King and Peasant (true value) in Telugu Short Stories by swathi books and stories PDF | రాజు మరియు రైతు (నిజమైన విలువ)

The Author
Featured Books
Categories
Share

రాజు మరియు రైతు (నిజమైన విలువ)

పీఠిక 
"నిశ్శబ్దంలో దాగి ఉన్న కొన్ని నిజాలను, మాటలకు అందని మనసులోని అలజడిని అక్షర రూపంలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం ఇది. 'అక్షర మౌనం' కలం నుండి జాలువారిన మొదటి కథ... 'నిజమైన విలువ'. బాహ్య రూపం కంటే అంతరంగానికి ప్రాముఖ్యతనిచ్చే ఒక అద్భుతమైన ప్రయాణం."

     "ఒకానొక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా పేదవాడు.మురికి బట్టలు వేసుకుని, తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదని అతనని ఎవరూ ఇష్టపడే  వారూ కాదు. అందరూ అతడిని తక్కువ చేసి చూసేవారు. అయినా సరే, అతను ఎవరి మాటలనూ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయేవాడు. తనకి ఉన్నదానిలో సర్దుకు పోయే మనస్తత్వం. తనని ఎప్పుడూ వాళ్లల ఉండాలని వీళ్లల ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు సరికదా తనకి ఆస్తులు లేవు అని ఎప్పుడూ బాధపడేవాడు కాదు. ఎప్పుడూ సంతోషంతోనే ఉండేవాడు అది చూసి జనాలు  ఏమి లేకపోయినా ఎందుకో ఆ నవ్వు అని చులకనగ చుసేవారు కానీ ఉన్నంతలో సంతోషంగా ఎలా బతకాలి అనే రైతు ను చూసి తెలుసుకోలేకపోయారు ఆ ఊరి జనాలు !
ఒకరోజు ఆ ఊరికి ఒక అపరిచితుడు వచ్చాడు. పొరుగు ఊరి నుండి వచ్చాడని ఆ ఊరి జనాలు తెలిసి గ్రామస్తులందరూ అతనికి ఘనంగా స్వాగతం పలికారు.  అతని వస్త్రాలు చూసి డబ్బు ఉన్నొడని ఎంతో కొంత అతని దగ్గర సంపద ఉంటాదని ఆ ఉరి ప్రజలు అనుకోని, లేని ప్రేమను ఉన్నట్టుగా ప్రవర్తించేవారు మా ఇంటికి భోజనానికి రమ్మని అందరూ అడిగారు కానీ ఆ ఊరికి వచ్చినా  అపరిచితుడు మాత్రం  వాళ్ళలో ఉన్న స్వార్థాన్ని   గుర్తించి ఏమి మాట్లాడలేదు అలా కొంత దూరంగా  వెళ్తూ ఉండగా అక్కడ ఆ పేద రైతు పొలంలో పని చేస్తూ ఉండగా బట్టలో మురికి ఒంటి నిండా చెమట, దుర్వాసన  వస్తున్న ఆ పేద రైతు దగ్గరకు ఆ అపరిచితుడు వెళ్ళాడు. అది చూసిన ఊరి వారంతా వద్దు అండి వద్దు అన్నారు. కానీ అపరిచితుడు ఎవరి మాట వినకుండా పేద రైతు  రైతు దగ్గరకు వెళ్లి  నీపేరు అడిగాడు నా పేరు అందీ  రాజు అందీ అని చెప్పాడు ఆ ఊరిలో ఒకడు' పేరు కి రాజు కానీ జీవితంలో పేదరాజు అనీ అన్నాడు ఆ  మాటకు నవ్వారు చుట్టుపక్కన ఉండే వాళ్ళు అది కూడా అర్ధం కాని ఆ రైతు కూడా నవ్వేశాడు ఆది చూసి ఆ అపరిచితుడు తనలో మంచితనం ,అమాయకత్వం చూసి మురిసిపోయాడు తనతో స్నేహం చెయ్యాలని ఆశ కలిగింది. నాతో స్నేహం చేస్తావా అని అడిగితే రైతు (రాజు) నవ్వేసి ఊరుకున్నాడు ఆ చుట్టూ పక్కన ఉన్నవాళ్ళు మాత్రం వాడితో మీకు స్నేహం ఏమిటి అన్నారు కానీ ఆ అపరిచితుడు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పేద రైతు (రాజు) తో స్నేహం చేయడం మొదలు పెట్టాడు అది చూసి ఉరి జనాలు మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు. 
అయినా సరే, ఆ వ్యక్తి రైతును వదలలేదు. వారి స్నేహం రోజురోజుకూ బలపడింది. ఆ  ఊరి ప్రజలు వచ్చి వాడితో స్నేహం ఏమిటి ! మీరు ఏమిటి ?మీ పరపతి  ఏమిటి? అని అడుగుతుండగా.  అవేమీ పట్టించుకోకుండ ఆ అపరిచితుడు రైతు దగ్గరకు వెళ్ళిపోయాడు.   ఇది చూసిన గ్రామస్తులు అసూయతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. రోజులు సంతోషంగా గడుస్తున్నాయి . ఒకరోజు రానే వచ్చింది ఆ అపరిచితుడు వెళ్ళాల్సిన సమయం వచ్చింది అతను వెళ్ళిపోతున్నందుకు అపరిచితుడు  చాలా బాధపడ్డాడు, కానీ ఆ సమయంలో రైతు మాత్రం ఏమీ జరగనట్టే ఉన్నాడు.తను వెళ్ళిపోతున్నాడు ఇక వస్తాడో రాడో అని అడగడం లేదు సరికదా జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి నవ్వుతున్నాడు . అక్కడి నుండి అపరిచితుడు వెనక్కి చూసుకుంటూ వదలలేక వెళ్ళిపోయాడు.
అయితే రోజులు గడుస్తున్న కొద్దీ, రైతుకు ఆ స్నేహితుడి లేని లోటు స్పష్టంగా తెలియడం మొదలైంది. తను అరిచినా, కోప్పడినా ఆ అపరిచితుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదని రైతు గ్రహించాడు. ఎన్ని సార్లు తిట్టిన
ఏమనే వాడు కాదు. అలా తను గుర్తు వచ్చి తనకి తెలియకుండా కళ్ళల్లో నీరు వచ్చింది . ఆ సరదాలు పొలం గట్టులో ఆడుకోవడం చద్దన్నం తినడం అది అపరిచితుడు కి తినడం రాకపోతే ఈ ఎలా తినాలో గంజి ఇచ్చిన తాగడం రాకపోతే పచ్చిమిర్చి ఇచ్చి  ఒక్కసారి కొరకమని చెప్పి అది కొరికితే దాహం దాహం అనడం అప్పుడు ఆ రైతు అప్పుడు గంజి తాగమని చెప్పి తాగించే వాడు. అలా వాళ్ళు సరదాగా రోజులు గుర్తు వచ్చి ముసి ముసి నవ్వుకునేవాడు ఆ రైతు.
 కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఊరికి తిరిగివచ్చాడు. అతడిని చూసి ఊరి జనం ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ ఏమి మాట్లాడలేదు అతనినీ చూస్తూ ఉండి పోయారు.  నేరుగా ఆ అపరిచితుడు రైతు దగ్గరకు వెళ్లి అతడిని ఆలింగనం చేసుకున్నాడు. రైతుకు ఏమీ అర్థం కాక అయోమయంలో ఉండిపోయాడు.  ఎవరు అండి మీరు నన్ను కౌగిలించుకున్నారు అని అన్నాడు. అప్పుడు ఆ అపరిచితుడు తన  వస్త్రాలను తీసివేసి ఆ పేద రైతు కు తను ముందు ఎలా కనపడ్డాడో  ఇప్పుడు అలా కనపడ్డాడు ! రైతు కు ఏమి అర్ధం కావడం లేదు!  ఒక్కనీమిషం అలా నిశ్చేష్టుడు అయిపోయాడు . రాజు రాజు అనీ పిలిచేసరికి ఒక్క సారి  ఈ లోకానికి వచ్చి అమాంతం కాళ్ళ పై పడబోయాడు అప్పుడు ఆ అపరిచితుడు నువ్వు కాళ్ళ మీద పడడం కాదు నీవు కూడా నాతో పాటు నాదగ్గర ఉందువు గాని రా అన్నాడు . అప్పుడు ఆ రైతు అయ్యా  నాకు అంతటి అద్రుష్టం లేదు" రాజు" గారు అని అనేసరికి రాజు చిన్న నవ్వు నవ్వి రాజు నా మిత్రమా!  వారందరూ నా బట్టలను, నా పై వేషాన్ని చూశారు. కానీ నువ్వు మాత్రం నేను ఎలా ఉన్నానో అలాగే నన్ను చూశావు నీలోని నిస్వార్థ ప్రేమ నాకు నచ్చింది అది అందరిలో ను ఉండదు కానీ నీ దగ్గర ఉంది అని చెప్పారు రాజు గారు. అందుకే నాకు నువ్వంటే అంత గౌరవం.  నా చుట్టు ఉన్న వాళ్ళు మొత్తం నా వస్త్రాలు చూసి నా దగ్గర  డబ్బు ఉందని గ్రహించి లేని ప్రేమను నటించారు కానీ నువ్వు అలాకాదు నన్ను నన్ను గా చూశావు ఇక ఆలస్యం ఎందుకు, వెళ్దాం'పద అన్నారూ. చుట్టూ జనాలు చూసి అయ్యో ఎంత తప్పు చేశాము  కనీసం ఆ రైతును మనిషిలాగా అయిన విలువనిచ్చి ఉంటే  కనీసం ఎంతో కొంత హోదా దక్కేది అని చుట్టూ  జనాలు బాధపడ్డారు. రైతు నీ గౌరవ మర్యాదలుతో తనని తీసుకెళ్తూ రైతు నడిచే దారి పొడవునా సుగంధభరితమైన పుష్ప వృష్టి (పూల వాన) కురిపిస్తూ, అతని పాదాలు నేలకు తగలకుండా స్వర్ణ వర్ణపు పట్టు వస్త్రాలు మరియు రత్నకంబళీలు పరిపించారు. అడుగుడుగునా మంగళ వాయిద్యాలు మారుమోగుతుండగా, పల్లకిలో కూర్చోబెట్టి అతడిని తన భవనానికి తీసుకువెళ్లారు. ఒక రాజుకు దక్కే గౌరవం ఆ రైతుకు దక్కేలా చేసి, లోకానికి స్నేహానికి ఉన్న "నిజమైన  విలువను" చాటిచెప్పారు."
నీతి :
"ఈ రోజుల్లో స్వచ్ఛమైన స్నేహం దొరకడం చాలా అరుదు. భగవంతుడు మనిషి పైరూపాన్ని లేదా హోదాను చూడడు, కేవలం నిష్కల్మషమైన మనసును మాత్రమే చూసి ఇష్టపడతాడు. సమాజంలో నిజమైన స్నేహం కరువవుతున్న ఈ తరుణంలో, ఒక స్నేహితుడు ఎలా ఉండాలో, ఎదుటివారిని ఎలా గౌరవించాలో ఈ కథ మనకు నేర్పుతుంది
    శుభం.