రామేశ్వరం దేవాలయం
అతిపెద్ద పర్యాటక ఆకర్షణ రామేశ్వరం ఆలయం.
ప్రతి సంవత్సరం ఎక్కువ మంది పర్యాటకులు
రామేశ్వరం ఆలయానికి వస్తారు.
ఈ ఆలయం శివునికి అంకితం చేయబడిన
ఒక అద్భుతమైన శిల్పకళ.
ప్రపంచం నలుమూలల నుండి భక్తులు
రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు
కాశీలోని గంగా జలాన్ని రామేశ్వరం లో శివలింగానికి అభిషేకం చేసి...
రామేశ్వరంలోని ఇసుకని కాశి గంగ లో కలిపితే
ఇక పునర్జన్మ ఉండదు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం
రామేశ్వరం ఎలా చేరుకోవాలి..
రైలు మార్గం ద్వారా రామేశ్వరం చేరుకోవడానికి విజయవాడ నుంచి అయితే డైరెక్ట్ గా రామేశ్వరం వరకు రెండు ట్రైన్స్ కలవు
ఇవి వారాంతపు ట్రైన్లు
అలాగే...
హైదరాబాద్ కాచిగూడ నుంచి ఒక ట్రైన్ కలదు
విశాఖపట్నం నుంచి వచ్చు ట్రైన్లు విజయవాడ చేరుకొని అక్కడి నుంచి రామేశ్వరం వెళ్తాయి.
ట్రైన్ మార్గం ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు
పంబన్ బ్రిడ్జి పైన ప్రయాణం
ఒక అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుంది

రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి రామేశ్వరం టెంపుల్
20 నిమిషాల నడకదారి.
ఆటో వాళ్ళు అయితే ఒక్కొక్కరికి 20 రూపాయల తీసుకుంటారు.
దేవాలయం రావడానికి ఒక ఆఫ్ కిలోమీటర్ ముందుగానే మనకు హోటల్ లు..... సత్రాలు ఉంటాయి.
సింగిల్ గా వెళ్లిన వాళ్లకి రూమ్స్ ఇవ్వరు
కాబట్టి దీన్ని గమనించాలి.
ఒకవేళ సింగిల్ గా వెళ్తే రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉన్న హోటల్ లో ఉండవచ్చు
రూమ్స్ యావరేజ్ గా ఉంటాయి.
కొంచెం నీట్ నెస్ తక్కువ
ఒకరోజు రెంట్ 300 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఉంటుంది
ఫ్యామిలీతో వెళ్లిన వారికి గుజరాతి హోటల్స్
బెంగాలీ హోటల్స్ ఇలా రకరకాల ట్రెడిషన్ పరమైన హోటల్స్ అందుబాటులో ఉన్నాయి
ఒక్కరోజు రూమ్ అద్దె 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఉంటుంది
ఇక భోజన సదుపాయాలు అంటే...
దేవాలయం దగ్గర రెండు ఆంధ్ర హోటల్స్
ఒక బెంగాలీ హోటల్ ..
రెండు రాజస్థానీ హోటల్స్ ఉన్నాయి.
భోజనం కాస్త పరవాలేదు అనిపించేలా ఉంటుంది
రామేశ్వరంలో సందర్శించే ప్రదేశాలు
22 బావుల స్నానం రామేశ్వరంలో అతి ముఖ్యమైనది.
దేవాలయ ప్రధాన ద్వారం నుంచి వెనుక వైపు చేరుకుంటే అక్కడి నుంచి 22 బావుల దగ్గరకు వెళ్లడానికి
మనకి ప్రధాన ద్వారం కనిపిస్తుంది
ఆ పక్కనే లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉంటుంది.
అయితే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు
టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తారు
దీనికి గల కారణం అక్కడ కొంతమంది భారీగా
దక్షిణ వసూలు చేయడానికి అలా చెప్తారు
కాబట్టి ముందుగానే టికెట్ తీసుకోవడం మంచిది.
ఒక్కొక్క బావి దగ్గరికి వెళ్తే ఆ బావి నుంచి నీటిని తీసుకొని మనపై పోస్తారు.
అగ్నితీర్థం ...
భక్తులు పవిత్రంగా భావించే "పవిత్ర స్నానo ఆచరించాల్సిన ప్రదేశం ఈ అగ్ని తీర్థం
అగ్నితీర్థం ఆలయం యొక్క సాంప్రదాయ పరిసరాల వెలుపల ఉన్న అతిపెద్ద స్నానం.
పర్యాటకులు పవిత్ర జలంలో స్నానమాచరించేందుకు అగ్నితీర్థాన్ని సందర్శిస్తారు.
పిండ ప్రధాన కార్యక్రమాలు చేయాలి అనుకునేవారు
ఈ అగ్ని తీర్థం దగ్గర చేయవచ్చు.
పిండ ప్రదానం కి దేవాలయం వారు నిర్దేశించిన టోకెన్ తీసుకోవాలి
టోకెన్ ధర 500 రూపాయలు.
అక్కడే పిండ ప్రధాన చేయడానికి పూజారులు ఉంటారు పిండ ప్రధాన కార్యక్రమం అయిపోయాక
మీకు తోచిన దక్షిణ వారికి ఇవ్వవచ్చు
రామసేతు ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలు మనం అగ్ని తీర్థం దగ్గర ఉన్న బోటింగ్ పాయింట్ లో తెలుసుకోవచ్చు.
ఎందుకంటే రామసేతు సందర్శనకి సపరేటుగా బోటింగ్ లు ఉంటాయి
అగ్ని తీర్థంలో స్నానం చేసి ప్రధాన ద్వారం గుండా వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.
ధనుష్కోడి...
రామేశ్వరం దేవాలయం నుంచి ధనుష్కోడి సుమారు
15 కిలోమీటర్లు ఉంటుంది.
ఒక్కరే విడిగా వెళ్తే ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటారు
దేవాలయం నుంచి ముందుకు వస్తే ఉండే ఆటో పాయింట్లు ధనుష్కోడి వెళ్లే ఆటోలు ఉంటాయి
అలా ప్రయాణిస్తే 40 రూపాయలు తీసుకుంటారు ఒక్కరికి

ఒకవైపు బంగాళాఖాతం మరొకవైపు అరేబియా మహాసముద్రం ఈ రెండింటి కలయిక ఈ దనుష్కోడీ
ఈ కలయిక మనకి గొప్ప అనుభూతిని ఇస్తుంది
భారతదేశానికి చివరి ప్రాంతం ఈ ధనుష్కోడి
ఇక్కడినుంచి శ్రీలంక 30 కిలోమీటర్లు
ధనుష్కోడి దేవాలయము అత్యంత అద్భుతమైన శిల్పసంపదతో ఉంటుంది
ఇది ప్రస్తుతానికి మరమ్మత్తు చేయబడుతున్న దశలో ఉంది రామేశ్వరం అత్యంత పవిత్రమైన మరియు
అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
జటాయు తీర్థం..
సీతాదేవినీ కాపాడడానికి ప్రయత్నించిన జటాయుకు గుర్తుగా అలాగే జటాయువుకు రాముడుతో ఉన్న భక్తికి గుర్తుగా ఈ దేవాలయాన్ని నిర్మించారు
జటాయు తీర్థం ప్రధాన నగరం నుండి 6 కి.మీ దూరంలో ఉంది
అరియమాన్ బీచ్...
అందమైన తెల్లని ఇసుక బీచ్ హిందూ మహాసముద్రం ఒడ్డున విస్తరించి ఉంది.
మీరు సముద్రతీరంలో వివిధ నీటి-క్రీడ కార్యకలాపాలను ఆస్వాదిస్తూ మీ సమయాన్ని గడపవచ్చు
లేదా సముద్రపు అద్భుతమైన వీక్షణలను ఆస్వాదించడానికి బోటింగ్ చేయవచ్చు.
బోటింగ్ కాస్ట్ వివిధ రకాలుగా ఉంది.
వ్యక్తిగత బోటింగ్ ఫ్యామిలీ బోటింగ్ ఇలా
ఈ బీచ్ రామశర్వం నగరం నుండి 21 కి.మీ దూరంలో
ఉంది. ఆటో లో ఒక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు
పంచముఖి హనుమాన్ దేవాలయం..
నగరంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో
ఈ పంచముఖి హనుమాన్ టెంపుల్ ముఖ్యమైనది
పౌర్ణమి అలాగే అమావాస్య రోజుల్లో ఈ టెంపుల్ ను ఎక్కువ మంది దర్శిస్తారు
లక్ష్మణ తీర్థం..
లక్ష్మణ తీర్థం అనేది రాముని సోదరుడైన లక్ష్మణుని ఆరాధనకు మాత్రమే అంకితం చేయబడిన ఆలయం. భక్తులు ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు మరియు ఇది ఇద్దరు దేవుళ్ల మధ్య సోదర ప్రేమకు చిహ్నంగా ప్రసిద్ధి చెందింది.
విల్లోండి తీర్థం...
మతపరంగా పవిత్రమైనది మరియు సహజంగా అందమైన ప్రదేశం, విల్లోండి తీర్థం రామేశ్వరం నగరంలోని
పవిత్ర జలం.
పట్టణ వాసులకు తాగునీరు అందించడానికి
రాముడు భూమిలోకి బాణం వేసినప్పుడు
భూమిలో నీటి బుగ్గ ఏర్పడిందని నమ్ముతారు.
వరల్డ్ అక్వేరియం .
రామేశ్వరంలో కనిపించే ప్రపంచ స్థాయి అక్వేరియం
సీ వరల్డ్ అక్వేరియం.
ఇది చాలా ప్రత్యేకం.
పిల్లలతో వెళ్లిన వారికి చాలా గొప్ప ఆనందాన్ని అందిస్తుంది
అబ్దుల్ కలాం గారి ఇల్లు..
డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి జన్మస్థలం రామేశ్వరం
తప్పక దర్శించాల్సిన ప్రదేశం ఈ ఇల్లు.
మొత్తం 3 అంతస్తులో ఉంటుంది ఈ భవనం
కలాం గారి ఎన్నో జ్ఞాపకాలు మనం ఇక్కడ చూడొచ్చు
ఆఖరి అంతస్తు లో ముత్యాలు అమ్మే షాప్స్ ఉంటాయి
ఈ భవనం వారపు రోజులలో 8:00 AM నుంచి
6:00 PM మధ్య సందర్శకులకు తెరిచి ఉంటుంది మరియు వారాంతాల్లో మూసివేయబడుతుంది.
కలాం ఇంటిని సందర్శించేందుకు ఒక్కొక్కరికి రూ.5 చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించాలి.
కలాం గారి ఇంటి నుంచి రైల్వే స్టేషన్ వచ్చేదారిలో
ముత్యాలు అమ్మే షాప్స్ ఉంటాయు