Strong bond in Telugu Motivational Stories by PRINCE PREMKUMAR books and stories PDF | పదిలమైన బంధం

Featured Books
  • Safar e Raigah - 7

    منظر ۔ اچھا تو تم ہسپتال تب سے جانے والے ہو تم بس ایک مُسافر...

  • شائستگی

       آنکھیں ہم آنکھیں ملنے نکلے ہیں۔ ہم کون سا...

  • Safar e Raigah - 6

    باب شاہمیر کی دنیا ہمیشہ سے ہی اس کے اسکول کی کتابوں اور پرا...

  • زندہ

    انتظار کر رہا ہے۔میرے نازک دل کو توڑ کر تم پوچھ رہے ہو میں ک...

  • طلاق شدہ لڑکی (قسط نمبر 2)

    آج پھر وہ آفس سے لیٹ گھر پہنچا تھا....ایسا نہیں تھا کے وہ آف...

Categories
Share

పదిలమైన బంధం

కేవలం మాటల్లోనే కాదు, మన ప్రవర్తన, భావాల ద్వారా ప్రేమను వ్యక్తపరచడమే నిజమైన ప్రేమ
అవతలి వ్యక్తికి ఏమీ చెప్పకుండానే ప్రేమను వ్యక్తపరచగలగాలి
ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ప్రతి విషయాన్ని తెలియజేయగలగాలి

ప్రేమ ఎంత అందంగా ఉంటుందో అంతే సొగసైనది. 
మన ప్రవర్తన, వైఖరి మన మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయి. 
భాగస్వామిని మెచ్చుకోవడం కూడా ప్రేమ భాషనే. అవమానాలు, బాధ కలిగించే మాటలు వారిని మానసికంగా వేధిస్తాయి. 
వీటిని వారు సులభంగా మరచిపోలేరు. 
కానీ  వారు చేసిన పనులకు మెచ్చుకుంటే
వాటిని కూడా మర్చిపోరు.
సరైన సమయానికి ప్రశంసలు దక్కితే 
మానసిక ఆరోగ్యానికి ఉపశమనం లభిస్తుంది.
ఆ తర్వాత మిమ్మల్ని వారు చూసే తీరే మారిపోతుంది. ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపుకుంటారు. 
కష్టసుఖాల్ని కలిసి పంచుకోవడం కూడా
ఒక ప్రేమ భాష అనడంలో ఎటువంటి అనుమానం లేదు.

జీవిత భాగస్వామి లేదా ప్రియమైనవారి బాధ్యతల్ని గుర్తించడం.. 
వాటిని మీ భుజాలపై వేసుకోవడం కూడా ప్రేమ భాషనే. సోమరితనం, మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తగ్గడం 
మీ ప్రియమైన వారిని ఎంత మాత్రం సంతోషపెట్టవు. 
వాళ్ల జీవితంలో ఎంత వరకు సపోర్ట్ చేస్తారు..? 
వారి బాధలకు మీరు ఎలా సానుభూతి చూపుతారు? 
ఇది మీ ప్రేమ యొక్క స్థాయిని పెంచుతుంది.

మీ ప్రేమ ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే 
మీరు ముందు ప్రేమించిన వ్యక్తిని అర్థం చేసుకోవాలి. 
అలా చేయాలంటే.. వారితో నాణ్యమైన సమయాన్ని గడపాలి. 
బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఒత్తిళ్లు, పనిలో బిజీ ఉండడం సహజమే. 
అయితే వీటితో పాటు మీ ప్రియమైన వారితో గడపడం అలవాటు చేసుకోవాలి. 
ఇద్దరూ పరస్పరం మాట్లాడుకోవాలి. 
కలిసి సమయం గడపండి.
ఇరువురి బలహీనతలు తెలుసుకోవడానికి కూడా సమయం కేటాయించాలి. 
అప్పుడు ఒకరికొరు సాయం చేసుకోగలరు. 
మీ ప్రేమ బంధం మధ్య స్వేచ్ఛ ఉండాలంటే సమయం కేటాయించడం ఉత్తమం.

ప్రేయసి ప్రియులు కావచ్చు
భార్య భర్తలు కావచ్చు
ఈ బంధంలో ఒకరినొకరు గౌరవించుకోవడం 
చాలా ముఖ్యం
కచ్చితంగా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి
అలాగే ఎదుటివారి ఆత్మగౌరవం తగ్గించేలా ప్రవర్తించడం కానీ మాట్లాడడం కానీ చేయకూడదు.

మీ బంధంలో మీరు ఎంత సమయం ఇచ్చారు అనేది ముఖ్యం కాదు
మీరు ఇచ్చిన సమయంలో ఎదుటివారు
ఎంత సంతోషంగా ఉన్నారు అనేది ముఖ్యం

సోషల్ మీడియా పుణ్యమా అని మధ్య కమ్యూనికేషన్స్ వేగంగా పెరుగుతున్నాయి
దానితో పాటే నకిలీ ప్రేమలు కూడా పెరుగుతున్నాయి
ఎంతగా అంటే...
నిజమైన ప్రేమ కంటే ఈ నకిలీ ప్రేమనే అందంగా కనిపిస్తుంది
మోసపోయేదాకా తెలియదు
ఆ ప్రేమ నిజమైందో నకిలీ ప్రేమనో....

నకిలీ మనస్తత్వం ఉన్న మనుషులు
ఎప్పుడు మీ వ్యక్తిగత విషయాలపైనే దృష్టి పెడతారు 
మీ పర్సనల్ విషయాలు 
ప్రతి చిన్న చిన్న విషయాల్లో తెలుసుకోవడానికి ఎక్కువ కుతూహలం చూపిస్తారు
ఎప్పుడూ ఎదుటివారిలో ఏ లోపాలు తప్పులు కనిపిస్తాయా? 
వాటి గురించి అందరికీ చెబుదామా
అన్న ఆలోచనల్లోనే నిమగ్నమవుతుంటారు.
ఈ క్రమంలో ఏ చిన్న క్లూ దొరికినా..
వాటిని పెద్దవి చేయడానికి ఆరా తీస్తుంటారు.
ఇలా అనవసరమైన విషయాల్ని
భూతద్దంలో పెట్టి
చూస్తూ నలుగురిలో మిమ్మల్ని నవ్వులపాలు
చేయాలనుకుంటారు..
అది కూడా వారిపై సందేహం రాకుండానే..

మీపై నకిలీ ప్రేమను, అభిమానాన్ని చూపే 
మీ స్నేహితులు కంటికి 
మీరు ఎంత అందంగా కనిపించినా.. 
దాన్ని వాళ్లు అంగీకరించరు. 
ఈ క్రమంలో మీ చర్మ ఛాయ, శరీరాకృతి....
గురించి విమర్శిస్తుంటారు.

ప్రతి విషయంలోనూ గొప్పలు చెప్పుకొనే తత్వాన్ని 
కలిగి ఉంటారు
ఎదుటివారి భావాలు ఎలా ఉన్నా 
తమ మాటలు, చేతలతో వాటిని తక్కువ చేసి చూస్తుంటారు. 
ఇలా ఒక రకమైన అభద్రతా భావాన్ని వారిలో
కలిగిస్తారు

ఎంతమంది స్నేహితుల మధ్య ఉన్నా.. 
ఎవరి గురించి చర్చ జరుగుతున్నా.. 
ప్రతిసారీ తమ గురించే, తమ జీవితంలో జరిగిన
విషయాల గురించే చర్చించడానికి 
ఆసక్తి చూపుతుంటారు.
పలానా వాలు ఇలా... పలానా వాళ్లు అలా అని
అనవసరమైన విషయాల గురించి
అనవసరమైన వ్యక్తుల గురించి 
ప్రతిసారి ప్రస్తావన తెస్తూ ఉంటారు

తమ పొరపాటును అంగీకరించే స్థితిలో వారుండరు. మంచి చెప్పినా వారి తలకెక్కదు. 
తమ నిర్ణయమే సరైందన్నట్లుగా ఒక రకమైన ఆధిపత్య ధోరణిని వారిలో చూడచ్చు...

మరి ఇలాంటి వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎలా


ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టడం వల్ల వారు
తమకు ఎదురుతిరుగుతారేమో, 
తమ గురించి నెగెటివ్గా ప్రచారం చేస్తారేమోనన్న భయం కొంతమందిలో ఉంటుంది.
కానీ మనసులోంచి ఆ భయాన్ని తీసేస్తే
ఎక్కడా, ఎవరి ముందూ నెర్వస్ ఫీలవ్వాల్సిన 
అవసరం లేదు

మీ వ్యక్తిగత, కెరీర్కు సంబంధించిన
ఎలాంటి విషయాల్లోనూ వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకోకూడదు.
ఒకవేళ కలగజేసుకొని వాళ్లు తమ అభిప్రాయాన్ని/ఆలోచనల్ని చెప్పినా.. వినీ విననట్లుగా ఊరుకోవడం
మంచిది.

ఇలాంటి స్నేహితులు.... అందరి మధ్యా
నిప్పు రాజేయాలనుకుంటారు. 
కాబట్టి వాళ్ల మాటలు నమ్మి 
మీరు గొడవ పడడం కాకుండా..
ఏవైనా సమస్యలొస్తే ముందు నిజానిజాలేంటో తెలుసుకోండి.. 
ఆపై కలిసి కూర్చొని మాట్లాడుకుంటే
బంధాలు దూరమవవు. సమస్యలూ
త్వరగా పరిష్కారమవుతాయి.

ఇలాంటి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ
మనసు పాడు చేసుకుంటుంటారు కొందరు. 
కానీ వాళ్లను పట్టించుకోకుండా, 
ప్రతి విషయంలో వారిని సాధ్యమైనంత దూరం పెట్టడం మంచిది
అప్పుడే వాళ్లకు మీరిచ్చే విలువేంటో అర్థం చేసుకొని
మీ జీవితంలో కలగజేసుకోకుండా ఉంటారూ 

నీకోసం నేనున్నాను అనే భావనను
ఎవరైతే మీలో ఎక్కువగా కలిగిస్తున్నారు అంటే 
మొదట అనుమానించాల్సింది వాళ్ళనే...
నమ్మించాల్సిన పనిలేదు 
  బంధాల్లో ప్రేమ నమ్మకం నిజమైతే 
కొన్ని విషయాలు వాటంతట అవే అర్థమవుతాయి

నమ్మించాలా అనే అనుమానం రావచ్చు
కానీ అక్కర్లేదు
మన ప్రవర్తన మన మాటతీరో సరైనదిగా సక్రమంగా ఉంటే నమ్మకం వాటంతటా అదే ఉంటుంది
అంతేకానీ నమ్మించడానికి నటించాల్సిన పనిలేదు అసలు బంధాన్ని కాపాడుకోవడంలో
నటనతో అవసరం లేదు
ఎన్నాళ్ళు నటిస్తూ బంధాన్ని కాపాడుకుంటాము మనసు నిజమవ్వాలి
మనస్తత్వము నిజమవ్వాలి
అప్పుడే కదా బంధం పదిలంగా ఉంటుంది
అప్పుడే కదా బంధం శాశ్వతంగా ఉంటుంది

మరొక ముఖ్య విషయం బంధాన్ని కాపాడుకోవాలి అంటే ఆ బంధం పైన గౌరవం ఉండాలి 
అంతేకాని బంధం అంటే అవసరం కాదు అవసరంతో ఏర్పడే బంధాలు
అవసరం తీరాక వెళ్లిపోతాయి
ఇది ఇప్పుడు జరిగే తీరు
 అవసరంతో కాదు ప్రేమతో ఏర్పడే బంధాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి
విడిపోవాలి అనే ఆలోచన ఉండదు
విడిపోయే అవసరం రాదు
విడిపోవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా విడిపోరు