వెంటాడే నీడలు
( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పారానార్మల్ థ్రిల్లర్)
కొట్ర శివ రామ కృష్ణ
"ఈ మధ్యకాలం లో ఏదైనా మెంటల్ కేర్ కి అటాచ్ అయి ఉండడం, సొంతంగా ప్రాక్టీస్ చెయ్యడం ఇష్టపడలేకపోతూఉన్నాను. ఏదో దేశం అంతా తిరిగి చూడాలనిపిస్తూ వుంది, అదే చేస్తున్నాను. అందులోనూ నాకు మీలా స్టూడెంట్స్ కూడా చాలా మంది వున్నారు కదా, వాళ్ళదగ్గరికి కూడా వెళ్తూవుంటాను. ఎవరన్నా నా సహాయం అడిగినా కూడా చేస్తూవుంటాను."
"మీ సహాయం మాలాంటివాళ్ళందరికీ ఎప్పుడూ కావాలి. మీరలాంటి దృక్పధం తో కూడా ఉండడం చాలా ఆనందకరమైన విషయం." నిరంజన్ అన్నాడు.
"నాకెందుకో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చూడాలనిపించింది. ఇంక త్వరలోనే మనం కొంతకాలం ఒకరికొకరం చాలా అవసరం పడతామని నాకు అనిపిస్తూంది." యస్మణి అన్నాడు.
"నిజం చెప్పాలంటే మీ అవసరం మాకెప్పుడూ వుంది. కానీ మేము ఏ రకంగా మీకు అవసరం పెడతామో ఆశ్చర్యంగా వుంది. మీకు ఏ రకంగా ఉపయోగపడగలిగినా అది మా అదృష్టం గా భావిస్తాం." నిరంజన్ అన్నాడు.
"అది ఖచ్చితంగా నిజం." వంతపలుకుతూ అంది సమీర.
"మామూలు సైకలాజికల్ డిజార్డర్స్ విషయంలో నా అవసరం మీకు రాదు. అవి ఎలాంటివైనా సాల్వ్ చేసేగల సమర్దులే మీరు. అలాగే మామూలు విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోను. కానీ ..........." భృకుటి మూడేసి సంశయంతో అంటున్నట్టుగా అన్నాడు "........... ఒక పారానార్మల్ విషయం మనల్ని ఒకరికొకరు చాలా అవసరపడేలా చేస్తుందనిపిస్తోంది."
"మీరంటే మాకున్న గౌరవం మీకు తెలుసు. కానీ మీతో మేము ఏకీభవించలేని విషయం ఇదొక్కటే. ఈ పారానార్మల్, సూపర్నేచురల్ విషయాల్ని మేము నమ్మలేం." నిరంజన్ అన్నాడు.
దానికి సమీర ఏం అనలేదు కానీ మోహంలో అటువంటి ఎక్స్ప్రెషన్ తోనే వుంది.
"కొన్ని విషయాలకి మన అభిప్రాయాలతోటి, నమ్మకాలతోటి నిమిత్తం ఉండదు. మనం నమ్మడం లేదని అవి ఉండకుండా పోవు. ఈ పారానార్మల్, సూపర్నేచురల్ అటువంటివి."
"ఈ విషయమై ఐతే నేను ఎటువంటి ఆర్గ్యుమెంట్ చెయ్యదలుచుకోలేదు. కానీ పారానార్మల్, సూపర్నేచురల్ విషయం లో నా అభిప్రాయం అంత త్వరగా మారదు." దృఢస్వరం తో అంది సమీర.
నవ్వాడు యస్మణి. "మీ అభిప్రాయాల్ని, నమ్మకాల్ని పనిగట్టుకుని మార్చే ఉద్దేశం తో నేనూ లేను. నేను బలంగా ఏది ఫీల్ అవుతున్నానో అది చెప్పానంతే."
"మీకు ఏ విషయం లో ఎటువంటి సహాయం కావలసి వచ్చినా, మేమెప్పుడూ అది చెయ్యడానికి సిద్ధంగా ఉంటాం." నిరంజన్ అన్నాడు.
"ఆ విషయం నాకు తెలుసును." నిట్టూరుస్తూ అన్నాడు యస్మణి. "కానీ ఈ విషయం లో నాకు మీకన్నా, మీకు నా సహాయం ఎక్కువ అవసరపడొచ్చు అనిపిస్తోంది. రాబోయే ఆ విషయం ఈ బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ ని, మీ ఇద్దరి జీవితాల్ని కూడా ప్రభావితం చెయ్యొచ్చు అనిపిస్తోంది. మీరిద్దరూ మీ కుటుంబాలతో సహా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమవుతోంది."
నిరంజన్, సమీర ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకున్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు.
"మీరిద్దరూ ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు రేపు ఆ విషయం లో నన్ను సహాయం అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు మొహమాటంగా ఫీల్ అవ్వొద్దు. ఈ పారానార్మల్ గురించి తెలియని వారు, ఆ విషయం లో అనుభవం లేనివారు మీలాగే ఆలోచిస్తారు. మీకెప్పుడు ఆ విషయం లో సహాయం అవసరమైనా నన్ను నిస్సంకోచం గా అడగండి. నేనందుకు సిద్ధంగా వుంటాను."
"తప్పకుండా అలాగే." నిరంజన్ అన్నాడు. "కానీ మీకెందుకు అలా అనిపిస్తోంది?"
"ఇది నా స్ట్రాంగ్ హంచ్. ఏదో పారానార్మల్ విషయం లో మనమందరం చిక్కుకోబోతున్నాం. ఇంతకుముందు నా హంచ్ లన్నీ నిజమయ్యాయి. ఇదీ నాకు నిజమవుతుందనిపిస్తోంది."
గట్టిగా నిట్టూర్చి ఊరుకున్నాడు నిరంజన్ ఏం మాట్లాడాలో తెలియక.
"ఈ హంచ్ లని కూడా మీరు నమ్మరని నాకు తెలుసును. కానీ కొన్ని చెప్పకుండా నేను ఉండలేను. అలాగే మీరు ఎంత ఇష్టపడకపోయినా మరొక విషయం కూడా మీకు చెప్పదలచుకున్నాను."
"ఏమిటది?" నిరంజన్ మొహం లో చిరాకు కనిపించకుండా అన్నాడు కానీ అదసలు యస్మణి చెప్పకపోతే బావుండునని తనకి అనిపిస్తూ వుంది.
"కొంతకాలం పాటు మీతో పాటుగా మీ చుట్టాలనెవరినీ ఉండనివ్వకండి. వేరే ఏ చుట్టాలని మీ ఇంటికి రావడానికి ఎంకరేజ్ చెయ్యకండి. ఆ పారానార్మల్ పవర్ మీతో పాటుగా, వాళ్ళ జీవితాల్ని ప్రభావితం చేసే అవకాశం వుంది."
"చూడండి సర్" ఇంక ఉండలేక అంది సమీర. "మీకు ఎటువంటి సహాయం అవసరమైనా మేము చెయ్యడానికి సిద్ధంగా వున్నాం. కానీ మమ్మల్ని భయభ్రాంతుల్ని చేసి పారానార్మల్ మీద నమ్మకం కలిగించాలని మాత్రం చూడకండి. అందువల్ల ప్రయోజనం ఉండదు."
"చెప్పను కదా. నాకు మీ అవసరం కన్నా, మీకు నా అవసరం ఎక్కువపడే అవకాశం వుంది." నవ్వుతూ అన్నాడు యస్మణి. "నేను మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం తో ఏదీ చెప్పడం లేదు. ఈ విషయం త్వరలోనే మీకర్ధం అవుతుంది."
"ఇంతకీ మీరంటున్న ఆ పారానార్మల్ పవర్ ఏమిటి? నేను అటువంటివి నమ్మకపోయినా తెలుసుకోవాలని ఆసక్తిగా వుంది." సమీర అడిగింది.
"నేనూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ తెలియడం లేదు." కుర్చీలో వెనక్కి జారగిలబడి ఒక అనీజీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు యస్మణి. "నాకు తెలుస్తూన్నదల్లా మనందరి జీవితాలు ఒక పారానార్మల్ పవర్ తో ప్రభావితం కాబోతూ వున్నాయి."
"సరే లెండి. మేము జాగ్రత్తగానే ఉంటాం. మీరు చెప్పినట్టుగానే చేస్తాం." అలా అన్నాక ఇంక ఆ విషయం గురించి మాట్లాడ్డం ఇష్టం లేదన్నట్టుగా టాపిక్ మార్చాడు నిరంజన్.
మరి కాసేపు సమీర తోటి, నిరంజన్ తోటి ఇంకొన్ని విషయాలు మాట్లాడాక అక్కడనుండి వెళ్ళిపోయాడు యస్మణి.
"మనల్ని కేవలం భయపెట్టే ఉద్దేశం తోటే ఇక్కడికి వచ్చాడా ఈరోజు ఈయన?" యస్మణి వెళ్ళిపోయాక చిరాగ్గా అంది సమీర. "సైకాలజీ లో ,సైకియాట్రీ లో అంత నాలెడ్జ్ వున్న మనిషి ఇలా ఎలా ఆలోచిస్తాడో అర్ధం కావడం లేదు."
ఒక అనీజీ ఎక్స్ప్రెషన్ తో నిట్టూరుస్తూ కుర్చీలో వెనక్కి జారగిలబడ్డాడు నిరంజన్. "ఒక విషయం మాత్రం నిజం. ఈయనకి ఇంతకు ముందు కొన్ని హంచెస్ రావడం, అవి పక్కాగా నిజం కావడం జరిగింది."
"కమాన్ సర్. ఇప్పుడు ఈయన ఈ పనికిమాలిన వాగుడు అంతా కూడా నిజం అవుతుందంటారా?" అదే చిరాకుతో అంది సమీర.
"అలా అవ్వకూడదని కోరుకుంటున్నాను."
"సర్.........." కుర్చీలోనుండి లేచినిలబడి అంది సమీర. "........... ఆయన చెప్పినదేదీ నేను కొంచెం కూడా నమ్మడం లేదు, పట్టించుకోవడం లేదు. మీక్కూడా నా సలహా అదే." అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయింది.
&&&
"మూడీ గా కనిపిస్తున్నావు ఏం జరిగింది? నా చెల్లెలు తను వస్తున్నట్టుగా రెండురోజుల కిందటే నాకు ఫోన్ చేసి చెప్పింది. నేనే నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు తనని సడన్ గా ఇలా చూసి ఏమన్నా అప్సెట్ అయ్యావా?" ఆ రోజు రాత్రి బెడ్ మీద ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు సెటిల్ అయ్యాక అరవింద్ అడిగాడు.
"ఏమిటి అరవింద్ ఇది? సుస్మిత ఇక్కడికి రావడం ముందుగా నాకు తెలియాలా? ఇది తన ఇల్లు. తనెప్పుడన్నాయిక్కడికి రావచ్చు, ఎలాంటి ప్రీయర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా. అందులోనూ తను నన్ను చాలా అభిమానించే మనిషి. తన కంపెనీ నాకు ఆనందాన్నే ఇస్తుంది." సమీర అంది.
"కానీ నువ్వెందుకో కొంచెం డిస్టర్బడ్ గానే కనిపిస్తున్నావు."
"నాకూ, మా సీనియర్ కి సీనియర్ మా మెంటల్ కేర్ కి వస్తున్నాడని చెప్పాను గుర్తుందా?" అరవింద్ వైపు తిరిగి అడిగింది సమీర. "ఆయన వచ్చాడు."
"ఏం ఈ సారి కూడా నీ అందాల్ని కళ్ళతో జుర్రేసాడా?" అరవింద్ కూడా సమీర వైపు తిరిగి ఆమె మొహంలోకి చూస్తూ అడిగాడు.
"దానికైతే నేను అలవాటు పడిపోయాను. ఒక్క ఆయన దగ్గరే కాదు, చాలా మంది దగ్గర." నవ్వింది సమీర. "నిజానికి నన్నెవరన్నా అలా చూస్తూవుంటే, అదో కాంప్లిమెంట్ లా తీసుకోవడం మొదలుపెట్టాను."
"మరయితే ఇప్పుడు సమస్యేమిటి అసలు?" నొసలు ముడేసాడు అరవింద్.
యస్మణి తమ దగ్గర పారానార్మల్ పవర్ అంటూ మాట్లాడింది చెప్పింది సమీర. "ఆయన వెళ్ళాక, నిరంజన్ దగ్గర నేను అలాంటివేమీ నమ్మను అని, తను కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పాను."
"నువ్వు కరెక్ట్ గానే చెప్పావు. ఇప్పుడు దేనికి ఫీలవుతున్నావు?" నొసలు ముడి అలాగే ఉంచి అడిగాడు అరవింద్.
"ఆ యస్మణి చాలా తెలివైన మనిషి. సైకాలజీ లోనూ, సైకియాట్రీ లోనూ అయన నాలెడ్జ్ అపారం. నేను ఆయన దగ్గరనుండి నేర్చుకున్నది చాలా వుంది, అలాగే నిరంజన్ కూడా. అటువంటిది ఆయన ఏ బేసిస్ లేకుండా అలా అంటాడా?"
"కొంతమంది చాలా తెలివైన వాళ్ళుకూడా కొన్నివిషయాల్లో ఫ్యూలిష్ గా బిహేవ్ చేస్తూ వుంటారు. ఈ పారానార్మల్ విషయం లో ఈ యస్మణి కూడా అంతేనని నాకు అనిపిస్తూంది. నేనూ ఎప్పుడూ ఈ పారానార్మల్ విషయాల్ని నమ్మలేదు. నువ్వు కూడా నమ్మకు."
"అంతేనంటావా?" ఇంకా ఎదో సందేహం, అనీజీనెస్ ఉండిపోయాయి సమీరా మోహంలో.
"అంతేకాక ఇంకా మరేమిటి?" సమీర ఇంకా వేరే ఏదన్నా అనేలోపల, తనని వెల్లకిలా చేసి, మీదనెక్కిపోయాడు అరవింద్. తన అనీజీనెస్ అంతా మర్చిపోయి కో-ఆపరేట్ చేసింది సమీర. ఎప్పుడు ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు పూర్తి న్యూడ్ గా మారిపోయారో వాళ్ళకే గుర్తులేదు.
"మొదటిసారిగా మన లిటిల్ డెవిల్ డిస్టర్బన్స్ లేకుండా వేడి చల్లార్చుకున్నాను." వేడి దింపుకున్నాక సమీర ఎడమవైపు స్లైడ్ అవుతూ అన్నాడు అరవింద్.
"ఆమె నీ మామ్, మర్చిపోయావా?" లేచి డ్రెస్ చేసుకోవడానికి బద్ధకంగా అనిపించి, దుప్పటి నిండుగా కప్పుకుని, నిద్రకి ఉపక్రమిస్తూ అంది సమీర.
"ఆ మర్చేపోయాను. నా మామ్ డెవిల్ కాదు ఏంజిల్." దుప్పట్లో దూరి, సమీర న్యూడ్ బాడీ ని గట్టిగా కౌగలించుకుని, తన కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అన్నాడు అరవింద్.
&&&
ఆ రోజు రాత్రి మళ్ళీ అదే హోటల్లో బసచేసాడు యస్మణి. మందాకిని కి మళ్ళీ ట్రై చేస్తే, తను వేరే చోటుకి వెళ్ళిపోయివుంది అందుకని తను తరచూ ప్రిఫర్ చేసే ముగ్గురు ఆడవాళ్ళలో, నందిని ని రప్పించుకుని తనతో రాత్రంతా గడిపి, ఉదయాన్నే ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు, ఫ్లైట్ ఎక్కి తనువుండే వూరు వెళ్ళడానికి.
తను చెప్పిన విషయం నిరంజన్ కి కానీ, సమీర కి కానీ నచ్చలేదని యస్మణి కి తెలుసు. వాళ్ళకి నచ్చదని, వాళ్ళ రియాక్షన్ అలాగే ఉంటుందని యస్మణి ముందే ఊహించాడు. కానీ తనకు స్ట్రాంగ్ గా అనిపిస్తూవున్నది వాళ్ళకి చెప్పకుండా ఉండలేకపోయాడు. తను తనకి సన్నిహితం గా అనిపించే కొద్దిమందితో టెలీపతిక్ లింక్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. వాళ్ళల్లో నిరంజన్, ఇంకా సమీర కూడా వున్నారు. వాళ్ళు ఏదన్నాప్రమాదంలో పడబోతూవున్నా, లేదా వాళ్ళకి తనకీ ఏదన్నా కామన్ గా జరగబోతూ వున్నా తనకి తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా తనకి చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తూవుంది, తాము ముగ్గురూ ఏదో పారానార్మల్ పవర్ హోల్డ్ లోకి వెళ్లబోతూవున్నారని, కేవలం తాము మాత్రమే కాదు తమతో సన్నిహితంగా వుండేవాళ్ళు కూడా ఆ పారానార్మల్ పవర్ వల్ల ప్రభావితం కాబోతూ వున్నారని. దానిని సపోర్ట్ చేస్తూ ఏవో కలలు కూడా వస్తూవున్నాయి.
తనకి సైకాలజీ, సైకియాట్రీ మీద చాలా చిన్నతనం నుండీ ఆసక్తి వుంది. మానవ మనస్తత్వం గురించి తెలుసుకోవడానికి చాలా పుస్తకాలూ చదివేవాడు, పరిశోధనలు చేసేవాడు. అసలు హ్యూమన్ బీయింగ్స్ బ్లాక్ మ్యాజిక్, ఊడూ లాంటి వాటిమీద ఎందుకు ఆసక్తిచూపిస్తున్నారు అని తెలుసుకునే క్రమంలో వాటిగురించి కూడా పరిశోధన చేసాడు, వాటిని ప్రాక్టీస్ చేసే ఊళ్ళకి కూడావెళ్ళాడు. ఆ సమయం లో తనకి చాలా ఆశ్చర్యపరిచే విషయాలు కూడా తెలిసాయి.
ఆ విషయాలన్నీ నిజమవునో కాదో తెలుసుకోవడానికి తనూ వాటిల్లో కొంత సాధనచేశాడు. చాలా సార్లు తను వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వుండాల్సిందేమో అనికూడా అనుకుంటూవుంటాడు. ఆ సాధనవల్లే కాబోలు తనకి కొన్ని సమయాల్లో డిస్టర్బ్ చేసే అనుభవాలు ఎదురవుతూ వున్నాయి, ఇలా భవిష్యత్తుని తెలియపరిచే హంచెస్ కూడా కలుగుతూ వున్నాయి. వాటిని సపోర్ట్ చేస్తూ ఏవో కలలు కూడా వస్తాయి.
తనకి ఇటువంటి హంచ్, ఇంకా ఈ రకమైన కలలు ఇదే మొదటిసారి అయితే పట్టించుకోకుండా వూరుకునేవాడు. కానీ ఇంతకుముందు వచ్చిన హంచెస్, ఇంకా కలలు నిజమవుతూ వచ్చాయి. ఇప్పుడూ అలాగ అవుతుందేమోనని భయంగా వుంది. అందుకనే వాళ్ళు నమ్మరని తెలిసినా, నిరంజన్ ని , సమీర ని కొంచెం హెచ్చరికలో ఉంచడం మంచిదని వెళ్ళాడు.
తన ఫ్లైట్ రావడానికి ఇంకా అరగంట ఎంతో సమయం వుంది. ఈ సారి తన వూళ్ళో తన ఇంటికివెళ్ళాక, కొంతకాలం పాటు ఇంక ఎక్కడికీ వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలి. నిరంజన్, సమీర తనని కావాలని కాంటాక్ట్ చేసి అడక్కుండా ఇంక వాళ్లతో ఈ విషయం మాట్లాడకూడదు ధృడంగా అనుకున్నాడు యస్మణి.
అంతలో యస్మణి కి గుండెల్లో చాలా బరువుగా, భారంగా అనిపించింది. వళ్ళంతా చెమటలు పట్టేసాయి. ఊపిరి పీల్చుకోవడం కష్టం అయిపొయింది
'తనకి గుండెపోటు రాబోతూందా? తనకి గుండెకి సంభందించిన సమస్య ఏమీ లేదే?' ఆశ్చర్యంగానూ, భయంగానూ అనుకున్నాడు యస్మణి. అయినా ఈ అరవై ఐదు సంవత్సరాల వయసులో తనకి హార్ట్ అటాక్ రాకూడదని ఏమీ లేదు.
సడన్ గా ప్రాణభయం పట్టుకుంది యస్మణి కి. తను అరవై ఐదు సంవత్సరాలు జీవించేసాడు. తను బాధపడి, కంగారుపడేందుకు తనకి నా అనేవాళ్ళు కానీ, తన మీద ఆధార పడ్డవాళ్ళు కానీ ఎవరూ లేరు. అయినా చావంటే తనకి ఎందుకో భయంగానే వుంది. గొంతెత్తి గట్టిగా అరిచి తనని కాపాడమని చెప్పాలని వుంది. కానీ తన నోరు లేవడం లేదు. వున్నచోటునుండి ఇంచ్ కూడా కదలలేకపోతూఉన్నాడు. ఊపిరి తీసుకోవడం కూడా కష్టం అయిపోతూవుంది.
ఇంక తను చనిపోవడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చేసాడు యస్మణి. ఎంత వద్దనుకున్నా సృష్టిలో కేవలం మానవులకే కాదు, ఏ జీవికి తప్పని విషయం ఈ చావు. కానీ అంత తప్పనిసరి అయినా ఈ చావు ని నాచురల్ గా, ఒక తప్పనిసరి విషయంగా చూసేది కేవలం ఎదో కొద్దీ మహానుభావులు మాత్రమే. ఏదో ఇంకొద్దిమంది మాత్రం భరించలేని బాధలవల్ల, సూసైడ్ లకి ఒడికడతారు. ఇంకొంత మంది తమాషాకి, ఎలావుంటుందో చూద్దామన్న వెరైటీ ఎక్స్పీరియన్స్ కోసం చనిపోతారు. కానీ చాలామంది చావంటే వణికిపోతారు, ఆ మృత్యువు తమకి రాకూడదని కోరుకుంటారు. ఆ చాలామందిలో తానొకడు. ఇప్పుడు చచ్చిపోవడం తనకి ఇష్టంలేదు. కానీ అది తప్పేలా లేదు. అది తప్పదనీ తెలిసినా తన మనసు అది అంగీకరించడానికి సిద్ధంగా లేదు.
అంతలో ఎవరో తన చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. వాటిని నెమ్మదిగా నిమురుతూ అన్నారు. "భయపడకండి. మీకొచ్చింది హార్ట్ అటాక్ కాదు. మీరు చనిపోబోవడం లేదు."
ఆ టచ్ లో ఎదో మ్యాజిక్ వుంది. గుండెల్లో బరువు, నొప్పీ మాయమయ్యాయి. మళ్ళీ ఊపిరి తీసుకోగలుగుతూ వున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే తన ఎదుట ఒక యాభై సంవత్సరాలు అలా వున్న ఒక వ్యక్తి చిరునవ్వుతో వున్నాడు.
"థాంక్ యు వెరీ మచ్ ఫర్ సేవింగ్ మీ." దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ, ఆ వ్యక్తి మొహంలోకి చూస్తూ అన్నాడు యస్మణి. "ఆర్ యు ఏ డాక్టర్?"
"నో, ఐ యాం నాట్ ఏ డాక్టర్. అయినా ఇప్పుడు మీకు ఒక డాక్టర్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చింది హార్ట్ అటాక్ కాదు. అసలు ఇదెలాంటి శారీరక రుగ్మత కాదు." అదే చిరునవ్వు కంటిన్యూ చేస్తూ అన్నాడు ఆ వ్యక్తి. "నేను మీకేమీ చెయ్యనూ లేదు. మీ అంతటా మీరుగా, నా స్పర్శతో మామూలుగా అయ్యారు అంతే."
"మీరేమంటున్నారో నాకు బోధపడడం లేదు." ఆ వ్యక్తి చేతులలోనుండి తన చేతులు విడిపించుకుంటూ అన్నాడు యస్మణి. "మరి నేను ఎందుకు ఆలా ఫీల్ అయ్యాను? ఇంతకీ మీరెవరు?"
"చూసి చాలా కాలం అవడం వలన మీరు నన్ను మర్చిపోయినట్టుగా వున్నారు. మనిద్దరికీ పరిచయం ఉంది. అంతేకాకుండా మనిద్దరికీ ఒకరి అవసరం ఇంకొకరికి వుంది. ప్రస్తుతానికి మీరు నన్ను రాజు అని పిలవండి చాలు." ఆ వ్యక్తి అన్నాడు.
(ఇక్కడివరకూ నచ్చిందనే ఆశిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మరచిపోవద్దు.)