అధ్యాయం: ఆశల పొద్దు – అహంకారపు రాత్రి
ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంట్లో పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేస్తోంది చంద్రిక.
"ప్రతాప్! ఈ టవల్ తీసుకో. ఏ మాత్రం స్మెల్ రాకుండా బాగా తలంటు స్నానం చెయ్," అంటూ భర్త చేతికి టవల్ ఇచ్చింది. తను తలస్నానం చేసి, జుట్టుకు చుట్టుకున్న టవల్ ను విప్పేసి, తడి ఆరుతున్న జుట్టును అల్లుకుంటూ బయటికి వచ్చింది.
"రుద్రా.. ఓసారి ఇలా రా!" అని పిలిచింది.
"ఏంటి వదినా?" అంటూ వచ్చాడు రుద్ర.
"వెళ్లి ఓ తట్టెడు పూలు తీసుకురావా?" అని అడిగింది.
"వామ్మో! ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? ఈ పూజలకు, పునస్కారాలకు నేను రాను బాబోయ్!" అంటూ భయపడుతున్నట్లు నటించాడు రుద్ర.
"అబ్బా! చెప్పేది విను. ఎందుకలా ఆలోచిస్తావ్? పూజకు కావాలి," అంది చంద్రిక కాస్త కోపంగా.
ఆమె చూపులకు భయపడిన రుద్ర, "సరే సరే, డబ్బులు ఇవ్వు," అన్నాడు చేతులు చాపుతూ.
"ఒక ఆడపిల్ల దగ్గర డబ్బులు అడగడానికి సిగ్గులేదా నీకు?" అని ఆటపట్టించింది చంద్రిక.
"సిగ్గు ఉంది కానీ, జేబులో డబ్బుల్లేవు. రేపు శాలరీ పడ్డాక ఇస్తాల్లే," అని రుద్ర అనడంతో చంద్రిక నవ్వింది. వెంటనే తన ఫోన్ తీసి వాడికి పదివేలు ఫోన్ పే చేసింది.
"ఇందులో ఐదువేలు నువ్వు ఉంచుకో, మిగతా ఐదువేలు కూడా నీ ఇష్టం వచ్చినట్లు వాడుకో. కాకపోతే అందులోంచి నాకు పూలు మాత్రం తీసుకురా. రేపు నెల జీతం రాగానే కచ్చితంగా నా డబ్బులు నాకు ఇచ్చేయాలి," అని చెప్పింది.
"ఓకే మేడం జీ!" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు రుద్ర.
సరిగ్గా పదిహేను నిమిషాలకు కాలింగ్ బెల్ మోగింది. కొత్త చీర కట్టుకుని, వెంకటేశ్వర స్వామి పటం ముందు అలంకరణ చేస్తున్న చంద్రిక వెళ్లి తలుపు తీసింది. గుమ్మం ముందు పూల తట్టతో రుద్ర నిలబడి ఉన్నాడు.
"అప్పుడే వచ్చేశావా? పూలు ఇటు ఇవ్వు.. సరే, నువ్వు కూడా వెళ్లి రెడీ అవ్వు," అని చెప్పి తలుపు వేసుకుంది చంద్రిక.
పూజ పూర్తయింది. దేవుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ప్రతాప్ కి ఇస్తూ పక్కన కూర్చుంది.
ప్రతాప్ ప్రసాదం తింటూ, "చంద్రికా... ఇలా పూజలు చేస్తే మనకు పిల్లలు పుడతారంటావా?" అని అడిగాడు కాస్త దిగులుగా.
"కేవలం పూజలు చేస్తేనే పిల్లలు పుట్టకపోవచ్చు. కానీ, ఆ దేవుడి మీద నమ్మకం అనేది ఒకటుంటుంది కదా? ఆ నమ్మకంతో చెబుతున్నాను... నువ్వు ముందు ఆ మందు, సిగరెట్ మానేయాలి. లేదంటే మాత్రం ఊరుకోను," అని కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది.
ప్రతాప్ వెంటనే కంగారు పడుతూ, "వద్దొద్దు, మానేస్తాను. కానీ రేపు మా సతీష్ గాడి పిల్లాడి పుట్టినరోజు ఫంక్షన్ ఉంది. అలాంటి పార్టీలో మాత్రం నన్ను వద్దు అనకూడదు," అని బతిమిలాడాడు.
"సరే, ఆ ఒక్కరోజుకు ఓకే. మిగతా అప్పుడు మాత్రం తాగకూడదు," అని కచ్చితంగా చెప్పి, పూజ ముగించి గంట మోగించింది చంద్రిక.
"రుద్రకి ఫోన్ చేసి రమ్మను. నేను డైనింగ్ టేబుల్ సర్దుతాను," అని చెప్పి చకచకా వంటగదిలోకి వెళ్లి, తను వండిన వంటలన్నీ టేబుల్ మీద సర్దింది. ప్రసాదం కూడా తీసుకొచ్చింది.
రుద్ర రాగానే, "ముందు వెళ్లి చేతులు కడుక్కో," అని చెప్పి, వాడి చేతిలో ప్రసాదం పెట్టింది. ముగ్గురూ కలిసి సరదాగా భోజనం చేశారు.
రెండు రోజుల తర్వాత - ఆఫీసులో...
ఆఫీసులో అందరితో కలుపుగోలుగా ఉండే రుద్ర, ఈమధ్య అప్పుడప్పుడు చాలా డల్ గా ఉంటున్నాడు. అది గమనించిన చంద్రిక, ప్రతాప్ దగ్గరికి వచ్చి, "ఏంటి ప్రతాప్, వీడు మనకంటే చాలా డల్ గా ఉంటున్నాడు? మొన్న పెళ్లిచూపులు చెడిపోయాయని మరీ ఇంతలా ఆలోచించాలా?" అని అడిగింది.
దానికి ప్రతాప్ నిట్టూరుస్తూ, "వాడు బాధపడుతోంది పెళ్లిచూపులు చెడిపోయాయని కాదు చంద్రికా... తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని. వాడి మనసులోని ఆ బాధ మీకు ఎలా తెలుస్తుందిలే," అన్నాడు.
"అవునులే, నీ గురించి కూడా నాకు తెలియదు కదా?" అని చంద్రిక నవ్వుతూ అంటుండగానే అక్కడికి బాస్ వచ్చాడు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. చంద్రిక తను డౌన్లోడ్ చేసిన ఫైల్ ని రుద్రకి పంపించగా, వాడు దాన్ని అనాలసిస్ చేసి క్లయింట్స్ కి పంపే పనిలో పడ్డాడు.
సతీష్ పార్టీకి ప్రయాణం...
సాయంత్రం ముగ్గురూ కలిసి పార్టీకి వెళ్లడానికి కారులో బయలుదేరారు.
చంద్రిక చాలా మోడ్రన్ గా రెడీ అయింది. పింక్ కలర్ టాప్, దానికి తగ్గ చున్నీ వేసుకుంది. చేతులకు మాత్రం బ్లూ కలర్ గాజులు వేసుకుని, మెడలో ఓ చిన్న లాకెట్ తో చాలా అందంగా కనిపిస్తోంది.
కారులో వెళ్తుండగా ప్రతాప్ రుద్రతో, "అవునురా రుద్రా, నువ్వు కార్ ఎందుకు తీసుకోలేదు?" అని అడిగాడు.
"నాకు వచ్చే జీతం 'ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి' (EMI) కట్టడానికే సరిపోతుంది. ఇక కార్ ఎక్కడినుంచి వస్తుంది?" అన్నాడు రుద్ర.
ఆ మాటలకి చంద్రిక సీట్లో పడి పడి నవ్వింది. "ఒరేయ్ బాబు! దాన్ని ఈ అమ్మాయి, ఆ అమ్మాయి అనరు రా.. ఇ.ఎం.ఐ (EMI) అంటారు. డిప్రెషన్ లో ఉన్నాను అంటావ్, కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళని నవ్వించడంలో నువ్వు మాస్టర్ మైండ్ వి రా!" అని ప్రతాప్ కూడా నవ్వేశాడు. వాడు బాధలో ఉన్నా కూడా ఆ ఫ్లాట్ లో ఉన్న అందరినీ నవ్వించడం వాడి నైజం.
అందరూ పార్టీ దగ్గరికి చేరుకున్నారు. కారు దిగుతుండగా చంద్రికను గమనించిన రుద్ర, "నాకో డౌట్ వదినా... మీరు ఎప్పుడూ మోడ్రన్ బట్టలు, రకరకాల నగలు వేసుకుంటారు కానీ, మెడలో ఆ తాళిబొట్టు ఎందుకు కనబడదు?" అని అడిగాడు.
చంద్రిక చిన్నగా నవ్వి, "మా ఆచారం కొంచెం వింతగా ఉంటుంది రుద్రా. పెళ్లి జరిగే సమయంలో తాళిబొట్టు లాంటి ఒక చిన్న గొలుసు వేస్తారు. కానీ శోభనం జరిగిన తర్వాత, దాని బదులు ఒక చిన్న తాయత్తు లాంటిది మెడలో వేసుకుంటాం. అదే మా ఇద్దరి బంధానికి గుర్తు," అని చెప్పింది.
"అదేంటో ఒకసారి చూపించు," అని రుద్ర అడగడంతో, తన డ్రెస్ లోపల ఉన్న ఆ తాయత్తును తీసి చూపించింది చంద్రిక.
అది చూడగానే రుద్ర మొహం వింతగా పెట్టి, "ఏంటిది? ఏదో మంత్రగాడు మంత్రాన్ని చుట్టి అంత్రంలో వేసినట్టు ఉంది. దీని పేరేంటి?" అన్నాడు.
ప్రతాప్ కల్పించుకుని, "ఒరేయ్ ఆపరా బాబు! అది యంత్రం, మంత్రం, తంత్రం కాదు రా... దాని పేరు 'విశ్వాస్' (నమ్మకం). అది మా ఆచారం," అని చెప్పాడు.
"సరే సరే, దాన్ని లోపల దాచిపెట్టుకోండి. ఎవరైనా చూస్తే బూచోళ్ళు అనుకుంటారు," అని నవ్వుతూ కారు వెనుక సైడ్ నడుచుకుంటూ పార్టీలోకి ఎంటర్ అయ్యాడు రుద్ర.
పార్టీలో...
సతీష్ ఇచ్చిన ఆ పార్టీ చాలా గ్రాండ్ గా ఉంది. ఎంట్రన్స్ లో పెద్ద బోర్డు, సతీష్, అతని భార్య, కొడుకు ఫోటోలతో దగదగా మెరిసిపోతోంది. చుట్టూ కెమెరాలు, లైట్లు, డాన్సర్లు... తన వర్కర్లకు తాను ఎంత డబ్బు పంచుతున్నాడో సతీష్ గొప్పలు పోతూ మైకులో మాట్లాడుతున్నాడు.
అదంతా చూసిన రుద్ర, "చూడు ప్రతాప్.. నా పెళ్ళికి వీడి కంటే గొప్పగా పార్టీ ఇస్తాను," అన్నాడు.
"సరేలే కానీ, నాకో సిగరెట్ ప్యాకెట్ కొనివ్వు రా," అని అడిగాడు ప్రతాప్.
"వదిన చేతిలో చావుదెబ్బలు తినాలనే ఉద్దేశం నాకు లేదు, నేను కొనివ్వను. అయినా నా దగ్గర డబ్బులు లేవు," అని తేల్చేశాడు రుద్ర.
"పోనీలే, ఫుడ్ సెక్షన్ లోకి వెళ్దాం రా," అని రుద్రను తీసుకుని వెళ్ళాడు ప్రతాప్.
అక్కడ చంద్రిక కనిపించలేదు. "చంద్రిక ఎక్కడ?" అని వెతకగా, ఆమె అప్పటికే ఆకలి తట్టుకోలేక ఫ్రూట్ సెక్షన్ లో నిలబడి ఫ్రూట్స్ తింటోంది. 'అంత గ్రాండ్ గా జరుగుతున్న వాడి కొడుకు పుట్టినరోజు చూస్తే, నాకు పిల్లలు లేరన్న బాధ ఇంకా పెరుగుతోంది' అని మనసులో అనుకుంటూ తన బాధను ఎవరికీ కనపడకుండా కవర్ చేసుకుంటోంది చంద్రిక.
అక్కడికి వచ్చిన సతీష్, ప్రతాప్ ని చూసి "ఏంటి ప్రతాప్, చంద్రిక రాలేదా?" అని అడిగాడు.
"వచ్చిందిరా, ఆకలేస్తుందని అటువైపు తింటోంది," అన్నాడు ప్రతాప్.
వెంటనే సతీష్ తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ, "తిననివ్వు రా... ఇలాంటి వాళ్ళ కోసమే కదా నేను ఇంత ఫుడ్ పెట్టింది! నేను ఎంత మంచోడిని చూశావా?" అన్నాడు గర్వంగా. ప్రతాప్ కి వాడి మాటలు నచ్చకపోయినా, వాడి కొడుకు ముఖం చూసి సైలెంట్ అయిపోయాడు.
ఆ తర్వాత సతీష్ తన తమ్ముడిని, భార్యను వేదిక మీదకు పిలిచాడు.
"అందరికీ అటెన్షన్! ఈ రోజు మా వాడి పుట్టినరోజే కాకుండా, మా తమ్ముడికి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అన్నీ మనకు మంచి రోజులే. ఇక్కడ పార్టీ అయిపోగానే అందరం పబ్ కి వెళ్తున్నాం, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం!" అని అరిచాడు.
తన కొడుకు బుగ్గలకు కేక్ రాస్తూ, "విజయ్ సేతుపతి!" అని గట్టిగా అరిచాడు.
"అదేంటండీ ఆ పేరు?" అని ఒకరు అడగగా..
సతీష్ మైకు పట్టుకుని, "నా కొడుకు పేరు విజయ్ సేతుపతి. 'విజయం' ఎప్పుడూ వాడి వెనకాలే ఉంటుంది. 'సేతుపతి' అంటే అంతం చేసేవాడు! విజయం తన వెనకాల రాకపోతే, దేన్నైనా అంతం చేయడానికి వాడు వెనకాడకూడదు. అదే నా కొడుకు క్యారెక్టర్!" అని ఒక పనికిమాలిన స్పీచ్ ఇచ్చి అందరి ముందు మరింత రెచ్చిపోయాడు.
తర్వాత తన తమ్ముడి దగ్గరికి వచ్చి, పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయిని చూపిస్తూ, "చూడు తమ్ముడూ... ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే. కాబట్టి నువ్వు కూడా నాలాగే బాగా డబ్బు సంపాదించు," అని నీతులు చెప్పాడు.
అదే సమయంలో ఒంటరిగా నిలబడి ఉన్న రుద్రను చూసిన సతీష్, వాడి దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యేసి, "ఏంటి రుద్రా అలా ఉన్నావ్? నీ పెళ్లి మేటర్ ఏమైంది? అమ్మాయితో ఫిక్స్ అయిందా? లేక..." అంటూ వ్యంగ్యంగా నవ్వాడు.
రుద్ర ముఖంలో ఒక్కసారిగా కోపం, బాధ రెండు కలిపి రగిలాయి.
(తరువాయి భాగం కోసం...)
(ఫాలో కొట్టు మామ కామెంట్ చేయే మామ