీ ఆ బాధ్యతలను దాటి ఒకరికొకరు సమయాన్ని ఇచ్చుకోవడమే మీ బంధానికి అన్నింటికంటే ముఖ్యం
అనుమానాలు అసహనాలు ఇవి బంధాన్ని నాశనం చేసే సోపానాలు మీ సమస్య ఏదైనా సరే మనస్పూర్తిగా చర్చించండి అప్పుడే అనుమానాలకు చోటు ఉండదు.
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ లో మీరు ఇవ్వగలిగే
గొప్ప బహుమతి సమయమే
నమ్మకంతో సాగే బంధాలు
నమ్మకం పై నిలిచే బంధాలు కాబట్టి ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యం
ఎందుకంటే కలిసి కలకాలం ఉండలేరు
విడిపోయి ఒక క్షణం కూడా బతకలేరు....