గుణేష్ ని అతని రూమ్ కి వదిలి వచ్చిన ప్రభ అర్జునుని ఏదో అడగాలని అనుకుంటూ ఉండగా అర్జున్ ఇవాళ ఉదయం తొందరగా వెళ్ళాలి అని చెప్పి ముందుగానే వెళ్ళిపోయేసరికి అడగలేక పోతాడు ప్రభ.
ఉదయం ఆఫీస్ లోకి అడుగుపెడుతుండగా అప్పటికే గుణేష్ ఒక అమ్మాయిని తిడుతూ కనిపించాడు . భయం భక్తి లేకుండా పనిచేస్తావా ఏంటి? ఇంత చిన్న వయసుకే వచ్చి ఇలాంటి చెత్త పనా చేసేది చదువుకోమని కాలేజ్ పంపితే ఇలా అవతారాలు చేస్తుంటారు కాబట్టి వాళ్లు మిమ్మల్ని ఇలా పనికి పంపించి ఉంటారు అన్నాడు గుణేష్.
ఆ అమ్మాయి ఏడుస్తూ" సార్ ! నేను ఏ తప్పు చేయలేదు అతనికి పనిలో హెల్ప్ చేయలేదని నన్నిలా ఇరికించాడు నాకు చదువుకోవాలని చాలా ఇష్టం అయినా మేము ఐదు మంది అమ్మాయిలు నేనే పెద్దదాన్ని మా నాన్నకి పెరాలసిస్ వచ్చింది కాబట్టి కుటుంబం బాధ్యత నా మీద పడింది అందుకే పనికి వచ్చాను అంతేకానీ చదువు అంటే ఇష్టం లేక కాదు" అని చెప్పి ఏడుస్తూ చెప్పింది సుధ.
"అయితే పనిచేసస్తూ చదువుకుంటావా? " అడుగుతాడు గుణేష్.
అవునన్నట్టు తల ఊపింది సుధ
సరే నీ చదువుకి నేను హెల్ప్ చేస్తాను కాలేజీకి వెళ్లి జాయిన్ అయిపో అని అనే గుణేష్ చెప్పేసరికి థాంక్యూ సర్ నవ్వుతూ చెప్పి వెళుతుంది సుధ.
పక్కనే నిలబడి ఈ సంభాషణ అంతా విని ఆశ్చర్యపోతాడు ప్రభ.
ఏంట్రా అలా చూస్తున్నావ్ టిఫిన్ తిన్నావా ? రా టిఫిన్ చేద్దాం పిలిచాడు గుణేష్.
తనకి ఆకలి లేకున్నా కూడా వెళ్తాడు ప్రభ.
సార్ మీరు ఎంత మంచి వారు సార్ ఆ అమ్మాయికి చదువుకు సాయం చేస్తున్నారు అన్నాడు ప్రభ.
ప్రభ నువ్వు కొన్ని రోజులకే నిజంగా నా ఆత్మీయుడవేమో అనిపిస్తుంది నీతో దాచేదేముంది నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ అది కూడా నాకు తెలియకుండానే జరిగిపోయింది అనుకో . నాకు పెళ్లయి నాలుగు ఏళ్లయింది .నా భార్య చాలా మంచిది తను ఇంటర్ కంప్లీట్ చేయగానే పెళ్లి చేసుకున్న . అమ్మాయి వాళ్ళ నాన్నతో మా నాన్న నేను చదివించుకుంటానని చెప్పారంట ఆ విషయం నాతో చెప్పలేదు. పెళ్లయి రెండు నెలలకే రిజల్ట్స్ వచ్చి ఫ్రీ సీట్ రావడంతో తను చదువు నాకు అవసరం అని నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని పట్టు పట్టింది అయినా నేను కొత్తగా పెళ్లయిందనో లేదా డబ్బు ఉందనో చదువు విషయం నాతో చెప్పలేదనో ఆ టైం కి ఎందుకలా మాట్లాడానో నాకే తెలియదు ససేమీరా చదివేకి వద్దని చెప్పేసాను. పిల్లలు కావాలని చెప్పాను అంతే ఆ రోజు నేను, మా నాన్న ఇంట్లో లేము. వాళ్ళ నాన్న రావడంతో వాళ్ల నాన్నతో పాటు ఊరికి వెళ్ళిపోయి కోర్సుకి జాయిన్ అయిపోయింది. అంతే ఆరోజు నుంచి ఈరోజు వరకు ఇద్దరు చూసింది లేదు మాట్లాడింది లేదు అంటూ టిఫిన్ తినకుండానే చేయికడుకున్నాడు గుణేష్.
సర్ బాధపడకండి మీలాగే మీ భార్య కూడా బాధపడుతూ ఉంటుందేమో ఎందుకంటే ఆలోచించి చూస్తే తను చదువుకోవాలి అనుకుందే కాని మిమ్మల్ని వద్దనుకోలేదు కదా అన్నాడు ప్రభ.
అవును ఇది కూడా పాయింట్ చెప్పాడు గుణేష్. ఇంతకీ తను నన్ను క్షమిస్తుందో లేదో అన్నాడు గుణేష్.
ఇంత మంచి సార్ ని ఎందుకు క్షమించదు తను మీలాగే మంచి మనిషి అయి ఉండొచ్చు కదా పాజిటివ్గా ఆలోచించండి.
ఆమె మంచిదని ఇంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు అడిగాడు గుణేష్.
ఎందుకంటే తను నాకు తెలుసు కాబట్టి చెప్పాడు ప్రభ.
అవునా నిజంగా తను నీకు తెలుసా ! తను బాగుందా అడిగాడు చాలా అత్రంగా గుణేష్.
అవును తను కూడా మీలాగే చాలా బాధపడుతుంది కోర్స్ కంప్లీట్ అయ్యేవరకు చదివే ప్రపంచం అనుకున్న తను కంప్లీట్ అవ్వగానే మీ మీద ధ్యాస మళ్లింది చెప్పాడు ప్రభ.
తను నిజంగా నన్ను క్షమిస్తుందంటావా వెంటనే తనని చూడాలనిపిస్తుంది రా ప్లీజ్ చెప్పవా అని చేతులు పట్టుకోవడంతో రండి సర్ వెళ్దాం అని మేనేజర్ తో సెలవు తీసుకొని ఇద్దరు సీతాపురం వెళతారు.
అక్కా ! పిలిచాడు ప్రభ
ప్రభా నువ్వా ! అంటూ లోపలి నుంచి వచ్చాడు అంకుల్
అంకుల్ అక్క ఉన్నారా? అడిగాడు ప్రభ.
మీ అక్క నిన్నటి నుంచి అన్నం కూడా తినకుండా గడివేసుకుని పడుకుంది రా ఏం చేయాలో అర్థం కావట్లేదు డోర్ ఓపెన్ చేయట్లేదు అసలేం చేస్తుందో ఏమో లోపల భయంగా ఉంది రా అని వాపోయాడు అంకుల్.
అక్కా ! నేను ప్రభని వచ్చాను ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవా ఈరోజు మీ మ్యారేజ్ డే కదా నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చా చెప్పాడు ప్రభ.
రేయ్ నన్ను ఆటప్పటించకు అని లోపల నుంచి మాటలు వినిపించడంతో అక్కా ! నేను చెప్పేది నిజం ముందు నువ్వు తలుపు తీ తర్వాత నువ్వే హ్యాపీగా ఫీల్ అవుతావ్ చెప్పాడు ప్రభ.
తలుపు తెరిచి కన్నీళ్లు తుడుచుకొని గడప దాటాలని కాలు పెడుతూ ఉండగా గుణేష్ కనిపించడంతో కాలు వెనక్కి తీసుకుంటుంది చరిత.
అంతలో రా అని చేయి చాచి దగ్గరికి రావడంతో వచ్చి కౌగిలించుకుంది చరిత.
సరే నేను అమ్మని మాట్లాడించాలి వెళ్తాడు ప్రభ.
ఇంటికి వెళ్లిన ప్రభ జరిగిన విషయం గౌరీ తో చెప్పగా చాలా సంతోషిస్తుంది ".
చరిత చాలా మంచి అమ్మాయి ఎలాగో వాళ్ళిద్దరూ కలిసిపోయారులే మంచి పని చేశావు" అని అంటూ ఉండగా అప్పటికే రిజల్ట్స్ వస్తాయేమోనన్న ఆశ ఉన్న ఆ రిసల్ట్ కోర్టు లో ఉన్నందుకు అది రావడానికి ఐదారు నెలలు పట్టొచ్చు అని తెలుసుకున్న ప్రభ ఇంట్లో కూర్చుని అమ్మతో అదే విషయం మాట్లాడుతూ ఉంటే ఆమెకు ఓనర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి.
" ప్రభ మా ఓనర్ ది పెద్ద మిల్క్ డైరీ ప్లాంట్ ఉంది అక్కడ ఒక ఉద్యోగం ఉందని చెప్పారు ఎలాగో ఇంకా ఆరు నెలల్లో టైం పట్టొచ్చు నువ్వు పని కావాలి అని అన్నావు కదా చూడు నీకు ఇష్టమైతేనే ఆ పని చెయ్ ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వేరే వర్క్ ఏదైనా చూసుకుందాం "అని అమ్మ చెప్పేసరికి "సరే ఒకసారి మీ ఓనర్ దగ్గరికి వెళ్లి కలుస్తాను తర్వాత ఏం చెప్తారో చూస్తాను" అని చెప్పి ఓనర్ దగ్గరికి వెళ్లి కలిసిన తర్వాత అతను ఉద్యోగానికి రమ్మని చెప్పడమే కాక అది కొంచెం బాధ్యతతో కూడిన పని అని చెప్పడంతో "సరేనండి నేను ప్రయత్నిస్తాను "అని చెప్పి వస్తూ ఉండగా అరణ్య ఫోన్ చేస్తుంది
అరణ్యతో రామాపురం వెళ్ళినప్పుడు పెద్దాయన పతంగులతో కలిసి మాట్లాడడం అరణ్య కూడా వాళ్లతో పాటు కూర్చొని ప్రభ ను పరిచయం చేసుకోవడం అలా ఇద్దరూ మంచి సన్నిహితులు అయ్యారు కాబట్టి అరణ్య ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేస్తాడు ప్రభ.
ప్రభ నీకు గుడ్ న్యూస్ చెప్పాలి
గుడ్ న్యూస్ అనగానే ప్రభలో ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది వెంటనే అదేదో చెప్పవా అని అడుగుతాడు.
ఆ గుడ్ న్యూస్ ఫోన్లో చెప్పేది కాదు రామపురం వస్తే చెబుతాను అనడంతో బయలుదేరుతాడు ప్రభ.
రామాపురంలో ఫామ్ హౌస్ దగ్గర కూర్చున్న పెద్దాయనకి ఒక వ్యక్తి నమస్కరించడంతో అతన్ని కూర్చోమని చెప్పి వచ్చిన విషయం ఏంటని అడుగుతాడు పెద్దాయన.
అన్న, " బసవయ్య మీతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాడు" అని అతను ఇంకా ఏదో చెప్పబోతుంటే "ఏం చెబుతున్నావన్న నువ్వు, ఒక విధంగా నువ్వు పెద్దోడివి కాబట్టి నిన్ను మధ్యవర్తిగా ఎందుకు వచ్చావు అని మాత్రమే అడుగుతున్నాను, అతనితో మాకు సంబంధం కుదుర్చుకోవడం ఏంటి?ఆ పని జరగదని చెప్పండి మా అమ్మాయికి ఉద్యోగం అవసరం ముందు తనకు ఉద్యోగం రావాలి ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను" అని పెద్దాయన కష్టం గట్టిగానే చెబుతాడు.
" వారికి ఏంటండీ కోటీశ్వరులు ఉద్యోగo అవసరమే లేదనుకుంటా "అని అతను మరొక మాట చెప్పేసరికి "ముందు మీరు ఇక్కడి నుంచి లేవండి ఇంతవరకు మీకు పెద్దవాళ్ళని గౌరవించాను ఇంకొకసారి సంబంధం గురించి మాట్లాడితే ఇక బాగోదు" అని పెద్దాయన చెప్పగానే అతను లేచి అలా వెళుతూ ఉంటే చూసిన అరణ్య" కోట్లకు ఉంటే సరిపోదు క్యారెక్టర్ ఉండాలి కదా "అని అన్న మాటలు అతని చవిన పడేసరికి అక్కడి నుంచి విసురుగా బసవయ్య దగ్గరికి వెళ్లి చెబుతాడు.
మధ్యవర్తి వచ్చి విషయం చెప్పిన తర్వాత
బసవయ్య రుస రుసలాడుతూ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు."నా కొడుకుని అది అంత మాట అందా? దానిని ఊరికే వదిలిపెట్టను. అదే ఆ కోదండపాని ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాడే ఆ బికారిగాని దగ్గర అంత క్లోజ్ గా ఉంటుంది వాడికేమైనా ఇచ్చి చేస్తాడేమో! అని బసవయ్య అంటూ ఉండగా అటువైపే వచ్చిన సర్పంచ్ ఆ మాటలు విని నిర్గాంత పోతాడు.
అక్కడి నుంచి పని మీద వచ్చిన సర్పంచ్ పెద్దాయనతో అదే మాట చెప్పేసరికి అంతలోపే ప్రభ గుడా అక్కడికి రావడంతో" బసవయ్య అన్నది నిజమే అవచ్చును ఎందుకంటే వాడికంటే వరుణ్ణి ఎక్కడ నుంచి తీసుకురాగలం వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే నేనే ముందు నిలబడి పెళ్ళి జరిపిస్తా "అన్న పెద్దాయన మాటలు విన్న అరణ్య అందరూ కలిసి అటు ఇటు తిరిగి మా ఇద్దరి వరకే మాటలు వస్తున్నాయి .మీరు ఏమనుకున్నా నాకు మాత్రం ప్రభ మీద అటువంటి అభిప్రాయం లేదు తను ఒక మంచి స్నేహితుడు గా మాత్రమే నేను గుర్తించగలను" అని తన మనసులో మాటని చెప్పేసరికి పెద్దాయన ప్రభావైపు చూస్తాడు. "
గురూజీ నాది కూడా అదే మాట నాకు అరణ్య మీద ఎటువంటి ఆలోచన లేదు.తనంటే నాకు నీ మీద ఎంత గౌరవం అభిమానం ఉందో అంతే గౌరవం, ఆరన్య మీద ఉంది.అంత తప్పితే మరొక ఆలోచన అయితే లేదు "అని ఇద్దరు చెప్పేసరికి ఇంకా సంతోషిస్తాడు పెద్దాయన.
ఇద్దరు ఎవరికీ ఎవరో తెలియదు కానీ ఇద్దరి మాట మాత్రం ఒక్కటిగానే ఉన్నది మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటాడు పెద్ద ఆయన. అది చూసిన సర్పంచ్ కూడా ఆనందిస్తాడు అక్కడి నుంచి ఊరిలోకి వెళతాడు. అంతలో ప్రబా, అరణ్య ముఖాన్ని చూస్తూ ఏదో గుడ్ న్యూస్ అన్నావు అనేసరికి తనకు వచ్చిన మెసేజ్ని చూపించి "ఇదిగో నేను కదిరినాడుకి ఎమ్మార్వో గా సెలెక్ట్ అయ్యాను "అని చెప్పేసరికి పెద్దాయన ఆనందం ఆకాశాన్ని అంటుతుంది.