Pranaya Geethika - 3 in Telugu Drama by sreelu books and stories PDF | ప్రణయ గీతిక - 3

The Author
Featured Books
Categories
Share

ప్రణయ గీతిక - 3

మొదటిరోజు ట్రైనింగ్ కోసం  ఆసుపత్రికి వచ్చిన ప్రభా గోవిందులు డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఓ అయిదు నిమిషాల వ్యవధిలో కారు వచ్చి ఆగడంతో బలభీమ్ " మేడం "అంటూ లోపల్నుంచి పరిగెత్తుకొస్తుంటే "ఇదేందిరా అంబోతు రంకె వేస్తున్నట్టుంది "అన్న గురు గోవిందం చేతిని ప్రభా నొక్కడంతో నోరు మూసుకున్నాడు గోవిందు

 ఒరేయ్ వాడు పిలిచింది విన్నావా  "మేడం అని" అంటే లేడీ డాక్టర్ అన్నమాట లేడీస్ ఎప్పుడు కాస్త స్ట్రిక్ట్ గా ఉంటారని విన్నాను ముందు   కామెడీ మాని అటువైపు చూడు " అనడంతో 'సరే 'అంటూ డోర్ వైపు  చూస్తుంటే  బలబీమ్ వెళ్లి కారు డోర్ ఓపెన్ చేయగా మేడం ఎలా ఉంటారో చూడాలని ఆత్రుతతో తొంగి చూస్తారు ప్రభా గోవిందులు .

తలుపులని తెరవగా నే దిగిన  మేడంని చూసి  
మేడం ఎంత స్లిమ్ గా ఉన్నారు అసలు వెటర్నరీ డాక్టరేనా?  అనిపిస్తుంది అంటూ ప్రభ పక్కకి నిలబడతాడు.
రేయ్ కాసేపు మౌనంగా ఉండరా అని ప్రభా చెబుతూ ఉన్నా  అది కాదురా ఏ ఎద్దో, ఏనుమో ఒక్కసారి తంతే ముడ్డి విరిగిపోతుంది అన్నాడు గోవిందు

 ఒరేయ్ అన్ని నువ్వే ఊహించుకుంటే ఎలా,  ఈ కాలంలో. స్లిమ్  గా ఉండడం అనేది పాసన్ తెలుసా ! అంతేకాక  పక్కన ఆంబోతు ఉన్నాడుగా వాడికీ తను అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి టెక్ని క్ గా వాడితోనే పనిచేస్తుంది నోరు మూసుకొని ముందు విష్ చెయ్ అని మెల్లగా చెప్తాడు ప్రభ

 ప్రభా,  గోవిందులిద్దరూ విష్ చేయగా తలూపుతూ లోనికి వెళ్ళింది డాక్టర్ సుకేసిని.

 డాక్టర్ వెనకాలే వెళ్తాడు బలభీమ్. ఐదు నిమిషాల తర్వాత    బలభీమ్  బయటకు వచ్చి ప్రభా గోవింద్ లని చూసి" కొత్తగా ట్రైనింగ్ కి వచ్చినది మీరేనా" అని అడగడంతో ఇద్దరూ తలూపుతారు .

"మేడం  మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తున్నారు" అని చెప్పడంతో ఇద్దరు లోనికి వెళ్తారు

ఏంటి అరగంట ఆలస్యంగా వచ్చావంట   ప్రస్నించింది సుకెసిని    .                                   ప్రభ  ఎదో చెప్పబోగా                                                     "నీ కారణాలు పక్కన పెట్టి ముందు చెప్పేది వినండి ముందు పంక్చువాలిటీ ఉండాలి. పనిలో క్రమశిక్షణ , నేర్చుకోవాలన్న  తపన ఉండాలి ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన పనిష్మెంట్ తప్పనిసరి" అని చెబుతూ ఉంటే ఓ రైతు దున్నపోతుని తోలుకు వచ్చి డాక్టరమ్మ !అని అరవడంతో బయటికి వచ్చింది డాక్టర్ సుకేషిని. ఆమెతోపాటు గోవిందు, ప్రభ  మరియు బలభీమ్ కూడా బయటికి వచ్చారు

" డాక్టరమ్మా  నా  భీముడు నిన్నటి నుండి గడ్డి ఏమి తినట్లేదు "అని రైతు  వాపోతుంటే గోవిందు బలభీమ్  వైపు ఒకసారి దున్నపోతువైపు ఒకసారి మార్చి మార్చి చూస్తూ ఉండడం సుకేసిని గమనించి అటువైపు చూడడంతో గోవిందు గబుక్కున ప్రభావైపు చూడగా నీకు కావాల్సిందే అని సైగ చేస్తాడు ప్రభ.

  భీముడిని పిలిచి " ఈ ఇంజక్షన్ తీసుకెళ్ళి ఆ దున్నపోతుకి వేసి  రైతుకి  ఆ టాబ్లెట్స్ ఇచ్చి పంపించు అలాగే వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయమని చెప్పు "అని చెప్పి లోపలికి వెళ్ళింది సుకేషిని.

 భీముడు,  ప్రభా గోవిందులిద్దరి వైపు చూస్తూ వాడే డాక్టర్ అయినట్టు బిల్డప్ ఇస్తూ" ఫాలో మీ "అన్నట్లు సైగ చేసేసరికి ఇద్దరు వాడితోపాటు వచ్చి దున్నపోతు దగ్గర నిలుచుకుంటారు. 

మీరు కొత్తగా వచ్చారు కదా" చూడండి ఇంజక్షన్ ఎలా ఈజీగా వేయాలో చూపిస్తా నేర్చుకోండి" అని చెప్పి మెడ దగ్గర వేయాల్సిన ఇంజక్షన్ ని పొరపాటున ముడ్డి దగ్గర వేయగా అది దున్నపోతు కాస్త తన్నేసరికి  అమ్మా ! అంటూ అంత దూరంలో పడ్డాడు భీముడు .

 గోవిందు వెంటనే బలబీమ్ ని   ఎత్తబోగా ప్రభ వచ్చి  దగ్గరికి వచ్చి "ఏరా ఇంజక్షన్ నీకే ఇవ్వడం వచ్చని  బిల్డప్ ఇస్తావా మైమరచి పనిచేయకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి "అంటూ చేయి  అందించడంతో భీముడు పైకి లేస్తుంటే

 ఆకారం ఆంబోతు  అయితే సరిపోదు  ఆలోచన, కూడా ఉండాలి అన్నాడు గోవిందు

 సారీ బ్రో చెప్పాడు భీముడు

  ఇట్స్ ఓకే చెప్పారు ఇద్దరు 

 కిటికీ నుంచి ఇదంతా చూసిన సుకేసిని నవ్వుతూ లోపలికెళ్ళి కూర్చుంది ఆ తర్వాత ముగ్గురుని లోపలికి పిలిచి రేపు పక్క ఊరిలో క్యాంపు ఉంటుంది కరెక్ట్ టైం కి రండి అని చెప్పి పంపించింది సుకేసిని 

మరుసటి రోజు క్యాంపు కి కరెక్ట్ టైం కి వచ్చారు ప్రభ గోవిందులు.అయితే అప్పటికే చరిత ,అశ్విన్లు వచ్చి ఉండడంతో పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఉండగా పదిమంది రైతులు రావడంతో వాళ్లతో మాట్లాడుతూ గంటసేపైనా సుకేసిని మేడం రాకపోయేసరికి బలభీమ్  కి ఫోన్ చేసాడు ప్రభ.

 మేడం ఈరోజు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లారు అందుకే రానని చెప్పారు వాళ్ళని ఇంటికి పొమ్మని చెప్పండి  అన్నాడు భీముడు

 మమ్మల్ని ఏమో టైంకి రమ్మంటారు గాని వాళ్ళు మాత్రం కరెక్ట్ టైం కి రారు అనుకొని రైతులు వెళ్ళిపోతూ ఉంటే ట్రైనర్స్ నలుగురు ఇంటి ముఖం పడతారు.ప్రభ, గోవిందులు ఫామ్ హౌస్ వైపు వెళతారు.
 ప్రభ ఫామ్ హౌస్ చుట్టూ ఎలా ఉందో చూడాలని వెళుతుంటే పతంగి పనిచేస్తూ ఉండడం చూసి" ఇతనేంటి  యజమాని లేకపోయినా ఎంత పర్ఫెక్ట్ గా పని చేస్తున్నాడు" అనుకుంటూ ముందుకెళ్లి "ఏంటన్న భోజనం అయిందా?" ప్రశ్నించాడు ప్రభ.



 హా! భోజనం ముగిసింది ప్రభ. అవును, ఇంతకీ మీరు ఎక్కడ తింటున్నారు?అడిగాడు పతంగి. 



 వస్తూ వస్తూ హోటల్ లో తినొచ్చాము ఇది విలేజ్ కదా హాస్టల్స్ ఉండవు అందుకే ఈరోజు నుండి మేమే వంట చేసుకోవాలి అనుకుంటున్నాం చెప్పాడు ప్రభ.



 అది మంచి పని, లేదంటే రోజు హోటల్ భోజనం తింటే ఆరోగ్యం ఏమవుతుంది.

 "అవును మీరు చెప్పింది నిజమే.  సరే నిన్ను డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను  వెళ్ళొస్తా "అని చెప్పి వెళుతున్న ప్రభతో పతంగి " ఇదిగో, మీకు ఆకుకూరలు, కూరగాయలు కావాలంటే ఇక్కడే ఉంటాయి తీసుకోండి" అని చెప్పాడు పతంగి.



 ఆ,  అలాగే అన్న అని చెప్పి చుట్టూ చూస్తూ "ఎంత సిస్టమాటిక్ గా ఉంది. చుట్టూ గ్రీనరీ తో చిన్న గార్డెన్ సిటీ లా ఉంది "అనుకొని ఇంకాస్త   ముందుకెళ్లగా  నీళ్లు పడుతున్న సౌండ్ రావడంతో అటు వెళ్దాలనుకునే లోగా ఫోన్ చేస్తాడు గోవిందు.ఇక వెళ్లలేక రూమ్ కి వెళతాడు ప్రభ.



 రాత్రి ఆరు గంటలు అయింది ఇద్దరు వంటలు ప్రారంభించి వంట చేస్తూ ఉండగా" ఇక్కడ వాతావరణం ఎంత బాగుంటుంది ఇంతకీ ఆ పెద్దాయనని చూద్దామనుకుంటే అతను కనిపించలేదు" అని అన్నాడు ప్రభా.



 "'పెద్దాయన ఇంట్లో లేరు కదా బయటికి వెళ్లారని చెప్పాడు పతంగి అన్న" చెప్పాడు గోవిందు.



" ఇంటి లోపల ఎలా ఉందో ఒకసారి చూడాలి     " అని ప్రభా చెప్పడంతో "అయితే పతంగి అన్నని పరిచయం చేసుకో" అన్నాడు గోవిందు .

                                                                                   పరిచయం ఆల్రెడీ అయిపోయింది కదా అతను చాలా బాగా మాట్లాడతాడు   సరే సాంబారు టేస్ట్ చూడు అన్నాడు" ప్రభ.



  అమ్మా  ! కారం ఎక్కువైందిరా అందుకే  పని చేస్తున్నప్పుడు ఆ దానిమీద ధ్యాస ఉండాలని నువ్వే ఎన్నోసార్లు చెప్తావు ఇప్పుడు చూడు తినడానికి మాత్రం కాదు "అని  చేతిని  నోటిదగ్గర పెట్టి ఉఫ్ అని ఊపుకుంటూ అన్నాడు గోవిందు.



 ఒక ఐడియా

 ఏంటది ప్రశ్నించాడు గోవిందు

 ఆ సాంబార్ లో నుండి ఒక గ్లాసు రసం బయటికి తీయి మరో గ్లాసు వాటర్ వెయ్   సరిపోతుంది  సొల్యూషన్ చెప్పాడు ప్రభ.



 "  సాంబారుని  వేస్ట్ చేయకూడదని  వాట్  ఎ  బ్రిలియంట్ ఐడియా  ప్రభ అని పొగడుతూ  అన్నాడు గోవిందు.



 ఏం చేయాలి మరి అంత సాంబార్ వేస్ట్ చేయలేమే అంటూ ఇద్దరు అలాగే చేసి ఇంకాస్త  సాంబార్ పౌడర్ వేసి వంట ముగించి అన్నం తిని పడుకున్నారు.



 మరుసటి రోజు ఆదివారం కావడంతో ప్రభ, గోవిందులు బయటికి వెళ్ళేసరికి సర్పంచ్ కూడా ఎదురు రావడంతో మాట్లాడించారు.



 "సర్ ఏంటి ఫ్యామిలీతో దిగినట్టున్నారు ఏదైనా వన భోజనమా?" అడిగాడు ప్రభ.



 "సార్ అంట సర్ అనుమానంతో భార్య మాట విని బయటికి పంపించాడు ఆ విషయం మర్చిపోయాడెమో" అని  నసుగుతూ అంటాడు గోవిందు.



 "రేయ్, ఎక్కడో ఓ చోట ప్లేస్ చూపించాడు కదరా నువ్వు సైలెంట్ గా ఉండు "అని మెల్లగా చెప్పాడు ప్రభ.



 "రండి బాబు మీరు కూడా భోజనం చేసి వెల్దురు " పిలిచాడు సర్పంచ్.

"లేదండి ఇప్పుడే కడుపునిండా తినొచ్చాము" అని చెప్తాడు ప్రభ.



 సర్పంచ్ కూతురు ఎలా ఉందో చూడాలన్న గోవిందు తపనతో" ప్రభ ఎలాగు అటునుండే వెళ్ళాలి కాబట్టి వెళ్దాం పదా అనేసరికి  "ఏరా ఆరోజు అన్న మాట మర్చిపోయావా ఏంటి?"అన్నాడు ప్రభ.



 "హలో  !   నేను వెళ్దామన్నది తినడానికి కాదు ఆ సుందరి ఎలా ఉందో చూసి తీరాలి" అని చెవిలో చెప్పాడు గోవిందు.



 "సరే అలా దూరం నుండి వెళ్తాం పదా" అని కాస్త ముందుకు వెళ్లేసరికి సర్పంచ్ కూతురు ఏదో తింటూ "నాన్నగారండి భోజనానికి టైం అయింది  అమ్మ పిలుస్తుంది రావాలంట "అని కొంచెం ముందుకు వచ్చి గట్టిగా అరవడంతో అటు చూసి జడుసుకున్నారు ప్రభా గోవిందులుద్దరు.



 ఇంతలో "లతిక   రా  నీకిష్టమైనవి   వడ్డించాను" అని సర్పంచ్ వాళ్ళ భార్య పిలిచింది కూతురిని.



 చూశావారా మనిషికి తగ్గ పేరు అన్నాడు ప్రభ.



 అవును , నిజమే లడ్డులా ఉంది  లడ్డు లాంటి లతిక . ఆ పేరు తనకి బాగా సూట్ అయింది ఇంతకీ తనకి ఆ తిండి ఎలా సమకూర్స్తారో ఏమో అన్నాడు గోవిందు సంకోచంగా.



" సరే వెళ్దాం పద సర్పంచ్ మన మాటలు వింటే బాగుండదు" అని మా మాట్లాడుకుని         అక్కడి నుంచి కొద్దిదూరం వెళ్ళగా ఓ గొర్రెల కాపరి గొర్రెలను మేపుతూ కనిపించాడు. ఇద్దరు అతన్ని మాట్లాడించి ముందుకెళుతూ ఉంటే కొద్ది దూరం పోయేలోగా ఆ గొర్రెల కాపరి లబోదిబోమని అరవడం ప్రారంభించగా వారిద్దరూ వెనక్కి పరిగెత్తుకుని వస్తే ఓ గొర్రె నేల మీద పడి మూర్చ పోయి తన్నులాడుతుండడం చూసి ప్రభ  తన పాఠంలో చదివిన కొన్ని ప్రయోగాలు ప్రయత్నించిన అది ఫలితం లేకపోయేసరికి డాక్టర్ సుకేషనికి కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ అని రాగా ఏం చేయాలో తోచుకున్న స్థితిలో బైకులో వ్యక్తి రావడం చూసి చూశాడు గొర్రెల కాపరి. 



 "అన్నా!  బైక్ ఆపండి వచ్చి చూడండి గొర్రెకు ఏమైందో" అని లబోది ఇవ్వమంటున్న కాపరిని చూసి ఏడ్చకులే అంటూ దగ్గరికి వచ్చి గొర్రెకు అక్కడే దగ్గరలో ఉన్న ఏవో ఆకులు తెచ్చి పసురు  నోటిలో వేయగా కాసేపు తేరుకుంది గొర్రె. గొర్రెల కాపరి ముఖం లో ఆనందం చూసి " ,కష్టపడే వ్యక్తికి ఎప్పుడు అన్యాయం జరగదు" అని భుజం తడుతూ" ధైర్యంగా ఉండు నీ గొర్రెకేమి కాదు "అని చెప్పి ఆ మధ్య వయసు వ్యక్తి బైక్ లో వెళ్లిపోయాడు. 



 ఈ కాలంలో కూడా నాటు వైద్యం బతికి ఉందంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది కదరా అన్నాడు ప్రభ గోవిందు వైపు చూస్తూ .



 అవును అతనికి నాటువైద్యం బాగా తెలిసినట్టుంది చెప్పాడు గోవిందు.