ఇది ఒక అమాయకమైన అబ్బాయి కథ, కథ అంటే ఆలా ఇలా కాదండి దీనిలో ఒక నిత్య జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తున్న కథ ఇది.
ప్రతి అబ్బాయిలలో జరిగే సంఘటనలు తగిలె దెబ్బలు బాధలు అలానే ఈ కథలో వున్నా అబ్బాయికి కొద్దిగా ఎక్కువగానే తగిలాయిలెండి.
అయితే మనం కథలో వెళ్తామా! సిద్ధూ అనే అబ్బాయి ఒక చిన్న పల్లెటూరులో అది కూడా ఒక పెద ఇంట్లో పుట్టాడు.
పుట్టినపుడే వాళ్ళ తల్లితండ్రులు సిద్ధూ ని వద్దు మరియు చంపేయాలి అనుకున్నారు. ఎందుకు అంటే మరి సార్ పుట్టింది చుడానికి ఆలా వున్నాడు మరి...
అయితే సిద్ధూ పుట్టడమే ఒక వింతగా పుట్టాడు, బ్రతకడు ఏమో అని అనుకున్నారు వాళ్ళ తల్లితండ్రులు. కొన్ని రోజులు గడిచేయి అయినా సిద్ధూ మీద ఆశ లేదు చూపించిన ఆసుపత్రిలు లేవు ఎక్కడ చూపించిన డాక్టర్స్ మా వాళ్ళ కాదు ఈ పిల్లాడిని వదిలేయండి అనేవాళ్ళే తప్ప ఎవరు నయం చేయలేక పోయారు.
ఇంకా కొన్ని రోజులు గడిచేయి ఎం చేయాలో ఏమో వాళ్ళకి అర్ధం అవని సమయం లో ఒక ముసలి ఆవిడా ఎదురాయింది. ఆ ముసలి ఆవిడా చూసి అడిగింది... ఏమైంది అమ్మా బాబు కి ఎందుకు ఇలా వున్నారు అని అడగగా... వాళ్ళు ఇలా! జరిగినదంతా చెప్పారు ఆమెకు అయితే ఆ ముసలి ఆవిడా ఒక సలహా చెప్పింది ఇలా!
నాకు తెలిసిన ఒక వ్యక్తి వున్నారు అక్కడికి వెళ్తే మీ అబ్బాయి నయం అవుతాడు వెళ్తారా అని అంటుంది. వాళ్ళు కూడా వెళ్తాము ఎక్కడ ఎవరు ఏంటి అని అడిగితే ముసలి ఆవిడా మొత్తం వివరాలు చెప్పింది. మరి మాకు కొత్త కదా బామ్మా గారు ఎవరైనా తెలిసిన వారు ఉంటే కొద్దిగా మాకు తోడుగా పంపిస్తారా అని అడిగితే. ఆ బామ్మా ఒక క్షణం కూడా ఆలోచించకుండా మా వారికి మీతో పంపిస్తాను అని చెప్తుంది.
దానికి సరే అని వాళ్ళు మారుసటి రోజు ఉదయం 5గంటలకు ప్రయాణం మొదలు పెట్టారు. అక్కడికి వెళ్ళాక చూపించక తన ఆరోగ్యం మొత్తం నయం అయింది.
అయితే సిద్ధూ కి స్కూల్ లో జాయిన్ చేసారు. తాను కూడా మంచిగా బుద్దిగా చదువుకుంటూ వున్నాడు.
కొన్ని సంవత్సరాలు అయ్యాయి, ఒక అమ్మాయిని ఇష్టపడాడు అయితే ఆ అమ్మాయి కి తెలీదు మనోడు ప్రేమిస్తున్న విషయం. అంటే మనోడిది సింగల్ సైడ్ లవ్ అన్నమాట. ఆలా చెప్పకుండా 3సంవత్సరాలు దాటేసాయ్
ఇంకా ఆలా చూస్తూ ఉండంగా స్కూల్ నుండి కాలేజీ కి వచ్చేసాడు సిద్ధూ. కాలేజీ లో మనోడే టాప్ అండోయ్ చదువుల్లో,
అయితే ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి సిద్ధూ కూర్చునా పక్క సీట్ లోనే ఒక ముస్లిం అమ్మాయి కూర్చొని వుంది. అయితే ఆమెను చూడగానే మనోడుకి స్కూల్ లవ్ గుర్తుకు వచ్చేసింది.
ఆ అమ్మాయితో పరిచయం ఎలాగైనా చేసుకోవాలి అని తన వైపే చూడసగాడు. ఆ అమ్మాయి ఏంటి ఆలా చూస్తున్నావ్ హ పరీక్ష రాసుకో నన్ను చూసి నువ్వు పరీక్షలు ఫెయిల్ అయిపోతావ్ అన్నది అయితే మనోడేమో నీకోసం ఆ మాత్రం అవ్వలేనా అంటూ జోకులు వేసుకుంటూ మొత్తానికి పరిచయం చేసుకున్నాడు.
అయితే సిద్ధూ క్లాసుమేట్ సిద్ధూ కి తెలియకుండా రేపు పరీక్షలకు కాపీ కొట్టడానికి ఆ అమ్మాయికి సలహాలు ఇచుకుంటూ పరిచయమైనా విషయం సిద్ధూ కి తెలీదు.
ఆ అమ్మాయి సిద్ధూ మాటలకి నవ్వుతు ఉండేది అది చుసిన సిద్ధూ క్లాసుమేట్ పరీక్షలు అయిపోయిన తరువాత నేను చనిపోతా ఆ అమ్మాయికి నేను ప్రేమిస్తున్న అంటూ చెయ్యి కోసుకుంటున్నాడు. అరేయ్ బాబు నేను నార్మల్ గా మాట్లాడాను రా.. నీకె సొంతం రా తాను సరేనా అంటే ఆ మాట తనతో చెప్పించు అంటూ గొడవ చేసాడు.
సరే అని సిద్ధూ అమ్మాయి తో మాట్లాడి చెప్పు అని అంటే నేను చెప్పను తాను నాకు అన్నయ్య లాంటి వాడు అని అంటుంది అందరి ముందు.
లేదు లేదు తాను ఏమైనా చేసుకుంటాడు ఆలా చెప్పకు అని సిద్ధూ చెప్పగా, చేసుకోని నేనేం చేయను నాకు ఇష్టం లేదు అని చెప్పింది.
ఆలా ఆలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి సిద్ధూ కి కష్టాలు మొదలయ్యాయి.
పై చదువులు చదవడానికి పైసలు లేవు పుట్టిందే పెద్ద కుంటుంబం లో అయినా సరే ఎలాగైనా చదవాలి అనుకునే లోపు ఊరిలో పొలం కోసం గొడవ జరుగుతుంది అని చెప్పగా తాను కాలేజీ నుండి వచ్చి చూస్తూ వున్నాడు.
సిద్ధూ కి ఎం అర్థం అవ్వట్లేదు ఆలా చూస్తూ ఉండగా ఒక క్షణంలో వాళ్ళ తల్లి పై గొడవకి రావడం చుసిన సిద్ధూ అది కోపం ఆపుకోలేక పోయాడు... పక్కనే వున్నారు ఒక్కా ఐరన్ పైప్ తీసుకొని కొడితే అవతల వ్యక్తికి తల పగిలి రక్తం కారుతుంది.
జరిగినదంతా ఒక వ్యక్తి వీడియో రికార్డింగ్ చేసారు. అదంతా మరుసటి రోజులు పోలీసు కేసు నమోదు అయ్యింది సిద్ధూ పై.
అసలు కేసు నమోదు అయినా తరువాత ఏమైంది?
సిద్ధూ చదువుకుంటున్నాడు కదా!
ముందు ముందు ఎం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే...... తరువాతి భాగం వరకు వేచి చూదాం....!
మీ....... ✍️ నాయక్ 💞