Yevaru..? - 12 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 12

Featured Books
Categories
Share

ఎవరు....? - 12

Part -12

సమయం : ఉదయం 10:20 గంటలు.
విజయవాడ కమీషనరేట్ కార్యాలయంలొ SIT తాత్కాలిక ఆఫీసు

గదిలో వాతావరణం అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది.

టేబుల్ మీద అరవింద్ ఫోన్లకు సంబంధించిన ఫైళ్లు, కాల్ రికార్డులు, టెలికాం నివేదికలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

ఆ గదిలొ సాగర్ వర్మ ఒక్కడె ఉన్నాడు. తను కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తూ సిగిరెట్ కాలుస్తున్నాడు.

అప్పుడే ఆ గది తలుపు తెరుచుకొని ఒకడు లోపలికి వచ్చాడు. అతని పేరు "వంశి". అతను ఒక ఎథికల్ హ్యాకర్.

నిన్నటి నుంచి అరవింద్ ప్రధాన మొబైల్‌ ఫోన్నూ పరిశీలిస్తున్న వ్యక్తి. 

వంశి లోపలికి వచ్చాడు.

హ్యాకర్ వంశి : గుడ్ మార్నింగ్ సార్...

అని చెప్పగానె సాగర్ తిరిగి చూశాడు.

సాగర్ వర్మ : గుడ్ మార్నింగ్ వంశి. చెప్పు ఎంత వరకు వచ్చింది..?

వంశి తన లాప్ టాప్ ను టేబుల్ మీద పెట్టాడు.

హ్యాకర్ వంశి : అరవింద్ ప్రధాన మొబైల్ ఫోన్ చెక్ చేయడం పూర్తయ్యింది సార్.

అదె సమయంలొ గదిలోకి ఎస్.ఐ. సుందర్ మరియు ఎస్.ఐ జాన్ బాబు లోపలికి వచ్చారు. వంశి అరవింద్ మొబైల్ ఫోన్ గురించి చెప్తుండడం చూసి వీళ్ళద్దరు కూడా వినడం మొదలుపెట్టారు.

సాగర్ వర్మ : ఏం తెలిసింది?

వంశి స్క్రీన్‌పై కొన్ని లాగ్స్ చూపించాడు.

హ్యాకర్ వంశి : ఫోన్‌లో అనాధరైజడ్ యాక్సిస్ ట్రేసెస్ (unauthorized access traces) ఉన్నాయి సార్

సాగర్ వర్మ : అంటే..? 

హ్యాకర్ వంశి : ఈ మొబైల్ ఫోన్ పై బయట నుంచి యాక్సిస్ జరిగినట్టు చాలా ఎక్కువ చూపిస్తుంది సార్ 

ఎస్.ఐ సుందర్ : అంటె మొబైల్ హ్యాక్ అయ్యిందా..?

హ్యాకర్ వంశి : క్లుప్తంగా చెప్పాలంటె అంతె సార్.

గదిలో మౌనం.

హ్యాకర్ వంశి : కాని...

అతను కొద్దిసేపు ఆగాడు.

హ్యాకర్ వంశి : ఎవరు చేశారో గుర్తించడానికి సరిపడా డేటా లేదు సార్

హ్యాకర్ వంశి : చాలా లాగ్స్ డిలీట్ చేయబడ్డాయి. హ్యాకర్ తనని ఎవరు కనిపెట్టకూడదని ఉద్దేషంతొ. తన ట్రాక్స్ ని ఇంచు మించు మొత్తం తుడిచి పెట్టేశాడు.

సాగర్ వర్మ : మరి ఆ రెండొ ఫోన్ యొక్క కాల్ డైవర్షన్ (Call diversion) సంగతి ?

వంశి తల ఊపాడు.

హ్యాకర్ వంశి : అది నా పరిధి కాదు సార్.
టెలికామ్ రికార్డ్స్ (Telecom records) ద్వారా మాత్రమే ట్రేస్ చేయగలం.

సాగర్ నెమ్మదిగా తల ఊపాడు.

హ్యాకర్ వంశి : టెలికాం డేటా అనాలిసిస్ సమయంలో నా టెక్నికల్ సహాయం అవసరమైతే చెప్పండి సార్.

సాగర్ వర్మ : థాంక్యు వంశి. నీ అవసరం ఉంటె మళ్ళి కచ్చితంగా పిలుస్తాను...

హ్యకర్ వంశి : సరె సార్. ఇంక నేను బయలుదేరుతాను..

అని చెప్పి వంశి బయటకు వెళ్లిపోయాడు.

గదిలో మళ్లీ నిశ్శబ్దం. కొద్దిసేపటి తరువాత

సాగర్ వర్మ :  ఇప్పుడు మన ముందు ఉన్నవి 3 ప్రశ్నలు
1) అరవింద్ రెండొ మొబైల్ నుంచి కాల్ డైవర్ట్ అయ్యిందా...?
2) కాల్ డైవర్ట్ అయితె. అది ఏ నంబర్ కి డైవర్ట్ అయ్యింది..?
3) ఆ డైవర్ట్ అయిన నంబర్ తాలుకు వ్యక్తి ఎవరు..?

ఎస్.ఐ సుందర్ : ఇవి తెలియాలంటె మనం టెలికాం సర్వైలన్స్ వింగ్ (Telecom surveillance wing) వాళ్ళ సహాయం కావాలి సార్.

ఎస్. ఐ జాన్ బాబు : సార్ టెలికాం సర్వైలన్స్ వింగ్ (Telecom surveillance wing) లొ మనకి తెలిసిన టెలికాం అనాలిస్ట్ ఆఫీసర్ (Telecom analyst officer) ఒకరు ఉన్నారు.

సాగర్ వర్మ : ఎవరు అతను...?

ఎస్.ఐ జాన్ బాబు. : అతని పేరు "శ్రీనివాస్" సార్. ఇంతకు ముందు జరిగిన సైబర్ ఫ్రాడ్ (cyber fraud), ఇంటర్సెప్షన్ ఆడిట్ (interception audit), రూటింగ్ అనాలసిస్ (routing analysis) కేసులన్నీ చూశాడు సార్.

సాగర్ వర్మ : అయితె వెంటనె, ఇప్పుడె అతనికి ఫోన్ కలిపండి.

ఎస్.ఐ జాన్ బాబు : ఒక్క నిమిషం సార్....

జాన్ బాబు తన మొబైల్ ఫోన్ తిసి శ్రీనివాస్ కి కాల్ చేశాడు. కాసేపటికి కాల్ కలిసింది.

శ్రీనివాస్ : హెలో.. ఎవరు..? 

ఎస్.ఐ జాన్ బాబు : హలో శ్రీనీవాస్... నేను జాన్ బాబుని.

శ్రీనివాస్ : హే జాన్ ఏంటి చాలా కాలం తరువాత కాల్ చేశావు?. ఎలా ఉన్నావు? అయిన ఈ నంబర్ ఎవరిది.?

ఎస్.ఐ జాన్ బాబు : నేను బానె ఉన్నా. ఇది నా కొత్త నంబర్ లె. పాత నంబర్ మా ఆవిడకి ఇచ్చా. తను వాడుతుంది. ఇంతకి నువ్వు ఎలా ఉన్నావు.?

శ్రీనివాస్ : నేను బాగున్నా...

ఎస్.ఐ జాన్ బాబు : నీతొ ఓ ముఖ్యమైన పనిపడింది. 

శ్రీనివాస్ : చెప్పు. ఎంటది..?

ఎస్.ఐ జాన్ బాబు : నీకు పాత విజయవాడ నగర పోలీస్ కమీషనర్ సాగర్ వర్మ గారు తెలుసు కదా.?

శ్రీనివాస్ : తెలుసు. ఇప్పుడు ఆయన రాజమండ్రి నగర కమీషనర్ కదా..

ఎస్.ఐ జాన్ బాబు : నిజమె కాని దేవేంద్ర రెడ్డి గారి మర్డర్ కేసుని విచారించడానికి ఆయన్నీ మళ్ళి విజయవాడకి డిప్యుటేషన్ మీద పిలిపించారు...

శ్రీనివాస్ : అవును అది కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు..?

ఎస్.ఐ జాన్ బాబు : ఆ కేసు విషయంపైనె నీకు కాల్ చేసింది. ఇప్పుడు ఆయన నా ప్రక్కనె ఉన్నారు. ఉండూ ఆయనకి ఫోన్ ఇస్తున్నా. ఆయనె నీతొ మాట్లాడుతారు...

శ్రీనివాస్ : సరె ఇవ్వు.

సాగర్ వర్మ : హెలొ శ్రీనివాస్ గారు. నమస్తె.

శ్రీనివాస్ : సార్. నమస్తె.. చెప్పండి.

సాగర్ వర్మ : ఒక నంబర్ కి రావల్సిన కాల్ డైవర్ట్ అయ్యిందని నా అనుమానం. మీకు ఆ నంబర్ వివరాలు మరియు తేది, సమయం అన్నీ ఇస్తా. కనుక్కోని చెప్పండి.

శ్రీనివాస్ : అయ్యొ. తప్పకుండా చూస్తాను సార్. ఆ వివరాలన్నీ నా వాట్సేప్ కి పంపించండి నేను ఇప్పుడె చెక్ చేయడం మొదలు పెడతా. ఈలోపు మీరు టెలికాం సర్వైలన్స్ వింగ్ (Telecom surveillance wing)కి ఒక ఫార్మల్ డ్రాఫ్ట్ తయ్యారు చేసి. వ్రాతాపూర్వకంగా రిక్వేష్ట్ చేస్తూ ఫాక్స్ లొ పంపండి చాలు. మిగిలింది అంతా నేను చూసుకుంటా.

సాగర్ వర్మ : అలాగె మీరు చెప్పినట్టె పంపిస్తా..

కాసేపటికి

ఎస్.ఐ సుందర్ : సార్ టెలికాం అనాలసిస్ రిక్వేష్ట్ డ్రాఫ్ట్ (telecom analysis request draft) సిద్ధంగా ఉంది

సాగర్ వర్మ : గుడ్ SIT అథరైజేషన్ రిఫరెన్స్ జత చేయండి. ప్రియారిటి ప్రాసాసింగ్. ఈరోజే రిపోర్ట్ కావాలి. అని చెప్పండి

ఎస్.ఐ సుందర్ : అలాగె సార్. 

సాగర్ వర్మ : జాన్ గారు మీరు అరవింద్ రెండొ నంబర్ మరియు మిగిలిన వివరాలన్నీ శ్రీనివాస్ కి వాట్సాప్ లొ వెంటనె పంపించండి.

ఎస్.ఐ జాన్ బాబు : ఆలాగె సార్.

అని చెప్పి వెంటనే అరవింద్ రెండో మొబైల్ నంబర్, అనుమానాస్పద కాల్స్ జరిగిన తేదీలు, సమయాలు మరియు ఇతర వివరాలన్నీ శ్రీనివాస్‌కు వాట్సాప్ ద్వారా పంపించాడు.

గదిలో మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. సాగర్ వర్మ టేబుల్ మీద ఉన్న ఫైళ్లను తిరగేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు.

సమయం : మధ్యాహ్నం 1:55 గంటలు
టెలికాం సర్వైలన్స్ వింగ్

అక్కడ శ్రీనివాస్ తన కంప్యూటర్ ముందు కూర్చొని వరుసగా డేటాబేస్‌లు తెరుస్తున్నాడు.

"రూటింగ్ లాగ్స్ (Routing Logs)"

"కాల్ ఫార్వార్డింగ్ రికార్డ్స్ (Call Forwarding Records)"

"సబ్స్రైబర్ ఇంఫర్మేషన్ (Subscriber Information)"

"సర్వీస్ మాడిఫికేషన్ హిస్టరీ (Service Modification History)"

ఒక్కో స్క్రీన్ మారుతోంది.

కొద్దిసేపటి తరువాత అతని చూపు ఒక ఎంట్రీ దగ్గర ఆగిపోయింది.

అతను మరోసారి తిరిగి చెక్ చేశాడు.

మూడోసారి కూడా చూసుకున్నాడు.

తర్వాత వెంటనే ఫోన్ తీసుకున్నాడు.

విజయవాడ కమీషనరేట్ - SIT కార్యాలయం

జాన్ బాబు ఫోన్ మోగింది.

స్క్రీన్ మీద శ్రీనివాస్ పేరు కనిపించగానె జాన్ బాబు వెంటనే లిఫ్ట్ చేశాడు.

ఎస్.ఐ జాన్ బాబు : చెప్పు శ్రీనివాస్..

శ్రీనివాస్ : జాన్... మీరు అందరూ ఆఫీసులోనే ఉన్నారా?

ఎస్.ఐ జాన్ బాబు : అవును.

శ్రీనివాస్ : అయితే ఫోన్ స్పీకర్లొ పెట్టు.

జాన్ బాబు తన ఫోన్ ని స్పీకర్లొ పెట్టాడు

సాగర్ వర్మ : చెప్పు శ్రీనివాస్.

శ్రీనివాస్ : సార్...కాల్ డైవెర్షన్ కన్ఫార్మడ్ (Call diversion confirmed) 

గదిలో ఉన్న ముగ్గురు ఒకేసారి తలెత్తి చూశారు.

సాగర్ వర్మ : ఖచ్చితంగా చెప్తున్నావా..?

శ్రీనివాస్ : వంద శాతం సార్. రూటింగ్ లాగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

సాగర్ వర్మ : ఏ నంబర్‌కి divert అయ్యింది?

కొద్దిసేపు నిశ్శబ్దం.

శ్రీనివాస్ : 9494551225 నంబర్ కి సార్

సాగర్ వర్మ : అది ఎవరి పేరు మీద ఉంది.

శ్రీనివాస్ : సబ్స్క్రైబర్ రికార్డ్స్ (Subscriber records) ప్రకారం.ఆ నంబర్ "సంజీవిని రూరల్ హెల్త్ ఫౌండేషన్"  పేరుమీద ఉంది సార్.

ఎస్.ఐ సుందర్ :ఫౌండేషన్ నంబరా..?

శ్రీనివాస్ : అవును సార్. ఇది ఆ సంస్థ యొక్క అధికారిక కనెక్షన్ (Official institutional connection). ఆ సంస్థ చైర్మేన్ "డా. రాఘవ రావు" పేరు క్రింద రిజిస్టర్ అయ్యింది.

ఈసారి గదిలో చిన్న నిశ్శబ్దం నెలకొంది.

ఎస్.ఐ జాన్ బాబు : "డాక్టర్ రాఘవ రావా..." ?

ఎస్.ఐ సుందర్ : సంజీవీని ఫౌండేషన్ వ్యస్తాపకుడా...?

శ్రీనివాస్ : అవుననుకుంటా. సబ్స్క్రైబర్ రికార్డ్స్ లో అదే ఉంది.

ఎస్.ఐ సుందర్ : కాని ఆయన చనిపోపయి దాదాపు 1 సంవత్సరం ఎనిమిది నెలలు కావుస్తుంది.

సాగర్ వర్మ కుర్చీలో వెనక్కి వాలి

సాగర్ వర్మ : ప్రస్తుతం ఇంకా సిమ్ యాక్టీవ్ లో ఉందా?

శ్రీనివాస్ : అవును సార్. నంబర్ ఇప్పటికీ యాక్టీవ్ గా ఉంది. ఆ నంబర్ రిచార్జ్ కూడా జరుగుతోంది. వాడకం (Usage) కూడా కనిపిస్తోంది.

సాగర్ వర్మ కనుబొమ్మలు ముడుచుకున్నాయి.

సాగర్ వర్మ : శ్రీనివాస్ నువ్వు ఆ నంబర్ తాలుకు గత ఆరు నెలల కాల్ డేటా రికార్డ్ ఎనాలసిస్ మొదలు పెట్టు. దాంతొ పాటు నాకు లోకేషన్ ప్యాటర్న్ (Location pattern) కూడా కావాలి.

శ్రీనివాస్ : అలాగే సార్.

కాల్ ముగిసింది. గదిలో కొద్దిసేపు మౌనం.

ఎస్.ఐ సుందర్ : సార్...ఫౌండేషన్ అధికారిక నంబర్ కాబట్టి. డా. రాఘవ రావు చనిపోయిన కూడా ప్రస్తుతం ఆ ఫౌండేషన్ వాళ్లే వాడుతూ ఉండొచ్చు కదా.

సాగర్ వర్మ తల ఊపాడు.

సాగర్ వర్మ : ఏమొ చెప్పలేం. అలా కూడా అవ్వచ్చు. కాని అది కేవలం మన అనుమానం మాత్రమే. నిజం తెలుసుకోవాలి.
ఆ... జాన్ గారు...మీరూ, సుందర్ గారు కలిసి వెంటనే ఆ సంజీవిని హెల్త ఫౌండేషన్ కి వెళ్లండి. ఆ నంబర్ ప్రస్తుతం ఎవరి వద్ద ఉందో కనుక్కోండి.

ఎస్.ఐ జాన్ బాబు : అలాగే సార్

సాగర్ వర్మ : అంతె కాదు డాక్టర్ రాఘవ రావు మరణించిన తర్వాత ఆయన వ్యక్తిగత వస్తువులు (personal belongings) ఏమయ్యాయొ కూడా తెలుసుకోండి.

ఎస్.ఐ సుందర్ & ఎస్.ఐ జాన్ బాబు : (ఇద్దరు ముక్త కంఠంతొ) అలాగె సార్.

ఇద్దరూ వెంటనే బయలుదేరారు.

సమయం : సాయంత్రం 4:35 గంటలు
సంజీవిని రూరల్ హెల్త్ ఫౌండేషన్ 

వీళ్ళద్దరు అక్కడికి చేరుకొని అక్కడున్న ఎడ్మినిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్ళి. వాళ్ళ ఐ.డి. కార్డులను చూపించి. అక్కడికి తాము వచ్చిన పని ఏంటొ చెప్పారు.  

తరువాత ఆ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేటర్ "ఈశ్వర్" వారిని లోపలికి తీసుకెళ్లాడు.

ఎస్.ఐ జాన్ బాబు : డాక్టర్ రాఘవరావు గారి ఫౌండేషన్ నంబర్ గురించి కొన్ని వివరాలు కావాలి.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : ఏ నంబర్ సార్..?

జాన్ బాబు ఒక ప్రింటౌట్ చూపించాడు. అది చూసి ఈశ్వర్ తల ఊపాడు.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : అవును. ఇది రాఘవరావు గారు వాడిన ఫౌండేషన్ అధికారిక నంబర్

ఎస్.ఐ సుందర్ : ప్రస్తుతం ఎవరు వాడుతున్నారు?

ఈశ్వర్ ఆశ్చర్యంగా చూశాడు.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : మాకు తెలియదు సార్. రాఘవరావు గారు చనిపోయిన తర్వాత ఆ SIM డీయాక్టివేట్ అయిపోయిందని అనుకున్నాం.

జాన్ బాబు మరియు సుందర్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

ఎస్.ఐ జాన్ బాబు : లేదు. అది ఆయన వ్యక్తిగత నంబర్ అయితె. మీరన్నట్టు SIM డీయాక్టివేట్ అయ్యేది. కాని ఇది ఫౌండేషన్ పేరు మీద తీసుకోబడిన అధికారిక నంబర్. అంత త్వరగా డీయాక్టివేట్ అవ్వదు. ఇప్పటికీ ఇది యాక్టీవ్ గా ఉన్నట్టు చూపిస్తోంది.

ఈశ్వర్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : ఏమంటున్నారు సార్...?  అది అసంభవం. నెలల తరబడి వాడక పోతె అధికారిక నంబరైన డీయాక్టీవేట్ అవ్వాల్సిందెగా..? నాకు తెలుసు ఫౌండేషన్ లొ ఎవ్వరు ఆ నంబర్ ని వాడటం లేదు.

ఈలోపు ఎస్.ఐ సుందర్ కి సాగర్ వర్మ చెప్పిన మరో విషయం గుర్తొచ్చింది.

ఎస్.ఐ సుందర్ : అన్నట్టు రాఘవరావు గారి వ్యక్తిగత వస్తువులు ఎక్కడ ఉన్నాయి?

ఈశ్వర్ కొద్దిసేపు ఆలోచించాడు.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : రికార్డ్స్ లాకర్లో ఉండాలి.

అందరూ రికార్డ్స్ లాకర్ గది వైపు నడిచారు...

ఆ గది చివర ఉన్న పెద్ద ఇనుప అల్మారా ముందు ఈశ్వర్ ఆగాడు. 

తన జేబులోంచి తాళం చెవి గుత్తొకటి తీసి. అందులో ఉన్న ఒక తాళం చెవితో ఆ లాకర్ తెరిచాడు.

లోపల వరుసగా పాత ఫైళ్ళు, సిజ్ చేసిన వస్తువులు, రికార్డ్స్ బాక్సులు ఉన్నాయి.

ఈశ్వర్ వాటిలోని ఒక ప్లాస్టిక్ బాక్స్ ఒకటి బయటు తీశాడు. దాని మీద "రాఘవ రావు - పర్సనల్ ఎఫెక్ట్స్" అని దాని మీద అంటిచిన తెల్లటి స్టిక్కర్ పై వ్రాసుంది.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : ఇదే సార్...

బాక్స్ తెరిచారు. లోపల రాఘవ రావుకి సంబంధించిన 
• ఒక పర్స్
• కళ్ళద్దాలు
• పాత డైరీ.
• కొన్నీ మెడికల్ నోట్సు
• ఒక మొబైల్ ఫోన్
ఉన్నాయి.

ఎస్. ఐ జాన్ బాబు అందులోంచి ఆ మొబైల్ ఫోన్ ని చేతిలోకి తీసుకున్నాడు.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : రాఘవ రావు సార్ చనిపోయిన తరువాత పోలీసులు వీటన్నీటిని ఇన్వెంటరి చేసి తిరిగి మాకు అప్పగించారు. అప్పటి నుండి ఇవన్నీ మా దగ్గరె ఉన్నాయి.

ఎస్.ఐ సుందర్ ఆ మొబైల్ ఫోన్ ని జాన్ బాబు చేతిలోంచి తీసుకొని. ఆ ఫోన్ వెనుక భాగాన్నీ పరిశీలించాడు. తర్వాత సిమ్ ట్రే ను బయటకు తీశాడు. 

ఒక్కసారిగా అతని ముఖంలొ మార్పు వచ్చింది.

ఎస్.ఐ జాన్ బాబు : ఏమైంది..?

ఎస్.ఐ సుందర్ సిమ్ ట్రే చూపిస్తూ...

ఎస్.ఐ సుందర్ : దీంట్లొ సిమ్ లేదు.

కొన్ని క్షణాలు గదిలొ ఎవరూ మాట్లాడలేదు.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : అది ఎలా సాద్యం..? బాక్స్ అప్పటినుంచి ఇక్కడె ఉంది. దాన్నీ ఎవరు తాకలేదు.

ఎస్.ఐ జాన్ బాబు : ఈ బాక్స్ చివరిసారి ఎవరు తెరిచారు.

ఎడ్మినిస్ట్రేటర్ ఈశ్వర్ : నాకు గుర్తున్నంతవరకు. రాఘవ సార్ చనిపోయాక ఒక్కసారి కూడా దీన్నీ ఎవరూ తెరవలేదు.

ఎస్.ఐ సుందర్ : ఫోన్ ఇక్కడె ఉంది. కాని సిమ్ మాత్రం లేదు.

జాన్ బాబు కాల్ చేసి సాగర్ వర్మ కి జరిగింది మొత్తం చెప్పాడు. 

తరువాత తను ఫోన్ సిమ్ ట్రే వైపు చూస్తూ..

ఎస్.ఐ జాన్ బాబు. : 
ఫోన్ ఇక్కడె ఉంది....
సిమ్ బయట ఉంది...
అంతె కాకుండా ఆ సిమ్ ఇప్పటికీ యాక్టీవ్ గా ఉంది సార్

ఫోన్ అవతల కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

సాగర్ వర్మ నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచి కిటికీ వైపు నడిచాడు.

సాగర్ వర్మ : అంటే...
డా. రాఘవరావు గారి మరణం తర్వాత కూడా. ఎవరో ఇంకా ఆ నంబర్‌ను వాడుతున్నారు.

అతను క్షణం ఆగాడు.

సాగర్ వర్మ : అరవింద్ కాల్స్‌ని డైవర్ట్ చేసింది కూడా అదే నంబర్‌కి అయితే....
ఇంతకీ అతను "ఎవరు...?"