అందరూ ఒకేసారి అరవడంతో ఫోన్ తన చెవి నుంచి దూరంగా పెట్టుకొని " అబ్బా... ఏంట్రా అలా అరుస్తున్నారు. ". అని అంది ప్రియా కొంచెం చిరాగ్గా.
" స్వీటీ ఇది ఏప్రిల్ మంత్ కాదు ఏప్రిల్ దాటి చాలా రోజులు అవుతుంది మమ్మల్ని ఏప్రిల్ఫుల్ చేద్దామనుకుంటున్నావా ముందు ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అది చెప్పు మమ్మల్ని ఫుల్ చేయడం కాదు " అని అన్నాడు నితిన్.
పొద్దున్నే నితిన్ కి జాగింగ్ చేసే అలవాటు ఉంది అలా జాగింగ్ చేసిన తర్వాత ఇంటి టెర్రస్ పైన ఉన్న అతని ఓపెన్ జిమ్ లో వర్కౌట్ చేయడం అతనికి అలవాటు రోజు లాగానే తన జీమ్ చేస్తూ ఉండగా ప్రియా వాళ్ళ ఇల్లు ఎవరో డెకరేట్ చేస్తూ కనిపించారు , అంత సడన్గా ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అనేది అతనికి అర్థం కాలేదు అతనికి ఫఫస్ట్ గుర్తొచ్చింది ప్రియా వాళ్ళ నాన్నమ్మ వయసు ఎక్కువ అవ్వడంతో తనకి ఏమైనా అయ్యిందేమో అని అనుకున్నాడు , అందుకే పొద్దున్నే అందరికీ వాట్సాప్ లో తాను అనుకుంటున్నది షేర్ చేశాడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి అలా ఆలోచించి నందుకు. అతనికి ఎక్సక్టు రీసన్ అయితే తెలియదు కానీ ప్రియా ఎంగేజ్మెంట్ అని చెప్తే నమ్మే అంత ఫూల్ కూడా కాదు అతను.
" అబ్బా పొద్దున్నే ఏంట్రా ఎదవ గోల నా నిద్ర చెడగొడుతుంది కాక, చక్కగా హాయిగా పదింటి వరకు పడుకుందాం కదా అనుకున్నా ఈరోజు, నన్ను ఏ రోజు ప్రశాంతంగా పడుకోనిచ్చారు మీరందరూ " అని అంది శైలు చిరాకుగా . పొద్దున్నే ఫోన్ కాల్ తర్వాత ఈ డిస్కషన్ వల్ల తన నిద్ర అంతా పాడైపోయింది.
" స్వీటీ జోక్ చేసింది చాలు కానీ ముందు ఎందుకు డెకరేట్ చేస్తున్నారు అది చెప్పవే" అన్నాడు అరుణ్. స్వీటీ సడన్ గా ఎంగేజ్మెంట్ అంటే నమ్మడానికి అరుణ్ కూడా సిద్ధంగా లేడు
" హే రియల్లీ నేను చెప్పేది నిజం. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు " అని అంది ప్రియ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ వీలైనంత సీరియస్ గా మాట్లాడటానికి ట్రై చేస్తూ.
" వెయిట్ వెయిట్ ఇంతకీ ఈ బావ ఎవరు?" అన్నాడు నిఖిల్. ఎందుకంటే అతనికి తెలిసినంతవరకు స్వీటీకి బావలు ఎవరూ లేరు.
" నేను మీ అందరికీ మా అత్త గురించి చెబుతూ ఉంటాను కదా".
"హ అవును అయితే" అడిగాడు నితిన్.
" ఆవిడ ఎక్కడ ఉన్నారు అనేది మా డాడ్ కనుక్కున్నారు ఫ్యూ డేస్ బ్యాక్, సో ఈరోజు ఆవిడ వస్తుంది వాళ్ల ఫ్యామిలీతో కలిసి అండ్ ఆవిడ కొడుకుతో ఈరోజు నా ఎంగేజ్మెంట్ , అందుకే ఇంటిని ఇలా డెకరేట్ చేస్తున్నారు , లేట్ చేయకుండా మీరందరూ వన్ అవర్ లో నా ముందు ఉండాలి ఓకేనా" అని చెప్పింది ప్రియా.
" నా ఎంగేజ్మెంట్ లో మీరు అందరూ ఉండాలి "అంటూ తన ఫ్లోలో తాను చెప్పుకుంటూ పోయింది ప్రియా.
ఇంతలో ఎవరో నవుతున్నట్లో వాయిస్.
" ఎవరు ఆ పంది నవుతునది " అని అడిగింది ప్రియా
" నువ్వు పెళ్లి చేసుకుంటావని అంటే నమ్ముతాను అనుకుంటున్నావా నీ గురించి నాకు తెలియదా ముందు ఏం జరిగిందో అది చెప్పు నాకు ?... వెయిట్ నాకు తెలిసి నీ అత్తయ్య వస్తుందా అని వెల్కమ్ పార్టీగా హోమ్ డెకరేట్ చేస్తున్నారు అనుకుంటా , మమ్మల్ని ఫుల్ చేయడానికి ఎంగేజ్మెంట్ అని ఎక్స్ట్రాగా యాడ్ చేశావు కదా నువ్వు" అని అన్నాడు నితిన్.
' అమ్మో వీడు కనిపెట్టేసినట్టున్నాడు అయినా సరే అసలు తగ్గదు ప్రియ ' అని తనకు తాను చెప్పుకుంది
" ఎగ్జాక్ట్లీ, ఇది కావాలని మనల్ని బురిడీ కొట్టించడానికి చూస్తుంది" అన్నాడు అరుణ్ కూడా.
" మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, కావాలంటే వచ్చాక మా నాన్నమ్మని అడగండి ఈరోజు నా ఎంగేజ్మెంట్ చేస్తున్నారు లేదు అనేది మా నానమ్మ మీకు క్లియర్ గా చెప్తుంది" అని అంది కాన్ఫిడెంట్గా ప్రియా.
ప్రియా వాయిస్ లోని కాన్ఫిడెన్స్ చూసి అందరూ ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు
" ప్రియా నువ్వు జోక్ చేయట్లేదు కదా? " అంది శైలు నమ్మకం కుదరక.
" నా వాయిస్ లో నీకు జోక్ కనిపిస్తుందా ఐ యాం సేయింగ్ సీరియస్లీ " అని అంది ప్రియ.
" నో దీనికి నేను ఒప్పుకోను" అంది అక్షయ ఒకసారి గా
" నువ్వెందుకు ఒప్పుకోవే?" అని అడిగింది ప్రియా కొంచెం కన్ఫ్యూజ్ ఆవుతూ.
" ఒసేయ్ నీకు నేను ముందే చెప్పాను నీకు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే నా మరిదీ నీ చేసుకోమని ఎంచక్కా మనిద్దరం ఒకే ఫ్యామిలీ లో తోడుకోడలుగా సెటిల్ అవ్వచ్చు అని , ఇప్పుడు బావని చేసుకుంటాను అంటే నేనెందుకు ఒప్పుకుంటాను ." అని అంది అక్షయ.
అప్పుడు అర్థమైంది ప్రియా కి అక్షయ ఎందుకు ఒప్పుకోను అంటుందో. అండ్ అందులోనూ తన మరిది ప్రేమ్ ని పెళ్లి చేసుకోమనడంతో కొంచెం కోపం కూడా వచ్చింది.
" ఏంటి ఆ కోతిని చేసుకోవాలా ? చచ్చిన చేసుకోను, నేను చేసుకుంటే మా భావనైన చేసుకుంటాను కానీ వాడిని మాత్రం అస్సలు చేసుకోను " అని అంది ప్రియా.
" ఏ నా మరిదికి ఏం తక్కువే మహేష్ బాబుని ప్రభాస్ ని మిక్స్ చేస్తే ఎలా ఉంటాడో అలా అంటాడు , యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మాన్ కూడా అందులోనూ వాడికి నువ్వంటే పిచ్చి ప్రేమ ఆ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాడు కానీ నువ్వే నేను ఈ లైఫ్ లో పెళ్లి చేసుకోను సో నా వెంట పడకు , హోప్స్ పెట్టుకోకు అని చెప్పావు , సో వాడు ఎప్పటికైనా వాడి ప్రేమ నిన్ను మారుస్తుంది అన్న హాప్స్ తో ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటున్నాను ఆ చేసుకునేది ఏదో వాడిని చేసుకోవచ్చు కదా ఎంచక్కా ఇద్దరం ఓకే ఇంట్లో ఉండిపోవచ్చు మా బుజ్జి కాదు మా బంగారం కాదు మా ప్రేమ్ నీ పెళ్లి చేసుకోవే" అని అంటూ ప్రియా నీ బతిమాలడం స్టార్ట్ చేసింది అక్షయ.
ప్రియా రిప్లై ఇవ్వక ముందే తన కన్నా ముందు ఎవరో అరిచారు
" నో ప్రియా ఆ కోతిని చేసుకుంటానంటే నేనసలు ఒప్పుకోను" అన్నాడు నితిన్ కోపంగా.
" ఒరేయ్ ..అది కోతి అంటే అనింది కానీ నువ్వంటే మాత్రం ఒప్పుకోను రా, అయినా నువ్వు ఎవరు రా ఒప్పుకోవడానికి దానికి వాడే కరెక్ట్ నాకు తెలిసినంతవరకు, ఈడు జోడు కూడా కరెక్ట్ గా సరిపోతారు" అని అంది అక్షయ అంతే కోపంగా.
" వాడే కాదు నేను కూడా ఒప్పుకోను " అన్నాడు అరుణ్.
ప్రియా కి ఎందుకో అసహనంగా అనిపించింది తన ఫ్రెండ్స్ ప్రేమ్ ని హేట్ చేయడం తనకి నచ్చలేదు. ప్రేమ్ అంత చెడ్డవాడు ఏమీ కాదు తనకు తెలిసినంతవరకు అల్లరి చేస్తాడు కానీ లిమిట్ గానే చేస్తాడు నిజం చెప్పాలి అంటే ప్రియా కి అతని అల్లరి అంటే కొంచెం ఇష్టం కూడా.
" అసలు నాకు తెలియక అడుగుతాను ప్రేమ్ అంటే మీకెందుకురా అంత కోపం నా హస్బెండ్ తో బానే ఉంటారు కానీ ప్రేమ్ నీ చూస్తే మాత్రం ఏదో శత్రువును చూసినట్టు బిహేవ్ చేస్తారు అసలు ఎందుకురా వాడంటే మీకు అంత కోపం ఫస్ట్ అది చెప్పండి ముందు? " అని అడిగింది అక్షయ.
వీళ్లు పెడుతున్న డిస్కషన్ కి తలనొప్పిగా అనిపించింది ప్రియా, శైలు ,అండ్ నిఖిల్ కి.
ప్రియ తను ఎక్కడ స్టార్ట్ చేస్తే దాన్ని వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని, అసలు ఈ మ్యారేజ్ టాపిక్ ఎందుకు తీసుకువచ్చానా అని బాధపడింది.
'ఛీ నా నోటి దూల.. ఉన్నచోట అసలు ఉండను .. ఇప్పుడు ఏం చేస్తాం ఈ ఎదవ డిస్కషన్ మొదలైంది నావల్లే కాబట్టి పడక తప్పతుందా ' అని తనలో తానా అనుకోకండి
" వాడెప్పుడూ కూడా ప్రియా ని డిస్టర్బ్ చేస్తానే ఉంటాడు , అది ఎక్కడికెళ్లినా అక్కడ ప్రత్యక్షం అవుతాడు , ప్రియకి ఎప్పుడు చూసినా కోపం తెప్పిస్తూ ఉంటాడు , మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వాడు చుట్టుపక్కల ఉన్నప్పుడు ప్రియా కి తెలిసిపోతుంది ఎందుకంటే వాడు ఒక నెగటివ్ ఎనర్జీ వాడి చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు అందుకే ప్రియా కి వాడు చుట్టుపక్కల ఉన్న ఇట్టే తెలిసిపోతుంది" అన్నాడు నితిన్.
'నెగిటివ్ ఎనర్జీ ? ఇదెక్కడి నుంచి వచ్చింది మధ్యలో, వీడేంమాట్లాడుతున్నాడు అసలు' అని ఆలోచించింది ప్రియ
" స్టాప్ ఇట్ ఒకే ,వాడేమీ దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు, అది కోపంలో అందంగా ఉంటుందని కొంచెం ఏడిపిస్తూ ఉంటాడు అంతే , కానీ ఎప్పుడూ కూడా హద్దులు మీరి ప్రవర్తించలేదు , వాళ్ళిద్దర్నీ మళ్ళీ మళ్ళీ మీట్ అవుతున్నారు అంటే అది డెస్టిని, అండ్ నెగటివ్ ఎనర్జీ అన్నావ్ కదా అది నెగిటివ్ ఎనర్జీ అసలు కాదు వాడు చుట్టుపక్కల ఉన్నప్పుడు ప్రియా హార్ట్ బీట్ పెరిగిపోతుంది ఇది హార్ట్ సిగ్నల్ అది లవర్స్ కి మాత్రమే అర్థమవుతుంది" అని అంది అక్షయ.
" వాట్ లవర్సా ? హలో ఇక్కడ ఎవరు ఎవరికి లవర్స్ తెలుసుకోవచ్చా " అని ఆశ్చర్యపోయింది ప్రియా.
ప్రియా అక్షయ కి రిప్లై ఇచ్చే లోపు నితిన్ మాట్లాడుతూ" ఏంటి లవ్ సిగ్నల్సా? వెరీ ఫన్నీ , సరే అయితే మన బ్యాచ్ లో కూడా ఉనారు కదా లవర్స్ , శైలు నువ్వు చెప్పవే నిఖిల్ నీ చుట్టూ పక్కల ఉన్నప్పుడు నీకు కూడా ఇలాగే హార్ట్ బీట్ పెరుగుతుందా ? " అని అడిగాడు.
ప్రియా తల కొట్టుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఆ విషయం ఎందుకు చెప్పానా అని బాధపడింది.
ఇంతలో శైలు ఆలోచనలో పడి" అది..." అని సాగదీసింది.
శైలు సాగదీస్తూ ఉంటే శైలు కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నితిన్ మాట్లాడుతూ "చూసావా అది చెప్పలేదు అంటే వీళ్ళిద్దరిది ట్రూ లవ్ కాదన్నా నీ ఉద్దేశం" అని అడిగాడు.
వీళ్ళిద్దరి డిస్కషన్ లో నిఖిల్ ని శైలు ని ఎందుకు లాగరో అసలు అర్థం కాలేదు నిఖిల్ కి
" ఒరేయ్ దానికి ఉంది అసలే చిన్న బ్రెయిన్ మీరు ఎదవ డౌట్లు పెట్టకండి , ఇలా హార్ట్ బీట్ ,హాట్ లాంగ్వేజెస్, ట్రూ లవ్ అని. మా ఇద్దరి గురించి మాకు తెలుసు మా గురించి మీరు కొట్ట కావాల్సిన అవసరం లేదు" అని అన్నాడు నిఖిల్.
ఈ లోపు శైలు ఏదో మాట్లాడుతూ" నిఖిల్..." అని ఏదో డౌట్ వచ్చిన దానిలా సాగదీసేపాటికి.
" బంగారం నువ్వు ఆగవే ఒక నిమిషం మనం కలిసినప్పుడు నీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను" అని చెప్పి .
" కొట్టుకుంటే మీరు కొట్టుకొని చావండి అంతేగాని మా ఇద్దరిని విడదీయకండి రా బాబు మీకు పుణ్యం ఉంటుంది" అని కొంచెం గ్యాప్ ఇచ్చి
" శైలు వీళ్లు అంటున్నవి పట్టించుకోకు ఏదో పిచ్చికుక్క కరిచినట్టుంది వీళ్ళని, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు నువ్వు రెడీగా ఉండు వన్ అవర్ లో వచ్చి నిన్ను తీసుకువెళ్తాను ప్రియా వాళ్ళ ఇంటికి దారిలో నీకు అడగాల్సినవి అడిగేసే ఓకేనా" అని అన్నాడు నిఖిల్.
శైలు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఆలోచించి " ఆ సరే " అంది
" చూసావా ...నిఖిల్ గాడు కూడా ఇవి అని పిచి పిచి మాటలు అన్నాడు సో.. నువ్వు చెప్పిన లాజిక్స్ అన్నీ తప్పు " అన్నాడు నితిన్ ఆ మ్యాటర్ ని ఇంకా సాగదీస్తుంది.
నితిన్ మాటలకు వత్తాసు పాడుతూ " నాకు తెలిసి ఆ ప్రేమ్ గాడు నీ బ్రెయిన్ వాష్ చేసినట్టున్నాడు. రోజు నీ పక్కనే ఉంటూ , అందుకే డెస్టినీ , లవ్ సిగ్నల్ అని పిచి పిచ్చిగా అంటున్నావు , ముందు వాడికి ఎంత దూరం గా ఉంటే అంత బెటర్ మాస్లే ఈ టైంలో" అన్నాడు అరుణ్.
'అమ్మ బాబోయ్ ఇప్పుడు వీళ్లని ఆపకపోతే వీళ్ళు పెట్టే డిస్కషన్ కి నా తల పెళ్ళిపోయేలాగా ఉంది వీళ్ళు ఈ టాపిక్ ని ఎక్కడినుంచి ఎక్కడికో తీసుకెళ్లారు '
వీళ్లు పెడుతున్న డిస్కషన్ కి చిరాకు వచ్చిన ప్రియా నిజం చెపుతూ " ఆపండి ....మీ ఎదవ గోల , నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు కాకపోతే మా నానమ్మకి నా నోటి దూల వల్ల పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను అది కూడా మా అత్త కొడుకుని " .
ప్రియా తను చెప్తున్నది పూర్తి కాకముందే అరుణ్ , నితిన్ అండ్ అక్షయ" నీకేమైనా పిచ్చా అలా ఎందుకు మాటిచ్చావు స్వీటీ " అని ఒకేసారి అరిచారు.
ప్రియా అసహనంగా " ముందు నేను చెప్పేది పూర్తిగా వింటారా లేదా" అని అరిచి .
" నువ్వు చెప్పరా స్వీటీ , అది పూర్తిగా చెప్పేవరకు మీలో ఎవరైనా మాట్లాడారు అనుకో నేను యాక్షన్ లో కి వస్తాను " అని వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్.
అందరూ నిఖిల్ బేస్ వాయిస్ కి కొంచెం భయపడ్డారు " ఓకే" అని అన్నారు.
" నేను ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదు అండ్ మీ అందరికీ క్లారిటీ కావాలి అంటే వన్ అవర్ లో నా ముందు ఉండండి మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లైన్ చేస్తాను" అని చెప్పింది ప్రియ.
నితిన్ ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తుంటే అతని మధ్యలోనే ఆపేస్తూ నిఖిల్ ఆర్డర్ వేశాడు " ఇది ఫైనల్! స్వీటీ చెప్పింది కదా ఇంటికి రమ్మని ఏదైనా సరే అక్కడికి వెళ్లిన తర్వాత అది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది " అనుకున్నాడు
'వీడు వీడి ఆర్డర్స్ ఏదో నేను వాడి కింద జవాన్ అన్నట్లు ఎప్పుడు చూసినా ఆర్డర్స్ ఇస్తూ ఉంటాడు ' అని నిఖిల్ నీ తిట్టుకున్నాడు.
" సారీ స్వీటీ నేను రాలేను రా ఎందుకంటే నిన్న నైట్ మా అత్తగారు ఎక్కడికో వెళ్ళాలి అని హడావిడి చేశారు ఎర్లీ మార్నింగ్ ఆవిడ స్వయంగా నన్ను లేపి తొందరగా రెడీ అవ్వమని ఆర్డర్ చేశారు సో మేము ఆవిరితో కలిసి బయటికి వెళ్తున్నాం ఈ వెల్కమ్ పార్టీకి రాకపోవచ్చు " అని చెప్పింది అక్షయ.
" డోంట్ వర్రీ అక్షయ నేను నీకు అప్డేట్ ఇస్తాలే" అని అంది శైలు.
" అండ్ అరుణ్ నువు ఒకడివే రా నీ వైఫ్ మాత్రం వదు రా ప్లీజ్ "అని రిక్వెస్ట్ చేసింది ప్రియ .
అరుణ్ నవ్వకుంటు " ఒకే డాన్" అనాడు.
" సరే అయితే అక్షయ నీకు ఇచ్చిన డైట్ ఫాలో అవుతున్నావు కదా టైం కి తిను ఓకేనా " అక్షయకి జాగ్రత్తలు చెప్పింది.
" అబ్బా నాకు తెలుసులేవే నువ్వు ఇచ్చిన డైట్ ప్లాన్ ప్రేమ్ అండ్ అధి గారి దగ్గరే ఉంచుకున్నారు టైం టు టైం నాకు అన్ని ఇస్తున్నారు" అని చెప్పింది.
" ఓకే తేనె సి యు ఎట్ మై హోమ్ ఇన్ వన్ అవర్" అని చెప్పి ప్రియ ఫోన్ కట్ చేసింది
*****
హాయ్ ఫ్రెండ్స్ ఈ కథలోని పాత్రల గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామా.
ఈ కథలోని మెయిన్ లీడ్ అదేనండి మన హీరోయిన్ పేరు ప్రియా తన తండ్రి పేరు జగదీష్ చంద్ర , అమ్మ సునంద , నానమ్మ ఊర్మిళాదేవి, తాతయ్య గారి పేరు రఘునాథ్ భూపతి.
ప్రియా ఫ్రెండ్స్ లిస్ట్ లో మొత్తం ఐదుగురు ఉంటారు ప్రియా తో కలిపి ఆరుగురు .ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు. వీళ్ళు కిండర్గార్డెన్ అదేనండి నర్సరీ అంటారు కదా నర్సరీ నుంచి కాలేజ్ వరకు కలిసే ఉన్నారు, ఒకటే స్కూల్ అండ్ ఒకటే కాలేజ్ కలిసే పెరిగారు .ఏమి చేసినా కలిసే చేస్తారు ఆది గుడ్ ఆర్ బ్యాడ్ .
ఫస్ట్ నిఖిల్ వీడు ఆర్మీలో వర్క్ చేస్తూ ఉంటాడు ప్రెసెంట్ లీవ్ లో ఉన్నాడు , ఇతని గురించి కథలో ముందుకు వెళ్లే కొద్దీ మీకే అర్థమవుతుంది. అండ్ నిఖిల్ ప్రయా నీ ఒక సిస్టర్ లా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ప్రియా కూడా తనకి ఏ కష్టం వచ్చినా ఫస్ట్ నిఖిల్ తోనే షేర్ చేసుకుంటుంది.
సెకండ్ శైలు, శైలు అండ్ నిఖిల్ లవ్ లో ఉన్నారు , శైలు ఒక డాక్టర్. చాలా అమాయకురాలు, విల బ్యాచ్ లో తిను చాలా ఇన్నోసెంట్.
అరుణ్ : అరుణ్ విషయానికి వస్తే ఇతను వాళ్ళ ఫాదర్ యొక్క ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు , వరుణ్ కి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అత్త కూతురితో.
నితిన్: నితిన్ కి ప్రియా అంటే సీక్రెట్ క్రష్ ఆ విషయం అరుణ్ కి తప్ప విల బ్యాచ్ లో ఎవరికీ తెలీదు అండ్ నితిన్ కి అరుణ్ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాడు, నితిన్ వాళ్ళ ఇల్లు ప్రియ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది.వీడు కూడా ఒక బిజినెస్ రన్ చేస్తున్నాడు అండ్ నితిన్ బిజినెస్ పార్ట్నర్ ప్రియా వీళ్లు ఇద్దరూ కలిసి ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. ఆ కంపెనీ గురించి ఈ ఇద్దరు కలిసి ఆ కంపెనీ ఎందుకు రన్ చేస్తున్నారు అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది కథలో ముందుకు వెళ్లే కొద్దీ అది వేరే విషయం అనుకోండి.
అక్షయ : అక్షయ అండ్ ప్రియ బెస్ట్ ఫ్రెండ్స్, అక్షయ కి కూడా మ్యారేజ్ ఐపోయింది, అతని పేరు ఆదిత్య అండ్ ప్రెసెంట్ అక్షయ ప్రెగ్నెట్. అక్షయ కి ప్రియ అంటే చాలా ఇష్టం అందుకే వల మరిదిని మ్యారేజ్ చేసుకోమని ప్రియ నీ ఎపుడు అడుగుతూ ఉంటుంది , ఆఫ్కోర్స్ అతనికి కూడా ప్రియ అంటే ఇష్టం అనుకోండి .
ఫైనల్లీ మన హీరోయిన్ ప్రియ (స్వీటీ) : తను కూడా ఒక డాక్టర్ (కార్డియాలజిస్ట్). బట్ తను తను చదివిన డాక్టర్ కాకుండా ఒక కంపెనీ కి సీఈవో(CEO) గా ఉంటుంది . తను మల్టీ టాలెంటెడ్ కూడా , అందమైన రూపంతో పాటు అంతే అందమైన మనసు కూడా ఉంది తనకి , కాకపోతే కొంచెం మొండిది. మొండిది అని ఎందుకు అన్నాను అంటే కథలో ముందుకెళ్లేకొద్ది మీకే అర్థమవుతుంది లేండి
****