Who is...? - 1 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 1

Featured Books
Categories
Share

ఎవరు....? - 1

Part - 1

ఆంధ్రరాష్ట్రానికి ఆర్ధిక కేంద్రంలాంటిది విజయవాడ నగరం.
ఆ నగరంలొ పెద్ద పెద్ద రాజకీయనాయకులు మరియు ప్రముఖ వ్యాపారవేత్తలు నివసించె ప్రాంతాలలొ ఒకటి "గురునానక్ కాలని"

ఈ కాలనిలోని ఒక విల్లా బయట ఆంబులన్స్ మరియు పోలీసుల వాహనాలు ఆగి ఉన్నాయి. ఆ ఇంటి చుట్టూ పత్రికల వాళ్ళు చాలా మంది నించొని ఉన్నారు. 

ఆ విల్లా యజమాని పేరు "సూర్యనారాయణ". ఇతనొక మాజి MLA మరియు అధికారపార్టి అయినటువంటి "నవతరం పార్టీ" సభ్యుడు.

లోపల ఒక ప్రక్క హాల్లో ఇతనిని పోలిసులు ప్రశ్నిస్తుంటె. మరో ప్రక్క డైనింగ్ హాల్లొ టేబుల్ వద్ద నేలపై చనిపోయున్న వ్యక్తి శవాన్నీ ఫారన్సిక్ బృందం పరిశీలిస్తుంది. 

ఆ చనిపోయిన వ్యక్తి పేరు "దేవేంద్ర రెడ్డి". ఇతను "విజయవాడ సెంట్రల్ " నియోజికవర్గం MLA. ఇతను కూడా అదే "నవతరం పార్టీ " సభ్యుడు.  .

చనిపోయింది ఒక MLA కావడం అదీ ఒక అధికారపార్టీకి చెందిన వ్యక్తి అవ్వడంతొ ఈ వార్త రాష్ట్రంలొని పెను సంచలనంగా మారింది.

"ఒకే పార్టీకి చెందిన సూర్యనారాయణ మరియు దేవేంద్ర రెడ్డి ఒకప్పుడు బద్ద శత్రువులు. ఒకరంటె ఒకరికి పడేదికాదు. పోయిన ఎన్నికల్లొ పార్టీ పెద్దలు పార్టీ ఆఫీసులొ మీటింగు పెట్టి ఈసారి సూర్యనారాయణకు కాకుండా దేవేంద్ర రెడ్డికి MLA టికెట్టు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం సూర్యనారాయణకి నచ్చలేదు దాంతొ ఆదె పార్టీ మీటింగులొ అందరిముందు దేవేంద్ర రెడ్డిని మరియు పార్టీ పెద్దల్ని అనరాని మాటలు అన్నాడు. 

ఇంకా కోపం తగ్గక దేవేంద్ర రెడ్డి పై చెయ్యి కూడా చేసుకున్నాడు. అప్పుడు అక్కడున్న సూర్యనారాయణ అనుచరులు గొడవ మరీంత పెద్దది అవ్వకుండా తనని అక్కడనుంచి బయటకి తీసుకెళ్ళీపోయారు. కాని దేవేంద్ర రెడ్డి మాత్రం అందరి ముందు తనకి జరిగిన ఈ అవమానం తట్టుకోలేకపోయాడు. దాంతొ సూర్యనారాయణపై పోలీసు కేసు పెట్టి తనని జైల్లొ పెట్టించి బెయిల్ కూడా రాకుండా చేస్తాడు. దీంతొ ఇద్దరి మద్యన వైరం మరింత ముదిరింది. 

ఎన్నికల్లొ దేవేంద్ర రెడ్డి MLA గా గెలిచాడు.  తరువాత దేవేంద్ర రెడ్డిని పిలిచి పోలీసూ కేసులు లాంటివి పార్టీకి అంత మంచివి కావని పార్టీ పెద్దలు చెప్పి ఒత్తిడి చేయడంతొ సూర్యనారాయణ పై పెట్టిన కేసుని వాపసు తీసుకున్నాడు. కాని దేవేంద్ర రెడ్డికి మాత్రం సూర్యనారాయణపై పగ ఇంకా పోలేదు. తనని ఎలాగైన పార్టీ నుండి గెంటెయ్యాలని బలంగా నిర్ణయించుకున్నాడు.

అలా 1.5 సంవత్సరం గడిచింది. తరువాత ఏమైందొ ఏమో తెలియదు కాని ఇద్దరు పాత పగలు అన్నీ మర్చిపోయి మంచి స్నేహితులయ్యారు. ఇద్దరి ఇళ్ళ మద్యన రాకపోకలు పెరిగాయి. నాలుగు నెలలు నుంచి ఎటువంటి గొడవలు లేకపోయెసరికి నిజంగానె ఇద్దరు మారిపోయారని ఇంక అంతా శుభమె అని అందరు అనుకున్నారు.

కాని ఈ రోజు మద్యాహ్నం భోజనానికి అని సూర్యనారాయణ తన ఇంటికి పిలవగా వెళ్ళిన దేవేంద్ర రెడ్డి ఇలా ఇప్పుడు శవమై క్రింద పడున్నాడు". 

ఫారన్సిక్ బృందం వాళ్ళు దేవేంద్ర రెడ్డి కంచంలొ వదిలేసిన ఆహారాన్నీ మరియు టేబుల్ పై ఉన్న మిగతా ఆహారాన్నీ కూడా సేకరించారు. దాంట్లొ ఎమైన విషం కలిసిందా అని పరిశీలించడానికి. తరువాత దేవేంద్ర రెడ్డి శవాన్నీ పంచనామాకి తరలించారు. 

పోలీసులు CrPC 174 సెక్షన్ క్రింద అనుమానస్పద మరణంగా నమోదు చేసి. CrPC 41 సెక్షన్ క్రింద అనుమానితుడుగా పోలీసులు సూర్యనారాయణని తమ అదుపులోకి తీసుకున్నారు. 

వివిధ వార్తా మాద్యమాల్లోని మరియు పత్రికల్లోని దేవేంద్ర రేడ్డి మరణం వెనుక సూర్యనారాయణ హస్తం ఉందంటూ అనె ప్రచారం జోరందుకుంది..

తరువాత పోలీసులు ఇద్దరు మద్య ఎప్పటినుంచొ ఉన్న శత్రుత్వాన్నీ పరిగణలోకి తీసుకొని సూర్యనారాయణపై BNS సెక్షన్ 302 హత్య నేరం కూడా కలిపి  FIR నమోదుచేశారు. 

మరుసటి రోజు పోలిసులు సూర్య నారాయణని కోర్టు లొ హజరుపరిచారు. అక్కడ వాదప్రతివాదనలు మొదలయ్యాయి.

సూర్య నారాయణ ఇంట్లొ పని వాళ్ళందరితొ పాటు ఆ సమయంలొ అక్కడున్న దేవేంద్ర రెడ్డి కారు డ్రైవర్ ను కూడా కోర్టులొ లాయర్లు ప్రశ్నించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ : సర్. ముద్దాయి సూర్యనారాయణకి మరియు చనిపోయిన దేవేంద్ర రెడ్డికి మద్య చాలా కాలంపాటు పెద్ద వైరం నడిచింది. పోయిన ఎన్నికల్లొ తనని కాదని పార్టీ పెద్దలు దేవేంద్ర రెడ్డి కి MLA టిక్కెట్టు ఇచ్చారని కోపంతొ అందరి ముందు దేవేంద్ర రెడ్డిని తిట్టి, కొట్టడమె కాకుండా చంపేస్తానని కూడా సూర్యనారాయణ బెదిరించాడు అందుకు గాను సూర్యనారాయణ పై కేసు కూడా నమొదయ్యింది. తరువాత పార్టీ పెద్దల చొరవ వల్ల కేసు వాపసు తీసుకోవడం జరిగింది. నేరుగా దేవేంద్ర రెడ్డిని చంపడం కష్టం కాబట్టి పథకం ప్రకారం తనతొ స్నేహం నటించాడని. తనని నమ్మించి ఇంటికి పిలిచి భోజనంలొ విషం కలిపి హత్య చేశాడని మా అనుమానం. నిజానిజాలు రాబట్టడం కోసం 15 రోజుల పాటు ఇతనని పోలీసువారి కస్టడిలోకి పంపించమని కోర్టు వారిని కోరుతున్నాం.

జడ్జి : డిఫెన్స్ లాయర్ మీ వాధనను వినిపించండి.

డిఫెన్స్ లాయర్ : సర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పిన దాంట్లొ దేవేంద్ర రెడ్డిని కొట్టినందుకు సూర్య నారాయణ పై కేసు పెట్టి తరువాత వాపసు తీసుకున్నంతవరకు వాస్తవమె. కాని తనని సూర్య నారాయణ చంపాడు అనేది మాత్రం అబద్దం. ఎందుకంటె విషం కలిపారు అని చెబుతున్న ఆ ఆహారాన్నె అందరితొ పాటు సూర్య నారాయణ కూడా తిన్నాడని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయినటువంటి ఆ ఇంట్లోని పని వాళ్ళు మరియు దేవేంద్ర రెడ్డి కారు డ్రైవరు కూడా చెప్పారు. వాళ్ళ సాక్ష్యాలను కోర్టువారు ఒక్కసారి పరిశీలించాలి.

జడ్జి : ఇరువర్గాల వాదలను విన్న తరువాత నిజానిజాలు తేలడం కోసం పోలీసు వారు అడిగినట్టు సూర్య నారాయణని 15 రోజులు పాటు పోలీసు కస్టడీకి కాకుండా వారం రోజులు పాటు జుడీశ్యల్ కస్టడికి మాత్రమె పంపించడానికి ఆదేశిస్తున్నాం. ఫారెన్సిక్ మరియు పంచనామ రిపోర్టులను వచ్చేంత వరుకు కేసును వచ్చే వారం ఏప్రిల్ 23వ తారీకు గురువారానికి వాయిదా వేస్తున్నాం.

తరువాత జుడీశ్యల్ కస్టడీలో ఉన్న సూర్యనారాయణని వారం రోజుల పాటు పోలీసులు విచారించారు. కాని వారు ఆశించిన నిజాలేమి రాలేదు. సూర్య నారాయణ తనకేం తెలియదనె చెప్పుకుంటూ వచ్చాడు.

ఈ లోపు ఫారన్సిక్ మరియు శవ పంచనామా రిపోర్టలు రెండు వచ్చాయి.

ఫారన్సిక్ రిపోర్టులొ దేవేంద్ర రెడ్డి తిన్న ఆహారంలొ గాని త్రాగిన నీళ్ళల్లొ గాని. మరియు ఆ టేబుల్ పై ఉన్న మిగతా ఆహారంలొ కూడా ఎటువంటి విషపూరితమైన పదార్ధం లేదు అని ఉంది.

శవ పంచనామా రిపోర్టులొ అయితె సడన్ కార్డియాక్ ఎరస్ట్ (Sudden cardiac arrest) అంటె హఠాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల చనిపోయాడు అని ఎటువంటి విష ప్రయోగం జరగలేదు అని పైగా అతని ఒంటిపై ఎటువంటి గాయాలు గాని చిన్న గీతలు గాని లేవని ఉంది.

పోలీసు విచారణ అధికారి : ఏంటీ గుండె పోటు వల్ల చనిపోయాడా? అది ఎలా సాద్యం. దేవేంద్ర రెడ్డికి బీ.పి, షుగరు లాంటివి ఏమిలేవు అతను చాలా ఆరోగ్యవంతుడు పైగా ఎటువంటి దురలవాట్లు లేని వ్యక్తి. అతనికి గుండెపోటు రావడం ఏంటి...?

వారం రోజులు తరువాత సూర్యనారాయణని కోర్టులొ తిరిగి హాజరు పరిచారు.

డిఫెన్స్ లాయర్ : సర్ వచ్చిన ఫారన్సిక్ మరియు శవ పంచనామ రిపోర్టుల ప్రకారం అతనిపై ఎటువంటి దాడి గాని విషప్రయోగం గాని జరగలేదు అని ఉంది. పైగా అతని చావుకి కారణం గుండెపోటు అని నిర్ధారించారు. కాబట్టి సూర్యనారాయణ కి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు అని తేలిపోయింది. కాబట్టి అతనిపై నమోదైన BNS సెక్షన్ 302 హత్య నేరం ఆరోపణ తొలగించి బెయిల్ మంజూరు చేయవలిసిందిగా కోర్టు వారిని  కోరుతున్నాం.

జడ్జి : పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీరు మాట్లాడండి

పబ్లిక్ ప్రాసిక్యూటర్ : సర్ దేవేంద్ర రెడ్డికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అతనికి గుండె పోటు వచ్చె అవకాశం చాలా తక్కువ. పైగ మృతుడి శరీరాన్నీ బాగా పరిశీలిస్తె అది సహజ మరణంలా లేదు కచ్చితంగా అతనిపై హత్యాయత్నం జరిగింది. కాబట్టి నిజాలని వెలికితీయడం కోసం ఇంకొన్ని రోజులు సూర్యనారాయణని విచారించడానికి అనుమతి కావాలి అని కోర్టు వారిని కోరుకుంటున్నాం.

జడ్జి : వాదనులు మరియు అన్నీ రిపోర్టులు పరిశీలించాక సూర్యనారాయణె ఈ హత్య చేశాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగని పోలీసులు చెబుతున్నట్లు దేవేంద్ర రెడ్డిది సహజ మరణం కాదనె అనుమానాలు ఉన్నాయి. పైగా దేవేంద్ర రెడ్డి చనిపోయింది సూర్యనారాయణ ఇంట్లొ కాబట్టీ అతనిని నిర్దోశిగాను పరిగణించలేము. అలాగని అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు.  కాబట్టి ప్రస్తుతానికి తనపై నమోదైన BNS సెక్షన్ 302 హత్య నేరాన్నీ కొట్టేస్తూ బెయిల్ మాత్రం మంజూరు చేస్తున్నాం. కేసు పూర్తయ్యవరకు అతను ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ లోపు పోలీసు వారు వెంటనె దర్యాప్తు జరిపి తగు ఆధారలు సేకరించాల్సిందిగా ఆదేశిస్తున్నాం.

కోర్టు తీర్పుతొ సూర్యనారాయణకు కాస్త ఉపశమనం కలిగింది. కాని పోలీసులకి మాత్రం అసహనం కలిగంది. 

వార్తల్లొ ఇంకా సూర్యనారాయణనె అనుమానితుడుగా చూపిస్తున్నారు. దేవేంద్ర రెడ్డి అనుచరులు కొంతమంది సూర్యనారాయణ ఇంటి పై రాళ్ళు వేస్తూ అతినికి నిరసన తన ఇంటి ముందు బేఠాయించారు. 

కాని సూర్యనారాయణ అంతకుముందె గన్నవరం దగ్గర ఉన్న తన ఫార్మ్ హౌస్ కి మకాం మర్చేశాడు.

దేవేంద్ర రెడ్డి శవాన్నీ విజయవాడ నగరం మీదుగా ఊరేగిస్తూ అంత్యక్రియలకి తీసుకెళ్ళారు. పోలీసులు ఎటువంటి గొడవలు జరగకుండా ప్రభావిత ప్రాంతాలలొ కర్ఫ్యూ విధించారు. రక్షణ బలగాలను అంత్యక్రియలు అయ్యేంత వరకు ఊరేగింపుకి కాపలాగా ఉంచారు

ఈ సంఘటనలన్నీ ఒక వ్యక్తి తన ఇంట్లొ కూర్చోని ప్రశాంతంగా తన మొబైల్లొ చూస్తున్నాడు. తరువాత కుర్చిలోంచి లేచి ఎదురుగా గోడపై ఉన్న బోర్డుకి గుచ్చిన దేవేంద్ర రెడ్డి ఫోటోను తీసుకొని తన లైటర్ తొ ఆ ఫోటోను కాలుస్తాడు. ఆ వచ్చిన మంటపై సిగిరెట్ వెలిగించి కాలుతున్న ఫోటోను డస్టబిన్లొ పడేశి బిగ్గరగా నవ్వుతాడు.