Yevaru..? - 5 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 5

Featured Books
Categories
Share

ఎవరు....? - 5

Part - 5

• ఉదయం 7 గంటలు..... 
• విజయవాడ పోలీసు కమీషనరేట్ ఆఫీసు....
• అక్కడ సాగర్ వర్మ మరియు మిగిలిన SIT అధికారులు కలిసి ఒక ప్రత్యేక గదిలొ సమావేశమై ఉన్నారు. 

సాగర్ వర్మ : So guys... lets coming to the case. 
• మనం చేయ్యాల్సిన మొదటి పని దేవేంద్ర రెడ్డి ఎలా చనిపోయారు అనేది కనుక్కోవాలి 
• రెండోది అతన్నీ ఇంత తెలివిగా పథకం ప్రకారం చంపాడు అంటె కచ్చితంగా ఎవరొకరు సహాయం చేయకుండా అతని ఈ పని చేయలేడు. So మనం ఆ సహాయం చేసిన వ్యక్తిని కనుక్కోవాలి
• మూడోది ఈ హత్యకు పాల్పడిన ఆ అజ్ఞాత వ్యక్తని మనం కనుక్కోవాలి.
• నాలుగు అతను ఈ హత్య ఎందుకు చేశాడొ తెలుసుకోవాలి.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : దీన్నీబట్టి మనం ఎక్కడనుంచి మొదలు పెట్టాలి సర్?.

సాగర్ వర్మ : అక్కడికె వస్తున్నా....
Mr. అజయ్ మీరు నేను కలిసి దేవేంద్ర రెడ్డి ఎలా..? దేని వల్ల...? చనిపోపోయాడొ దర్యాప్తు చేద్దాం.

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : సరె సర్...

సాగర్ వర్మ : Mr. ప్రవీణ్ మీరు దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణ యొక్క గత చరిత్ర మొత్తం తెలుసుకోండి. అంటె వాళ్ళ రాజకీయ ప్రయాణం మొదలవ్వకముందు నుంచి ఇప్పటి వరకు. పూర్తి గతం తెలిస్తేనె హంతకుడు ఎవరనేది ఎందుకు చంపాడనేది తెలుస్తుంది.

సీ.ఐ ప్రవీణ (C.I Praveen) : సరె సర్

సాగర్ వర్మ : Mr. సుందర్ & జాన్ బాబు. మీరిద్దరు కలిసి నవతరం పార్టీ ఆఫీసు, సూర్యనారాయణ ఇల్లు మరియు దేవేంద్ర రెడ్ది ఇళ్ళ తాలుకు గత ఆరు నెలల సీ.సీ టీవి ఫూటేజస్ ని సంపాదించండి. 

ఎస్.ఐ సుందర్ & ఎస్.ఐ జాన్ బాబు : అలాగె సర్.

సాగర్ వర్మ : అంతె కాకుండ అక్కడ కెమేరాల్లొ కనబడని చోట్లు అదె.. బ్లైండ్ స్పాట్స్ ఎన్నున్నాయి మరియు ఎక్కడెక్కడ. ఉన్నాయొ తెలుసుకోండి. 
ఎవరికి అనుమానం రాకుండా ఆ బ్లైండ్ స్పాట్స్ దగ్గర బాగా తనిఖి చేయండి. ఏదైన క్లూ దోరకచ్చు... అలాగె ఆ కెమెరాల యొక్క యాంగిల్సు ఎలా ఉన్నాయి అవి ఎటువైపు తిరిగి ఉన్నాయి?. వాటిని ఎవరైన టాంపరింగ్ గట్రా చేశారా లేదా ? అనేది కూడా చూడండి. జాగ్రత్త ఇవన్నీ చూసేటప్పుడు అందరికి సాధారణ తనిఖిలానె అనిపించాలి గాని ఎవరికి అనుమానం రాకూడదు. మళ్ళి చెప్తున్న

ఎస్.ఐ సుందర్ & ఎస్.ఐ జాన్ బాబు : అలాగె సర్. 

ఎస్.ఐ సుందర్ : మీరు చెప్పనట్టె ఎవరికి అనుమానం రాకుండా చూసుకుంటాం.

సాగర్ వర్మ : తరువాత మనకి ఒక హాకర్ (Hacker) కావాలి. 

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : ఎందుకు సర్?

సాగర్ వర్మ : ఎందుకొ తరువాత చెప్తాను ఇప్పుడు కాదు. ముందు నేను చెప్పిన పని చూడండి.

ఇలా ఒక్కొక్కరు ఒక్కో పని మొదలుపెట్టారు. 

ముందుగా సాగర్ వర్మ మరియు ఏ.సి.పి అజెయ్ కలిసి దేవేంద్ర రెడ్డికి శవపంచనామ చేసిన డాక్టర్ రవీంద్రని కలవడానికి వెళ్ళారు.

సాగర్ వర్మ : నమస్తె డాక్టర్ రవీంద్ర గారు..

డా.రవీంద్ర : నమస్తె మీ గురించె ఎదురుచూస్తున్న. రండి కూర్చొండి. 

సాగర్ వర్మ : ఇతను ఏ.సి.పి అజయ్ నాతొ పోటు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు.

డా.రవీంద్ర : ఓ ఐ.సీ... నమస్తె... 

ఏ.సీ.పి అజయ్ (ACP Ajay) : నమస్తె డాక్టర్

డా. రవీంద్ర : చెప్పండి... దేవేంద్ర రెడ్డి గారి పోస్టుమార్టెమ్ రిపోర్టు మీద మీకు ఏ అనుమానాలు ఉన్నాయి.?

సాగర్ వర్మ : నా అనుమానాలు ఏంటంటె ఈ కేసులొ ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలానికి మీరిచ్చిన పోస్టుమార్టమ్ రిపోర్టుకి కొంచెం పొంతన కుదరడం లేదు.

డా.రవీంద్ర : ఏ ఏ విషయాల్లొ..?

సాగర్ వర్మ : మీరిచ్చిన రిపోర్టు ప్రకారం దేవేంద్ర రెడ్డి కార్డియాక్ అరెస్ట్ (అంటె హృదయ స్పందన ఆగిపోవడం) వల్ల చనిపోయారు. ఏమ్. ఐ. కరక్ట్...?

డా. రవీంద్ర : ఎస్... ఆబ్సల్యూట్లి....

సాగర్ వర్మ : నేను చేసిన పరిశోధన ప్రకారం కార్డియాక్ అరెస్టైన వ్యక్తి కేవలం 10 సెకండ్లలొ కుప్పకూలిపోయి ఛలనం లేకుండా అయిపోయి కాసేపటికె చనిపోతాడు. రైట్...? 

డా. రవీంద్ర : యూ.. అర్... రైట్. హఠాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల
•  మొదటి 10 సెంకెడ్లలొ అతను కుప్పకూలిపోతాడు.
• తరువాత 20 సెంకెండ్లు అతనిలొ స్పందన ఉండదు..
• మరొ నిమిషం అతని శరీరంలొని రక్త ప్రసరణ ఆగి. మెదడుకు చేరాల్సిన ఆక్సిజన్ (ప్రాణ వాయువు) ఆగిపోతుంది
• 5 నిమిషాల తరువాత అతని మెదడు చచ్చుబడుతుంది
• తరువాత 5-7 నిమిషాలలొ అతనికి సీ.పి.ఆర్ అందించక పోతె చనిపోతాడు.

సాగర్ వర్మ : అంటె కార్డియాక్ అరస్టైన వ్యక్తి 10 సెకెండ్లలోనె కుప్పకూలి ఛలనం లేకుండా ఉంటాడు. 10.5 - 12.5 నిమిషంలొ చనిపోతాడు. కాని ప్రత్యక్ష సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలంలొ. దేవేంద్ర రెడ్డి చనిపోయెముందు ఓ 2 - 3 నిమిషాలపాటు గుండె పట్టుకొని నోప్పితొ గిలగిల్లాడాడు అని ఉంది.

డా.రవీంద్ర : అయితె... ?

సాగర్ వర్మ : కార్డియాక్ అరస్ట్ కి గురైన వ్యక్తి వెంటనె కుప్పకూలి స్పృహ కోల్పోవాలి గాని 2-3 నిమిషాలపాటు నొప్పితొ ఎందుకు విలవిల్లాడాడు..?

డా.రవీంద్ర : ఒక్కోసారి కార్డియాక్ అరస్టైన వెంటనె స్పృహ కోల్పోకుండా కొంచెం సేపు నొప్పితొ బాధపడె అవకాశాలు అరుదుగా ఉన్నాయి. అలా దేవేంద్ర గారికి వచ్చుండచ్చు.

ఏ.సీ.పి అజయ్ : అంటె డాక్టర్ గారు దేవేంద్ర గారిది సహజ మరణమె అని అంటారా.?

డా. రవీంద్ర : అలా అవ్వచ్చు అని చెబుతున్నాను.

డాక్టర్ రవీంద్ర అలా అనడంతొ సాగర్ వర్మ ఆలోచనలొ పడిపోయాడు. కసేపు ఆగి

సాగర్ వర్మ : నాకింకా ఇది సహజ మరణంలా అనిపించడం లేదు. మీరే చెప్పండి డాక్టర్ మీ అనుభవంలొ ఇలాంటి మరణాలు ఎన్నో చూశారు. మీకు ఇది సహజ మరణంలా అనిపిస్తుందా..?

డా. రవీంద్ర : మీకు వచ్చిన అనుమానమె నాకూ వచ్చింది. కాని దేవేంద్ర రెడ్డి గారి మరణానికి సంబంధించి వేరె ఇంక ఏ కారణాలు నాకు కనిపించలేదు. శవపంచనామ చేస్తున్నప్పుడు బాగా గమనించాను ఆయన శరీరంలొ అనుమానమైనిది ఏది కనిపించలేదు.

ఏ.సీ.పి అజయ్ : ఛా.. ఇప్పుడు ఎలా సర్? మళ్ళి దర్యాప్తు మొదటికె వచ్చింది. ఏం చేద్ధాం..?

సాగర్ వర్మకి ఏం చెయ్యాలొ పాలుపోక మళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు. 

డా. రవీంద్ర : చూడండి సాగర్ గారు నేను కేవలం ఫారెన్సిక్ పాథాలజీస్ట్ని శవాలుకు పంచనామ చేసేవాడిని. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. కాని మీకింకా అనుమానాలు తీరాలంటె కార్డియాలజిస్ట్ ని కలవండి. వాళ్ళకి గుండెకి సంబంధించిన వాటిపై పూర్తి పట్టు ఉంటుంది. 

ఏ.సీ.పి అజయ్ : మరి మీకు తెలిసిన కార్డియలజిస్ట్ ఎవరైన ఉన్నారా?

డా. రవీంద్ర : ఉన్నారు.. పేరు డాక్టర్ గోపాల్ ప్రముఖ కార్డియాలజిస్ట్.

సాగర్ వర్మ : ఆయన రిటైర్ అయిపోయారు అని విన్నాను.

డా. రవీంద్ర : అవును.. రిటైర్ అయిపోయారు. 

ఏ.సీ.పి అజయ్ : మరి ఆయన మమ్మల్ని కలవడానికి ఒప్పుకుంటారా..?

డా.రవీంద్ర : తప్పకుండా ఒప్పుకుంటారు. 

ఏ.సీ.పి అజయ్ : ఎలా చెప్పగలరు.?

డా. రవీంద్ర : ఎందుకంటె ఆయన మా నాన్నగారు. నేను అడిగితె కచ్చితంగా ఒప్పుకుంటారు.

ఏ.సీ.పి అజయ్ : ఓ... అవునా.. 

డా.రవీంద్ర : ఒక రోజు సమయం ఇవ్వండి.
నేను ఆయనతొ మాట్లాడి మీకు చెబుతాను.

సాగర్ వర్మ : సరె మేము రేపు వస్తాం.

అక్కడనుంచి సాగర్ వర్మ మరియు ఏ.సీ.పి అజయ్ బయలుదేరారు.

ఏ.సీ.పి అజయ్ : ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి సర్.?

అని కార్ స్టార్ట్ చేస్తు అడిగాడు. 

సాగర్ వర్మ : ఆంధ్రప్రదేశ్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరి (APFSL), మంగళగిరి. అక్కడికి పోనీయండి

అని తన ఫోన్ లొ నంబర్ డయల్ చేస్తూ చెప్పాడు.

ఏ.సీ.పి అజయ్ : సరె సర్.

సాగర్ వర్మ డయల్ చేసిన నంబర్ సీ.ఐ ప్రవీణ్ ది. తనకె కాల్ చేశాడు. 

సాగర్ వర్మ : Mr.ప్రవీణ్ ఎంతవరకు వచ్చింది మీ పని.?

సీ.ఐ ప్రవీణ్ : సర్ మీరు చెప్పినట్టె నేను దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణకి సంబంధించిన గతం గురించి వాకబు చేశాను.

సాగర్ వర్మ : ఏం తేలిసింది ?

సీ.ఐ. ప్రవీణ్ : మొత్తం క్లీన్ సర్ అనుమానంగా ఏం కనిపించలేదు. వాళ్ళ రాజకీయ జీవితంలొ ప్రత్యర్ధులు తప్ప శత్రువులంటూ పెద్దగా ఎవరు లేరు

సాగర్ వర్మ : వాళ్ళ సొంత ఊళ్ళొ వాకబు చేశారా.?

సీ.ఐ ప్రవీణ్ : ప్రస్తుతం నేను ఇప్పుడు వాళ్ళ సొంత ఊరు ఇబ్రహీంపట్నానికి వచ్చాను సర్. ఇక్కడ కూడా వాళ్ళకి సంబంధించి ఎటువంటి క్లూ దొరకలేదు. 

సాగర్ వర్మ : ఛా.. సరె తరువాత ఏం చెయ్యాలొ నేను చెబుతాను మీరొచ్చయ్యండి.

సీ.ఐ. ప్రవీణ్ : ఆ.. సర్.. సర్....సర్

సాగర్ వర్మ : చెప్పండి.

సీ.ఐ ప్రవీణ్ : ఒక్క విషయం మాత్రం ఉంది సర్. కాని దినికి ఈ కేసుకి సంబంధం ఉండకపోవచ్చు. అయిన చెప్తున్నా..

సాగర్ వర్మ : ఏంటది?

సీ.ఐ ప్రవీణ్ : నేను సిగిరెట్ కొందామని ఒక కొట్టు దగ్గర ఆగాను. అనుకొకుండా దానికి ఎదురుగ్గా ఒక పాడుబడిన ఇల్లు ఒకటి చూశా..

సాగర్ వర్మ : అయితె.?

సి.ఐ ప్రవీణ్ : దాని గురించి వాకబు చేస్తె. ఆ ఇల్లు 23 ఏళ్ళ క్రితం ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలొ పనిచేసిన ప్రిన్సిపాల్ ది అంటా. ఏవొ వ్యక్తిగత సమస్యల కారణంగా కుటుంబంతొ సహా నిప్పు అంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళుతొపాటు ఆ ఇల్లు కూడా తగలబడిపోయింది

సాగర్ వర్మ : ఆ ప్రిన్సిపాల్ పేరు ఏంటి?

సీ.ఐ ప్రవీణ్ : అతని పేరు ఇక్కడ ఎవ్వరికి పెద్దగా తెలియదు అని చెప్పారు సర్. ఆయిన ఇది కేసుకి అంత ఉపయోగపడుతుంది నేను అనుకోవడం లేదు.

సాగర్ వర్మ : సరె. ఇంకేమైన విషయాలు తెలిస్తె చెప్పండి. 

సీ.ఐ ప్రవీణ్ : సరె సర్.

సాగర్ వర్మ మరియు ఏ.సీ.పి అజయ్ మంగళగిరి ఫారెన్సిక్ లాబరేటరికి చేరుకుంటారు. సెక్యూరిటి చెకింగ్ అంతా అయ్యాక లోపలికెళతారు. 

లోపల అడ్మిన్ డెస్క్ దగ్గర కూర్చున్న మహిళ వద్దకు వెళ్ళి 

సాగర్ వర్మ :  సైంటిఫిక్ ఆఫీసర్ ప్రేరణ గారిని కలవాలి.

ఏ.సీ.పి అజయ్ : ఆవిడది టాక్సికాలజి డిపార్టమెంట్.

అడ్మిన్ డెస్క్ మహిళ : మీరెవరొ తెలుసుకోవచ్చా?

సాగర్ వర్మ : నా పేరు సాగర్ వర్మ IPS. దేవేంద్ర రెడ్డి గారి మరణం తాలుకు కేసు ఇన్వేస్టిగేషన్ టీమ్ హెడ్ ని. ఇతను పేరు అజయ్ IPS నాతొ పాటు ఈ టీమ్ లొ ఉన్నారు. ఇవి మా ఐ.డీ కార్డ్స్..

అడ్మిన్ డెస్క్ మహిళ : ఓ ఐ.సీ. అపాయింట్మెంట్ ఉందా సర్.?

సాగర్ వర్మ : ఉంది..

అడ్మిన్ డెస్క్ మహిళ : ఒన్ మినిట్....

తను ఎవరికొ కాల్ చేసి మాట్లాడింది. 

అడ్మిన్ డెస్క్ మహిళ : ప్రేరణ మేడమ్ ఉన్నారు వెళ్ళండి.

ఏ.సీ.పి అజయ్ : టోక్సికాలజి డిపార్టమెంట్ ఏ ఫ్లోరు.?

అడ్మిన్ డెస్క్ మహిళ : రెండొ అంతస్తు. అక్కడ కుడివైపు చివరిది. 

లిఫ్ట్ ఎక్కి రెండొ అంతస్తుకు వెళ్ళారు. క్రింద ఆ మహిళ చెప్పినట్టుగానె కుడివైపు చివరి గది వద్ద ఆగారు. ఎదురుగా తలుపు పైన గోడ మీద టాక్సికాలజి సెక్షన్ అని వ్రాసుంది. లోపలికి వెళ్ళారు..

వెళ్ళగానె ఎదురుగా సైంటిఫిక్ ఆఫీసర్ ప్రేరణ కనిపించి వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. ఆ ల్యాబ్ లోని చివర ఒక మూలన ప్రేరణ క్యాబీన్ ఉంది. తను వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి కూర్చొబెట్టింది.

ప్రేరణ : ఇప్పుడు చెప్పండి..? 

సాగర్ వర్మ : మేడమ్ నేరుగా పాయింట్ కి వచ్చేస్తున్నా. మీరిచ్చిన రీపోర్ట్ చదివా. అందులొ నాకు ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి.

ప్రేరణ : సర్ మేము సేకరించిన ఫుడ్ శ్యాంపిల్స్ అన్ని మామూలుగానె ఉన్నాయి. అందులొ ఎటువంటి కన్వెంట్షనల్ టాక్సిన్స్ అంటె సాంప్రదాయ విషపధార్దాలు ఏమి లేవు.

సాగర్ వర్మ : అంటె విషం ఏమి కలవలేదు అంటారా?

ప్రేరణ : విషం కలిసిందని చెప్పలేను కాని. ఆహారంలొ ఎటువంటి హానికార పదార్ధాలైతె లేవు. అసలు ఇంతకి మీకు ఉన్న సందేహాలు ఏంటి.?

సాగర్ వర్మ : మీరు సేకరించిన ఫుడ్ శ్యాంపిల్స్ లిస్టులొ ఈ అకంపనీయింగ్ సాచేట్స్ అని ఉంది. ఏంటది దానిని ఎలా చెక్ చేశారు.

ప్రేరణ : ఓ.. అవా..? అవి ఘోస్ట్ పెప్పర్ ప్యాకెట్స్ అస్సాంలొ దొరికె అతి ఘాటైన కారం. వాటిని వంటల్లొ చాలా తక్కువ మొతాదులొ వాడతారు. వాటిని కూడా విడిగానె టెస్ట్ చేశాం. ఒక్కొక్క సాచెట్ ని విడి విడిగా పరిక్షించి ఎనాలైజ్ చేశాం.

సాగర్ వర్మ : అన్నీ ఒకేలా ఉన్నాయా.?

ప్రేరణ : ఇంచుమించు అన్నీ ఒకేలా ఉన్నాయి కాని ఒక సాచెట్ లోది మాత్రం కొంచెం వేరుగా అనిపించింది.

సాగర్ వర్మ : వేరుగా అంటె?

ప్రేరణ : అందులొ ఉన్న కారం యొక్క భౌతిక సాంద్రతా (physical consistency) కొంచెం వేరుగా ఉంది. అంటె దాని గుణనిర్మాణం (Texture) మరియు వాసన కొంచెం వేరుగా అనిపించింది. కాని రసాయన పరీక్షలొ (Chemical analysis) ఏం కనిపంచలేదు. అంతా మామూలుగానె ఉంది.

సాగర వర్మ : ఆ శ్యాంపిల్ ఇంకా ఉందా.?

ప్రేరణ : ఉంది. అధారంగా ఉంటుంది అని ప్రజెర్వ్ చేశాం (నిల్వ ఉంచాం).

ప్రేరణ అసిస్టెంట్ ఒకరు ఆ ప్యాకెట్స్ ని ఒక ట్రేలొ పెట్టి తీసుకొచ్చారు. సాగర్ వర్మ వాటిని క్షుణ్ణంగా పరిశీలించాడు. నిజంగానె ఆ ప్యాకెట్టులొ ఉన్న కారం చూడ్డానికి కొంచెం వేరుగా అనిపించింది. కాని దాని రుచి మాత్రం మిగతా వాటిలాగె ఉంది నోట్లొ పెట్టుకున్నప్పుడు. 

సాగర్ వర్మ : So ఇది హానికరమైనది కాదు అంటారు.?

ప్రేరణ : హానికరమైనది అని చెప్పడానికి ఎటువంటి రుజువుల లేవు. కాని పూర్తి క్రియారహిత పదార్దం అని కూడా చెప్పలేం.

ఏ.సీ.పి అజయ్ : అదేంటి?

ప్రేరణ : కొన్నీ పదార్దాలు విషతత్వాన్నీ చూపించవు కాని వాటి వల్ల శరీర ప్రతిస్పందన మారుతుంది. అది పూర్తిగా వేరె విషయం అనుకోండి... (చిరు నవ్వతూ)

సాగర్ వర్మ : రిపోర్ట్ కాపిని ఇంకోసారి ఇవ్వండి.

ఏదొ అర్దమైన వాడిలా ప్రేరణని చూస్తూ తను కూడా చిరు నవ్వుచిందుస్తూ అడిగాడు

ప్రేరణ : మీ ఈమైల్ కి పంపించాను చూడండి.

సాగర్ వర్మ : ఒకె వీ.. విల్.. లీవ్.

అజయ్ మరియు సాగర్ వర్మ ఇద్దరు బయటకి వచ్చేశారు..

ఏ.సీ.పి అజయ్ : సర్ ఏదొ ఉంది కాని వాళ్ళు సరిగ్గ చెప్పడంలేదు. 

సాగర్ వర్మ : వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు Mr.అజయ్. మిగతాది మనమె అర్ధం చేసుకోవాలి.

ఏ.సీ.పి అజయ్ : అంటె సర్

సాగర్ వర్మ : అంటె రేపు మనం కార్డియాలజిస్ట్ ని కలిసాకె అర్ధం అవుతుంది అంటున్నా..

ఇలా వీళ్ళు బయటకి వచ్చి కారు ఎక్కుతుండగా. ఎస్.ఐ సుందర్ నుంచి సాగర్ వర్మకి కాల్ వస్తుంది.

సాగర్ వర్మ : ఆ... Mr. సుందర్ చెప్పండి..

ఎస్.ఐ సుందర్ : సర్ మీకు సీ.సీ టీవి ఫూటేజి నుంచి సేకరించిన వీడియొలలొ ముఖ్యమైనవి రెండు వీడియోలు మీ వాట్సెప్ కి పంపించా అర్జంటుగా చూడండి.