The mind behind the machine - 12 in Telugu Love Stories by swathi books and stories PDF | యంత్రం వెనుక మనసు - 12

The Author
Featured Books
  • ક્રિસ્ટોફર કોલમ્બસ

    ઇતિહાસના પાનાઓમાં જેને આપણે 'મહાન સાગરખેડુ' તરીકે ઓળ...

  • જયપુર

    *જયપુર* રાજસ્થાનની રાજધાની જયપુરની ઓળખાણ એવો હવામહલ પહેલાં જ...

  • તારા વિનાના શહેરમાં

    સાંજ નમવા આવી હતી અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઠંડો પવન ફૂંકાઈ...

  • બ્રહ્માંડ ભ્રમ

                  પ્રકરણ ૧: શાંત સવારનું તોફાનઆકાશ હજી પૂરેપૂરું...

  • લવમાં લોચો

    અમદાવાદની ભાગોળે આવેલા એ ફાર્મહાઉસમાં શનિવારની રાત ફૂલ ઓન હા...

Categories
Share

యంత్రం వెనుక మనసు - 12

అప్పుడు నీల గోడకు ఆనుకుని.. కొద్దిసేపటి క్రితం తను ప్రసాద్ అంకుల్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసుకుంది.
నీల ఫోన్ చేయగానే ప్రసాద్ గారు ఎత్తారు. "చెప్పు నీలా! ప్రయోగశాలకు కాల్ చేశావు? నీ మొబైల్ నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను పనిలో ఉండి ఎత్తలేదు తల్లి.. నన్ను క్షమించు! ఇంతకీ విషయం ఏంటమ్మా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు?" అని అడిగారు ప్రసాద్ గారు.
"అంతా బాగానే ఉన్నాం అంకుల్ గారు.. కానీ మీ అయాన్ పుట్టినరోజును మీరు మర్చిపోయారా?" అని నీల అడిగింది.
"అవును కదా! నా పరిశోధన పనిలో పడి పూర్తిగా మర్చిపోయాను అమ్మ.. సరే, నేను తప్పకుండా ఇప్పుడే బయల్దేరి వస్తున్నాను" అన్నారు ప్రసాద్ గారు.
ఆ విధంగా ప్రసాద్ అంకుల్‌ను తానే సమయానికి పిలిపించి, అయాన్‌ను షీలా తీసుకెళ్లకుండా కాపాడుకున్నందుకు నీల తనలో తానే మురిసిపోతూ నవ్వుకుంది.
నీల తన గత జ్ఞాపకాలను మరికొంచెం లోతుగా గుర్తుచేసుకుంది. ఫోన్‌లో ప్రసాద్ అంకుల్‌తో మాట్లాడుతున్నప్పుడు, నీల కాస్త నసుగుతూ, "అంకుల్ గారు.. ఇంకొక ముఖ్యమైన విషయం.. కానీ నాకు కొంచెం మొహమాటంగా ఉంది" అని ఆగింది.
దానికి ప్రసాద్ గారు నవ్వుతూ, "చెప్పు నీలా! నా దగ్గర ఈ మొహమాటాలు ఎందుకు తల్లి? ఏంటో చెప్పు" అన్నారు.
అది.. నా స్నేహితురాలు షీలా ఉందండీ. తను రేపు ఏదో పరిశోధన కోసం అయాన్‌ను తనతో పాటు పంపించమని నాన్నగారిని అడుగుతోంది. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు అంకుల్!" అంది నీల ఆందోళనగా.
"ఎందుకు నీలా? ఇష్టం లేదు అంటున్నావు.. అయాన్‌ను ఇస్తే ఏమవుతుంది?" అని ప్రసాద్ గారు ఆశ్చర్యంగా అడిగారు.
నిజానికి నీలకు అయాన్ లోని సమాచారం పోతుందనే భయం కంటే.. అయాన్ మీద ఉన్న ప్రేమ వల్లే వాడిని షీలాతో పంపించడం అస్సలు ఇష్టం లేదు. వాడు ఒక యంత్రం అయినప్పటికీ, అయాన్ వేరే ఏ అమ్మాయితోనైనా ఆత్మీయంగా ఉంటే తను భరించలేకపోతోంది. కానీ ఆ నిజాన్ని ప్రసాద్ అంకుల్‌కు చెప్పలేకపోయింది.
తన మనసులోని అసూయను, ప్రేమని దాచేస్తూ.. "అంటే.. మన అయాన్ వేరే వాళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు, వాళ్లు తెలియక ఏదైనా పొరపాటు చేస్తే వాడి సమాచారం మొత్తం పోతుంది కదా అంకుల్! ఇన్నేళ్ల మీ శ్రమ వృథా అయిపోతుందని నా భయం.. అందుకే.." అని అబద్ధం చెప్పి కవర్ చేసింది.
నీల మాటలు వింటున్న ప్రసాద్ గారికి ఎక్కడో ఏదో తేడాగా అనిపించింది. ఆమె అయాన్ గురించి ఇంతగా కంగారు పడుతుంటే.. అది కేవలం ఒక యంత్రం మీద ఉన్న శ్రద్ధ కాదు, అంతకు మించిన ఏదో బలమైన భావన, ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉందని ఆయనకు అనుమానం వచ్చింది. అయినా ఆయన పైకి ఏమీ అడగలేదు. "సరే నీలా.. నువ్వు కంగారు పడకు. షీలా అడిగితే నేను అయాన్‌ను ఇవ్వనని గట్టిగా చెప్తాను, సరేనా?" అన్నారు ప్రసాద్ గారు.
"చాలా కృతజ్ఞతలు అంకుల్! కానీ.. ఈ విషయం నాన్నగారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ప్లీజ్ నాకు మాట ఇవ్వండి" అని నీల అడిగింది.
ప్రసాద్ గారు కాసేపు ఆలోచించి, "సరేనమ్మా.. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను రాజుకు ఈ విషయం చెప్పనులే" అని మాట ఇచ్చారు.
"ధన్యవాదాలు అంకుల్! మర్చిపోకుండా అయాన్ పుట్టినరోజు వేడుకకు తప్పకుండా వచ్చేయండి" అని చెప్పి నీల ఫోన్ పెట్టేసింది.
ఇదంతా గుర్తుచేసుకుంటూ నీల.. అయాన్‌ను వేరే అమ్మాయికి దక్కకుండా కాపాడుకోవడానికి తను ఎంత పెద్ద ప్లాన్ వేసిందో, అది ఎంత బాగా ఫలించిందో తలుచుకుని తనలో తానే ఎంతో మురిసిపోతూ నవ్వుకుంది.
పుట్టినరోజు వేడుక ముగిసింది. వచ్చిన అతిథులంతా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ప్రసాద్ గారు కూడా సెలవు తీసుకున్నారు. రాజు గారు బయటకు వెళ్లి, ఆయనను కారు ఎక్కించి సాగనంపి లోపలికి వచ్చారు.
ఇల్లంతా కాస్త అస్తవ్యస్తంగా ఉండటంతో అయాన్ ఎప్పటిలాగే చకచకా శుభ్రం చేయడం మొదలుపెట్టాడు. అంతలో సుస్మిత అక్కడికి వచ్చి, "అయాన్, నువ్వు కాదు.. ఇప్పుడు ఈ పనులన్నీ వీళ్లు చేయాలి!" అంటూ నీల, ఆర్యల వైపు గంభీరంగా చూసింది.
"ఏమిటి.. మేమా?!" అని ఆర్య, నీల నోళ్లు వెళ్లబెట్టారు.
"అవును మీరే! పుట్టినరోజు జరుపుకున్న పిల్లాడి చేత పనులు చేయిస్తారా ఏంటి?" అంది సుస్మిత.
"అదేంటి అమ్మ.. సడెన్‌గా నీలో ఇంత మార్పు? వాడు రోబో కదా!" అని ఆర్య కాస్త అల్లరిగా అనబోయాడు.
అంతే! సుస్మిత ఒక్కసారిగా ఆర్య వైపు తీక్షణంగా చూసింది. ఆమె కళ్లల్లో 'నేను చెప్పింది చేయకపోతే మీ ఇద్దరికీ ఇవాళ పడకలు బయటే!' అనే హెచ్చరిక స్పష్టంగా కనిపించింది. ఆ చూపులోని పవర్‌కి ఆర్య నోట మాట రాలేదు. అమ్మ అంత కఠినంగా చూస్తే ఇంట్లో ఎవరైనా సరే లొంగిపోవాల్సిందే అని వాడికి అర్థమైపోయింది.
ఆర్య నెమ్మదిగా ముందుకు వచ్చి, "వద్దు తల్లి.. పనులన్నీ మేమే చేస్తాం. ఈరోజు పుట్టినరోజు పిల్లాడు..అయాన్ గారు మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి. ఈ పూటకి మేము మీ సేవకులం!" అన్నాడు ఎంతో వినయంగా.
వాడి మాట తీరుకు సుస్మిత ముఖంలో పగటి వెన్నెల లాంటి ఒక అందమైన నవ్వు విరిసింది. రాజు గారు పక్కనే నిలబడి సుస్మితలో వచ్చిన ఈ అద్భుతమైన మార్పును చూసి మనసులోనే మురిసిపోయారు. ఒక యంత్రం తమ ఇంటి ఇల్లాలి మనసును ఇంతలా గెలుచుకుంటుందని ఆయన ఊహించలేదు. సుస్మిత, రాజు గారు కలిసి నవ్వుకుంటూ తమ గదిలోకి వెళ్లారు.
ఇక చేసేదేమీ లేక నీల, ఆర్య ఇద్దరూ కలిసి ఇల్లంతా తుడిచి, సర్ది మొత్తం శుభ్రం చేశారు. "హమ్మయ్య!" అని ఇద్దరూ అలసటగా సోఫాలో కూర్చుని ఊపిరి పీల్చుకున్నారో లేదో.. సుస్మిత గదిలో నుండి బయటకు వచ్చి, "పిల్లలు.. వంటలు చాలా మిగిలిపోయాయి. ఇప్పుడు వీటిని ఏం చేద్దాం?" అని అడిగింది.