Part - 8
ఇబ్రహీపట్నం
మద్యాహ్నం 2 గంటల సమయం
ఒక ఇంట్లోని 30 ఏళ్ళ స్త్రీ తివ్రమైన కడుపు నొప్పితొ ఉదయం నుంచి బాధపడుతంది. ఆమె పేరు "తులసి"
ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన అమెను హాస్పెటల్ కి తరలించారు. అక్కడ డాక్టర్ అమేను పరీక్షించిన ఆమె కడుపు నొప్పికి కారణం మాత్రం తెలియలేదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఆమెకు పేయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చారు.
తరువాత ఆమెను విజయవాడ లోని పెద్ద హాస్పెటల్లొ చేర్పించారు. అక్కడ ఆమె రెండు రోజులపాటు హాస్పెటల్లోనె ఉంది. ఈ రెండు రోజులు ఆమెక తీవ్రమైన సుస్తి చేసి విపరీతమైన వాంతులు, విరోచనలు అయ్యి పూర్తిగా బలహీనంగ మారీపోయింది. ఆ రెండు రోజుల్లో అక్కడున్న డాక్టర్లు ఎన్నో టెస్టులు ఆమెకు చేసిన ఆమె అనారోగ్యానికి కారణం మాత్రం కనుక్కోలేక పోయారు. ప్రతి టెస్టు రిపోర్టులోని అంతా నార్మల్ అనె వస్తుంది. కాని ఆమె ఆరోగ్యం మాత్రం రోజు రోజుకు క్షీణించి పోతుంది.
మళ్ళి రెండు రోజుల తరువాత ఈసారి ఆమెకు తీవ్రమైన కాళ్ళు మంటలు రావడం మొదలయ్యాయి. తన కాళ్ళు మొత్తం నిప్పు అంటుకున్నట్టు తీవ్రంగా మండిపోతూ నొప్పులు వస్తున్నాయి. నడిచె సామర్ధ్యం కోల్పోయింది.
ఆమె పడె బాధను చూసి ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. డాక్టర్లకి అమె సమస్య ఏంటొ అంతు చిక్కడం లేదు.
మరో వారం రోజులకి ఆమె జుట్టు ముద్దలు ముద్దలు రాలడం మొదలయ్యింది. ఇంకో వారానికి ఆమెలోని ఒక్కొక్క అవయం స్పందించడం ఆగిపోతుంది. ఆమె కుటుంబ సబ్యులు చివరి ఆశగా దేవుడినె నమ్ముకున్నారు.
వాళ్ళు క్రైస్తవులు కావడంతొ ఆమె తల్లిదండ్రులు వాళ్ళకి తెలిసిన పాస్టర్ ని హాస్పెటల్ కి పిలిపించి ఆమె వద్ద ప్రార్ధన చేయించారు.
అప్పటికె ఆమె అనారోగ్యంతొ హాస్పెటల్లో చేరి నెల రోజులు అవుతుంది. జుట్టంతా ఊడిపోయి, బాగా క్షీణించిపోయి, నీరసంతో మాటలు కూడా రాకుండా చాలా నరకం అనుభవిస్తుంది.
ఎప్పటిలాగె ఆ రోజు కూడా పాస్టర్ వచ్చి ఆమె వద్ద ప్రార్ధన చేశాడు. ప్రార్ధన ముగిశాక చూస్తె ఆమెలొ చలనం లేదు. డాక్టర్ వచ్చి పరీక్షించగా ఆమె చనిపోయింది అని చెప్పారు.
ఆది విని ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా చితికలపడి బాధతొ
తల్లిదండ్రులు : అమ్మా తులసీ......
అంటూ గట్టి ఏడవడం మొదలుపెట్టారు
------------------------------------------------------------------------
సూర్యనారాయణ మరణ వార్త విన్నవెంటనె. సాగర్ వర్మ, ఏ.సీ.పి అజయ్ మరియు ఎస్.ఐ. జాన్ బాబు అందరు కలిసి హుటాహుటిగ బయలుదేరి గన్నవరం దగ్గర్లొ ఉన్న సూర్యనారాయణ ఫార్మ్ హౌస్ కి రాత్రి 8:00 గంటలకు చేరుకుంటారు.
బయట హోరున వర్షం. ఫార్మ్ హౌస్ బయట పోలీసు వాహానాలు మరియు అంబులన్సు ఒక ప్రక్క పార్క్ చేసి ఉన్నాయి.
ఇంటి ముందు వీళ్ళ కారు ఆగింది. అప్పటికె అక్కడికి చేరుకొని ఉన్న ఎస్.ఐ. సుందర్ వీళ్ళను చూసి వాళ్ళ కారు దగ్గరకి వచ్చాడు.
ఎస్.ఐ. సుందర్ : గుడ్ ఈవినింగ్ సర్...
సాగర్ వర్మ : గుడ్ ఈవినింగ్. బాడీ ఎక్కడ ఉంది.
ఎస్.ఐ. సుందర్ : పైన ఆయన పడక గదిలొ సర్.
అందరు నేరుగా సూర్యనారాయణ పడక గదిలోకి వెళ్ళారు. అక్కడ నేల పై విగత జీవిగా సూర్యనారాయణ పడున్నాడు. పక్కన ప్రభుత్వ డాక్టర్ శవాన్నీ పరీశీలిస్తున్నాడు. ఫారెన్సిక్ బృందం వారు ముఖ్యమైన ఆధారాల కోసం వెతుకుతున్నారు.
సాగర్ వర్మ మిగిలిన ముగ్గురూ శవం వద్దకు వచ్చి నించున్నారు. సాగర్ వర్మ క్షుణ్ణంగా సూర్యనారాయణ శవాన్నీ గమనిస్తున్నాడు.
ఏ.సీ.పి అజయ్ : ఎన్నింటికి జరిగింది?.
ఎస్.ఐ. సుందర్ : సాయంత్రం 6:15 కి అలా జరిగుండచ్చని డాక్టర్ చెప్తున్నారు సార్
ఏ.సీ.పి. అజయ్ : ఎవరు ముందు చూశారు.?
ఎస్.ఐ. సుందర్ : ఇంటి పని మనిషి సార్.
ఏ.సీ.పి అజయ్ : ఎక్కడ ఉంది తను.? పిలు ఒకసారి.
ఎస్.ఐ. సుందర్ : సరె సార్.
కొంచెం సేపటి సుందర్ పని మనిషిని తీసుకువస్తాడు.
ఏ.సీ.పి అజయ్ : చెప్పు అమ్మ ఏం చూశావు?
పని మనిషి : మద్యాహ్నం భోజనం ఎక్కువుగా తినడం వల్ల. సాయంత్రం ఆయనకి బాగా కడుపు ఉబ్బరంగా అనిపించి ENO పౌడర్ ని సోడా లొ కలిపి ఇవ్వమ్మన్నారు. నేను ఇచ్చాను. అది తాగాక కూడా ఇంకా ఆయనకి కడుపు ఉబ్బరం తగ్గం లేదు. కాసేపటికి చమటలు పట్టేసి చాలా అవస్త పడ్డారు. "హాస్పెటల్ కి వెళదామా సార్" అని అడిగాను. "వద్దు పైకెళ్ళి పడుకుంటాను. కొంచె మజ్జిగలొ మెంతులు పొడి కలిపి తీసుకురమ్మని" చెప్పి వెళ్ళారు. తీరా నేను మజ్జిగ గ్లాసుతొ పైకి వెళ్ళి చూస్తె ఆ మనిషి ఛాతి పట్టుకొని నెల మీద నొప్పితొ బాధపడుతూ కనిపించాడు. వెంటనె ఇంట్లొ ఉన్న డ్రైవర్ ని పిలిచి డాక్టర్ కి కాల్ చేసి అంబులెన్సుతొ రమ్మని చెప్పాం. కాని ఆయన వచ్చె లోపలె అయ్యగారు స్పృహ కోల్పోయారు. కాసేపటికి అంబులన్సుతొ డాక్టర్ వచ్చి. ఆయ్యగారిని పరీక్షించి చూస్తె ఆయన అప్పటికె చనిపోయారు అని చెప్పారు.
ఏ.సీ.పి అజయ్ : ఆ ENO ప్యాకెట్టు మరియు సోడా బాటిల్ ఎక్కడుంది.?
పనిమనిషి : డైనింగ్ టేబుల్ మీదె ఉన్నాయి సర్.
ఏ.సీ.పి అజయ్ : చూపించు.
పనిమనిషి : రండి సార్.
క్రింద డైనింగ్ హాల్ దగ్గరకు వచ్చారు.
పనిమనిషి : ఇవిగోండి సార్ ఇవె ..
ఏ.సీ.పి అజయ్ వాటిని కాసేపు పరిశీలనగా చూసి
ఏ.సీ.పి అజయ్ : సరె. ఆఆ.. జాన్.
ఎస్.ఐ జాన్ బాబు : సార్...
ఏ.సీ.పి అజయ్ : ఫారెన్సిక్ వాళ్ళకి దీని గురించి కూడా చెప్పి. ఈ ఖాళి ప్యాకెట్టుతొ మిగిలిన ENO ప్యాకేట్లు మరియు సోడా బాటిల్ కూడా సేకరించమను.
ఎస్.ఐ జాన్ బాబు : సరె సార్...
తరువాత మళ్ళి ఏ.సీ.పి అజయ్ పైకి వచ్చి సాగర్ వర్మ దగ్గర నిలబడ్డాడు. సాగర్ వర్మ ఇంకా అదె పనిగా సూర్యనారాయణ శవాన్నీ చూస్తున్నాడు.
ఏ.సీ.పి అజయ్ : సుందర్.. పారిస్ లొ చదువుకుంటున్న ఈయన అబ్బాయి వంశి కి ఫోన్ చేసి చెప్పావా..?
ఎస్.ఐ. సుందర్ : ఇంకా లేదు సర్. ఇప్పుడు చెప్తాను.
ఏ.సీ.పి అజయ్ : సరే...
కాసేపటికి శవాన్నీ పరీక్షించడం అయిపోయిన తరువాత డాక్టర్ వీళ్ళిద్దరి వద్దకు వచ్చాడు.
సాగర్ వర్మ : ఎలా జరిగుండచ్చు. డాక్టర్.?
ప్రభుత్వ డాక్టర్ : నా ప్రాధమిక పరిశీలనలొ అతని ఒంటిపై ఎటువంటి గాయాలు గాని కనీసం చిన్న గీతలు గాని లేవు. కార్డియాక్ అరెస్టె అని నేను అనుకుంటున్నాను. కాని శరీర లక్షణాలు చూస్తె మాత్రం వేరె ఇంకేదొ అనిపిస్తుంది.
ఏ.సీ.పి అజయ్ : మళ్ళి అదే మాట... ఏంటి సార్ తిరిగి తిరిగి మళ్ళి ఇక్కడికె వచ్చాం. పిచ్చెక్కుతుంది ఈ కేసుల వల్ల.
సాగర్ వర్మ మాత్రం అజయ్ మాటలు వినకుండా ఏదొ ఆలోచిస్తు ఉన్నాడు.
ఎస్.ఐ సుందర్ : కానిస్టేబుల్ వాళ్ళను వచ్చి శవాన్నీ తీసుకెళ్ళి అంబులెన్సులొ ఎక్కించమను. పోస్ట్ మార్టెమ్ కి పంపించాలి.
సాగర్ వర్మ : ఈ రాత్రికి పోస్టుమార్టెమ్ చెయ్యించద్దు. మార్చురీలొ ఉంచి రేపు ఉదయం 8 గంటలకు చేద్దాం.
ఎస్.ఐ సుందరం : దేనికి సర్.?
ఏ.సీ.పి అజయ్ : అవును ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు సర్.?
సాగర్ వర్మ : దేవేంద్ర రెడ్డి కేసులొ మనం కనిపెట్టలేక పోయాం. ఈసారి అలా జరిగడానికి వీల్లేదు. ఇది సాధారణ పోస్టుమార్టెమ్ లా జరగకూడదు.
ఏ.సీ.పి అజయ్ : సాధారణంలా కాకుండా అంటె.?
సాగర్ వర్మ : Mr. అజయ్ ఒక్కసారి ఆ రోజు మనం డా.గోపాల్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొండి. నాడి వ్యవస్త గతి తప్పేలా చేసి గుండె లయను మార్చొచ్చు అన్నారు. కదా..
ఏ.సీ.పి అజయ్ : అవును సార్.
సాగర్ వర్మ : అందుకె మనం ఈ పోస్టుమార్టెమ్ ని డా.గోపాల్ గారి కళ్ళ ముందె చేయిద్దాం. అప్పుడు ఆయన ఏ లోపం ఉందొ క్షుణ్ణంగా పరీశీలించి అసలైన కారణం ఏంటొ చెప్తారు. ప్రస్తుతం ఆయన సొంతపని మీద కొడుకు డా. రవీంద్ర గారితొ కలిసి విశాఖపట్టణం వెళ్ళారు. ఇంతుముందె నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడేశాను. రేపు ఉదయం 6 గంటల ఫ్లైట్ కి బయలుదేరి వస్తా అన్నారు. కాబట్టి ఆయన వచ్చేంత వరకు ఆగుదాం.
ఏ.సీ.పి అజయ్ : సరె సర్ . అయినా ఏలాగొ పోస్టుమార్టెమ్ చేసేది డా. రవీంద్ర గారె కదా. ఆయన నాన్నగారు డా.గోపాల్ గారి కోసం కాకపోయిన ఎలాగొ డా. రవీంద్ర గారి కోసమైన రేపు ఉదయం వరకు ఆగాలి.
మరుసటి రోజు ఉదయం 7 గంటలకి
డా.రవీంద్ర మరియు తన తండ్రి డా. గోపాల్ ఇద్దరు గన్నవరం విమానాశ్రయంలొ దిగారు.
లగేజి మొత్తం తీసుకొని బయటకు వచ్చి టాక్సీ కట్టించుకొని నేరుగా విజయవాడ జెనరల్ హాస్పెటల్ కి చేరుకున్నారు..
1 గంట తరువాత.....
మార్చురీలో గాఢమైన నిశ్శబ్దం అలుముకుంది.
పైకప్పు లైట్ల తెల్లని వెలుతురు పోస్ట్‌మార్టం టేబుల్ మీద పడుతోంది.
సూర్యనారాయణ మృతదేహం చుట్టూ ఫారెన్సిక్ సిబ్బంది, వీడియోగ్రాఫీ సిబ్బంది ఉన్నారు.
అక్కడె సాగర్ వర్మ కూడా చేతులు ముడుచుకుని నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు.
అతడి పక్కనే ఏ.సీ.పి అజయ్ కూడా ఉన్నాడు.
కొద్ది దూరంలో డా. గోపల్ అక్కడ మొదలవ్వె పోస్టుమార్టెమ్ ను పర్యవేక్షిస్తున్నారు.
డా. రవీంద్ర మృతదేహం యొక్క బాహ్య పరిశీలన (external examination) ప్రారంభించాడు.
డా.రవీంద్ర : శరీరంపై గాయాలు గాని పెనుగులాట తాలుకు గుర్తులు గాని ఏం లేవు… కాని సహజ గుండెపోటు కేసుల్లొ కనిపించె టిపికల్ మయోకార్డియల్ డ్యామేజ్ (typical myocardial damage) అంటె గుండె యొక్క కండరాలు దెబ్బతిన్నటువంటి లక్షణాలు ఏమి కనిపించడం లేదు.
ఇలా డా. రవీంద్ర చెబుతుంటె ప్రక్కనె ఉన్న అసిస్టంట్ డాక్టర్. పృధ్వీ ప్రతి తను చెప్పే ప్రతి పరీశీలనను నమోదు చేస్తున్నాడు.
కొన్ని నిమిషాల తర్వాత మృతదేహం తాలుకు అంతర్గత పరీశీలన (internal examination) ప్రారంభమైంది.
గుండెను జాగ్రత్తగా బయటకు తీసి పరిశీలిస్తున్న డా. రవీంద్ర ఒక్కసారిగా కనుబొమ్మలు ముడిచాడు.
డా.రవీంద్ర : గుండె ధమనులు(Coronary arteries) లో ఎటువంటి తీవ్రమైన అడ్డంకి (significant blockage) కనిపించడం లేదు…
అది విన్న వెంటనే డా. గోపాల్ ముందుకు వచ్చాడు.
అతని చూపు పూర్తిగా గుండెపైనే నిలిచిపోయింది.
డా.గోపాల్ : మాసివ్ ఇన్ఫార్క్షన్ ఎవిడెన్స్ (Massive infarction evidence) అంటె తీవ్రస్థాయిలొ గుండె కణజాలం దెబ్బతిన్న ఆనవాళ్ళు ఏమైన ఉన్నాయా..?
డా.రవీంద్ర : లేదు నాన్న
అని మెల్లగా సమాధానం ఇచ్చాడు.
కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం.
తర్వాత డా. గోపాల్ నెమ్మదిగా
డా.గోపాల్ : అయితే… గుండె లయ ఎందుకు తప్పింది?
ఆ మాటతో మార్చురీలోని వాతావరణం ఒక్కసారిగా భారంగా మారింది.
సాగర్ వర్మ వెంటనే డా. గోపాల్ వైపు తిరిగి చూశాడు.
డా. రవీంద్ర మరోసారి తన అసిస్టంట్ డా.పృధ్వీ వ్రాసిన ఎక్సామినేషన్ రిపోర్టు వైపు చూసి
డా. రవీంద్ర : సాధారణ గుండెపోటు కేసుల్లో కనిపించే గుండె కండరాల నష్టం (myocardial damage) ఇక్కడ చాలా తక్కువగా ఉంది…
డా. గోపాల్ కాసేపు సూర్యనారాయణ మృతదేహాన్ని నిశ్శబ్దంగా గమనించాడు. తర్వాత మెల్లగా
డా. గోపాల్ : ఈ గుండె ఆగిపోయింది. కానీ సహజంగా కాదు... మనం అనుమానించినట్టు. ఏదొ పదార్ధం ద్వారా అది ఆగిపోయెలా చేశారు.
ఆ మాటలు విన్న వెంటనే సాగర్ వర్మ మనసులో దేవేంద్ర రెడ్డి తాలూకు పోస్టమార్టెమ్ రిపోర్ట్ మెదిలింది.
ఒకే లక్షణాలు.
ఒకే తరహాలొ ఆకస్మాత్తుగా కుప్పకూలడం
కానీ… సహజ మరణానికి సరిపోని గుండెపోటు.
సాగర్ వర్మ కళ్ళలో అనుమానం మరింత పెరిగింది.
పోస్ట్ మార్టెమ్ పూర్తయిన మరుసటి రోజు సాయంత్రం సాగర్ వర్మ తన ఆఫీసులో కిటికి దగ్గర నించోని సిగిరెట్టు కాలుస్తూ బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
కాసేపటికి ఏ.సీ.పి అజయ్ లోపలికి వచ్చాడు
ఏ.సీ.పి అజయ్ : సార్ ఇది సహజ మరణం కాదని అర్ధమయింది. ఎవరొ చాలా తెలివిగా వీళ్ళని సహజ మరణంలా అనిపించేలా చంపాడు. వాడిని ఎలా కనుక్కోవడమొ అర్ధం కావడంలేదు ...?
సాగర్ వర్మ మాట్లాడుతున్న అజయ్ వైపు తిరగకుండా అలా సిగిరెట్ కాలుస్తూ కిటికి లోంచి చూస్తూనె...
సాగర్ వర్మ : ఒక విషయం చెప్పండి అజయ్ ఆరోజు ఇంటరాగేషన్ సెల్లో అరవింద్ ని విచారిస్తున్నప్పుడు మనం తనని ఒక ప్రశ్న అడిగాం. గుర్తుందా...?
ఏ.సీ.పి అజయ్ : ఏ ప్రశ్న సార్...?
అలాగె సిగిరెట్ కాలుస్తూ అజయ్ వైపు తిరిగి
సాగర్ వర్మ : అదే దేవేంద్ర గారు చనిపోయిన రోజు పోలీసులకు ఎందుకు ఫోన్ చేశావు.? అని అడిగాముగా..
ఏ.సీ.పి అజయ్ : అవును సార్. అప్పుడు తను పోలీసులకు కాదు అంబులెన్సుకి కాల్ చేశాడని అబద్దం చెప్పాడు.
సాగర్ వర్మ : కాని ఎందుకొ తను చెప్పింది నిజం ఏమో అనిపిస్తుంది.
ఏ.సీ.పి అజయ్ : ఎలా నిజం అవుతుంది సార్. అతని కాల్ డేటా ఆ సమయానికి పోలీసులకి వెళ్ళినట్టెగా ఉంది. మనం చెక్ చేశాంగా ..
సాగర్ వర్మ : ఏ నెంబర్ కాల్ డేటాలొ చూశాం మనం.?
ఏ.సీ.పి అజయ్ : +919908232222 సార్ తన మేయిన్ మరియు మొదటి నంబరు.
సాగర్ వర్మ : మరి తన రెండొ నంబరు +918852241364 కాల్ డేటాలొ చూశామా..?
ఏ.సీ.పి అజయ్ : లేదు సార్. మొదటి నంబర్ కాల్ డేటాలొ పోలీసులకు ఫోన్ చేసినట్టు ఉండెసరికి ఆ రెండొ నంబర్ చెక్ చేయలేదు.
సాగర్ వర్మ : ఇప్పుడు చెక్ చేద్దాం. అవి ఇక్కడికి తెప్పించండి. అలాగె ఎస్.ఐ జాన్ బాబు మరియు ఎస్.ఐ సుందర్ ని కూడా పిలిపించండి.
ఏ.సీ.పి అజయ్ : సరె సార్.
కాసేపటికి ఎస్.ఐ జాన్ బాబు మరియు ఎస్.ఐ సుందర్ ఇద్దరు వస్తూ అరవింద్ రెండు ఫోన్ నంబర్ల కాల్ డేటాను కూడా తీసుకొని వచ్చారు.
ఏ.సీ.పి అజయ్ వారిద్దరితొ కలిసి రెండు నంబర్ల కాల్ డేటాను క్షుణ్ణంగా పరీశీలిస్తున్నారు. సాగర్ వర్మ ఇంకా ఆ కిటికి దగ్గర నించోని సిగిరెట్ కాలుస్తూనె ఉన్నాడు.
ఏ.సీ.పి అజయ్ : సార్ మీ అనుమానం నిజమె. నిజంగానె అరవింద్ తన రెండొ నంబర్ నుంచి అంబులెన్సుకు కాల్ చేశాడు. రెండిటికి 30 సెకెండ్లు తేడా ఉంది.
అది విని సాగర్ వర్మ తన టేబుల్ వద్దకు వచ్చి యాస్ట్రేలొ సిగిరెట్ ను ఆర్పి. అజయ్ చేతిలొ ఉన్న కాల్ డేటా రిపోర్టును తీసుకున్నాడు.
ఏ.సీ.పి అజయ్ : అయితె ముందు అంబులన్సుకి కాల్ చేసి తరువాత పోలీసులకి ఎందుకు కాల్ చేసినట్టు.?
సాగర్ వర్మ : మీరు అడగాల్సింది అది కాదు. కాల్ చేసిన కూడా అంబులెన్స్ ఎందుకు రాలేదు అని.
ఏ.సీ.పి అజయ్ : అవును కదా. కాల్ చేసినప్పుడు అంబులెన్స్ రావాలి కదా.? ఎందుకు రాలేదు.?
సాగర్ వర్మ : కాల్ డైవర్ట్....
ఏ.సీ.పి అజయ్ : కాల్ డైవర్టా..?
ఎస్.ఐ. సుందర్ : కాల్ డైవర్ట్. అంటె ఏంటి సార్.?
సాగర్ వర్మ : అరవింద్ చేసిన కాల్ ని అంబులెన్స్ కంట్రోల్ రూమ్ కి వెళ్ళకుండా మద్యలోనె ఇంటర్సెప్ట్ చేయడం.
ఏ.సీ.పి అజయ్ : అలా చెయ్యచ్చా సార్.?
సాగర్ వర్మ : చెయ్యచ్చు. అంతె కాదు తన మొదటి మేయిన్ మొబైల్ ఫోన్ నీ కూడా ఎవరొ హ్యాక్ చేసుండచ్చు. అరవింద్ కి తెలియకుండా ఆ మొబైల్ నుండె పోలీసులకు కాల్ వెళ్ళుంటుంది.
ఎస్.ఐ. సుందర్ : వామ్మో. ఈ హంతకుడెవడొ గాని చాలా తెలివైనవాడు.
ఏ.సీ.పి అజయ్ : ఇదంతా మీకు ఎలా తెలుసు సార్. ?
సాగర్ వర్మ : విన్నాను. 3 ఏళ్ళ క్రితం ఢిల్లిలొ జరిగిన ఒక హత్య కేసులొ హంతుకుడు ఇలాగె కాల్ డైవర్ట్ చేసి ఒక అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఆ కేసుని డీల్ చేసింది నా బ్యాచ్ మేట్ కరుణాకర్ ఐ.పీ.ఎస్. తనె నాకు చెప్పాడు ఈ విషయం గురించి
ఏ.సీ.పి అజయ్ : ఓహో... మరి మేయిన్ మొబైల్ హాకింగ్ గురించి ఎలా చెప్పగలిగారు.
సాగర్ వర్మ : కమాన్ Mr. అజయ్ మీరు ఒక ఐ.పీ.ఎస్ అయ్యుండి ఈ మాత్రం కూడా తెలియదా. కాల్ డైవర్ట్ చేయగలిగిన వాడు. ఆఫ్ట్రాల్ ఒక స్మార్ట్ ఫోన్నీ హ్యాక్ చేయలేడా....?
ఏ.సీ.పి అజయ్ : కదా. ఏంటొ ఈ కేసు వల్ల నా బుర్ర మొత్తం దొబ్బింది. అస్సలు పనిచేయడం లేదు.
ఎస్.ఐ జాన్ బాబు : ఇప్పుడు ఇది మన నిరూపించాలంటె ఏం చేయ్యాలి సార్.?
సాగర్ వర్మ : చెప్తా. దానికంటె ముందు మీరిద్దరు చేయ్యాల్సిన పని ఇంకొకటుంది.
ఎస్.ఐ సుందర్ : ఏంటి సార్. ?
సాగర్ వర్మ : అరవింద్ ద్వారా మనం పట్టుకున్న డ్రగ్స్ స్మగ్లర్స్ ని మన స్టైల్లొ బాగా విచారించి. వాళ్ళకి సరుకు ఎక్కడి నుంచి వస్తుందొ ట్రేస్ చెయ్యండి. మొత్తం దాని ములాల వరకు వెళ్ళాలి.
ఎస్.ఐ సుందర్ : అంటె వాళ్ళ ద్వారా ఆ సరుకు ఎక్కడ? ఎలా? ఎవరు తయ్యారు చేస్తున్నారొ తెలుసుకోవాలా సార్?
సాగర్ వర్మ : ఎస్. ఎగ్సాట్లీ... కుదురితె అరవింద్ ని కూడా అదె పద్దతిలొ విచారించండి.
ఎస్. ఐ జాన్ బాబు : ఇంక మాకు వదలేయండి సార్. మేము చూసుకుంటాం.
సాగర్ వర్మ : గుడ్ ... వెళ్ళి ఆ పని మీద ఉండండి.
ఏ.సీ.పి అజయ్ : సార్ సీ.ఐ ప్రవీణ్ ఇప్పుడు కోలుకున్నాడు. ఈ డ్రగ్స్ లింక్ వెతకడంలొ తను బాగా ఉపయోగపడతాడు. ఎలా వెతకాలొ తనకి బాగా తెలుసు.
సాగర్ వర్మ : అయితె. సీ.ఐ ప్రవీణ్ ని కూడా రేపటి నుంచి వీళ్ళద్దరితొ పాటు ఆ పనిమీద ఉండమని చెప్పండి.
ఏ.సీ.పి అజయ్ : సరె సార్.
సాగర్ వర్మ : Mr. అజయ్ మీరు మాత్రం నాతోనె ఉండండి రేపు మనం డా. సమర్జిత్ సెన్ ని కలవడానికి గన్నవరం విమానాశ్రయానికి వెళుతున్నాం.
ఏ.సీ.పి అజయ్ : ఆయన ఎవరు సార్ ?
సాగర్ వర్మ : ఆయన మాజి చీఫ్ ఫారెన్సిక్ టాక్సికాలజి అనలిస్ట్ ఈ కేసు తీవ్రత దృష్ట్యా మన అబ్యర్థనపై డీ.జీ.పి గారె ఆయన్నీ కలకత్తా నుంచి ఈ కేసుపై ప్రత్యేక సలహాదారుగా ఇక్కడికి పిలిపిస్తున్నారు.
ఏ.సీ.పి అజయ్ : మరీ ఆ కాల్ డైవర్ట్ మరియు ఇంకా ఆ మొబైల్ హ్యాకింగ్ సంగతి ఏంటి సార్.
సాగర్ వర్మ : ఈ కేసు మొదట్లొ నేను ఒక హ్యాకర్ కావాలి అని అడిగాను గుర్తుందా..?
ఏ.సీ.పి అజయ్ : గుర్తుంది సార్.
సాగర్ వర్మ : ఇలాంటి వాటి కోసమె అడిగాను. రేపు ఎలాగైన ఒక హ్యకర్ ని ఏర్పాటు చెయ్యండి.
ఏ.సీ.పి అజయ్ : అడిగిన రోజె మాట్లాడి ఉంచాను సార్. మీరు చెప్పినప్పుడు పిలుద్దామని ఆగాను. రేపె పిలిపిస్తాను.
సాగర్ వర్మ : రేపు మాద్యాహ్నానికి ఇక్కడికి రమ్మను. ఎందుకంటె ఉదయం డా. సమర్జీత్ గారితొ మనం నేరుగా మంగళగిరి లొ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫారెనసిక్ సైన్స్ ల్యాబరేటరి (APFSL) వెళుతున్నాం.
ఏ.సీ.పి అజయ్ : సరె సార్.