Will this journey reach the coast.. - 11 books and stories free download online pdf in Telugu

ఈ పయనం తీరం చేరేనా...- 11

ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు... అసద్ కాఫీ తాగి పక్కకి చూసే సరికి పర్వీన్ నవ్వుతూ వుంది... పర్వీన్ నవ్వు చూసి అసద్ కి కొంచం ప్రశాంతంగా అనిపించింది " ఏమైంది అమ్మి..." అని అడిగాడు.


పర్వీన్ " నాన్న నువ్వు కాఫీ తాగావు..." అని చెప్పింది.


అసద్ " హా అమ్మి... నువ్వు చేస్తే నేను తాగుతాను కదా..." అని అన్నాడు...


పర్వీన్ " ఇప్పటి వరకు నీతో మాట్లాడి... అప్పుడే నేను కాఫీ ఎలా చేస్తాను నాన్న.." అని అడిగింది.


అసద్ కి అర్దం అయ్యింది. ఇప్పుడు వున్న ఆ కాస్త ప్రస్తంతత కూడా పోయింది... " ప్రణయ్ త్వరగా కానివ్వు ఆఫీస్ కి వెళ్ళాలి..." అన్నాడు.


పర్వీన్ అందుకొని " అసద్ ఈ రోజు నువ్వు ఆఫీస్ కి వెళ్ళటం లేదు.. ఎమైన ఇంపార్టెంట్ వర్క్ వుంటే ప్రణయ్ చుస్కుంటాడు... నువ్వు ఇక్కడి నుండే వాడిని గైడ్ చెయ్యి..." అని చెప్పింది.


సహజం గానే పర్వీన్ మాటలకి ఎదురు చెప్పలేని అసద్ ఇప్పుడు కూడా ఏమి మాట్లాడలేదు...


కొత్తగా పెళ్లి అయిన అమ్మాయి అయిన కూడా ఇంటి కోడలు కాబట్టి వంట పని తనే తీసుకుంది.. వంట గదిలోకి వెళ్లి అక్కడ పని అమ్మాయి గంగ నీ అడిగి ఎవరికి ఎం ఇష్టమో అన్ని కనుక్కొని అందరికీ అన్నీ చేసి పెట్టింది... చాలా అంటే చాలా ఫాస్ట్ గా చేసింది..


అందరినీ పిలిచి అసద్ నీ పిలిచే దైర్యం లేక ప్రణయ్ వైపు చూసింది.. ప్రణయ్ వెళ్లి అసద్ నీ పిలుచుకు వచ్చాడు.. అసద్ కూడా వచ్చి కూర్చున్నాడు.. ( ఫ్రెండ్స్ అసద్ కి కాళ్ళు సరిగ్గా పని చెయ్యవు.. అతను వీల్ చైర్ నే వాడుతాడు.. ఒక వేళ అతను అతని కాళ్ళ మీద నడిస్తే నేను మేంక్షన్ చేస్తాను.. వచ్చాడు.. వెళ్ళాడు అంటే అది వీల్ చైర్ సహాయం తో నే అని గుర్తించగలరు...🙏🙏🙏🙏) పర్వీన్ కి ప్రణయ్ కి తనే వడ్డించింది కానీ అసద్ కి వడ్డించాలి అంటే భయంగా వుంది.


పర్వీన్ తన భయం అర్దం చేసుకొని " వాడు నీ భర్త అమ్మ.. ముందు మా కన్నా కూడా వాడితోనే వుండాలి వాడికే పెట్టాలి.. వెళ్ళు.. పెట్టు " అనడం తో తనే స్వయంగా అసద్ కి వడ్డించింది..


అసద్ అసలు పట్టించుకోలేదు.. తినేసి వెళ్ళిపోయాడు.. కాసేపు సోఫా లో కూర్చొని వర్క్ చేసుకున్నాడు.. ప్రణయ్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.. పర్వీన్ కోడలిని తీసుకొని గార్డెన్ లోకి వెళ్ళింది..


పర్వీన్ " తల్లి నువ్వేం టెన్షన్ పడకు అమ్మ.. వాడు చూడటానికే కోపిష్టి కానీ చాలా మంచి వాడు.. నీకు తోడు, నీడ వాడు అవుతాడు అని నాకు నమ్మకం వుంది.. ప్రణయ్ వల్ల తెలిసింది నీకు ఒక కొడుకు వున్నాడు అంట కదా.. బాబు ఎందుకు నీతో తీసుకురాలేదు..??" అని అడిగింది.


తను " అది.. మీరు.." పర్వీన్ " అత్తమ్మ.." తను " అది అత్తమ్మ.. " పర్వీన్ " అర్దం అయ్యింది అమ్మ.. మేము ఎక్కడ ఆ పసి వాడిని వద్దు అంటాము అనే కదా.. నాకు నా వారసుడిని చూసుకునే అదృష్టం లేదు అమ్మ.. నువ్వు అంటే నా కోడలికి కొడుకు అంటే నాకు వారసుడు అనే కదా.. నా మనవడిని చూడాలి అని వుంది.. ఎప్పుడు తీసుకువస్తావు తల్లి.." అని అడిగింది.


పర్వీన్ మాటలకి గుండెలో వున్న భయం పోయి చాలా అంటే చాలా సంతోషం గా అనిపించింది. " మీకు ఇష్టమేనా అత్తమ్మ.." అని అడిగింది ఇంకో సారి కన్ఫర్మ్ చేసుకోవటానికి అన్నట్టు.. తన మాటలు నమ్మశక్యంగా లేవు అనుకోని తనని దగ్గరకి తీసుకొని " నిజంగా నా మనవడిని చూడాలి అని కోరికగా వుంది అమ్మ.. త్వరగా తీసుకు రా.." అంటుంది.


దానికి తను కూడా చాలా ఆనందంగా పర్వీన్ నీ హత్తుకొని థాంక్స్ చెప్పింది.. " కానీ అత్తమ్మ... మీ అబ్బాయి నన్నే ఆక్సెప్ట్ చెయ్యలేదు ఇంక నా కొడుకు నీ ఎలా యాక్సెప్ట్ చేస్తాడు.. నేనే కొన్ని రోజులు టైమ్ చూసుకొని తీసుకు వస్తాను.." అంటుంది.


పర్వీన్ కూడా ఏమి అనదు కారణం తను చెప్పింది నిజం కాబట్టి.. తన మనసులో వున్న ఇంకో మాట కూడా చెప్పాలి అనుకుంది.. " అమ్మ నాకు మీరు ఇద్దరూ శారీరకంగానూ, మానసికంగానూ ఒక్కటి అవ్వాలి అంటే అది అత్యాశే అవుతుంది కానీ నా కోరిక ఎప్పటికైనా అదే కానీ ప్రస్తుతం నువ్వు వాడితో కనీసం స్నేహం అన్న చెయ్యి అమ్మ.. ఈ అమ్మ కోరిక నీ తీర్చు తల్లి.." అని చేతులు పట్టుకొని అడిగారు.. పర్వీన్ అల అడిగేసరికి కాదు అనలేకపాయింది తను.. అలాగే అన్నట్టు తల ఆడించింది.ఇంక ఏవో కబుర్లు చెప్పుకుంటూ వున్నారు.. అల గార్డెన్ చుట్టూ చూస్తూ ఒక ప్లేస్ దగ్గర అలానే నిల్చొని అటే చూస్తూ వుండటం గమనించి " అది అసద్ కి చాలా ఇష్టమైన ప్లేస్ అమ్మ.. ఎందుకో ఈ ఇల్లు కట్టించినప్పుడే స్పెషల్ గా ఈ ప్లేస్ కూడా వాడే డిజైన్ చేయించి కట్టించాడు.. వాడికి దేవుడి మీద నమ్మకం లేకపోయినా కూడా ఎందుకో ఆ నటరాజ విగ్రహం పెట్టించాడు.. వాడి మనసు బాగొనప్పుడు ఇక్కడికి వచ్చి కొంచం సేపు కూర్చుంటాడు.." అని చెప్పింది..


అది చూడటానికి ఒక పందిరి లా వుంది.. అంటే నాలుగు స్తంభాల చుట్టూ వుండి పైన సీలింగ్ ఏమి లేకుండా ఓపెన్ గా ఉండి ఒక పక్కకి ఆ నటరాజ విగ్రహం వుంటుంది.. ఆ స్తంభాల చుట్టూ రక రకాల తీగలు.. పూల చెట్లు అల్లుకొని పైన కూడా ఆ చెట్లతో పూర్తి నిండిపోయి ఆ పందిరి అంతా కూడా చూడటానికి ఒక నందన వనం లా వుంది.. తను మాత్రం కళ్ళు అర్పటం మర్చి అలానే చూస్తూ వుంది..


తనని అల చూసి " ఎంటి అమ్మ.." అంటే తను " అత్తమ్మ కొంచం సేపు నేను అక్కడికి వెళ్ళన.. ప్లీస్" అని అడుగుతుంది... పర్వీన్ సరే అనడం తో తను అక్కడికి వెళ్తుంది.. తనకి ఆ ప్లేస్ చూస్తుంటే ఏదో తెలియని భావం పుట్టుకు వచ్చింది.. ఎప్పుడో ఎనిమిది సంవత్సరాల క్రితం తను చేసిన లాస్ట్ నృత్య ప్రదర్శన కళ్ళ ముందు మెదిలి అలానే ఆ నటరాజ నీ చూస్తూ వుంది.. తెలియకుండా నే వెళ్లి ఆ నటరాజ కి నమస్కరించి నృత్యం చెయ్యడం మొదలు పెట్టింది.. తను చేస్తున్న నృత్యం చూసి కళ్లు రెప్పలు కూడా వెయ్యడం లేదు పర్వీన్.. చాలా అంటే చాలా అలవోకగా వేస్తుంది.. ఎవరైనా నాట్యం చేస్తే కళ్ళతో భావం చెప్పేస్తారు అంటారు కానీ తను నాట్యం చేస్తుంటే తన అనవనువు ఏదో భావం వ్యక్త పరిచి నట్టే వుంది.. తను అసలు ఎంత సేపు నృత్యం చేస్తుంది కూడా తనకి తెలియలేదు.. దాదాపుగా రెండుగంటలు నృత్యం చేసి అలిసి అలానే నేలకొరిగింది. ఆయాసం వస్తుంటే దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ రొప్పుతూ వుంది..


తను నాట్యం ఆడుతున్న అంతా సేపు నిల్చొని చూస్తూ వున్న పర్వీన్ తనకి తెలియకుండా నే చప్పట్లు కొట్టడం మొదలు పెట్టింది.. తన చప్పట్ల తో పాటు ఇంకో రెండు జతల చప్పట్లు వినిపించాయి.. ఒకటి వెనుక వైపు నుండి అటు చూస్తే ప్రణయ్ వున్నాడు.. అల ట్రాన్స్ లో చప్పట్లు కొడుతూ ముందుకు పర్వీన్ దగ్గరకి వచ్చాడు..


పర్వీన్ అలానే చూస్తూ వుంది ప్రణయ్ కూడా.. ప్రణయ్ మనసులో ' అప్పట్లో వాడు చెప్తే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది వాడు చెప్పింది చాలా అంటే చాలా తక్కువ అని..' అని అనుకోని తన వైపే చూస్తున్న పర్వీన్ వైపు చూస్తూ " ఎంటి అత్త.." అన్నాడు...


కొనసాగుతుంది...