Yevaru..? - 19 in Telugu Crime Stories by Suresh Josyabhatla books and stories PDF | ఎవరు....? - 19

Featured Books
Categories
Share

ఎవరు....? - 19

Part - 19 

సమయం : ఉదయం 10:15 గంటలు
విజయవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం

సిట్ కార్యాలయంలో ఏ.సి.పి అజయ్ తన కేబిన్‌లో ఒంటరిగా కూర్చున్నాడు. టేబుల్‌పై ఫైళ్లు తెరిచి ఉన్నా... అతని చూపు మాత్రం వాటిపై లేదు.

నిన్న తెనాలిలో డాక్టర్ మాధవ్‌తో జరిగిన సంభాషణే మళ్లీ మళ్లీ అతని మనసులో తిరుగుతోంది.

నెమ్మదిగా కుర్చీలో వెనక్కి వాలి కళ్లుమూశాడు. డా.మాధవ్ చెప్పినవి మళ్ళి గుర్తుచేసుంటున్నాడు.

ఫ్లాష్ బ్యాక్

"తెనాలి...
ధన్వంతరి ఆయుర్వేద్ క్లీనిక్...

డా. మాధవ్ కూర్చున్న చోట వున గోడపై వేలాడుతున్న పాత ఫోటోను చూస్తూ అజయ్ అడిగాడు.

ఏ.సి.పి అజయ్ : డాక్టర్ గారు... ఈ ఫోటోలో ఉన్నది ఎవరు....?

డాక్టర్ మాధవ్ తిరిగి ఆ ఫోటో వైపు చూశాడు

డా. మాధవ్ : ఓ అదా..? ఆ ఫోటోలో ఉన్నది నేను నా ప్రక్కన నా స్నేహితుడు డా. రాఘవరావు. 

ఏ.సీ.పి అజయ్ : మరి ఆ మద్యనున్న పిల్లాడు..?

డా. మాధవ్ : ఆ కుర్రాడు సాంబయ్య అని వియవాడకి 40-50 కి.మీ దురంలొ కొండపల్లి కొండల వెనక ఉన్న పోనికెగూడెం అనె గిరిజన గ్రామానికి చెందిన 14 ఏళ్ళ కుర్రవాడు. ఇప్పుడా కుర్రాడికి ఓ 30 ఏళ్ళు ఉంటుంది.

ఏ.సి.పి అజయ్ : ఓహొ ఈ ఫోటొ అక్కడ తీసిందా... ఎప్పుడిది అండి...?

డా. మాధవ్ : దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది 2010 అనుకుంటా అప్పుడు తీయించుకున్న ఫోటొ. నా స్నేహితుడు డా. రాఘవరావు సంజీవిని రూరల్ హెల్త్ ఫౌండేషన్ నడుపుతున్నాడు. ఆ ఫౌండేషన్ తరుపున మారుమూల గ్రామాల్లొ, గిరిజన కోనల్లొ వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుంటాడు. అలా వాడితొ పాటు నేను కూడా వెళ్ళాను చాలాసార్లు. అలాగె పొనికెగూడానికి కూడా..

ఏ.సి.పి అజయ్ : డాక్టర్ రాఘవరావు గారితో మీ పరిచయం ఎప్పటి నుంచి...?

మాధవ్ కాఫీ కప్పును టేబుల్‌పై పెట్టాడు.
కొన్ని క్షణాలు మౌనంగా ఉండి...

డా. మాధవ్ : రాఘవ. నా ప్రాణ స్నేహితుడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసె పెరిగాం ఇంటర్ వరకు కలిసె చదువుకున్నాం. తరువాత వాడు MBBS,  MD physician and Surgeon చేయడానకి నేను BAMS, 3 MD's చేయడానికి ఇద్దరం వేరె చోట్లకి వెళ్ళిపోయాం. విద్య వేరైన మా ఇద్దరి లక్ష్యం ఒకటె పేదలకు ఉచిత వైద్యం అందించడం. మా చదువు పూర్తయిన తర్వాత మేమిద్దరం కలిసి ఎన్నో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో.

అజయ్ నిశ్శబ్దంగా విన్నాడు.

డా. మాధవ్ : కోట్ల ఆస్తికి వాడొక్కడె వారసుడు ఆ ఆస్తితోనె ఆ సంజీవిని ఫౌండేషన్ కట్టి పేదలుకు ఉచిత వైద్యం అందిస్తున్నాడు. పెళ్ళి కూడా చేసుకోలేదు.

ఏ.సీ.పి అజయ్ : అంటె రాఘవ రావు గారికి మీరతప్ప ఆయనకి ఎవరు లేరా అండి.

డా. మాధవ్ : లేకేం ఒక కూతురు ఉంది పేరు శ్వేత. 26 ఏళ్ళ క్రితం ఒక అనాధ పిల్లను దత్తత తీసుకొని పెంచి డాక్టర్ ని చేశాడు. కాని...

ఏ.సీ.పి అజయ్ : ఆ కాని...?

ఒక్కసారిగా డా. మాధవ్ కళ్ళల్లొ నీళ్ళు కారుతున్నాయి.

డా. మాధవ్ : కాని నా స్నేహితుడు రాఘవ 3 ఏళ్ళ గుండెపోటుతొ చనిపోయాడు. వాడు పోయిన 8 నెలలకె ఆ అమ్మాయి శ్వేత కూడా యాక్సిడెంట్లొ చనిపోయింది.

అని చెప్పి ఏడుస్తాడు....

ఏ.సీ.పి అజయ్ : క్షమించాలి మీ స్నేహితుడిని ఆయన కూతురిని గుర్తుచేసి మిమ్మల్ని బాధపెట్టాను.

డా. మాధవ్ : మరేం పరవాలేదు.. నా కొడుకు అయితె ఇంతకన్నా ఎక్కువె బాధపడతాడు. వాడికి ఆ పిల్ల శ్వేత అంటె చాలా ఇష్టం సొంత చెల్లల్లా చూసునేవాడు.  అలాంటిది తాను నా స్నేహితుడు ఇద్దరు ఒకరి తరువాత ఒకరు చనిపోయెసరికి తీసుకోలేకపోయాడు. అందుకె అమెరికా వెళ్ళిపోయాడు. ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు. పైగా నన్నె అక్కడికి వచ్చేయమని రోజు అడుగుతున్నాడు. మీకు ఇందాకె చెప్పాను కదా నాకు ఈ నేల వదిలి వెళ్ళడం ఇష్టం లేదని.

ఏ.సి.పి అజయ్ : అంటే.. శ్వేతను చిన్నప్పటి నుంచే మీకు తెలుసన్నమాట.

మాధవ్ ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపించింది.

డా. మాధవ్ : చిన్నప్పటి నుంచే కాదు...ఆమె మా కళ్ల ముందే పెరిగింది. రాఘవ ఆ పాపను ఇంటికి తీసుకొచ్చిన రోజు ఇప్పటికీ గుర్తుంది. అనాధాశ్రమంలో పెరిగిన ఆ చిన్నారి...మొదట్లో చాలా భయపడేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. కానీ రాఘవ ఆమెకు తండ్రిలా కాక అమ్మలా కూడా మారిపోయాడు.

అజయ్ శ్రద్ధగా వింటున్నాడు.

డా. మాధవ్ : శ్వేత చదువంతా హాస్టల్‌లో జరిగింది. కానీ ప్రతి సెలవుకూ మా ఇంటికి కూడా వచ్చేది. మా ఇంట్లో తిరిగేది. మా అందరితో కలిసిపోయేది.

ఏ.సి.పి అజయ్ : మీ అబ్బాయి అర్జున్‌తో శ్వేత ఎలా ఉండేది..?

మాధవ్ నవ్వాడు.

డా. మాధవ్ : అర్జున్‌కు శ్వేతను సొంత చెల్లెల్లా చూసుకునెవాడు అని చెప్పానుగా. అలాగె శ్వేత కూడ అర్జున్ ని సొంత అన్నలా చూసుకునేది. వాళ్లిద్దరి మధ్య రక్త సంబంధం లేకపోయిన అంతకంటె ఎక్కువె ఉంది.
అర్జున్ ఏ మాట చెప్పినా శ్వేత వినేది. తాను ఏడిస్తే అర్జున్ తట్టుకోలేడు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరి పుట్టినరోజు మరొకరు లేకుండా జరగదు. రాఖిపండగ వస్తె ఇంక అంతె వాళ్ళిద్ధరి గోల మామూలుగా ఉండదు. 

కొన్ని క్షణాలు...
మాధవ్ మౌనంగా ఉన్నాడు.

డా. మాధవ్ : రాఘవకు కూడా అర్జున్ అంటె చాలా ఇష్టం. కొడుకులా తన వారసుడిలా చూసుకునేవాడు. అలాంటి వాళ్ళిద్దరు మరిణించెసరికి వాడు తట్టుకోలకపాయాడు.

ఏ.సీ.పి అజయ్ : మరి ఆ సంజీవిని ఫౌండేషన్నీ ఎవరు చూస్తున్నారు...?

డా. మాధవ్ : నేనె అప్పడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటా. నేను కూడా ఫౌండేషన్ లొ భాగస్వామినె కదా. ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి దాని బాద్యతలు ఆ ట్రస్టుకి ఇద్దామని చూస్తున్నా.."

ఫ్లాష్ బ్యాక్ Ends

అజయ్ నెమ్మదిగా కళ్లుతెరిచాడు. అతని ముఖం గంభీరంగా మారింది. టేబుల్‌పై ఉన్న పెన్నును చేతిలో తిప్పుతూ...నెమ్మదిగా తనలోతానే మాట్లాడుకున్నాడు.

ఏ.సి.పి అజయ్ (మనసులో) : రాఘవరావు...శ్వేత... ఈ ఇద్దరూ డాక్టర్ మాధవ్ కుటుంబానికి రక్త సంబంధం లేకపోయినా ప్రాణాల్లాంటి వాళ్లు వాళ్లను దారుణంగా చంపారు అలాంటి పరిస్థితిలో పగ తీర్చుకోవాలని అర్జున్ అనుకోవడం అసాధారణం కాదు.
అదే జరిగి ఉంటే...దేవేంద్ర రెడ్డి..సూర్యనారాయణ...
ఈ ఇద్దరి హత్యలకు మొటీవ్ స్పష్టంగా కనిపిస్తోంది.

అజయ్ ఇంకా ఆలోచిస్తుండగానే...

"టక్... టక్..."
అని తలుపు తట్టిన శబ్దం వినిపించింది.

ఆ తలుపు తట్టిన శబ్దానికి అజయ్ ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు.

ఏ.సి.పి అజయ్ : కామిన్.....

తలుపు తెరిచి సి.ఐ. ప్రవీణ్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. అజయ్ ముఖం చూసిన వెంటనే...

సీ.ఐ. ప్రవీణ్ : ఏమైంది...? ఇంకా నిన్నటి ఆలోచనలలోనే ఉన్నట్టున్నావు.

అజయ్ స్వల్పంగా నవ్వాడు.

ఏ.సి.పి అజయ్ : అవును ప్రవీణ్..నిన్న డాక్టర్ మాధవ్‌తో మాట్లాడిన తర్వాత మన కేసులో కొన్ని విషయాలు కొంచెం క్లియర్ అయ్యాయి.

ప్రవీణ్ ఎదురుగా కూర్చున్నాడు.

సీ.ఐ. ప్రవీణ్ : ఏంటది అర్జునె ఆ హంతకుడనా ? 

ఏ.సీ.పి అజయ్ : అది మాత్రమె కాదు. డా. మాధవ్ హస్తం కూడా అందులొ ఉందని. డా. రాఘవరావుని ఆయన కూతురు శ్వేతని చంపడం వల్ల వాళ్ళు పగ తీర్చుకున్నారు అని నా అనుమానం.

ఈలోపు ప్రవీణ్ కి ఒక కాల్ వస్తుంది. ప్రవీణ్ ఆ కాల్ మాట్లాడి వెంటనె పెట్టేస్తాడు.

ఏ.సీ.పి అజయ్ : ఏమైంది ప్రవీణ్ ఎవరిది ఆ కాల్..?

సీ.ఐ ప్రవీణ్ : ఇండియన్ ఇమిగ్రేషన్ ఆఫిస్ నుంచి ఫోన్. అర్జున్ కి సంబంధించిన వివరాలు అడిగాం కదా. వాళ్ళు ఆ రిపోర్ట్స్ మనకి మైయిల్ లొ పంపించారు.

అని చెప్తూ అజయ్ ముందున్న కంప్యూటర్ ని తన వైపుకు తిప్పుకొని అందులొ ఈ-మేయిల్ తెరిచాడు.

ప్రవీణ్ కంప్యూటర్ స్క్రీన్ వైపు కొన్ని క్షణాలు చూస్తూనే ఉన్నాడు. అజయ్ అతని ముఖంలోని మార్పును గమనించాడు.

ఏ.సి.పి అజయ్ : ఏమైంది ప్రవీణ్...?

ప్రవీణ్ నెమ్మదిగా కంప్యూటర్ మోనిటర్ ని అజయ్ వైపు తిప్పాడు.

సీ.ఐ. ప్రవీణ్ : నువ్వే చూడు...

అజయ్ కంప్యూటర్ లొ ఉన్న మైయిల్ చదవడం ప్రారంభించాడు.
అందులో...
Immigration Records (ఇమిగ్రేషన్ రికార్డ్స్)
Passport Database (పాస్పొర్ట్ డేటాబేస్)
Overseas Citizen Verification (ఓవర్సీస్ సిటిజన్ వెరిఫికేషన్)
Indian Emigration Records (ఇండియన్ ఇమిగ్రేషన్ రికార్డ్స్)
అన్నీ చెక్ చేసినట్లు ఉంది.
చివరలో...
"అర్జున్ S/o డా. మాధవ్ అనే పేరుతో ఎటువంటి వ్యక్తి రికార్డుల్లో లేడు." అని వ్రాసి ఉంది

అజయ్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి.
మళ్లీ ఒక్కసారి మొత్తం రిపోర్ట్ చదివాడు.

ఏ.సి.పి అజయ్ : ఇది ఎలా సాధ్యం...?

సీ.ఐ. ప్రవీణ్ : నాకూ అదే అర్థం కావడం లేదు.
అమెరికాలో ఉంటాడని డాక్టర్ మాధవ్ చెప్పారు.
కానీ పాస్‌పోర్ట్ రికార్డుల్లో లేడు.
ఇమిగ్రేషన్‌లో కూడా లేడు.
అమెరికా వెళ్లిన ఆనవాళ్లే లేవు.

అజయ్ కుర్చీలో వెనక్కి ఆనుకున్నాడు.
కొన్ని క్షణాలు...
గదిలో నిశ్శబ్దం.
అతని మెదడులో...
మాధవ్ చెప్పిన ప్రతి మాట తిరగసాగింది.
"అమెరికాలో ఉంటాడు..."
"సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..."
"మూడేళ్లుగా ఎదురెదురుగా చూడలేదు..."

అన్నీ...
ఒక్కసారిగా అనుమానాస్పదంగా అనిపించసాగాయి.

ఏ.సి.పి అజయ్ : ప్రవీణ్..మళ్లీ ఒకసారి మొత్తం చెక్ చేయించావా...? పేరు స్పెల్లింగ్ తప్పు అయి ఉండొచ్చు.
మిడిల్ నేమ్ ఉండొచ్చు. ఏమైనా అలియాస్ ఉండొచ్చు.

సీ.ఐ. ప్రవీణ్ : అన్నీ చూశారు....
"అర్జున్"
"అర్జున్ మాధవ్"
"అర్జున్ ఎం"
"అర్జున్ S/o మాధవ్"
సాధ్యమైన అన్ని కాంబినేషన్స్ చెక్ చేయించాను. ఏమీ లేదు.

అజయ్ ఒక్కసారిగా టేబుల్ మీద చేయి కొట్టాడు.
థప్...!

ఏ.సి.పి అజయ్ : అంటే... అబ్బా కొడుకులిద్దరూ కలిసి మన దగ్గర నాటకాలాడుతున్నారన్నమాట. ముఖ్యంగా ఆ ముసలోడు నా దగ్గర ఏంత బాగా నటించాడు.

సీ.ఐ. ప్రవీణ్ : అవును నాకైతే ముఖ్యంగా డాక్టర్ మాధవ్ మన దగ్గర అబద్దం చెప్పి ఏదో పెద్ద విషయం దాస్తున్నాడని అనిపిస్తోంది. 

అజయ్ నెమ్మదిగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లాడు.
బయట కమిషనరేట్ ప్రాంగణాన్ని చూస్తూ కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు తర్వాత వెనక్కి తిరిగి చాలా ప్రశాంతంగా అన్నాడు.

ఏ.సి.పి అజయ్ : నీ అనుమానం నిజమైంది ప్రవీణ్. డాక్టర్ మాధవ్ కొడుకు గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఒక్కటే ఉంటుంది. అతన్ని దాచిపెట్టాలి. అంటె ఆ అర్జున్ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు బహుశా ఇన్ని రోజులు మన కళ్ల ముందే తిరిగి ఉండొచ్చు కూడా.

సీ.ఐ. ప్రవీణ్ : ఇప్పుడు ఏం చేద్దాం సార్...?

ఏ.సి.పి అజయ్ : నువ్వు వెంటనే...ఆ అర్జున్ ఎక్కడున్నాడో ట్రేస్ చేయి. డాక్టర్ మాధవ్ మరియు తన కొడుకు అర్జున్ చదివిన కాలేజీల దగ్గర నుంచి
పాత అడ్రసులు...
బ్యాంక్ అకౌంట్లు...
ఆస్తులు...
ఫోన్ నెంబర్లు...
ఈమెయిల్స్...
పాత స్టూడెంట్స్...
స్నేహితులు...
అన్నీ తవ్వి చూడు. అర్జున్ అనే వ్యక్తి...
ఎక్కడో ఒకచోట తప్పకుండా బయటపడతాడు.

సీ.ఐ. ప్రవీణ్ : సరె ఇప్పుడె ఎంక్వైరి మొదలుపెడతా..

ప్రవీణ్ బయటకు వెళ్లిపోయాడు. అజయ్ మాత్రం...
టేబుల్ మీద ఉన్న ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు.
2010లో తీసిన ఆ ఫోటో...
మాధవ్...
రాఘవరావు...
మధ్యలో నిలబడి ఉన్న 14 ఏళ్ళ సాంబయ్య...
ఫోటో వైపు చూస్తూ...

అజయ్ మనసులో ఒక్కటే ఆలోచన.
"డాక్టర్ మాధవ్..."
"మీరు నిజంగా చాలా తెలివైనవారు..."
"కానీ..."
"మీరు దాచింది ఇప్పుడు బయటపడటం మొదలైంది."

అదే సమయంలో...
దూరంగా మరో చోట ఈ కేసును ఇంకో కోణంలో సాగర్ వర్మ నిశ్శబ్దంగా ముందుకు తీసుకెళ్తున్నాడనే విషయం అజయ్‌కు తెలియదు.

ఈ లోపు ఏ.సీ.పి అజయ్ మరియు సి.ఐ. ప్రవీణ్ తమ టీమ్‌తో కలిసి అర్జున్ కోసం పగలు రాత్రి తేడా లేకుండా వెతుకడం ప్రారంభించారు.
డా. మాధవ్ మరియు అర్జున్ చదివిన కాలేజీలు...
పాత అడ్రసులు...
బ్యాంక్ వివరాలు...
పాత ఫోన్ నెంబర్లు...
సోషల్ మీడియా...
పాత స్నేహితులు...
అన్నీ చోట్లా అందరి దగ్గర ఎంక్వైరి చేశారు మరియు చేయించారు.

అంతె కాకుండా మరొ సారి అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా కూడా విచారణ చేయించారు. కానీ..."అర్జున్ S/o డా. మాధవ్" అనే వ్యక్తి మాత్రం ఎక్కడా కనిపించలేదు.

ఒక వారం తర్వాత
సమయం : ఉదయం 11:20 గంటలు
విజయవాడ కమిషనరేట్ – SIT కార్యాలయం

అజయ్ తనదైన పద్ధతిలో...
డా. మాధవ్, రాఘవరావు, శ్వేత, అర్జున్ మధ్య ఉన్న సంబంధాన్ని మళ్లీ మళ్లీ విశ్లేషించుకుంటున్నాడు.
అతని టేబుల్ మీద నాలుగు ఫొటోలు.
డా. రాఘవరావు
డా. మాధవ్
డా.శ్వేత
అర్జున్ వేసిన పెయింటింగ్

వాటి వైపు చూస్తూ...
నెమ్మదిగా తనలోతానే మాట్లాడుకున్నాడు.

ఏ.సి.పి అజయ్ (మనసులో):
"పగ..."
"ప్రేమ..."
"కుటుంబం..."
"నష్టం..." ఈ నాలుగు కలిస్తే మనిషి ఎంతకైనా తెగిస్తాడు.

అంతలో...
అతని మొబైల్ మోగింది. స్క్రీన్‌పై..."సీ.ఐ ప్రవీణ్" అనె పేరు

అజయ్ వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు.

ఏ.సి.పి అజయ్ : చెప్పు ప్రవీణ్ ఏమయింది...? అర్జున్ గురించి తెలిసిందా.?. 

సీ.ఐ ప్రవీణ్ : కాసేపటిలొ తెలియబోతోంది. ఈ వారం రోజులుగా అతని గురించి చేసిన ఎంక్వైరిలొ ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. 

ఏ.సీ.పి అజయ్ : ఏంటది....?

సీ.ఐ ప్రవీణ్ : అర్జున్ అసలు సాప్ట్ వేర్ ఇంజినేరె కాదు. తను 2010 లొ ఇంజినేరింగ్ పూర్తయ్యాక ఢిల్లికి వెళ్ళాడు. ఏదొ పరీక్షకు తయ్యారవ్వడం కోసం అంటా.. ఆ తరువాత మళ్ళి తను తిరిగొచ్చి 14 ఏళ్ళ నుంచి అంటె 2012 నుంచి విజయవాడలోనె ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు. 

ఏ.సీ.పి అజయ్ : సూపర్బ్... అంటె ఇంతకాలం తను విజయవాడలోనె ఉన్నాడు. ఎప్పడైతె శ్వేత మరియు రాఘవరావు చనిపోయారొ అప్పుడె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆ 2 హత్యలకు పథకం రచించి వాళ్ళిద్ధరిని చంపేశాడనమాట. 

సీ.ఐ ప్రవీణ్ : అంతె కాదు నా ఎంక్వైరి ప్రకారం ఆ హత్యల్లొ అర్జున్ ఒక్కడె కాదు తన తండ్రి రాఘవరావు హస్తం కూడా ఉంది... ఎందుకంటె శ్వేత చనిపోయిన వారం రోజుల తరువాత సంజీవిని ఫౌండేషన్ కి వెళ్ళి లాకర్లొ ఉన్న రాఘవరావు మొబైల్ లోని సిమ్ కార్డ్ తీసుకుంది డా. మాధవె. 

ఏ.సీ.పి అజయ్ : వాట్....?

సీ.ఐ ప్రవీణ్ : అవును రెండు రోజులు క్రితం ఆ నంబర్ యాక్టివ్ అయినట్టు సమాచారం వస్తె అనుమానంతొ ముందు డా. మాధవ్ ఇంటికి వెళ్ళా. తను అక్కడ లేడు. కనుక్కుంటె విజయవాడలోని సంజీవిని ఫౌండేషన్ కి వెళ్ళాడని చెప్పారు. సరిగ్గ ఆ నంబర్ తాలుకు సిగ్నల్స్ కూడా ఆ సంజీవిని ఫౌండేషన్లోనె చూపించింది. తరువాత ఆ సిగ్నల్స్ ఆగిపోయాయి. 

ఏ.సీ.పి అజయ్ : అక్కడికి వెళ్ళాక సిగ్నెల్స్ ఆగాయి అంటె. మళ్ళి ఆ సిమ్ కార్డుని యధా స్థానంలొ పెట్టడానికి అయ్యుండచ్చు లేదా....

సీ.ఐ ప్రవీణ్ : లేదా ఆ సిమ్ కార్డుని అర్జున్ కి ఇచ్చుండచ్చు. 

ఏ.సీ.పి అజయ్ : అర్జున్ కి ఇచ్చుండచ్చు అంటె అర్జున్...?

సీ.ఐ ప్రవీణ్ : అవును సంజీవిని ఫౌండేషన్లోనె ఉన్నాడు. ఇప్పుడు నేను అక్కడికె వెళుతున్నా... ఒక గంటలొ కాల్ చేస్తా..

ఏ.సీ.పి అజయ్ : సూపర్బ్... అర్జున్ దొరకగానె వాడితొ పాటు వాడి బాబుని కూడా లోపలెయ్యాలి.

సీ.ఐ ప్రవీణ్ : ఇంతకుముందె మఫ్తిలొ ఉన్న పోలీసులని డా.మాధవ్ ఇంటి చుట్టూ పెట్టా. ఇక్కడ అర్జున్ దొరకగానె అక్కడ మాధవ్ ని కూడా అరెస్ట్ చేస్తారు.

ఏ.సీ.పి అజయ్ : వెరి గుడ్. ఏ విషయం నాకు ప్రతి 10 నిమిషాలకొకసారి అప్డేట్ చేస్తూ ఉండూ..

అని చెప్పి కాల్ కట్ చేశాడు. 15 నిమిషాల తరువాత అజయ్ మద్యాహ్నం భోజనానికి అని తన ఇంటికి బయలుదేరాడు. దారిలొ ఉండగా తన మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తె సాగర్ వర్మ కాల్ చేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చెశాడు.

సాగర్ వర్మ : Mr.అజయ్ ఎక్కడున్నారు..?

ఏ.సి.పి అజయ్ : భోజనానికని ఇంటికి వెళుతున్నా సార్. అన్నట్టు మీకొ గుడ్ న్యూస్.

సాగర్ వర్మ : ఏంటి..?

ఏ.సీ.పి అజయ్ : మనం వెతుకుతున్న వాళ్లు దాదాపు దొరికిపోయారు. 

సాగర్ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు.

సాగర్ వర్మ : ఎవరు...?

ఏ.సి.పి అజయ్ : నా ఎంక్వైరి ప్రకారం ఈ హత్యల వెనుక డాక్టర్ మాధవ్ మరియు అతని కొడుకు అర్జున్ ఉన్నారని తేలింది సార్.

కొద్దిసేపు అవతలవైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తర్వాత...

సాగర్ స్వల్పంగా నవ్వాడు.

సాగర్ వర్మ : కంగ్రాచ్యులేషన్స్ అజయ్. మొత్తానికి సాధించారు.

అజయ్ గర్వంగా నవ్వాడు.

ఏ.సి.పి అజయ్ : థ్యాంక్యూ సర్. అర్జున్ సంజీవిని ఫౌండేషన్లొ దాంకున్నాడని సమాచారం వచ్చింది. తనని పట్టుకోడానికి మన ప్రవీణ్ వెళ్ళాడు. తను దొరకగానె డాక్టర్ మాధవ్‌ని కస్టడీలోకి తీసుకోవచ్చు.

సాగర్ వర్మ : సరే ఇంతకీ మీరు ఎంతసేపు ఇంట్లొ ఉంటారు..? త్వరగానె మళ్ళి ఆఫీసుకి వస్తారా..?

ఏ.సి.పి అజయ్ : అంటె ఇంట్లొ చిన్న పర్సనల్ పని ఒకటి ఉంది సార్. లంచ్ చేసి ఆ పని ముగించుకొని మళ్లీ ఆఫీసుకి వస్తాను.

సాగర్ వర్మ : ఓకే.

కాల్ ముగిసింది.
అజయ్ తన ఫోన్ ని పైన షర్ట్ జేబులో పెట్టుకున్నాడు. తన ముఖంలో ఆత్మవిశ్వాసంతొ కూడిన సంతోషం. 10 నెలలగా వెతుకుతున్న ఆ హంతకులు దొరకబోతున్నారు అనుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు

సమయం : మధ్యాహ్నం 2:35 గంటలు
విజయవాడ.. ఏ.సీ.పి అజయ్ ఇల్లు.

అజయ్ తన భోజనం ముగించుకొని హాల్‌లోని సోఫాలో కూర్చొని మొబైల్లొ ఎవరితోనొ సీరియస్ గా మాట్లాడుతున్నాడు.

అప్పుడే బయట ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగింది. దాని వెంట ఇంకో వాహనం అజయ్ కంగారుగా తలుపు వైపు చూశాడు.

టక్... టక్...
తలుపు తట్టిన శబ్దం వినిపించింది.

అజయ్ భార్య క్యాథరీన్ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు నించున్నారు. వాళ్ళు లోపలికి వచ్చారు. అజయ్ వాళ్ళ వైపు చూశాడు. వాళ్ళతొ పాటు విజయవాడ నగర డిప్యూటి కమీషనర్  (డీ.సీ.పి) రవికాంత్ కూడా ఉండడం గమనించి సోఫాలోంచి లేచాడు.

డీ.సి.పి రవికంత్ : అజయ్ నీపై అరెస్ట్ వారెంట్ ఈష్యూ అయ్యింది.. మురళి అతనికి ఆ అరెస్ట్ వారెంట్ ఇవ్వు.

అని సీ.ఐ మురళికి చెప్పాడు. అజయ్ కంగారు పడుతూ ఆ వారెంట్ పాపేర్ ని తీసుకొని చదువుతున్నాడు.

డీ.సి.పి రవికంత్ : పదివి దుర్వినియోగి పరిచి నువ్వు మరియు సీ.ఐ ప్రవీణ్ కలిసి మాధక ద్రవ్యాల అమ్మె ముఠాతొ చేతులు కలిపి అక్రమంగా ఎంతొ సంపాదించడమె కాకుండా. అడ్డొచ్చిన వాళ్ళని బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపారు, అది మాత్రమె కాకుండా చనిపోయిన ఎం. ఎల్. ఎ దేవేంద్ర రెడ్డి మరియు సూర్యనారాయణలతొ చేతులు కలిపి పొనికె గూడెం విషయంలొ అడ్డొచ్చిన డా. రాఘవరావుని చంపించి, ఆయన కూతురు శ్వేతకు యాక్సిడెంట్ చేయించారు తరువాత జూనియర్ డాక్టర్స్ పద్మ మరియు హరీష్ లని కిడ్నాప్ చేసి హింసించారు. మీ మనుషుల చేత పద్మని మానభంగం చేయించి చంపించి అక్కడె పాతిపెట్టించారు.

అజయ్ భయంతొ అలా చూస్తు నించుండిపోయాడు. తన భార్య కెథరిన్ అయితె భర్తపై మొపిన ఆరోపణలు విని నమ్మలేకపోయింది

డీ.సి.పి రవికాంత్ : అది మాత్రమె కాదు 6.5 ఏళ్ళ క్రితం తులసి అనె ఒక అమ్మాయిని అనుభవించి కడుపు చేసి బిడ్డ పుట్టాక నిన్ను పెళ్ళి చేసుకోమని అడిగినందుకు సీ.ఐ ప్రవీణ్ ద్వారా తులసి హోటల్ నుంచి తెప్పించుకున్న టిఫిన్లొ థాలియం అనె కెమికల్ ని కలిపించి తులసిని నెలరోజులు నరకం అనుభవించేలా చేసి చంపావు. 

తులసి గురించి కెథిరిన్ వినగానె భర్తను అసహ్యంగా చూసింది.

డీ.జీ.పి రవికాంత్ : ఇవ్వన్నీ నువ్వు మరియు సీ.ఐ ప్రవీణ్ చేసినట్టు రుజువులతొ సహా మీపై నేరారోపణ జరిగింది. 

ఈలోపు సీ.ఐ మురళి ఏదొ కాల్ మాట్లాడి డీ.సీ.పి రవికాంత్ దగ్గరకు వచ్చాడు. 

సీ.ఐ మురళి : సార్ ఇందాక మన వాళ్ళు అరెస్ట్ చెయ్యడానికి వెళితె ఆ సీ.ఐ ప్రవీణ్ తప్పించుకొని పారిపోయాడు. కాసేపటి క్రితం గుంటూరు హైవె మీద కనబడితె వెంబడించారు. అప్పుడ ప్రవీణ్ తన దగ్గర ఉన్న రివాల్వర్ తొ మన వాళ్ళపై కాల్పులు జరిపితె దాంతొ మన వాళ్ళు తనని షూట్ చెయ్యాల్సి వచ్చింది. 

డీ.సి.పి రవికాంత్ : మరి ఇప్పుదు తన స్టేటస్ ఏంటి. 

సీ.ఐ మురళి : ప్రాణం ఉంది సార్ హాస్పెటల్ కి తీసుకెళ్ళారు.

డీ.సీ.పి రవికాంత్ : ఓకె.... పదా అజయ్ నువ్వేం మాట్లాడల్లా కోర్టులొ మాట్లాడుకొ.... 
మురళి...

సీ.ఐ మురళి : సార్...

డీ.సీ.పి రవికాంత్ : అరెస్ట్ హిమ్.

పోలీసులు అజయ్ ని అరెస్ట్ చేసి ఇంటి నుండి బయటకు తీసుకొచ్చారు. అక్కడ సాగర్ వర్మ తన కారు ప్రక్కన నించోని ఉన్నాడు.

అజయ్ తనని కోపంగా చూస్తూ వెళుతుంటె సాగర్ వర్మ చిన్నగా నవ్వుతున్నాడు.

మళ్ళి ఫ్లాష్ బ్యాక్ 

రెండు వారాల క్రితం 
సమయం : రాత్రి 8:00 గంటలు
విజయవాడ కమీష్నరేట్ కార్యాలయం

పోనికె గూడెం నుంచి వచ్చిన సాగర్ వర్మ తన ఆఫీసులొ కూర్చోని ఎస్. ఐ సుందర్ కి దేవేంద్ర రెడ్డి అనుచరులు శివ మరియు వివేక్. మరో వ్యక్తి సూర్యనారాయణ పీ.ఎ రవికూమార్ వీళ్ళ ముగ్గురిపై 24 గంటలు నిఘా పెట్టించమని చెప్తాడు. 

ఎస్.ఐ జాన్ బాబు కి ఏమొ దేవేంద్ర రెడ్డి, సూర్యనారాయణలకు సంబంధించిన 10 ఏళ్ళ వార్షిక ఆర్ధిక లావాదేవీలు, బినామీ కంపెనీలు, విదేశి లావాదేవీలు, ప్రైవేట్ ఒప్పందాలు అన్నీ బయటకు తీయమని చెప్పి పంపిస్తాడు. 

వాళ్ళిద్దరు వెళ్ళిన కాసేపటకి కానిస్టేబుల్ లోపలికి వచ్చి. ఎవరొ సాగర్ ని అర్జెంటుగా కలవడానికి వచ్చాడని. పేరు అడిగితె చెప్పలేదని చెప్పాడు.

అది విన్న సాగర్ అతనిని పంపించమని కానిస్టేబుల్ కి చెప్తాడు. 

కాసేపటికి అతను సాగర్ క్యాబిన్లోకి వస్తాడు. ఆ వచ్చిన అతను సాగర్ కి నమస్కారం పెట్టి తన పేరు కిరణ్ కుమార్ అని సంజీవిని ఫౌండేషన్లొ పనిచేసె కాంపౌండర్నని అంతె కాకుండా తాను అక్కడ పని చేస్తున్న జూనియర్ డాక్టర్ హరీష్ తండ్రిని అని చెబుతాడు.

సాగర్ వర్మ : చెప్పండి ఎందుకు నన్ను అర్జెంటుగా కలవాలి అన్నారు. మీ అబ్బాయి గురించా..?

కిరణ్ కుమార్ : కాదు మా అబ్బాయి గదిలొ ఈ ఫైల్ మరియు పెన్ డ్రైవ్ ఉన్న కవర్ దొరికింది. దీనిపై మీ పేరు అది వ్రాసి ఉంది. ఇది మీ దర్యాప్తుకి ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను. అంతె 

అని చెప్పి ఆ కవర్ సాగర్ వర్మకి ఇస్తాడు. దాంతొ పాటు ఎవిరికి కనబడకుండా రహస్యంగా ఒక చీటి కూడా సాగర్ చేతికి ఇచ్చి అక్కడ వెళ్ళడానికి లేస్తాడు.

సాగర్ ఆ చీటి తీసుకొని తెరిచి చూస్తె అందులొ "మా అబ్బాయి హరీష్ తిరిగొచ్చాడు" అని వ్రాసి ఉంది.

అది సాగర్ వర్మ వెళుతున్న కిరణ్ కుమార్ వైపు చూస్తాడు. కిరణ్ కుమార్ వెళుతూ సాగర్ వైపు తిరిగి నిలువుగా తలాడిస్తాడు..

ఫ్లాష్ బ్యాక్ ends